Saturday, 17 April 2021

అజరామర సూక్తి – 211 अजरामर सूक्ती - 211 Eternal Quote – 211

  

అజరామర సూక్తి  211

अजरामर सूक्ती -  211

Eternal Quote – 211

https://cherukuramamohan.blogspot.com/2021/04/211-211-eternal-quote-211.html

ईर्ष्यी घृणी त्वसन्तुष्टः क्रोधनो नित्यशङ्कितः ।

परभाग्योपजीवी च षडेते दुःखभागिनः ॥ - हितोपदेशमित्रलाभ

 

ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశంకితః l

పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః l   

1.ఈర్ష్యాళువు, 2. జుగుప్సావంతుడు, 3. అసంతృప్తి పరుడు 4. క్రోధనుడు5నిత్యశంకితుడు, 6. పరభాగ్యోపజీవి అనే ఆరు లక్షణాలు కల వ్యక్తులు దుఃఖభాగులు.

ఇందులో వరుసగా :                                                                                 

1.       ఈర్ష్యాళువు. ప్రతి మనిషిలోనూ ఈ గుణం కొంత మేర ఉంటుంది. కానీ స్థాయి దాటిన ఈర్ష్యతో ప్రతి ఒక్కరి పట్ల ఈర్ష్య పెంచుకునే వారు తాము ప్రశాంతంగా ఉండలేరు. తమ వారికి ప్రశాంతతను పంచలేరు. అసలు అట్టివారి ఆరోగ్యము చెడుతుంది. ఆరోగ్యము చెడితే ఆవేదన పెరుగుతుంది. ఆవేదన అనర్తమునకు దారితీస్తుంది.

     2.    మన వేషముమాటతీరుప్రవర్తన ఇవన్నీ ఎదుటి వారికి ఇబ్బంది                                     కలిగించ కూడదు. అలా ఇబ్బంది కలిగేలా జుగుప్సావంతమైన ప్రదర్శనతో                         నడచుకొనే వారిని ఎప్పుడూ, ఎవ్వరూ హర్షించరు. ఇతరులు                                             అసహ్యించుకుంటారు. వారు అపుడు రాహువు పట్టిన సూర్యుడే!

వేషమును గూర్చి పెద్దలు ఒక మాట చెప్పినారు.

వస్త్రేణ వపుషా మూర్ఖాః పండితానాం సభాస్వపి l

చత్రన్యాయేన రాజన్తే సత్సంగ ఫలమీదృశం ll

మూర్ఖుడు పందితసభలో, మంచి బట్టలు ధరించి కూర్చొని నోరు మెదపనంతవరకు గొడుగులు తెరచి పట్టుకొన్నవారి నడుమ గొడుగు లేనివాడు కూర్చున్నట్లే! కాబట్టి విద్వాసుల సమావేశములో మౌనము మంచిది.

ఇక మాటను గూర్చి ఒక మాట

మంచిమాట ఎపుడు మనుగడ కలిగించు

పాడు మాట లెపుడు పనికి రావు

పాచినట్టి కూడు పక్వానికొచ్చునా

రామ మొహనుక్తి రమ్య సూక్తి

వినయము కూడా అంతే! వినయవంతునికి సంఘములోని పెద్దల వద్ద ఆప్యాయత పుష్కలముగా వుంటుంది.

3.    సంతృప్తిలో ఉన్న ఆనందం దేనిలో ఉండదు. మనకు ఉన్నదానిలో సంతృప్తి చెందకుండా నిస్సంతోషంతో జీవితాన్ని గడిపే వారు ప్రశాంతంగా ఎలా ఉండగలరు. సాధించిన దానితో సంతృప్తి చెందకుండా అభివృద్ధి దిశగా సాగడం ఓ ఎత్తు. అయితే ఉన్న దానితో సంతృప్తి పడుతూనేఅభివృద్ధి దిశగా సాగడం మేలు చేకూరుస్తుంది. కొందరు అసలు ఎప్పటికీ సంతోషంగా కనిపించరు. వారు ముందుకు వెళ్ళలేరు. నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.

         క్రోధో వైశ్వానరో దేవో ఆశా వైతరిణీ నది
        విద్యా కామదుఘాః దేనుః సంతుష్టిః నందనం వనం
        తన క్రోధమగ్ని గాంచగ
        తన ఆశే వైతరిణిని
  తప్పక చేర్చున్
        తన విద్య కామధేనువు
        తనతృప్తే నందనమ్ము తలవగ రామా!

