అజరామర సూక్తి – 201
अजरामर सूक्ती - 201
Eternal Quote – 201
https://cherukuramamohan.blogspot.com/2021/04/201-201-eternal-quote-201.html
यदेव तीव्रसंवेगात् दृढं कर्म कृतं पुरा ।
तदेव दैवशब्देन पर्यायेणेह कथ्यते ॥ - योगवासिष्ठ
యదేవ తీవ్ర సంవేగాత్ దృఢం కర్మ కృతం పురా l
తదేవ దైవ శబ్దేన పర్యయాణేహ కథ్యతే ll
గతములో తీవ్రమగు కృషి తో సాధించిన కర్మల ఫలితమే నేడు మనము అనుభవించుచున్నాము.
‘కష్టే ఫలి’ అన్నది ఆర్యవాక్కు. అట్లని కష్టపడిన వెంటనే ఫలితము ఏదీ? అని అడిగే హక్కు మనకు లేదు. అందుకే భగవంతుడు చెప్పినాడు :
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 2 - 47 ।।
శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ
కర్మఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ
అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.మంచి చెడు
మాట అటుంచితే మనము కర్మలు మాత్రము చేస్తూ ఉంది తీరవలసినదే! మనకు మన
కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నము మీదనే ఆధారపడి
ఉండవు. చాలా కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి - మన పరిశ్రమ, మన ప్రారబ్ధం
(గత కర్మలు), భగవంతుని సంకల్పము, ఇతరుల పరిశ్రమ, సంబంధిత అందరి
ప్రారబ్ధం, దేశ కాల పరిస్థితులు (అదృష్టము) మొదలగునవి. ఇప్పుడు మనం ఫలితాల
గురించి ఆరాట పడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి
వస్తుంది. కాబట్టి ఫలితముల గురించి ఆందోళనని విడిచి పెట్టి, చేయవలసిన పని మీదనే
శ్రద్ధ చూపమని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నిజానికి ఫలితాల గురించి
పట్టించుకోనప్పుడే, మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాము, దీనితో ఇంతకు
పూర్వం కన్నా మంచి ఫలితాలు వస్తాయి.
బహుశా ఈ శ్లోకసారమును NATO అని అనవచ్చునేమో! NATO అంటే Not Attached
To Outcome అని. తెండుల్కర్ Bat చేతపట్టిన రోజే తానూ Cricket God గా
పిలువబడుతానని ఊహించియుంటాడా! భారత రత్నకై కల, గని ఉంటాడా! అంతా
కృషి. తన కృషి లోపము లేకుండా చేస్తూ పోయినాడు ఫలితము కొన్ని దశాబ్దముల
తరువాత అతని చేతికందినది.
కొన్ని కర్మలకు ఫలితము దేవుడు ఈ జన్మలోనే ఇస్తాడు, కొన్ని కర్మ ఫలితములు
మరుసటి జన్మకు నివహతమౌతుంది (Carry Over). కానీ క్జర్మను వీడకూడదు. ఈ
శ్లోకములను చూడండి.
యదాచరిత కళ్యాణి శుభంవా యదివాऽశుభం l
తదేవ లభతే భద్రే కర్తాకర్మజమాత్మనః ll
మానవుడు అనుభవించేది తానూ చేసిన మంచి చెడు కర్మ ఫలమే! ‘చేసిన కర్మము
చెడని పదార్థము అన్నారు’ పెద్దలు కావున అది అనుభవించి తీరవలసినదే!
ఒక పనిని చేయ ఉద్యుక్తుడై అసాంతము పట్టుదలతో చేస్తే సాధించగలము కానీ
కేవలము సంకల్పించుట చేత మాత్రము జరుగానే జరుగదు. సింహము వేటాడకుండా
పడుకొని నిద్రించుతూ ఉంటే జింక ఆదేపనిగా దాని నోటిలోకి పోయి ఇక తిను అనదు
కదా!
