Sunday, 6 June 2021

అజరామర సూక్తి – 264 अजरामर सूक्ति – 264 Eternal Quote – 264

 

అజరామర సూక్తి  264

अजरामर सूक्ति  264

Eternal Quote  264

https://cherukuramamohan.blogspot.com/2021/06/264-264-eternal-quote-264.html

शीलभारवती कान्ता पुष्पभारवती लता ।

अर्थभारवती वाणी भजते कामपि श्रियं ॥ - रसगङ्गाधर

శీలభారవతీ కాంతా పుష్పభారవతీ లతా l

అర్థ భారవతీ వాణీ భజతే కామపిశ్రియం ll

 పైశ్లోకానికి అర్థము చెప్పుకోవలసి వస్తే అది రెండు పంక్తులలో ముగుస్తుంది.

శీలవతీ యగు భార్య, పుష్పభారముచే పరిఢవిల్లు లత, అర్థవంతమైన అంటే 

చాతుర్యముతో కూడిన భాషణ కల్గిన చోటును సిరి వదులుతుందా?  ఈ శ్లోకము 

లోని ప్రతమార్త్ధము, త్రుతీయార్ధము మానవ ప్రవర్తనకు సంబంధించినవి. ప్రథమ 

పాదము లోని ద్వితీయార్ధము మాత్రము ప్రకృతికి సంబంధించినది.అందుచే ముందు 

ఆ అర్ధ పాదమునకు అర్థము చెప్పుకొని మిగత రెండు అర్ధ పాదములకు 

పోదాము.ఒక ఇంటి పెరడులో జాజి పూల తీగెలు, మల్లె తీగెలు సంపంగి చెట్ల కు ఉన్న 

పూవులా గుత్తులు ఒక పర్యాయము ఊహించుకొండి. ఆ దృశ్యమును మనసు పెట్టి 

చూస్తే ఆచటి నుండి కదలము. శ్రీ శంకర భగవత్పాద విరచిత కనకధారా స్తోత్రము 

లోని ఈ శ్లోకమును గమనించండి.

సరసిజనిలయే సరోజహస్తే 
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్ || 18 ||

కమలములవంటి కన్నులు గలదికమలములు చేత ధరించినదితెల్లని వలువలు

గంధముపూలమాలలతో ప్రకాశించునదిసౌందర్యమూర్తి అయిన శ్రీమహాలక్ష్మీ! నీవు 

ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానవు. హే భగవతీ ! హరివల్లభా! శ్రీ 

మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము ! అంటే ముల్లోకములను 

అనుగ్రహించే తల్లికి పువ్వులు అంటే అంత ఇష్టము. అసలు ఆమె కమల సంభవ. 

కావున లతాంతములు అనగా పూవుల గుత్తులు శోభనూ సిరులనూ 

సమకూర్చుతాయి.

ఇక మిగతా రెండు విషయాలు ఒకే పద్య విశ్లేషణతో మీ ముందు ఉంచుతాను. ఇది 

సుగమ సంసార గమనమునకు అత్యంత ఆవశ్యకము. శ్రద్ధగా చదవండి.

 ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో

ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ

క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్

నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్

 పై పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము అనే ప్రబంధపు 

తృతీయాశ్వాసం లోనిది.

రామకృష్ణుడు విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవ రాయల ఆస్థాన కవి. ఆ మహారాజు 

ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరిగా చెప్పబడ్డవాడు. ఈయన రచించిన ఈ 

పాండురంగ మాహాత్మ్యము తెలుగు పంచ మహా కావ్యాలలో ఒకటి. ఇది బాగా ప్రసిద్ధి 

చెందిన కావ్యం. “పాండురంగ విభుని పద గుంఫనంబును” అని పెద్దలు ఈ కవి 

పదనైపుణిని ప్రశంసిస్తారు. చాలా చక్కని పద్యాలున్న ఈ ప్రబంధంలో 

పండరీపురంలోని పాండురంగ విఠలుని మాహాత్మ్యమూలీలలూఆయన భక్తుల 

కథలూ మొదలైనవి వర్ణించబడ్డాయి. ఆ స్వామి ప్రభావాన్ని వివరించడంలో భాగంగా 

చెప్పిన నిగమశర్మోపాఖ్యానము లోనిది పై పద్యం.

