ఆధునిక పెళ్ళిపత్రిక
పెళ్ళి పత్రిక లో చివరి పంక్తి ‘బంధు మిత్ర సమేతముగా వచ్చి
వదూవరులనాశీర్వదించి మాచే నోసంగబడు చందన
తాంబూలాదుల స్వీకరించి, విందారగించి మమ్మానందింప
జేయ ప్రార్థన’ అని ఉంటూ ఉండేది ఆకాలములో. కాలం మారింది.
రాబోవు కాలానికి పత్రికలు ఈ విధముగా
ఉంటాయేమో!
మా అమ్మాయికి వాళ్ళబ్బాయికి ఫలాని
స్థలమునపెళ్ళి
వచ్చి చూచి మరి పోదురుగానీ ఆనందముగా వెళ్లి
వచ్చేముందే ఒక్క విషయమును మరువక గమనించండి
గిఫ్ట్లను రూపాయలుగా మార్చి పేటీఎం లో
వెయ్యండి
విందుటికెట్టును మీదగుజంటకు వాటుశాపులో
పొందండి
మందీ మార్బలముంటే కోవిడు మీకు గెస్టుగా వచ్చు
సుమండీ
మీ సంక్షేమమె మాకు ముఖ్యము మీ ఆరోగ్యమె మాకు
భాగ్యము
ఖర్చు తరిగి ఆదాయము పెరుగుట అన్నివిధాలా మాకు
యోగ్యము
No comments:
Post a Comment