ఈ సందర్భములో ఒకనాటి సుప్రసిద్ధ Basket Ball ఆటగాడు మైకేల్ జోర్డాన్
బాల్యములోని అతని మనస్తత్వాన్ని గూర్చి కాస్త చెబుతాను. ఒకరోజు ఆతని తండ్రి ఒక
చినుగకుండా ఉండే T-Shirt ను చూపి దీనిని ఇంతకు అమ్మవచ్చు అని కొడుకును
అడిగినాడు. జోర్డాన్ దానిని మహా అంటే ఒక డాలరుకు అమ్మవచ్చు అన్నాడు. దీనిని 2
డాలర్లకమ్ముకొని రాపో అని కుమారుని పురమాయించినాడు. మారు మాటాడకుండా
వీధులన్నీ 5,6 గంటలు తిరిగి 2దాలర్లకమ్ముకొని డబ్బు తండ్రి చేతికి ఇచ్చినాడు. ఈసారి
తండ్రి అటువంట్డే 2 కు బదులుగా 20 దాలర్లకంముకొని రమ్మన్నాడు. జోర్డాన్ అలాగే
అన్నాడు కానీ వీలుకాదు అనలేదు. బాగా అలోచించి ఆ T-Shirt ముందువైపు
ఎన్నోతంతాలు పది ఒక మిక్కీమౌసు స్టిక్కరును అంటించి ఒక ధనవంతుల పిల్లలు
చదివే స్కూలు వద్ద నిలిచి మిక్కిమౌసు T-Shirt 20 డాలర్లంటూ అరువ సాగినాడు. నాకు
నాకు అని పిల్లలు ఎగబడినారు. ఒక బాలుని తండ్రి 25 డాలర్లిచ్చి దానిని కొన్నాడు.
జోర్డాన్ ఆ డబ్బును తండ్రికి ఇచ్చినాడు. ఇంకొక సందర్భములో అటుంటి T-Shirt నే
ఇచ్చి 200 డాలర్లకమ్మమన్నాడు. జోర్డాన్ నా చేత కాదు అనలేదు.
T-Shirt తీసుకొన్నాడు. ఆరోజు ప్రసిద్ధ Hollywood నటి Farrah Fawcett ఆ
ఊరికి దగ్గరగా ఉన్న పట్టణమునకు వచ్చియుండినది. ఎన్నో తిప్పలు బడి ఆమె వద్దకు
చేరుకొని ఆ T-Shirt పై తాను తీసుకుపోయిన Permanent Marker తో సంతకము
చేయించినాడు. బయట ఒకచోట నిలబడి ‘మంచి తరుణము మించిన దొరుకదు.
సుప్రసిద్ధ Hollywood నటి Farrah ఆటోగ్రాఫ్ చేసిన T-Shirt, 200 డాలర్లు మాత్రమే
అన్నాడు. 4గే నాలుగు నిముషాలలో ఒకవ్యక్తి దానిని 2500 డాలర్లకు కొన్నాడు. ఆ
డబ్బును కూడా తండ్రికి ఇచ్చినాడు జోర్డాన్. ఇక్కడ అతని పెట్టుబడి పట్టుదల, పరిశ్రమ.
అంతే! మొదట అమ్మకానికి 8 గంటలు, తరువాత 4 గంటలు, ఆపై 4 నిముసములు.
అట్టి దీక్ష అలవాటు చేసుకొంటే అందుకొనుటకు ఆకాశమే హద్దు అవుతుంది.
यदेव तीव्रसंवेगात् दृढं कर्म कृतं पुरा ।
तदेव दैवशब्देन पर्यायेणेह कथ्यते ॥ - योगवासिष्ठ
पहले जो भी प्रयास किए गए थे, उन्ही का फल आज भी 'नियति' के रूप में हम भुगत रहें हैं l
किसी ने एक बार कहा था, 'मैं शायद ही कभी समाप्त होता हूं, जहां मैं जाना चाहता था, उस के बदले में
जहां मुझे होना चाहिए वहाँ जरूर पहूंचता हूँ l सभी प्राणियों के लिए इतना सच है की वे करनी का फल
जरूर पानाहे पड़ता है l इस यधार्थ को निश्चित रूप से हम स्वीकार करना आवश्यक है। क्या किसी को
भाग्य पे भरोसा रखते हुए काम करना चोडदेना है l किसी काम करनेसे या नहीं करनेसे कुछ फरक पड़ता
है क्या? ऐसा पूछने वालेभी रहते हैं l सिर्फ मूर्ख ही हवा में दिया रख के, “अगर यह जलना है तो जलता है
नहीं जलना है तो बुझ जाताहै l इस का देखबाल भगवान् खुद करता है” बोलता है l गीता में भी यही
कहागया है:
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
अर्थात तेरा कर्म करने में ही अधिकार है, उसके फलों में कभी नहीं। इसलिए तू फल की दृष्टि से कर्म मत
कर और न ही ऐसा सोच की फल की आशा के बिना कर्म क्यों करूं | ॥47॥
इस श्लोक में चार तत्त्व हैं – १. कर्म करना तेरे हाथ में है | २. कर्म का फल किसी और के हाथ में है |३.
