అజరామర సూక్తి – 288
अजरामर सूक्ति – 288
Eternal Quote – 288
https://cherukuramamohan.blogspot.com/2021/07/288-288-eternal-quote-288.html
प्रमाणा दधिकस्यापि गंदाश्यामामदच्युतेः l
पदम् मूर्ध्नि समाधत्ते केसरी मत्ता दन्तिनः ll
बालस्यापि रवेः पादाः पतन्त्युपरि भूभृताम् ।
तेजसा सह जातानां वयः कुत्रोपयुज्यते ॥ - पञ्चतन्त्र, मित्रभेद
ప్రమాణాదధికస్యాపి గండశ్యామమదచ్యుతేః, l
పదం మూర్ధ్ని సమాధత్తే కేసరీ మత్తదంతినః,ll తథా చ,
బాలస్యాపి రవేః పాదాః పతంత్యుపరి భూభృతామ్l
తేజసా సహ జాతానాం వయః కుత్రోపయుజ్యతే ll
సింహము తన శరీరముకన్నా ఎంతో పెద్దదగు శరీరమును కలిగి, కపోలము నుండి
మదము స్రవించుచున్న ఏనుగు అనగా మదపుటేనుగు యొక్క కుంభస్థలంపై తన
పాదాన్ని మోపుతుంది. బాలసూర్యుడు తన పాదములను అనగా కిరణములను పర్వత
శిఖరాలపై ఉంచగలుగుచున్నాడు. కావున తేజోవంతులగువారి యెడల వయస్సును
పరిగణనలోకి తీసుకోకూడదు.
పంచతంత్రము విష్ణుశర్మ చే వ్రాయబడినది. భర్తృహరి ఆయనకు పూర్వీకుడు. అందుకే
తన కావ్య ప్రారంభములోనే విష్ణుశర్మ తనకు అవసరమని అనిపించినచోట భర్తృహరి,
చాణక్య ఇత్యాది మహాత్ములు వ్రాసినవి తను రచించే కథకు అనుగుణముగా
తీసుకొన్నట్లు ముందే తెలిపినాడు.
భర్తృహరి సుభాషితములలో పై రెండు శ్లోకములు విలోమక్రమములో కనిపించుతాయి.
యదచేతనోఽపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితు రినకాంతః ।
తత్తేజస్వీ పురుషః పరకృతనికృతిం కథం సహతే ॥ 29
సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ।
ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతుః ॥ 30
పై శ్లోకముల తెనుగుసేత ఏనుగు లక్ష్మణకవి గారి భర్తృహరి సుభాషితములలో ఈ
విధముగా గానవస్తుంది.
విదళింప నురుకు సింగపు
గొదమయు మదమలిన గండకుంజరములపై
నిది బలశాలికి నైజము
గద, తేజోనిధికి వయసు కారణమగునే ?
అర్కకాంత మచేతనం బయ్యు సవితృ
పాదములు సోకినంతనే ప్రజ్వరిల్లు
గాన నభిమానవంతుడెందైన శత్రు
కృత తిరస్కార మెట్టు సహింపనేర్చు ?
ఈ వాస్తవాన్ని గమనించండి సూర్యుడు తులారాశిలో చేరినా, మేఘసమూహాలను
జయిస్తున్నాడు. ఈ వాక్యమునకు కాస్త అన్వయము చెప్పుకోవలసియుంది. సూర్యునకు
‘మేషము’ ఉచ్చరాశియని, ‘తుల’ నీచరాశియని జ్యోతిశ్శాస్త్రం చెబుతూవుంది. అంటే,
రవి నీచలో ఉన్నా తన ప్రభావములో లోపము చూపదని అర్థము.
కుసుమ స్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః ।
మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ॥25
కుసుమ గుచ్ఛంబునకు బోలె బొసగు శౌర్య\
మాన వంతునకివి రెండు మహిత గతులు
సకల జన మస్తక ప్రదేశముననైన
వనము నందిన జీర్ణ భావంబు గనుట
పూవులా చెట్లకు పూచే పూవులు సువాసనా మారవు. కానీ అవి జనపదములలో ఉంటే
ఆడువారి కొప్పును అలంకరించుతాయి అదే అడవిలో వుంటే భూమిపి రాలి వాడి
పోతాయి. కానీ వానిలోన గల సువాసన అన్న గుమము మాత్రము మారదు. శూరుడు
కూడా ఎక్కడ వున్నా తన స్వతఃసిద్ధమగు తన గుణమును మానడు.
प्रमाणा दधिकस्यापि गंदाश्यामामदच्युतेः l
पदम् मूर्ध्नि समाधत्ते केसरी मत्त दन्तिनः ll
बालस्यापि रवेः पादाः पतन्त्युपरि भूभृताम् ।
तेजसा सह जातानां वयः कुत्रोपयुज्यते ॥ - पञ्चतन्त्र, मित्रभेद
हाथी का शरीर शेर से बहुत बड़ा होता है, लेकिन वह हाथी के ऊपर कूद जाता है और
हाथी के जो खोपड़ी से तरल वसा स्रावित होता है उस खोपड़ी पर अपने पैर रखता है। उसी तरह
बाल सूर्या भी अपने पैर यानी सूर्य किरण पहाड़ों की चोटी पर गिर रखता है।
उन लोगों के लिए जो प्रतिभा के साथ पैदा हुए, उम्र की प्रासंगिकता कहां है?