పూర్వం పిఠాపురంలో నిగమశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు. పేరు 

మాత్రం గొప్పగా నిగమశర్మ (నిగమములు = వేదములు) అని వుంది కాని అతనికి లేని 

పాడు బుద్ధులు లేవు. ముఖ్యముగా అతడు జూదరివేశ్యాలంపటుడు. ఇల్లాలు ఆతనిని 

భరించుట తప్ప ఎదురు తిరిగిన పాపాన పోయినది కాదు. తన కష్టముల గూర్చి 

పుట్టినింటికి కూడా తెలిపినది కాదు. ‘సంసారము గుట్టు వ్యాధి రట్టు’ అంటారు కదా 

పెద్దలు. ఆమె ఏ సతీ అనసూయయో, అరుంధతియో కాకపోయినా వారి 

అడుగుజాడలు వీడెడిది కాదు. అనగా ఆమె పై సూక్తిలోని మొదటి అర్ధ చరణమును 

యథాతథముగా పాటించేది.వాడి ప్రవర్తన మార్చడానికి వాడి భార్యాతల్లీతండ్రులూ 

ఎంతో శ్రమపడతారు. పూర్వులు సంపాదించిన ఆస్తి అంతా వేశ్యలకు ధారపోసినాడు. 

తల్లి నగలు తాకట్టు పెట్టినాడు. దొరికిన ప్రతి చోటా అప్పు చేసినాడు. శిగ్గు 

విడిచి బంధువులను కూడా యాచించినాడు. ఈ రకంగా భ్రష్టు పట్టిపోయిన 

విషయం తెలుసుకొని అతని అక్కతమ్మునికి మంచిబుద్ధి చెప్పడానికి భర్తనూ

పిల్లలనూ తీసుకొని పుట్టింటికి వస్తుంది. అలా వచ్చితమ్ముని సంబోధిస్తూ బుద్ధి గరిపే 

సందర్భంలో మాట్లాడిన తొలి మాటలను వివరించే పద్యం ఇది. ఇక్కడ రెండవ 

చరణము లోని మొదటి సగభాగము యొక్క విశ్లేషణ తిలకికించేది. ఇందులో 

సందర్భానుసారమగు మాటతీరు ఏవిధముగా ఉండవలె నన్నది ప్రస్ఫుటముగా 

తెలియవస్తుంది.

తల్లిదండ్రులు ముసలివారు. తమ్ముడు ఇల్లు పట్టకుండా చెడు తిరుగుళ్ళు 

తిరుగుతుండె. మరదలు చిన్నపిల్ల. అట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఎలా వుండాలో అలానే 

వున్నది. ఈమె వచ్చి తల్లిదండ్రులను ఊరడిస్తూ ఉపచారాలు చేస్తూ కొంత కొంత 

వారికి ఉపశమనం కలిగించింది. దేవుని మందహాసమును శుభ్రపరచి  దేవతార్చనను 

పునరుద్ధరించింది. అతిథి అభ్యాగతులను ఆదరించడం మొదలు పెట్టింది. తల్లి తన 

దగ్గర తమ్ముడికి కనబడకుండా వుంచుకున్న డబ్బులను జాగ్రత్త చేసింది. 

దాసదాసీలను అభిమానంగా దగ్గరకు తీసింది. పశుపోషణాదికాన్ని స్వయంగా 

పర్యవేక్షించడం ప్రారంభించింది. ఇంట్లో పెద్ద గ్రంధాలయం వున్నట్లున్నది  

పుస్తకాలను వరసగా పేర్చడమూఇతరులు తీసుకుపోయిన పుస్తకాలను తిరిగి 

రాబట్టడమూచినిగినవాటిని మరమ్మత్తు చేయడమూ  దాని పనులను భర్తకు 

పురమాయించింది. ఇంటి మరమ్మత్తులకు  మెత్తడమూఅలకడమూ,సర్దడమూ  

స్వయంగా పూనుకుంది. రాజానుగ్రహంతో వచ్చిన గ్రామభోగాలను స్వాధీనంలోకి 

తెచ్చుకున్నది. చేలకు కాపలా నియమించింది. ఇదీఆమె పుట్టింటికి వచ్చిన తర్వాత 

కావించిన నిర్వహణ. (పాపంఇన్ని చేస్తున్నా కాపురానికి వచ్చి యౌవనారంభంలో 

వుండిభర్త ఆదరణకు నోచుకోని మరదలి స్థితికి “వగచి వగచి బాధపడుతూనే 

వున్నది). పైన తెల్పిన మొదటి నేపథ్యం ఇది. ఇక్కడ ఒకరు బట్టు ఇరువురు ఇల్లాళ్ళ 

నడత మనకు తెలియవస్తూ ఉన్నది. ఆవిధమగు ఇల్లాళ్ళకు ఎల్ల వేళలా మహాలక్ష్మి 

అండదండలు ఉంటాయి.

