Sunday, 6 June 2021

అజరామర సూక్తి – 263 अजरामर सूक्ति – 263 Eternal Quote – 263

 

అజరామర సూక్తి  263

अजरामर सूक्ति  263

Eternal Quote  263

https://cherukuramamohan.blogspot.com/2021/06/263-263-eternal-quote-263.html

अमंत्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम्‌।

अयोग्यः पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः

అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధంl

అయోగ్యః పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః ll

మంత్రమునకుపయోగపడని అక్షరములెదు. వైద్యమునకుపయోగాపడని మూలికలేదు

యోగ్యత లేని వ్యక్తి (అంటే అయోగ్యుడైన వ్యక్తి) లేడు. ఇవి అన్నీ తెలిసిన వ్యక్తి దొరకడు.

భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు, కానీ ఆ వస్తువు 

యొక్క ప్రయోజనము తెలిస్తేనే మనము దానిని తగు విధముగా వాడగలము, లేదంటే 

నిష్ప్రయోజనమే!

   పూర్వము బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువు వైద్యశాస్త్ర గురుకులము నడిపేవాడు. 

ఆయన దగ్గర పదిమంది శిష్యులను మాత్రమే చేర్చుకొనేవాడు.  ఒకనాడు ఆయన  

ఆపదిమందిని  పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్లిఅక్కడున్న అన్ని చెట్లను పరీక్షించి ఏ 

మందుకూ పనికిరాని చెట్టుకు గురుతుగా ఆ చెట్టు ఆకులు తెచ్చి నాకు చూపించండి’ 

అన్నాడు. ప్రతి విద్యార్థీ ఏదో ఒకటి తెచ్చి పనికిరానిదని చూపించినారు. చివరికి పదవ 

విద్యార్థియగు  జీవకుడు విషణ్ణవదనముతో,చీకటి పడుతూ ఉండగా రిక్త హస్తములతో 

వచ్చినాడు. గురువుగారు ‘ఏం నాయనా అలా ఉన్నావు! అని అడిగారు. విద్యార్థి 

‘గురువుగారూ నేను ఎంత వెతికినా వైద్యానికి పనికిరాని ఆకు ఒక్కటీ నాకు 

కనపడలేదు’ అంటూ గురువుగారు శిక్షణా ప్రారంభములో చెప్పిన శ్లోకమును 

గుర్తుచేసినాడు జీవకుడు.

దీని అర్థం ఇది. ‘అమంత్రమక్షరం నాస్తి’  అంటే మంత్రం కాని అక్షరము లేదు. 

'మననేన త్రాత ఇతి మంత్రంఅనియే కదా శాస్త్రవచనము. కాబట్టి ఉచ్ఛారణా 

లోపముతో ఆమంత్రాక్షరములను మననము చేస్తే అందుకు తగ్గ ఫలితమే వస్తుంది.

ఇక్కడ మా అమ్మమ్మ చెప్పిన ఒక కథ, సందర్భోచితము కావున మీ ముందుంచుతాను. 