        కోపము అగ్ని వంటిది. అది తననూ కాల్చుకొంటుంది పరులనూ నిర్దాక్షిణ్యముగా            కాల్చివేస్తుంది. ఇక ఆశ వైతరిణీ నది వంటిది. ఈ వతరినీ నదిని గూర్చి ఒక్కమాట            చెప్పుకొందాము. ఇది వంద యోజనాల వెడల్పు ఉంటుంది. చిక్కని రక్తముచీము         కూడా. భయంకర  జలచరాలుఒక్క క్షణం కూడా భరించలేని దుర్వాసన                       కలిగియుంటుంది.  ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి   తను చేసిన  పాపాలకు                    ఫలితం అందులో మునిగి అనుభవించవలసిందే. అందుకనే తమ వారి కోసం                 భువిపై వారిపేరు మీద గోదానం చేస్తారు.  గోదానం చేస్తే వైతరిణి  నదిని సులభంగా         దాటగలరని గరుడ పురాణంలో  శ్రీమహావిష్ణువు                                                              స్వయంగా  గరుత్మంతుడికి  తెలియజెప్పినాడు. విద్య పాలిచ్చే పాడియావు వంటిది.         తన సంతృప్తే నందనవనము. ఎంతటి నీతి వాక్యములో గమనించండి.

4.    ప్రతిదానికి కోపించే వాడు జీవితంలో దేన్నీ సాధించలేడు. తన కోపమే తనకు శత్రువుగా మారిప్రతి ఒక్కటి దూరం చేస్తుంది. ప్రతి వారు దూరం అవుతారు. కోపాగ్నితో రగిలే మనిషికి దగ్గరగా ఒంటరితనం తప్ప ఎవరూ ఉండలేరు. కోపమునుగూర్చి ఎన్నో మార్లు ఎన్నో విధముల , ఎన్నెన్నో ఉదాహరణలతో తొలగించుకొమ్మని చెప్పుట జరిగినది కావున విశ్లేషించుట లేదు.

     5. ‘చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితం’ అన్నారు పెద్దలు. నిత్యశంకలతో ప్రతి            దానికి భయపడే వ్యక్తిప్రశాంతతను పొందలేడు. అందుకే త్యాగరాజు వారు                  ‘శాంతము లేక సౌఖ్యము లేదు సారసా దళ నయనా’ అన్నారు. శంకలతో                      జీవనం సాగించే వ్యక్తులు అన్నింటికీఅందరిని అనుమానిస్తారు. ఎవరికీ చేరువ              కాలేరు. తమ జీవితంలో ప్రశాతంతను పొందలేరు. అసలు ఈ శంక భార్య పై                  కలిగిందంటే  సంసారమే సర్వనాశనమైపోతుంది. ఈ శంకించే గుణము                         కలిగినవారు సరియైన నిర్ణయమును సకాలములో తీసుకోలేరు.

     6.    పరభాగ్యోపజీవి అంటే ఎప్పుడూ పక్కవారి మీద ఆధారపడే వాడు. ఇలాంటి                      వ్యక్తులు ఏదీ సొంతముగా చేయలేరుకష్టపడరు. ఎప్పుడూ ఎవరో వస్తారని ఎదో          చేస్తారని ఎదురు చూస్తూనే ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా పక్క వారి మీద             ఆధారపడుతూనే ఉంటారు.  ఇలాంటి వారికి దీర్ఘకాలంలో ఇబ్బందులు                            ఎదురౌతాయి.

 ఈ ఆరు గుణాలకు ఎవరూ అతీతులు కారు. అయితే అవి మనలో ఏ స్థాయిలో ఉన్నాయన్నదే అసలు ప్రశ్న. వీటిని జయించి ముందు సాగితేనే జీవితాన్ని మరింత అర్థవంతంగాఆనందంగా గడపటం సాధ్యమౌతుంది.

