అజరామర సూక్తి -196
अजरामर सूक्ति - 196
Eternal Quote - 196
https://cherukuramamohan.blogspot.com/2021/04/196-196-eternal-quote-196.html
अग्नौ दग्धं जले मग्नं हृतं तस्करपार्थिवैः l
तत्सर्वं दानमित्याहुः यदि क्लैब्यं न भाषते ll - सुभाषितरत्नभाण्डागार
అగ్నౌ దగ్ధం జలే మగ్నం హృతం తస్కరపార్థివైః l
తత్సర్వం దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతే ll - సుభాషితరత్నభాణ్డాగారము
ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి పోవడము గానీ, నీటిలోబడి మునిగి
పోవడము గానీ లేక చోరులచేత తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న
దానిని గూర్చి పరితపించక కృష్ణార్పణం అన్న దృష్టిని అలవరచుకొంటే అంతకు
మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా .
కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ
సంతృప్తి వస్తుంది. ఆవిధంగా మనము వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ
ఉండరని మాత్రం అనుకోవద్దు. ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు. వారలే
మనకాదర్శము. చింత చెంతన ఉంటే చేర్చేది చితికే!
ఈ విషయమును ఒకపరి గమనించండి. चित चिंत (చిత, చింత) అన్న రెండు పదాలు
దేవనాగరి లిపిలో వ్రాస్తే చింతలో ఒక బిందువు ఎక్కువ వుంటుంది. కానీ అర్థభేదము
అపారము. చిత అన్నది శవాలను కాలుస్తుంది కానీ చింత జీవించే వారినే కాల్చివేస్తుంది.
దీనిని బట్టి చింత ఎంత ఘాతుకమో మనము అర్థము చేసుకొనవచ్చును. ఈ
విషయమును నాదయిన రీతిలో చెప్పిన ఈ పద్యమును చదవండి.
ఎంతటి వానికైన మది నేర్పడు చింతకు ఊపిరూదుచున్
చెంతన ఈర్ష్య వున్న ఇక చింత దవానలమౌచు రేగి ఏ
పొంతన లేని దుష్టగుణ పూత విపత్తి విషాద మూకలన్
సంతతముంచి చిత్తమును సాంతము గాల్చును రామమోహనా!
పూతము= చిక్కనయిన
చింత అదెంతయైన మరి చెంతన చేరగ చిత్తగించినన
ఎంతటివాడు కూడ గతినెంచగ తప్పును కొంతయైనయున్
సంతసమన్నదే వెదుక సంతనగూడ లభించగల్గునే
కంతలు గల్గు దుప్పటిని గప్పిన వేడిమి రాదు మోహనా!
అర్థము సుగమము కాబట్టి నేను విశ్లేషించలేదు. చింతలన్న కంతలున్న దుప్పటి
కప్పుకొంటే చలితో ఏర్పడిన వణుకు తగ్గదు కదా! కాబట్టి ఎక్కడికక్కడ ఈ చింతలను
వదిలిపెడితే మనసు చాలా తేలిక పడుతుంది. ఈర్ష్య కూడా ఒక విధమైన చింతనే!
శ్రీనాథుని కాశీ ఖండములోని ఈ పద్యమును
గమనించండి:
కంటికి నిద్ర వచ్చునె?సుఖంబగునే రతికేళి?జిహ్వకున్
వంటక మిందునే?యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె?మానుషంబు గలయట్టి మనుష్యుని కెట్టివానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు దనంతటి వాడు గల్గినన్ (కాశీఖండం)
చింత అనేది ‘కరోనా వైరస్’ కన్నా కఠోరమైనది. కావున చింత నెప్పటికీ చెంతన చేర్చవద్దు.
అందుకే చింత అన్నది luggage తో పోల్చుకొంటే నాకు ఒకకాలమునాటి Railway Slogan గుర్తుకు వస్తుంది.
Less luggage More Comfort Make Travel a Pleasure.
अग्नौ दग्धं जले मग्नं हृतं तस्करपार्थिवैः l
तत्सर्वं दानमित्याहुः यदि क्लैब्यं न भाषते ll - सुभाषितरत्नभाण्डागार
अगर हमारा कोई भी चीज़ आग में जल जाता है, पानी में डूब जाता है या चोरों के हस्तगत होजाता है और उसी
की बारे में चिंतित होतेहुए रह
जायेंगे तो कोई प्रयोजन नहीं पा सकते. अगर उसे बुद्धि पूर्वक 'दान' समझते हैं तो नातो चिंता रहेगी मन में न काम
करने में उदासीनता | उस खोयाहुआ चीज़ हमारा ही है तो हमारे हात से नहीं फिसलता |
एक बार इओस श्लोक को पढनेका कोशिश कीजिए l
चिता चिंता समाप्रोक्ता बिंदुमात्रं विशेषता।
सजीवं दहते चिंता निर्जीवं दहते चिता॥
चिता और चिंता समान कही गयी हैं पर उसमें भी चिंता में एक बिंदु की विशेषता है; चिता तो मरे हुए को ही जलाती
हैm पर चिंता जीवित व्यक्ति को l
agnau dagdhaM jalE magnaM hRtaM taskarapaarthivai@h l
tatsarvaM daanamityaahu@h yadi klaibyaM na bhaaShatE ll - subhaaShitaratnabhaaNDaagaara
Anything burnt in the fire, drowned in water, snatched by the thieves or the kings - all these would be called 'daana' (giving), only if (one) doesn't speak woefully of it.
It is all in the attitude! When a material possession is lost for any reason - if one doesn't lament about it and instead thinks that it was not meant to be his anymore - he gains more than he lost, in the form of virtues for his share! On the contrary, even if one gives generous charities but is emotionally attached to the object, his act of giving goes futile. Hence, attitude is what defines everything and every action in this world.
Have a look at the following shloka
Chita chinta samaaproktaa bindu maatram visheshatah l
Sajeevam dahate chintaa nirjeevam dahate chitaa l
"Chita" and "Chinta" are said to be same still there is a difference of a dot. Pyre(chita) burns the dead while Worry(chinta) burns the alive.
Bygones are bygones. Do not fret about them. Better times are yet to come!
Syamala Khambhmpati: Really men and women will get tranquility if they follow this. I
will try it from today itself.
At my young age I used to find out in the railway bogies a slogan as follows:
Less luggage More Comfort Make Travel a Pleasure.
స్వస్తి.
No comments:
Post a Comment