వెనుకటికి ఒక ‘నాంచారమ్మ గుడి పూజారిని ఒక మూఢుడు తన చిరకాల వాంఛ 

తీరుటకు ఒక మంత్రము చెప్పమంటే ఆయన “నీ కోరిక ముందు తలచి అటుపై 

సిధ్ధించుటకు అని చెప్పి ‘నమ్మితిని అమ్ నాంచారమ్మా’ అని నెమ్మదిగా 

చెప్పుకొ”మ్మన్నాడు. ఈ మూర్ఖ భక్తుడు ఫలితము సత్వరము పొందనెంచి 

‘నమ్మితినమ్మా నాంచారమ్మా’ అని గడగడ చెప్ప మొదలిడినాడు. అమ్మవారు వాడు 

మంత్రము ఉచ్చరించిన మేరకే వచ్చి తిని పోయింది. అందుచే ప్రతి అక్షరమూ మంత్రమే 

కానీ ఉచ్చరించుటలో తప్పు దొరలరాదు. ‘సకలం కరోతి’ అంటే సర్వస్వమూ 

చేయమని, ‘శకలం కరోతి’ అంటే ముక్కలు ముక్కలు చేయమని. అలాగే ‘నాస్తి 

మూలం అనౌషధం’  అంటే వైద్యానికి పనికిరాని చెట్టు వేరు, బెరడు,ఆకు ఏదీ 

ప్రపంచంలో లేదు. అలాగే ‘అయోగ్యః పురుషో నాస్తి’. అంటే పనికిరాని మనిషి కూడా 

ప్రపంచంలో లేడు. కానీ అతని లేక ఆమె అనగా ఆవ్యక్తియోక్క మానసిక 

బలాబలములను గ్రహించి తగువిధముగా వాడుకొనుట ఆ కార్య నిర్వాహక నిపుణునిపై 

ఆధారపడి యుంటుంది. పని చేయవలసిన సమయములో పాటలు పాడే వ్యక్తిని ప్రచార 

సాధన విభాగమునకు పంపితే ఉపయోగపడుతాడు కానీ కర్రజూపించి పనిచెయమని 

చెప్పినా చేయలేడు. అందుకే చిన్న పిల్లల విషయములో ‘నీవెందుకూ పనికి రావు’ అని 

తిడుతూనే ఉంటె అదేనిజమని అట్లే అయిపోతాడు ఆ బాలుడు.

జగమున పనికే రానిది ఏదీ ఉండదు. వచ్చిన చిక్కల్లా అది ఎందుకు పనికివస్తుంది 

అన్నది మనకు తెలియదు.

జగమున పనికేరానిది

నగ వారిధి భూమిపైన నలుసే అయినా

అగుపించబోదు గాంచిన

ఖగరాజునకైన విబుధ గణనుత రామా!  

 

अमंत्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम्‌।

अयोग्यः पुरुषो नास्ति योजकःस्तत्र दुर्लभः

 ऐसा एक भी अक्षर नहीं है जो मंत्र नहीं बन सकताऎसी एक भी वनस्पति नहीं है जो औषधि नहीं हो सकतीऐसा कोई भी व्यक्ति नहीं है जिसमे कोई भी गुण या योग्यता नहीं हो। किन्तु उनका 

उपयोग करने वाला संयोजक मिलना अथवा उन्हें पहचानने वाली पारखी दृष्टि होना कठिन है... 

सार संक्षेप में इस सृष्टि में ऎसी कोई वस्तु या ऐसा कोई जीव नहीं है जिसमें कोई भी गुण न हो या 

जो किसी भी प्रकार से उपयोगी न हो। कमी है तो बस अन्वेषणकर्ता की है।

मैं उक्त श्लोक को कुछ दृष्टांतों के साथ समझाने की कोशिश करूंगा

पूर्व में ब्रह्ममित्र नाम के एक महान आयुर्वेद  शिक्षक और गुरु थे। उन्होंने केवल दस शिष्यों को 

पढानेका प्रतिबंध लगाया था। एक दिन उसने अपने शिष्यों को बुलाया और कहा, 'जंगल में जाओ 

और वहां के सभी पेड़ों की जांच करो और उस पेड़ की पत्तियों को लाना जो बेकार पेड़ माने जो 

किसी प्रकार का उपयोग में नहीं आता । प्रत्येक छात्र कुछ न कुछ लाया और दिखाया कि वह बेकार 

है। आखिर में दसवां लडका जिन का नाम जीवक था, अपने चेहरे पर सारा दुख के साथ खाली हाथ 

आया। शिक्षक ने उससे पूछा कि वह खाली हाथ क्यों आया है। छात्र ने प्रशिक्षण की शुरुआत में शिक्षक द्वारा सुनाए गए एक श्लोक को याद किया और कहा, "मैंने कितना भी खोजागुरूजी, मुझे एक भी पत्ता नहीं मिला जो दवा के लिए बेकार हो या किसी काम का नहीं"l

शीर्ष पर दिया गया श्लोक का अर्थ है 'अमन्त्रमाक्षरम नास्ति' - अर्थात ऐसी कोई वर्णमाला नहीं है जो अपने आप में कोई मंत्र  हो। 'मननेना त्रात इति मंत्रःशास्त्र कहता है। तो वर्तनी की त्रुटि के साथ जप नहीं करने में कोई भी त्रुटि बुरा परिणाम देसकती है

यहाँ मैं अपनी माँ की माँ द्वारा बताई गई एक कहानी का वर्णन करता हूँ। एक कट्टर भक्त लेकिन स्वभाव से मूर्ख ' नाँचरम्मा मंदिरपुजारी के पास पहुंचा और ऐसा एक मंत्र का उपदेश देनेकेलिए कहा जो झट से उनकी इच्छा पूरी करसकती है। पंडित ने कहा, "पहले तुम देवी को अपनी इच्छा मन में ही बताएं और फिर धीरे-धीरे कहें, 'नम्मितिनि अम्मा  नाँचरम्मा'।" जिस का अर्थ है मई मैंने केवल तुझ पर ही भरोसा रखा है l यह मूर्ख भक्त जल्दी से परिणाम प्राप्त करना चाहता था और 'नम्मितिनम्मा नंचरम्माके नारे लगाने लगा। उस मंत्र का अर्थ ही बदल गया l मां ने आकर उस व्यक्ति को खा लिया क्योंकि उन से मंत्र का गलत उच्चारण किया गया था। 'नम्मितिनम्माका अर्थ है 'मुझ पर विश्वास करो और खाओ'। तो हर अक्षर एक मंत्र है लेकिन उच्चारण में कुछ भी गलत नहीं होना चाहिए। 'सकलम करोतिका अर्थ है सब कुछ करना, 'शकलम करोतिका अर्थ है तुकडे करना l           