कर्म करते समय फल की इच्छा मत कर | ४. फल की इच्छा छोड़ने का यह अर्थ नहीं है की तू कर्म करना
भी छोड़ दे |
यह सिद्धांत जितना उपयुक्त महाभारत काल में अर्थात अर्जुन के लिए था, उससे भी अधिक यह आज के
युग में हैं क्योंकि जो व्यक्ति कर्म करते समय उस के फल पर अपना ध्यान लगाते ही वे प्रायः तनाव में
रहते हैं | यही आज की स्थिति है। जो व्यक्ति कर्म को अपना कर्तव्य समझ कर करते हैं वे तनाव-मुक्त
रहते हैं | ऐसे व्यक्ति फल न मिलने पंर निराश नहीं होते | तटस्थ भाव से कर्म करने करने वाले अपने कर्म
को ही पुरस्कार समझते हैं| उन्हें उसी में शान्ति मिलती हैं |
वैसे लोग ऐसे भी कहते हैं ‘अगर भगवान् चाहे तो बड़े पैमाने पर अगर कुछदिया है तो जरूर वह अपने
किए सत्कर्मों का फल है। आज अपने कर्मों के जरिए जो हालात बनाता है, वही उसके कल के लिए उसकी
किस्मत तय करता है! स्थितियों को एक निश्चित स्तर तक स्वीकार करने की आवश्यकता है। इसके साथ
ही, उन परिदृश्यों में से सबसे अच्छा बनाना और बेहतर कल के लिए बीज बोना पूरी तरह से उसका
निर्माण है। एक व्यक्ति ने सवाल किया, 'अगर मेरी किस्मत में अमीर बनना है, तो मैं बनूंगा। मुझे अब
मेहनत क्यों करनी चाहिए? ‘एक अन्य ने उसे उत्तर दिया, 'अगर तुम मेहनत कर रहे हो तो क्या तुम अमीर
बनोगे? आप अवसर खो चुके होते! '
इस सन्दर्भ में इस श्लोक भी बहुत उपयुक्त है l
यदाचरित कल्याणि शुभं वा यदिवाऽशुभम् l
तदेव लभते भद्रे कर्ता कर्मजमात्मनाः ll
मनुष्य जैसा भी अच्छा या बुरा कर्म करता है,उसे वैसा ही फल मिलता है l कर्ता को अपने कर्म का फल
अवश्य भोगना पड़ता है l
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथै।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥
अपने अपने औद्योगिक प्रयासों से कार्य संपन्न होते हैं; बल्कि केवल चाहने से काम नहीं बनता l सोते हुए
मृगराज के मुह में कोइ भी हिरन घुसके उसका आहार नहीं बंता l
ए सूक्तियां देखनेमे बहुत छोटे लगते हैं लेकी टिपण्णी देना शुरू करें तो अंत करना आसान की बात नहीं
है l
yadeva tīvrasaṃvegāt dṛḍhaṃ karma kṛtaṃ purā ।
tadeva daivaśabdena paryāyeṇeha kathyate ॥
- yogavāsiṣṭha
Whatever actions were performed with steadfast effort before, the same ones perhaps are alternatively referred to as 'destiny' today.
Someone once said, 'I seldom end up where I wanted to go, but almost always end up where I need to be!' That is so true for all beings, only acknowledging it is essential. Should one resign himself to fate and say that he had no influence? Largely the place where one stands today is because of his prior actions. He cannot have much of a say about it now. But what he makes of the circumstances today dictates his fate for his tomorrow! One needs to accept the situations to a certain level. Along with that, making the best out of those scenarios and sowing seeds for a better tomorrow is entirely his making. One person questioned, 'if I am destined to become rich, I will become. Why should I work hard now?' Another replied to him, 'what if you are destined to become rich if and when you work hard? You would have lost the opportunity!'
Actions are the seeds of fate that eventually grow into destiny! It is the choices, not chances that form one's destiny. Destiny is shaped in those decisive moments. So, it is certainly not beyond one's control. Rather, it is very much in one's own restraint. Make the best of today, for a better tomorrow!
Udyamenahi sidhyanthi kaaryaani na mano rathai l
Nahi suptasya simhasya pravishanthi mukhe mrigaah ll
Tasks are accomplished by industrial endeavors alone; not by mere wishing as deers don't enter into the mouth of sleeping Lion, to offer themselves as his food.
These Shlokas are really eternal and will exist as long as the sun shines.
స్వస్తి.
No comments:
Post a Comment