అజరామర సూక్తి – 269
अजरामर सूक्ति – 269
Eternal Quote – 269
शरदम्बुधरच्छाया जत्वर्यो यौवनश्रियः l
आपातरम्याः विषयाः पर्यन्तपरितापिनः ll
శరదంబుధరచ్ఛాయా జత్వర్యో యౌవనశ్రియః l
ఆపాతరమ్యాః విషయాః పర్యంత పరితాపినః ll కిరాతార్జునీయం (మహాకవి భారవి)
శరద్రితు మేఘాడంబరము యువత బాహ్యేంద్రియములకు అపార సుఖాన్ని
అందిస్తున్నట్లు అనిపించుతుంది కానీ ఆపై అనర్థములను ఆలోచించదు .
ఇంద్రియాల ఆనందాలు ప్రారంభంలో తీపిగా ఉంటాయి కాని చివరికి చేదు ఫలితాలను
ఇస్తాయి.
ఉదయము లేచి పరమాత్మునికి జీవితమునకు మరొకరోజు జతచేసినందుకు
ధన్యవాదములు సమర్పించుకొంటూ, సూర్యుని మనసారా తలచుతూ మీలో రోజంతా
సరియైన సామర్థ్యమును మరియు శక్తిని కలిగించమని మీ దినచర్యగా ప్రార్థిస్తుంటారు.
అలాగే, ఆ వారమంతా లోకము సుఖమయము చేయమని ఆ సూర్య నారాయణుని
ప్రార్తించవచ్చు. జగత్పతి ముందు ఎంత ఆర్తిని చూపితే ఆయన సంతుష్టుడౌతాడు. ఈ
విషయము సదా గుర్తుంచుకొనుట మంచిది.
గుర్తుంచుకో క్షమ ఎల్లప్పుడూ శ్రేయోదాయకము. ‘క్షమా యశః క్షమా ధర్మః క్షమయా
నిష్ఠితాం జగత్’ అన్నారు వాల్మీకి.‘తేజసా సూర్యసంకాశః క్షమయా పృథివీసమః’
అన్నారు భారతములోని 2వ అధ్యాయములో వ్యాసులవారు. మహాపురుషులు ఎవరు
చెప్పినా ఒకే మాటే! ‘క్షమ’ అన్న పదమునకు ‘సహనము’ ఓర్పు’ అని అరెతము.
మనము తెలుగులో ‘క్షమించినాను’ అంటే నీమీద కష సాధించాక వదలివేస్తున్నాను
అన్న అర్థమును తీసుకొంటారు. ఇది ‘అపార్థము’ ‘నేను క్షమించినాను’ అంటే ‘I am
tolerant to what you did’అని అర్థము. ‘క్షమ’ వ్యక్తియొక్క సద్గుణమకుటమునకు
తాపబడు ప్రధానరత్నము. ఈ రత్నము మకుటము సమవాయ సంబంధమును (అనగా
ఎన్నటికీ విడివడని సంబంధమును) కలిగి ఉంటాయి. ఆ గొప్పతనమును కలిగిన మనిషి
యొక్క ఔన్నత్యము మేరుపర్వత సమానము. ఇది మనసు యొక్క పారదర్శకతను
నిరూపిస్తూ, వ్యక్తి యొక్క, బాధ్యత అందుగల స్పష్టతను తెలియజేస్తూ, సామాజిక
ఆనందమునకు దారితీయించుతుంది. కాబట్టి ఒకరి వ్యక్తిత్వం యొక్క సర్వవ్యాప్త
మెరుగుదల ఉంది. అందుచేత క్షనికములగు ఆనంద్సముల జోలికి పోక ‘సర్వేజనాః
సుఖినోభవంతు’ అన్న ఆదర్శముతో మనుగడ సాగించితే పరమాత్మునికి
ప్రియతములమౌటాము. జన్మకు సార్థకత చేకూరుతుంది.
శరదృతువు మేఘాలు,తొలకరి చినుకులు, పిండి ఆరబోసినట్లగుపించే వెన్నెల
మొదలగునవి యువతకు కోరికలు రగుల్చుతాయి . కానీ ఆ జల్లు ఆరోగ్యానికి
మంచిదికాదు, అని భారవి గారు చెబుతున్నారు. వారి పరిశీలన,సందేశము,
లొకహితమును గమనించండి.
शरदम्बुधरच्छाया जत्वर्यो यौवनश्रियः l
आपातरम्याः विषयाः पर्यन्तपरितापिनः ll किरातार्जुनीयम् (महाकवि भरावि)
यौवन शारदृतु के बादलों की तरह क्षणभंगुर है। इन्द्रियों के सुख आरम्भ में मीठे होते हैं परन्तु अन्त में
कड़वे फल देते हैं।
इन्द्रियों के सुख आरम्भ में मीठे होते हैं परन्तु अन्त में कड़वे फल देते हैं।
सुबह, जब आप अपनी आत्मा को सूर्य की पोषण अग्नि में डुबोते हैं, तो आप पूरे दिन में इष्टतम दक्षता
और शक्ति के लिए प्रार्थना करनाहै। इसके अलावा, एक नए सप्ताह के सभी दिनों में, आप में और
आपके जीवन में लोगों के बीच शांति बनी रहने का प्रार्थना करना है। यही सदा तुम्हारा लक्ष्य होना
चाहिए l
याद रखें: क्षमाशील बनो। एक आदमी का कुल कद नई ऊंचाइयों तक पहुंचता है क्योंकि 'क्षमा' उसमें
महानता जोड़ती है। यह व्यक्तित्व की नकारात्मकता को कम करता है क्योंकि पाप की मात्रा काफी
कम हो जाती है।
महाकवि भारवी ने युवाओं को प्रारंभिक सुख में न भटकने की चेतावनी दी है, लेकिन उन्हें भविष्य के
नतीजों के बारे में सोचने की सलाह दी है।
इससे मन की स्पष्टता और प्रसन्नता प्राप्त होती है। तो व्यक्ति के व्यक्तित्व का सर्वांगीण सुधार होता है।
Sharadambudharachchhaayaa jatwaryo yauvanashriyah l
Aapaataramyaah vishayaah paryanta paritaapinah ll Kiraataarjuneeyam (Mahakavi
Bharavi)
Youth is fleeting like the clouds of Sharadrithu. The pleasures of the senses are sweet in
the beginning but yield bitter results in the end.
The pleasures of the senses are sweet in the beginning but yield bitter results
in the end.
This morning, as you drench your soul in the nurturing fire of the Sun and pray
him for an optimal efficiency and vigor throughout your day. Also, in all
purified ablutions of a new week, may there be prevailing peace in you and
among the people in your Life. Amen.
Remember: Be forgiving. The total stature of a man reaches new heights as
‘clemency’ adds greatness to it. It lessens the negativity of the personality as
the amount of sin is drastically reduced. This leads to the clarity and
happiness of the mind. So there is an all-round improvement of one's
personality.Mahaakavi Bharavi cautions the youth not to be carried away by
preliminary pleasure but advises them to think of the future repercussions.
స్వస్తి.
No comments:
Post a Comment