Thursday, 17 June 2021

అజరామర సూక్తి – 274 अजरामर सूक्ति – 274 Eternal Quote – 274

  అజరామర సూక్తి  274

अजरामर सूक्ति  274

Eternal Quote  274

https://cherukuramamohan.blogspot.com/2021/06/274-274-eternal-quote-274.html

अनिच्छन्तोऽपि विनयं विद्याभ्यासेन बालकाः ।

भेषजेनेव नैरुज्यं प्रापणीयाः प्रयत्नतः ॥ हरिहरसुभाषित

 అనిచ్ఛంతోపి వినయం విద్యాభ్యాసేన బాలకాః l

భేషజేనేవ నైరూజ్యం ప్రాపణీయాః ప్రయత్నతఃll

 కోరుకోకపోయినాఔషధము ద్వారా ఒక వ్యాధి కి చికిత్స చేసినట్లేపిల్లలకు విద్య ద్వారా వినయము మరియు నైతిక విలువలు రుజువర్తనము నేర్పించాలి.

ఔషధము ఎల్లప్పుడూ రుచికరముగా ఉండదు లేదా మనోజ్ఞమైన వాసన కలిగియుండదు. కానీ అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడువ్యక్తికి తానూ కోరిన విధముగా మందు ఉండదు కదా! అతని ఇష్టాలు మరియు అయిష్టాలు అటువంటి పరిస్థితిలో పక్కన పెట్టక తప్పదు కదాపిల్లల పెంపకము చేపట్టినప్పటి పరిస్థితి కూడా అంతే! పిల్లవానిని  తన ఇష్టాలకు మరియు అభిరుచులకు  విడిచిపెడితేఅవి మంచివి కావని మనము గమనించి చెబితే తన ప్రవర్తనను మార్చుకొనుటకు ఇష్టపడక పోవచ్చును. మరి తల్లిదండ్రులు అట్టి పసివారిని అరచి, తిట్టి, కొట్టియైనా సరే మందలించి మార్చవలసియుంటుంది. లేకపోతే ఈ క్రింది పద్యమును రుజువు పరచుతుంది.

పెదవి మించు పళ్ళు పెరికి వేయగలేము

అదుపు మీరు సుతుని ఆపలేము

గొడ్ఢుబోవ చెట్టు కొరీనా ఫలమీదు

రామమోహనుక్తి రమ్య సూక్తి

నేటి యుగములోమనస్తత్వవేత్తలు పిల్లలను వారి ఇష్టాలకుకల్పనలకు వదిలేయాలని చెబుతారు. కానీ ఇది వాస్తవ దూరము. తల్లిదండ్రులు మొదట ఆ విషయాలను పరిశీలించివారి పంథా సరియైనది కాకుంటే సంతానానికి సరియైన సలహా ఇవ్వాలి. మన పూర్వీకులు ఇలా అంటారు:

రాజవత్ పంచ వర్షాణి దశ వర్షణి తాడవత్ l

ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్ ll

మొదటి ఐదేళ్లపాటు పిల్లలకు రాజు / రాణి హోదా ఇవ్వాలి. పదేళ్లపాటుశిక్షను కూడా అవసరానికి అనుగుణంగా వాడాలి.మహారవ సంవత్సరం వచ్చిన వెంటనే పిల్లలతో స్నేహం కొనసాగించాలి.

విద్య ద్వారా పిల్లలలో విలువలను పెంపొందించడం  వారికి సంబంధించిన పెద్దలందరి యొక్క విధి, బాధ్యత, కర్తవ్యము. అసలది అత్యంత ప్రాధమిక కర్తవ్యమవుతుంది. సరైన జ్ఞానాన్ని పెంపొందింప జేయుటచేవ్యక్తి పెద్దయిన తరువాత  ఆదర్శవంతమగు వాతావరనమును కుటుంబలో వ్యాపింపజేయగలుగుతారు. ఔషధము యొక్క రుచి చేదయినా, రోగ నిర్మూలనకు అది ఆవశ్యకము. అదేవిధముగాసంతుకు సదభ్యాసమును ఏర్పరచుటకు కష్టాలు కడగళ్ళు అడ్డురాకూడదు. సద్గుణవంతులే సమాజ హితైషులు.

