Monday, 21 June 2021

అజరామర సూక్తి – 279 अजरामर सूक्ति – 279 Eternal Quote – 279

 

అజరామర సూక్తి  279

अजरामर सूक्ति  279

Eternal Quote  279

https://cherukuramamohan.blogspot.com/2021/06/279-279-eternal-quote-279.html

लालनाद्बहवो दोषाः ताडनाद्बहवो गुणाः ।

तस्मात्पुत्रञ्च शिष्यञ्च ताडयेन्न तु लालयेत् ॥- चाणक्य नीति-द्वितीयाध्यायः-12

లాలనాద్బహవో దోషా స్తాడనాద్బహవో గుణాః |

 తస్మాత్పుత్రం చ శిష్యంచ తాడయేన్న తులాలయేత్‌ || 

చాణక్య నీతి ద్వితీయాధ్యాయము-12

లాలన చేయుట అనగా బుజ్జగించుట వలన పిల్లలలో మొండితనము, మంచి చెడుల 

తారతమ్యమునరయుట మొదలగు అనేక దోషములుత్పన్నములగును. దండించుట 

వలన బాల్యావస్థ కావున, దుర్గుణముల మాన్పించి సద్గుణములులిగింపజేయనగును. 

కావున సంతానమునుశిష్యులను దండింపవలెనే కాని లాలింపరాదు.

పతంజలి మహర్షి వ్యాకరణ భాష్యము (8-1-8) లో ఈ విధముగా తెలియజేయుచున్నారు.

 సామృతైః పాణిభిర్ఘ్నన్తి గురవో న విపోక్షితైః |

 లాలనా శ్రయిణో దోషాస్తాడనాశ్రయిణో గుణాః ||

 తాత్పర్యము :- దండించుటవలన సంతానము శిష్యుడును దోషములేనివారును

గుణయుక్తులు నగుదురు. తల్లిదండ్రులుఅధ్యాపకులు అమృతమయములగు 

హస్తములతో కొట్టుదురు. విషమయములగుచేతులతో కాదు. వారు ఈర్ష్యాద్వేషములతో 

కాక పైకి భయమును కనబఱచుచు లోపల దయ కలిగియుందురు. కావున శిక్షణలో ఆపెద్దలు ఇచ్చు శిక్ష సంతుకు, శిష్యులకు ప్రయోజనకరము తప్ప వారిని చేడుదారి పట్టించదు.

ఈ విషయములో వేమన ఈవిధముగా చెప్పినాడు :

చాకివాడు కోక చీకాకు పడజేసి

మైలబుచ్చి మంచి మడత బెట్టు

బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమిరా

విశ్వదాభిరామ వినురవేమ.

చాకలివారు బాగా మాసిపోయిన వస్త్రాలను తీసుకుపోయి బాగా ఉతుకుతారు. ఆ వస్త్రం మలినం పోగొట్టడానికి వారు దాన్ని బండకేసి బాదుతారు. జాడిస్తారు. మెలికలు తిప్పుతారు. ఎండలో వేస్తారు. ఏదో విధంగా వస్త్రాన్ని రకరకాలుగా చికాకు పెట్టి చివరకు అతి చక్కని మడత పెట్టి శుభ్రంగా చేతికి ఇస్తారు.

ఆవిధంగానే సమాజానికి బుద్ధి చెప్పి మంచిదారిలో పెడదామని చూసేవాడు ఆ మంచి 

చెప్పే పద్ధతి కొంచెం కఠినంగా ఉండవచ్చు. అలాగే మరీ దారి మళ్లుతున్నారని పిస్తే 

దండించడం కూడా జరగవచ్చు. అయితేనేం అతను మంచి మార్పుకోసం ఇలా 

చేసినప్పుడు దాన్ని భరించి అతనినుంచి మేలు పొందాలన్నాడు వేమన. ఎంత మంచి 

మాటో చూడండి.

ఇది నాకు తోచిన మాట.

సుత్తివాడకుండ చూడ బంగరు ముద్ద

పొందలేము వంటి భూషణముగ

కన్నబిడ్డయంచు గారాము చేసిన

పొందలేము ఇంటి భూషణముగ

लालनाद्बहवो दोषाः ताडनाद्बहवो गुणाः ।

तस्मात्पुत्रञ्च शिष्यञ्च ताडयेन्न तु लालयेत् ॥- चाणक्य नीति-द्वितीयाध्यायः-12

अधिक लाड़ से अनेक दोष तथा अधिक ताड से गुण आते हैं । इसलिए पुत्र और शिष्य को लालन की नहीं ताड की आवश्यकता होती है ।

क्या अच्छा है और क्या नहींइसका अंदाजा बच्चों को नहीं होता। कई बार उनके पास आज की पसंद के कारण आने वाले कल के परिणामों को देखने की दृष्टि नहीं होती हैऔर कभी-कभीवे केवल सीमाओं का परीक्षण करना चाहते हैं। ये स्पष्ट कारणों से होते हैं। 1) वे बच्चे हैं और 2) उनके पास निर्णय लेने के लिए आवश्यक अनुभव और ज्ञान की कमी है। बहुधा यह भी देखा जाता है कि उनमें अपनी पसंद पर टिके रहने के लिए भी मन की दृढता नहीं होती है। उनहोंने अपना मन बदल लेके अचानक कुछ और चाहते हैं!

