అజరామర సూక్తి – 280
अजरामर सूक्ति – 280
Eternal Quote – 280
यन्मातापितरौ वृत्तं तनये कुरुत: सदा।
न सुप्रतिकरं तत् तु मात्रा पित्रा च यत्कृतम्।।2.111.9।। - वाल्मीकि रामायणं
यथाशक्ति प्रदानेन स्वापनोच्छादनेन च।
नित्यं च प्रियवादेन तथा संवर्धनेन च।।2.111.10।। - वाल्मीकि रामायणं
యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా l
న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం ll ।।2.111.109।। - వాల్మీకి
రామాయణము
యథా శక్తి ప్రదానేన స్వాపనోచ్ఛాదనేనచ l
నిత్యంచ ప్రియవాదేన తథా సంవర్ధనేనచ ll ।।2.111.10।। - వాల్మీకి రామాయణము
తల్లిదండ్రులు తమ కుమారుని విషయంలో ఎల్లప్పుడూ చూపే అవ్యాజమైన
అభిమానము, వారి వనరుల మేరకు, తమ సంతానమునకు ఒనగూర్చే వసతులు అతని చక్కని భవితకు తమ శక్తి వంచన లేకుండా చేకూర్చే ప్రయోజనములు, వారి సుఖ నిద్రకు, మరియు వారికి ప్రియమైన దుస్తులు సమకూర్చుట లోను, వారు ఎల్లప్పుడూ అతనితో అత్యంత ఆప్యాయత మాటలాడే తీరు, అతనిని అభివృద్ధిలోనికి తీసుకువచ్చేందుకు పడే తపన ఏనాటికీ సంతానము తీర్చుకోలేదు.
కావున తల్లితండ్రులు తమకు చేసిన సేవల ఋణమును తీర్చుకొనుట ఎంతటి మహనీయుడికీ అసాధ్యము”, అని శ్రీరాముడు వసిష్ఠమహర్షితో పలికెను. కాబట్టి శక్తివంచనలేకుండా నిరంతరము తల్లిదండ్రులను సేవించుటే తనయుల కర్తవ్యము.
ఇదే విషయమును వ్యాసులవారు మహాభారతమున ఏవిధముగా తెలియజేసినారో గమనించండి.
మాతా గురుతరా భూమేః ఖాత్ పితోచ్ఛతరస్తథా l
మనః శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ త్రుణాత్ ll – మహాభారతము
ధర్మరాజు యక్షునికి చెప్పిన నాలుగు జవాబులకు సంబంధించిన శ్లోకమిది. నేలకన్ననూ
గురుత్వము కలిగినది తల్లి , నింగికన్ననూ ఉన్నతమైనవాడు తండ్రి, గాలికన్ననూ
వేగమయినది మనసు, గడ్డిపరక కన్ననూ హీనముగా చూచుకోనవలసినది చింత.
అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః ।
చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం ।। (మనుస్మృతి: 2.121)
తల్లి తండ్రి గురువులను ఎంతో భక్తితో తలచి కొలిచేవాడు, పెద్దలను అత్యంత
ఆదరముతో సేవించేవాడు కలకాలము ఆయుస్సు, విద్య, యశస్సు, బలము అను ఈ
నాలుగు గుణములతో వర్ధిల్లుతాడు.
మాతా పిత్రోస్తు యః పాదౌ నిత్యం ప్రక్షాళయేత్ సుతః।
తస్య భాగీరథీ స్నానం ఆహాన్యహినజాయతే।। (పద్మ పురాణము;భూమి ఖండము 62.74)
ప్రతి దినమూ తల్లిదండ్రుల పాద ప్రక్షాళనము చేసే పుత్రుడు నిత్య గంగాస్నాన
పునీతుడౌతాడు.
నిత్యము మాతా పితకు ప్రణామము
చేసిన కలుగును శుభ పరిణామము
ఆ మమకారము ఆ ఉపకారము
ఇచ్చిన చాలదు ఏ ఉపహారము
అమ్మ గర్భిణిగ పడిన కష్టములు
గాంచగ ఎంతో అవి క్లిష్టములు
ఏమి ఇచ్చినా ఋణము తీరదు
నా మదిదేవత నెలవు మారదు
వ్రేలు పట్టి నడిపించిన నాన్న
గాంచగ ఆయన మనసే వెన్న
నాపై మమతన ఆయన కన్న
ఎవరూ లేరీ జగతిన మిన్న
తల్లిదండ్రులను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. వారిపాదముల నాత్మ నిలుపుకొని అంజలిఘటించి అర్పించితినీ అక్షర సుమములు అతి ప్రపత్తితో!