अनिच्छन्तोऽपि विनयं विद्याभ्यासेन बालकाः ।

भेषजेनेव नैरुज्यं प्रापणीयाः प्रयत्नतः ॥ हरिहरसुभाषित

वांछित न होने पर भीजिस प्रकार एक रोग (रोग का उपचार) औषधि द्वारा किया जाता हैउसी 

प्रकार शिक्षा के द्वारा बच्चों को नम्रता (और मूल्यों) की शिक्षा देनी चाहिए।

दवा का स्वाद हमेशा अच्छा या मोहक गंध नहीं होता है। लेकिन बीमारी मेंक्या व्यक्ति के पास कोई 

विकल्प होता हैक्या ऐसी स्थिति में उसकी पसंद-नापसंद को दरकिनार नहीं किया जातायह ठीक 

वैसा ही परिदृश्य है जब बच्चे की परवरिश हाथ में होती है। सिर्फ इसलिए कि उसके पास अपनी 

सनक और कल्पनाएं हैंएक बच्चे को उसके आचरण के बारे में जाने की अनुमति नहीं दी जा सकती 

हैहालांकि वह चाहता है।

आजकल के जमाने में मनोवैज्ञानिकों का कहना है कि हम बच्चोंको उनके सनक और कल्पनाओं पर 

छोड़ना है l लेकिन यह ठीक नहीं है l माता पिता पहले उन विषयोको जानकार परखकर लड़के को 

उनके आलोचना के बारेमें उचित सलाह देनी चाहिए l हमारे पूर्वज कहते हैं :

राजावत पंचा वर्षाणि दशा वर्षाणि तादावत् l

प्राप्तेतु षोडशे वर्षे पुत्रं मित्र वादाचरेत ll

पहले पांच साल बच्चों को राजा\रानी दर्जा देना चाहिए l बाद में. दस साल जरूरत के अनुसार दंड 

प्रयोग भी करना चाहिए l सोलहवां साल आते ही बच्चों से मैत्री का पालन करना चाहिए l

शिक्षा के माध्यम से बच्चों में मूल्यों को विकसित करना आसपास के लोगों का सबसे महत्वपूर्ण कर्तव्य 

बन जाता है। जैसे-जैसे वह बड़ा होता हैसही ज्ञान प्राप्त करना उसे एक अद्भुत इंसान के रूप में 

बदल देता है।

दवा का कड़वा स्वाद इसके सेवन का निर्णायक कारक नहीं हो सकता है। इसी तरहसीखने के साथ 

आने वाली कठिनाइयाँ और बलिदान सदाचारी और विद्वान इंसान बनने के लिए निर्णायक कारक नहीं 

हो सकते हैं!

anicchanto'pi vinaya vidyābhyāsena bālakāḥ 

bheajeneva nairujya prāpaṇīyāḥ prayatnata  hariharasubhāṣita

Even if not desired, just as a disease (is treated) through medicine, children should be taught humility (and values) through education.

Medicine doesn't always taste good or smell enticing.  But when in sickness, does the person have a choice?  Don't his likes and dislikes get put aside in such a circumstance?  It is the exact same scenario when a child's upbringing is at hand.  Just because he has his whims and fancies, a child cannot be allowed to go about his demeanor however he pleases. 

In today's context, psychologists say that we have to leave children to their whims and fantasies. But this is not right. Parents should first examine those subjects and give proper advice good and bad, pros and cons to the boy\girl of their desire. Our ancestors say:

Rajawat Pancha Varshani Dasa Varshani Tadavat l

Pratetu shodse varshe putran mitra vadacharet ll

For the first five years, the children should be given the status of king/queen. Later. For ten years, punishment should be given according to the need. As soon as the sixteenth year comes, the parents should maintain friendship with the children.

It becomes the most primal duty of those around to inculcate values in the child through education.  Acquiring the right knowledge chisels him out into a wonderful human being as he grows up.

The bitter taste of medicine cannot be the deciding factor for its consumption.  Similarly, the hardships and sacrifices that come with learning cannot be the deciding factors against becoming virtuous and learned human beings!

స్వస్తి.

No comments:

Post a Comment