साथ ही 'नस्ति स्रोत अनुषाधम' - यानी दुनिया में कोई भी जडछाल या पत्ता नहीं है जो दवा के लिए या 

किसी  किसी माना उपयोग केलिए बेकार हो। साथ ही 'अयोग्य पुरुषो नस्ति'। यानी दुनिया में कोई भी 

बेकार आदमी नहीं है। लेकिन यह प्रबंधक के कौशल पर निर्भर करता है कि वह उस आदमी के 

 मानसिक शक्तियों को उचित रूप से समझे और उपयोग करे। किसी गायक को आदेश मांग और 

फटकार द्वारा काम कराने के बजाय उत्पाद विपणन विभाग में भेजने में मददगार हो सकता है। इसलिए 

छोटे बच्चों के मामले में अगर हम उसे 'तुम किसी भी चीज़ के लिए बेकार हो' बोलके उस बालक का 

आत्मनिर्भाराताको तोड़ना नहीं चाहिए l  वैसा कहनेसे  लड़का उसी बात को सही मान के  बेकार हो 

जाता है

दुनिया में ऐसा कुछ भी नहीं है जो काम  करे। हम नहीं जानते कि वह कैसा काम करता है

 Amantramaksharam naaasthi naasthi moolamanoushadham l

Ayogyah purushonaasthi prayogastaradurlabah ll

There is no alphabet which doesn't have charm (curative property, not used in 'Mantra').

There is no root which doesn't have medicinal property.

There is no man who is not of worth

Rare is a person who knows its proper application.

There is no letter in the scriipt that is not a mantra, a chanting, a principle; what we need is a Pandit, a scholar to pronounce it. There is no root / plant without medicinal value; what we need is a doctor to diagnose it. There is none in this world who is ineligible, inefficient, and ineffective; what we need is a MANAGER who manifests it.

I will try to explain the said sloka with certain illustrations.

Formerly a great teacher named Brahmamitra was an Ayurveda guru. He maintained a restriction of teaching only ten disciples. One day he called his disciples and said, 'Go into the forest and examine all the trees there and bring me the leaves of that tree as a mark for any useless tree’. Each student brought something and showed that it was useless. Eventually the tenth boy Jivaka came in with empty-hands with all the sorrow in his face. The teacher asked him as to why he happened to come with empty hands. The student recalled a shloka recited by the teacher at the beginning of the training and said "No matter how much I looked for, Master! I could not find a single leaf that was useless for medicine."

The shloka is given on the top and here it is what it means. ‘Amantramaksharam Nasti’ - means there is no Alphabet which is not a mantra by itself. 'Mananena Trata Iti Mantra' is what the Shaastra says. So any error in chanting with a spelling error will only give an evil result.

Here I illustrate a story told by my Mother’s Mother. A staunch Bhaktha but stupid by nature approached ‘Nancharamma Gudi priest. He said, "First you tell your desire to Goddess and then slowly say, 'Nammitininamma Nancharamma'." This foolish devotee wanted to get the result quickly and started shouting ‘Nammitinamma Nancharamma’. The mother came and ate as the mantra was uttered incorrectly. ‘Nammitinamma’ means ‘Trust me and eat’.  So every letter is a mantra but there should be nothing wrong with the pronunciation. ‘Sakalam Karoti’ means to do everything, ‘Sakalam Karoti’ means to make into pieces.

Also ‘nasti moolamanoushadham’ - that is, there is no root, bark or leaf in the world that is useless for medicine or for any human use. As well as ‘Ayogyah Purusho Nasti’. That is, there is no useless man in the world. But it depends on the manager's skill to perceive and use his or her mental strengths appropriately. It may be helpful to send a singer to the product marketing department than to make him do work by command demand and reprimand. That's why in the case of small children, if we scold him ‘You are useless for anything’, the boy thinks the same way and becomes useless.

There is nothing that does not work in the world. We do not know how it works.

స్వస్తి.

No comments:

Post a Comment