 

ईर्ष्यी घृणी त्वसन्तुष्टः क्रोधनो नित्यशङ्कितः ।

परभाग्योपजीवी च षडेते दुःखभागिनः ॥ - हितोपदेशमित्रलाभ

 ईर्ष्यालुघृणा करने वालाअसंतोषीक्रोधीसदा संदेह करने वाला तथा दूसरों के भाग्य पर जीवन बिताने वालाये छह तरह के लोग संसार में सदा दुःखी रहते हैं ।

1. अन्य लोगों के प्रति ईर्ष्या कोई अच्छा पैदावार नहीं देती है। ईर्ष्या करने वाला व्यक्ति अपने तथाकथित 'शत्रुके खिलाफ लगातार साजिश रचता ही रहता है। इसलिए वह कभी शांत नहीं हो सकता। हमारे पूर्वज अनुभव पूर्वक  चिता दहति निर्जीवम चिंता दहति जीवितं’ बोले हैं l उसलिए कभी भी हमारे मन में ‘चिंता’ या ‘ईर्ष्या’ को कोइ जगह नहीं देना है l

 

2. किसी के प्रति घृणाअरुचि या घृणा या कोई भी चीज उनके साथ सुंदर विचार उत्पन्न नहीं कर सकती है। ऐसा व्यक्ति हमेशा दुखी रहता है। जब एक व्यक्ति पे घृणा मन में उत्पन्न होगा तब उनका हर काम हमें गलत हरी दिखता है l अगर किसी व्यक्थिका गुण हमें अच्छा नहीं लगता तब उनसे दूर रहना सीखें l

 

3. बिना किसी संतोष के वह लगातार अपने मन को संतुष्ट करने के लिए कुछ और प्राप्त करने की दिशा में काम करता रहता है। ऐसे मन में कोई शांत नहीं होता। छेद घडा में क्या पानी हम भरसकते हैं l

 

4. क्रोधी और क्रोधी व्यक्ति कभी भी किसी चीज या किसी से खुश नहीं होता है। दूसरों को खुश भी नहीं रख सकता l वह हर कदम पर नाराजगी व्यक्त करता है। ऐसे व्यक्ति के पास आनंद कैसे  सकता है?

5. संदेह करने वाले को जीवन के किसी भी पहलू पर भरोसा नहीं रहता है। उसे हर एक आयाम पर विश्वास करने के लिए निरंतर आश्वासन और भौतिक साक्ष्य की आवश्यकता होती है। ऐसा व्यक्ति शायद चैन की नींद भी  सो सकता है

6. परभाग्योपजीवी माने वह कोइ और कमा के दिए तो खाने वालाएक मशक भी उड़कर आदमीके शरीर पे बैठ कर थोडा कुछ खून चूसता है l वह खून को खुद बनाकर नहीं खातीलेकिन  परान्नाभुक खुद बैठे जगह पे खानेका इंतजाम होना चाहता है l ऐसे लोग सिर्फ पृथ्वी की वजन बढासकते हैं l

 

Transliteration:

īryī ghṛṇī tvasantuṣṭa krodhano nityaśakita 

parabhāgyopajīvī ca aete dukhabhāgina  hitopadeśa, mitralābha

 

The jealous, the repugnant, the un-contented, the resentful, the ever doubting, and those living off of other people's wealth; these six are eligible for sorrow.

 

1. Jealousy towards other people yields no good. The person who is jealous is constantly plotting against his so-called 'enemy'. Hence he can never be peaceful.

 

2. Repugnance, distaste or aversion towards anyone or anything can breed no beautiful thoughts along with them. Such a person is always miserable.

 

3. One with no contentment is constantly working his mind towards acquiring something more to satisfy him. There is no calmness in such a mind.

 

4. A resentful and angry person is never happy with anything or anyone. He expresses displeasure every step of the way. How can pleasure even come near such a person?

 

5. A sceptic, has no trust in any aspect of life. He needs constant assurance and physical evidence to make him believe every single dimension. Such an individual probably can't even sleep in peace.

 

6. One living off of someone else's wealth has to constantly think of that someone literally! If the other person loses his source of income, so does he!! The parasitic guilt that accompanies the scenario is a whole other issue to deal with. How can such a person be happy!

 

Any person who is not at peace, always miserable, not calm, not happy, not pleasant nor satisfied - how can delight come near such an individual! The verse even says, such a person almost deserves to be sorrowful, meaning he can't escape sorrow.

 Avoid all such detrimental qualities. Develop Good Habits. Don't worry, be happy!

 స్వస్తి.

*****************************************

No comments:

Post a Comment