शेर का शावक भी हाथी की खोपड़ी पर कूद जाता है l
बहुत ही कोमल सूरज सुबह जल्दी उठ जाता है क्योंकि वह गहरी घाटियों तक पहुँच सकता है और
पहाड़ों की चोटियों को भी छू सकता है.. वह राजाओं पर और साथ ही राजा के आदमियों पर भी
चमक सकता है। जो लोग स्वाभाविक रूप से प्रतिभाशाली हैं, उनकी उम्र का उनकी उपलब्धियों से
कोई संबंध नहीं है।
यह निश्चित रूप से एक विशेषता है जिसे हर कोई रखना चाहता है! किसी के वर्षों के अनुभव के
आधार पर उपलब्धियां मिलना जरूरी नहीं हैं। बच्चे, अपने भोलेपन और मासूमियत से भी बड़ों को
बहुत कुछ सिखाते हैं। बालकों का उम्र कोई कारक नहीं है अपने ओजस दिखानेकेलिए l वे
स्वाभाविक रूप से खुश हैं और उनकी खुशी संक्रामक है! वयस्कों परिवार के झंझट में फस कर ,
अपने अकाल का बेकदर करते हैं और नए दिशा के खोज में अपना समय व्यतीत नहीं करते l
पंचतंत्र की रचना विष्णु शर्मा ने की थी। भर्तृहरि उनके पूर्वज हैं। अपने काव्य के आरंभ में विष्णु शर्मा
कहते हैं कि जब उन्हें अपने पूर्वजों की आवश्यकता महसूस हुईतो, उन्होंने भर्तृहरि, चाणक्य आदि
ने जो लिखा था, उन रचनाओं का प्रतिकृति अपने पंचतंत्र में लेनेकेलिए प्रारम्भ में ही लिखे थे।
निम्नलिखित दो श्लोक हैं जो वही अर्थ दे रहे हैं जो ऊपर लिखे गए हैं l
भर्तृहरि:.
यदचतानिपि पदैं स्पृणं प्रज्वलती सवितु रिनकांत:।
तत्तजस्वी पुरुष: पराकृत्तिनिकृतिं कथां सहति ll 29
सिन्हा: सिशुरापि निपातति मद मालीना कपिला भित्तिशु गजु।
प्रकृतिरियां सत्त्ववतं न खालू वयस्तिजसां हितु: ll 30
ऐसी हमारे पूर्वजों की महानता है जिन्होंने सदाचार और नैतिकता के
हिमालयी खजाने को वसीयत दी।
Pramana dadhikasyapi gandashyamamadchute: l
padam murdhni samadhatte kesari matta dantih ll
Balasyapi Raveh Padaah Patantyupari Bhubhritam l
Tejasaa saha jataanam vayah kutropyujyate ll -Panchatantram, mitrabhedam
The Elephant has a body much larger than a lion, but he jumps on to the apex of the
elephant, which is secreting liquid fat from the skull and keeps his legs on it. Even the
feet of young Sun (sunrays) can fall on top of the mountains (kings). For those
born with brilliance, where is the relevance of age?
Even a cub of a lion jumps on to the scull of an elephant
The very tender sun early in the morning easily as he can reach the deep valleys and
can also touch the tops of the mountains... He can shine on kings, as well as king’s men.
For those who are inherently brilliant, their age has no connection to their achievements.
That certainly is an attribute everyone wants to possess!
Achievements are not necessarily gauged, based on one's years of experience.
Children, even with their naivety and innocence, teach the grown-ups a lot. Age is no
factor to the little ones. They are inherently happy and their happiness is contagious! As
adults, why do we fall short of these traits?!
The Panchatantra was written by Vishnu Sharma. Bhartruhari is his ancestor. That is why
at the very beginning of his poetry, Vishnu Sharma states, when he felt the need, he had
taken what was written by Bhartruhari, Chanakya, etc., in line with the story he was
writing. The following are the two Shlokas giving the same meaning as above written by
Bhartruhari:.
Yadacētanōఽpi pādaiḥ spr̥ṣṭaḥ prajvalati savitu rinakāntaḥ।
tattējasvī puruṣaḥ parakr̥tanikr̥tiṁ kathaṁ sahatē॥ 29
sinhaḥ śiśurapi nipatati mada malina kapōla bhittiṣu gajēṣu।
prakr̥tiriyaṁ sattvavatāṁ na khalu vayastējasāṁ hētuḥ॥ 30
Such is the greatness of our ancisters who bequeathed a Himalayan
treasure of Morals and Ethics.
స్వస్తి.