यदि माता-पिता या शिक्षक बच्चे की हर एक कल्पना में लिप्त होंतो उसका कोई अंत नहीं होगा। साथ हीबच्चा अपने पास मौजूद संपत्ति का सही मूल्य कभी नहीं सीख पाएगा। वह चीजों और लोगों को हल्के में लेना सीख जाएगा। वह बुरे परिणामों को उसके द्वारा किए गए बुरे विकल्पों से नहीं जोड़ पाएगा उसका निर्णय धूमिल हो जाएगा और जैसे-जैसे वह बड़ा होगा वह असफलता के दुष्चक्र में फंस जाएगा

इस मामले मेंबच्चे की सनक और कल्पनाओं का मनोरंजन करने से क्या लाभ होता हैऐसी परवरिश में गुणों से ज्यादा दुर्गुण होते हैं!

इसके बजाययदि बच्चे को उसकी पसंद और उसके कार्यों के पेशेवरों/विपक्षों के माध्यम से निर्देशित किया जाता हैतो वह बाद में जीवन में बेहतर विकल्प बनाएगा। ऐसा करने मेंकभी-कभीवयस्कों को अपना रुख पकड़ना पड सकता है और बच्चों को दृढ़ता से अनुशासित करना पद सकता है। बच्चे अभी भी सीमाओं का परीक्षण करने का प्रयास करेंगे। बच्चे को पैदा करना और उसे लिप्त करना आसान हो सकता है। तब  लंबे समय मेंबच्चे अपना रास्ता पाने के लिए अनुनय-विनय करना सीखते हैं। अगर बाल्य में उन्होंने अनुशासन नहीं सीखा तो वह न तो घर को न ही समाज को उपयुक्त होसकता है l समस्या यह है कि अगर कोई खुद को अनुशासित नहीं करता हैतो दुनिया ठुकराता हैक्या 

बच्चों के रूप में इसे सीखना और जीवन में बाद में कठिनाइयों से नहीं गुजरना कम दर्दनाक नहीं है? (हालांकि 'ताडनका शाब्दिक अर्थ है 'पिटाई करना', इसे 'अनुशासनके रूप में लिया जा सकता है। पहले के दिनों में पिटाई का उद्देश्य अनुशासन करना था।)

अनुशासन के माध्यम से बच्चों को जीवन के नियमावली सिखाएं। अनुशासन लक्ष्यों और उपलब्धियों के बीच का सेतु है। अपने बच्चों और छात्रों को इस एक आवश्यक कौशल से सुसज्जित करें!

 lālanādbahavo doṣāḥ tāḍanādbahavo guṇāḥ 

tasmātputrañca śiyañca tāḍayenna tu lālayet ॥- cāṇakya nīti-dwitiyadhyayah-12 Indulgence has many deficiencies; disciplining has many efficiencies. Hence, discipline children and students.  Do not indulge them.

Children do not have an idea of what is good and what is not. Many times, they do not have the vision to see tomorrow's repercussions due to today's choices; and sometimes, they just want to test the limits. These happen due to obvious reasons. 1) they are children and 2) they lack the experience and knowledge required to make their decisions. Most often, it is also seen that they do not have the firmness of mind to stick to their choice either. They suddenly want something else just because they changed their mind!

If parents or teachers indulge in every single fancy of the child, there will be no end to it. Also, the child will never learn the true value for the possessions he has. He will learn to take the things and people for granted. He will not be able to connect bad outcomes to the bad choices he made! His judgement will get clouded and he will be entrapped in a vicious cycle of failure as he grows up.

In this case, what good is achieved by entertaining the whims and fancies of the child? There are more qualms than qualities in such an upbringing!

Instead, if the child is guided through his choices and the pros/cons of his actions, he will make better choices later in life. In doing so, sometimes, the adults may have to hold their stance and discipline the children firmly. The children will still try to test limits. It may be easier at that moment to yield and indulge the child. But then, in the long run, children learn to be persuasive in order to get their way. They will not have learnt discipline, which is very essential. The problem is, if one doesn't discipline himself, the world will do it for him! Isn't it less painful to learn this as children and not go through hardships later in life? (Although 'tāḍana' literally means 'spanking', it can be taken as 'discipline'.  The purpose of spanking in the earlier days was to discipline.)

Teach children 'discipline', through discipline. Discipline is the bridge between goals and accomplishments. Equip your children and students with this one essential skill!

స్వస్తి.

 *********************************************

No comments:

Post a Comment