ఇంతలో ఒకరోజు ఉన్నట్టుండి “చుక్క తెగిపడిన వడుపున” ఇంటికి వచ్చినాడు 

నిగమశర్మ. చాలా రోజుల తర్వాత చూసింది గదా అని కౌగిలించుకోబోయింది కాని

వాడి వంటినిండా నఖక్షతాలున్నాయిట. వాటిని చూసి అసహ్యించుకుంది. పాపం 

మనసులో కూడా అపవిత్రతకు తావీయక దేవతార్చనలు గావించుకునే ఇంటి ఇల్లాలు 

గదా! మేనల్లుని ఎత్తుకొమ్మని అందించింది. ‘నిముసములో శాకపాకాలు తయారు 

చేస్తానుమీ బావతో కలిసి భోంచేద్దువు గానిస్నానం చేసి ర’మ్మంది. అతనికి 

చేయవలసిన ఉపచారాల కోసం మరదలికి కనుసైగ చేసింది. అభ్యంగన స్నానం 

చేయించింది. ఉతికిన ధోవతీఉత్తరీయమూ ఇప్పించింది. తల తానే శుభ్రంగా తడి 

లేకుండా తుడిచింది. ఒంటికి గంధం రాచింది. తలలో పూలు తురిమింది. బావా 

తలిదండ్రుల పంక్తిలో కూర్చోబెట్టి షడ్రసోపేతమైన భోజనం వడ్డించింది. అనంతరం

అరుగు మీద కూర్చుని వుండగా మరదలి చేత తాంబూలపు చిలకలు ఇప్పించింది. 

తనూ తమ్ముని దగ్గరకు చేరింది. బిడ్డ చనుబాలు త్రాగుతూ వుండగాకుడివైపుకు 

కొంచెము ఒత్తిగిల్లిపద్మవనంలో కొలువున్న లక్ష్మీదేవిలా కూర్చొనితమ్మునికి 

హితబోధ ప్రారంభించింది. ఇది రెండో నేపథ్యం. ఆ సందర్భములోని మొట్టమొదటి 

పద్యము మనము పైన చదివినది.

ఇక ఆమె మాటలాడిన తీరును మనసుపెట్టి గమనించండి. ఉపదేశమును తిట్టడంతో 

గానీతప్పులెంచడంతో గానిఆమె మొదలు పెట్టలేదు. ఏరా తమ్ముడూమా ఇంటికి 

రావడమే మానేశావు. నీకోసం నేనూమీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో 

రోజుల్నించీ ఎదురు చూస్తున్నామునెలపొడుపు కోసం సముద్రం ఎదురు 

చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావావాటికి ఆటంకం 

కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! 

అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా 

ఎత్తిపొడుస్తూ

వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది.

ప్రారంభించిన వేదపాఠాలకు విఘ్నం కలుగుతుందనా రావడం లేదు అని అడగడం 

ఎందుకుఆమెకు తెలియకనా వాడు వేదపాఠాలను పక్కనబెట్టి చాలా రోజులే 

అయిందని. అయినా తెలీనట్లే అడిగింది. వాడు రాగానే తిట్లకు లంకించుకోవడం 

సరిగాదు. నువ్వేమిటి నాకు చెప్పేది అని వాడు విదిలించుకొని పోకుండాఎంతో 

ఆప్తంగా కొడుకుని ఎత్తుకోమని ఇవ్వడంస్వయంగా వడ్డించడంతల దువ్వడం 

లాంటి పనులతో, వాడి మనసులో విరసపు భావం తొలగించేందుకు జాగ్రత్త పడింది. 