यन्मातापितरौ वृत्तं तनये कुरुत: सदा।
न सुप्रतिकरं तत् तु मात्रा पित्रा च यत्कृतम्।।2.111.9।। - वाल्मीकि रामायणं
यथाशक्ति प्रदानेन स्वापनोच्छादनेन च।
नित्यं च प्रियवादेन तथा संवर्धनेन च।।2.111.10।। - वाल्मीकि रामायणं
माता-पिता हमेशा अपने बेटे के संबंध में जो कार्रवाई करते हैं, वे अपने संसाधनों के अनुसार उसे जो लाभ प्रदान करते हैं, जिस तरह से वे उसे सुकून से सोने और कपडे पहनाने के लिए लुभाते हैं, स्नेहपूर्ण शब्द जो वे हमेशा उससे बोलते हैं और जिस तरह से वे उसका परवरिश करते हैं इन सभी
को किसी भी हालत में चुकाया नहीं जा सकता है। अगर वे बूढ़े होनेपर, बच्चे, मीठे बातों से उनका देखरेख करते हैं तो वही उन लोगों केलिए बहुत काफी है l
माता गुरुतरा भूमेः खात् पितोच्चतरस्तथा।
माता का गौरव पृथ्वी से भी अधिक है और पिता आकाश से भी ऊँचे (श्रेष्ठ) हैं।'
(महाभारत, वनपर्वणि, आरण्येव पर्वः 313.60)
अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः।
चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशो बलम्।। (मनुस्मृतिः 2.121)
'जो माता - पिता और गुरुजनों को प्रणाम करता है और उनकी सेवा करता है, उसकी आयु, विद्या, य
श और बल चारों बढ़ते हैं।'
मातापित्रोस्तु यः पादौ नित्यं प्रक्षालयेत् सुतः।
तस्य भागीरथीस्नानं अहन्यहनि जायते।। (पद्म पुराण, भूमि खंडः 62.74)
जो पुत्र प्रतिदिन माता और पिता के चरण पखारता है, उसका नित्यप्रति गंगा-स्नान हो जाता है।'
मात पिता के चरणों में प्रणाम करते बारम्बार।
जो उनसे पाया उपकार। तुलना में न कोई उपहार ll
माता ने जो कष्ट उठाया, वह ऋण कभी न जाए चुकाया।
अंगुली पकड़ चलन सिखाया पले पिता के शीतल छाया।।
शौच शुभ्र करने में माता कोई शंका नहीं जताया l
घर में सबकुछ जो है खाने पहले देने मुझे बुलाया ll
माता-पिता के गुण गानेमें हद नहीं हो सकता l वे आँखों के सामने बसे पार्वतीपरमेश्वर है l
yanmaataapitarau vrttan tanaye kurutah sada l
na supratikaran tat tu maatra pitra ch yatkrtam ll 2.111.9 - vaalmeeki raamaayanan
yathaashakti pradaanen svaapanochchhaadanen cha l
nityan ch priyavaaden tatha sanvardhanen ch ll 2.111.10.. - vaalmeeki raamaayanan
The course of action the parents always adopt in respect of their son, the benefits they confer on him according to their resources, the way they lull him to sleep and clothe him, the affectionate words they always speak to him and the way they bring him up all these cannot be repaid.
Parents work tirelessly for the welfare of their children. From the moment they become aware of their status as parents, they constantly think of nothing else but the wellbeing of their child/children and work tirelessly in their own arenas to make the child as good an individual as possible. Every parent wants their children to be better than them. In fact, they rejoice when their offspring surpasses them in their achievements.
There is nothing in this world that one can give to his parents to make up for their efforts. No amount of wealth or money can outweigh their dedication towards their children. The one meagre effort one can do is: he can try and emulate all the values his parents tried to imbibe in him. Parents are happiest when their children live worthy lives.
Like they say, to understand a parents' love one must raise children himself. Then it becomes evident to him that there is no retribution to it!
స్వస్తి.
No comments:
Post a Comment