Tuesday, 8 June 2021

అజరామర సూక్తి – 265 अजरामर सूक्ति – 265 Eternal Quote – 265

 

అజరామర సూక్తి  265

अजरामर सूक्ति  265

Eternal Quote  265

https://cherukuramamohan.blogspot.com/2021/06/265-265-eternal-quote-265.html

किं वावसादकर आत्मवताम् l

కిం వావసాదకర ఆత్మవతాం l మాళవికాగ్ని మిత్రం నాటకము (మహాకవి కాళీదాసు)

జ్ఞానుల చిత్తములను  ఎటువంటి అవాంతరములు నిగ్రహించలేవు

అతి చక్కటి ఈ సూక్తికి అస్సలైన ఉదాహరణ భర్తృహరి సుభాషితములలోని నీతి 

శతకము-ధైర్య పద్ధతి నందు గల ఈ సూక్తి.

రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా

న భేజిరే భీమ విషేణ భీతిమ్‌ ।

సుధాం వినా న ప్రరయుర్విరామం

న నిశ్చితార్థాద్విరమంతి ధీరాః ॥

పై సూక్తికి ఏనుగు లక్ష్మణకవి గారి తెనుగు సేత ఈ క్రింది విధముగా ఉన్నది.

తనిసిరే వేల్పు లుదధిరత్నముల చేత

వెఱచిరే ఘోర కాకోల విషముచేత

విడిచిరే యత్నమమృతంబు వొడముదనుక

నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు

ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులుంటాయి. అనుకూలతకు పొంగిపోవద్దు. 

ప్రతికూలతకు కుంగిపోవద్దు. అవి ఉంటూనే ఉంటాయి. దేవతలురాక్షసులు 

అమృతాన్ని సాధించదలుచుకున్నారు. ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చినారు. కానీ 

నిలకడ లేని మనస్తత్వముతో రాక్షసులు తలచినది సాధించాలేకపోయినారు.

 అదే దేవతలుఅమృతాన్ని మథిస్తుంటే ఆకర్షణీయమగు ఎన్నో వస్తువులు వచ్చినాయి. 

రకరకాల రత్నాలు వచ్చినాయి. చివరకు గాని  అమృతము పుట్టుట జరుగలేదు. 

వాళ్లు ఏ ఐరావతంతోనోఉచ్చైశ్రవముతోనోచింతామణితోనోకామధేనువుతోనో 

సంతృప్తి పడి ఊరుకోలేదు. అమృత సాధనయే వారి లక్ష్యము. మనము కూడా 

ఆవిధముగానే ఉండవలెను. ఉన్నతమైన లక్ష్యము పై ధ్యాస ధ్యేయము కలిగినప్పుడు

మధ్యలో వచ్చు అవాంతరాలతో  కలత చెందకూదు మరియు ఏవో ఈ వచ్చినవి 

చాలులే అని అనుకొననూ కూడహు. సత్ఫలితము సాధించేవరకూ సంతృప్తి 

పడకూడదు. ఒక్కోసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఉదాహరణకు 

కాలకూట విషము పుట్టినప్పుడు శివుణ్ణి ప్రార్థించినారు. అలాగే ప్రతిదానికీ ఒక 

పరిష్కారం ఉంటుంది. భయకంపితులము గాక నిలుపూ నిదానముగా వలుపూ 

వైనముగా ఆలోచించితే అలుపు ఆయాసము లేకుండా ఫలితము దక్కుతుంది.ఎట్టి 

పరిస్థితుల్లోనూ తలపెట్టిన ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదల కలవారు, 

ధైర్యవంతులు, విజ్ఞులు విశ్రమించరు.

 किं वावसादकर आत्मवताम् l मालविकाग्निमित्र नाटकम्-महाकवि कालीदास

ऐसा कुछ भी नहीं है जो उच्च विचारों वाले व्यक्तियों के मन को थका या परेशान करे

इस पंक्ति का एक अच्छा  और सच्चा उदाहरण हमें भर्तृहरि शुभाषितम् के ‘नीति शतक’ में मिलता है l  

वह इस प्रकार है l

रत्नैर्महार्हैस्तुपुर्न देवा  भेजिरे भीमविषेण भीतिम् ।

सुधां विना  प्रपयुरविरामं  निश्चितार्थाद्विरमन्ति धीराः ।। ८१ ।। 

भर्तृहरि नीतिशतकमधैर्य पद्धति

समुद्र मथते समयदेवता नाना प्रकार के अमोल रत्न पाकर भी संतुष्ट  हुए - उन्होंने समुद्र 

मथना  छोड़ा। भयानक विष से भयभीत होकर भीउन्होंने अपना उद्योग  त्यागा । जब तक 

अमृत  निकल आया उन्होंने विश्राम  किया - अविरत परिश्रम करते ही रहे । इससे यह सिद्ध 

होता हैकि धीरज, प्रथिबद्धाता और ज्ञानी पुरुष अपने निश्चित अर्थ - इच्छित पदार्थ - को पाए 

बिनाबीच में घबरा कर अपना काम नहीं छोड़ बैठते ।

Kimivaavasaadakara aatmavataam l

Malavikaagni mitraM Natakam (Mahakavi Kalidasa)

There is nothing which will tire out or disturb the mind of high-minded 

persons.

We find a good and true example of this wisdom in 'Niti Shatak' of 

Bhartrihari Shubhashitam. It is as follows.

Ratnairmaharhaistupurna Deva Na bhadhere bhimavishen bhitim l

Sudham vina Na prapyuraviram Na nishkartha dvirmanti dhiraah ll 81.

Bhartrihari Nitishtakam - Patience Method

While churning the ocean, the gods were not satisfied even after getting a 

variety of priceless gems - they did not stop churning the ocean. Despite 

being frightened by the terrible poison, they did not give up their industry. 

They did not rest until the nectar came out - continued to work hard. This 

proves that the brave committed and knowledgeable persons do not leave 

their work without getting their definite meaning-the desired substance-in 

the middle, panicking.

స్వస్తి.

No comments:

Post a Comment