నెలపొడుపు కోసం సముద్రంలాగా నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం 

ఎంతో అందంగా వుంది. ఇది ఏదో ఆషామాషీగా పోల్చిన పోలిక కాదు. చంద్రుడు 

సముద్ర మదన సమయంలో  అందులోంచి పుట్టినాడనేది ప్రసిద్ధం. అందువలన 

చంద్రుడు సముద్రునిది తండ్రీకొడుకుల సంబంధము. కొడుకు ఉదయించి

క్రమంగా దినదినాభివృద్ధి గావిన్చుతూ ఉంటే తండ్రి ఆనందము చెప్ప శక్యము కాదు. 

అందుకనే పున్నమి రోజున సముద్రంలో వచ్చే ఆటుపోట్లనుతన తనయుని ఉన్నతికి 

ఉప్పొంగడముగా పోల్చుత జరిగినది. నీ ఉన్నతి కోరేవాడు తండ్రి. తోబుట్టువు 

లక్షీదేవి. బావ మహావిష్ణువు కావున వారందరి ఉపదేశ వాక్యములను వినవలేనన్నది ఆ 

సంభాషణా సారాంశము.

ఒక్కసారిఆమె ప్రవర్తనాఆమె గృహ నిర్వహణ చేసిన తీరూమాట్లాడే ధోరణీ

కూర్చున్న వైఖరీ  ఇవన్నీ మనసులోకి తెచ్చుకొనిఆమె చెప్పిన ఈ పద్యం 

తలచుకుంటే ఎంతో ఉజ్జ్వలంగా కన్పట్టక మానదు. ఆ పద్యంతో ప్రారంభించి ఒక 

పది పద్యాలలో అతని వంశ ప్రతిష్ఠనూఇంటి దుస్థితినీభార్య పరిస్థితినీవచ్చిన 

దుష్కీర్తినీ వివరించిఅతను కాదనడానికి వీల్లేని పరిస్థితిని కల్పించితాత్కాలికంగా నైనా తన మాటలకి ఒడబడేటట్లు మాట్లాడింది  అదీ నిగమశర్మ అక్క అంటే. అక్కడ 

ఆమె చేత ఉపదేశం చేయించిన తీరూమనం పైన అనుకున్న రెండు నేపథ్యాల కల్పనా  ఇవి రామకృష్ణుని అద్భుత ప్రతిభకూలోకజ్ఞతకూ నిదర్శనాలు. ఈ ఒక్క పద్యమే 

కాదుఆ సందర్భంలోని పద్యాలన్నీ ఆణిముత్యాలే!

ఇంతటి అద్భుతమైన గ్రంధములను తాకే అర్హత కూడా లేకుండా చేసినారు మన 

‘వాడుక భాషా’ ఉద్ధారకులు. 

शीलभारवती कान्ता पुष्पभारवती लता ।

अर्थभारवती वाणी भजते कामपि श्रियं ॥ - रसगङ्गाधर

अच्छे चरित्र वाली स्त्रीफूलों से भरी लताऔर उद्देश्य से भरी हुई वाणीसमृद्धि किसकी ओर मुडती है?

जहां मूल्य होता है वहां समृद्धि अपने आप आती ​​है सत्यनिष्ठा वाली महिला को तुरंत सम्मान मिलता 

है फूलों से भरी लता स्वाभाविक रूप से किसी का भी मन मोह लेती है इसी प्रकार मधुर वचन और 

अर्थपूर्ण वाणी सभी को प्रसन्न करेगी

ऐसी जगह जहां ये विशेषताएं मौजूद हैंसमृद्धि के पास विरोध करने का कोई साधन नहीं होगा 

समृद्धि हमेशा ऐसे लोगों को ही प्रदान करती है

समृद्ध होने के लिए उद्देश्यपूर्ण जीवन जिएं!

 

śīlabhāravatī kāntā pupabhāravatī latā

arthabhāravatī vāṇī bhajate kāmapi śriya॥ - rasagagādhara

A woman brimming with good character, a creeper filled with blooms, and a 

speech overflowing with purpose; who else does prosperity turn to?

Prosperity automatically comes where there is value. A woman with integrity gets 

respect instantaneously. A creeper filled with blossoms naturally attracts 

anyone's eye.  Similarly, pleasant words and meaningful speech will appease 

everyone. In a place where these characteristics are present, prosperity will 

have no means to resist. Prosperity always offers itself to such people.

Live purposeful lives to be prosperous!

స్వస్తి.

No comments:

Post a Comment