Tuesday, 13 April 2021

అజరామర సూక్తి – 206 अजरामर सूक्ती - 206 Eternal Quote – 206

 

అజరామర సూక్తి  206

अजरामर सूक्ती -  206

Eternal Quote – 206

https://cherukuramamohan.blogspot.com/2021/04/206-206-eternal-quote-206.html

लोभात् क्रोधः प्रभवति लोभात् कामः प्रजायते 

लोभात् मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् - हितोपदेश

లోభాత్ క్రోధః ప్రభవతి లోభాత్ కామః ప్రజాయతే ।

లోభాన్మోహశ్చ నాశశ్చ లోభః పాపస్య కారణమ్॥1-27॥ హితోపదేశము

ఆశ వలన కోరిక పుట్టుచున్నది. ఆశ వలన ఆ కోరిక తీరనప్పుడు, కోపము ఉత్పన్నమౌతుంది. ఆశ వలన మోహము మరియు నాశము కూడా సంభవించుచున్నవి. అందువలన ఆశ అనునది పాపమునకు ముఖ్యకారణము అని భావము.

నీవు గుడిలోకి పోబోతూ గుడి ముంగిట నిలిచినట్లు ఊహించుకో ! ఆ వాతావరణములో ఏమి కనిపిస్తాయి? పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, కర్పూరము, అగరు వత్తులు, దేవుని చిత్ర పటాలు, భక్తి పుస్తకాలు తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు మొదలైనవి మాత్రమె వుంటాయి. KFC, పిజ్జాలు మొదలైనవి దొరకవు. ఎందుకు? అది పరిసరపు ప్రభావము. దీనివల్ల మనకు ఏమి అర్థమౌతుంది. తలపునకు తగినట్టే తగిన వస్తు సముదాయమును తల సమకూర్చుతుంది. అందుకే బాల్యములోనే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకొని సంస్కారాన్ని నేర్పిస్తే  సన్మార్గాన పోయే అవకాశము వుంటుంది. అసలు నీ బుద్ధి అనేది బాల్యములో సామాను చేర్చని కొత్త ఇల్లు లాంటిది. మరి ఆ ఇంటిలో వుండదలచినవారు తగిన సామాను ఉంచితే అందంగా ఉండడమే గాక చూచే వారందరికీ ఆనందాన్ని కూడా సమకూర్చుతుంది. అసలు ఇంటికే ప్రాణముంటే నలుగురి మెచ్చుకోళ్ళు విని ఎంత ఆనందించుతుందో ! మనము చేయవలసినది అదే !

 ఒకసారి నీవు నీలో కలిగిన కోరిక దుర్మార్గమైనదా అంటే, సన్మార్గము దుర్మార్గము అన్న ఆరెండు మాటలు ప్రక్కన వుంచి , నీకు కలిగిన కోరిక వల్ల నీకు మానసికంగా కలిగే గ్లాని ఎంత? అట్లే ఆలోచించుతూ వుంటే  ఆరోగ్య మేమవుతుంది అన్న  చింత మనసుకు కొంతయినా వచ్చిందా ! నీ కోరిక తీరుతుందో లేదో తెలియదు. తెలిసే వరకు నీ మనసుకు నిలకడ లేదు. నిలకడ లేకుంటే పడిపోవుట తథ్యము కాదా!   నీ మనసులో ఒక విధమైన తాత్వికత నీ తలిదండ్రి గురువులు కలిగించినారంటే నీ ఆలోచనలు అన్యథా పోవు. ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా! 

ఒకసారి 'బాహుబలి' సినిమా ను గూర్చి ఊహించుకో ! అది ఇంకా విడుదల కాని రోజులను ఊహించుకో. అది విడుదల అయినవెంటనే చూడాలని నీకు ఆకాంక్ష . అది తీరేవరకు మనసులో క్షోభ . ఎవరైనా ఆ చిత్రమును గూర్చి వ్యతిరేకముగా ఏదయినా చెడుగు చెబితే వారిపై కోపము. చివరికి అది ఒకానొక రోజు విడుదల కానేఅయ్యింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చీటీ (Ticket) కొన్నావు. కారులో సంసారముతో  వెళ్ళుతూ వుంటే నీ మిత్రుడు నీకోసమే , నీ బాకీ చెల్లించడానికి వస్తున్నట్లు తెలిపినాడు. ముందుకు పోలేవు వెనక్కు రాలేవు. సరే అనుకొన్న ప్రకారముగా దారిలో కలిసి డబ్బు (కొన్ని లక్షలు )తీసుకొని కారులో పెట్టుకొని ప్రదర్శన శాల (Theter) చేరినావు. ఆలస్యమైంది. సినిమా మొదలైంది. ఆ హడావుడిలో కారు తాళాలు మరచినావు. సినిమా చాలా బాగుందని అందరూ అనందించుతుంటే  నీకు కారు తాళాలు గుర్తుకొచ్చి సినిమా వదిలి పార్కింగ్ ప్లేస్ కు పోయినావు. కారు లేదు, డబ్బు కారుతోబాటే పోయింది , నీ కుటుంబము ధియేటర్ లో వుంది. సమస్య పరిష్కారమైనదా లేదా ఇప్పుడు అప్రస్తుతము. నీకోరిక తీరినట్లా లేనట్లా చెప్పు ?  ఆనందము పొందినట్లా లేనట్లా? అందుకే ఆశను ఆకాశమునకు అంటించ వద్దు.

ఇక భగవద్గీత లో ఈ విషయమై  శ్రీకృష్ణుడు ఏమని ఉపదేశించినాడో చూస్తాము.                                                                                                                                                                              

ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషూపజాయతే

సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే 62 -- 2 

మనసున తలపే మరులను గూర్చును

మరులుగొన్నచో మమతలు పెరుగును

మమతలు పెరిగిన మతికంపించును

కంపించిన మతి, కలుగును కోపము  62 -- 2

క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః

స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి 6౩ -- 2

కోపమన్నదొక కొరివి చూడమది

సమ్మోహాగ్నిని సంతరించును

సమ్మోహముచే స్మృతి విభ్రంశము

స్మృతి గతి తప్పిన బుద్ధి నాశనము  6౩ -- 2

మయ సభను చూచినది మొదలు తన వధ వరకు దుర్యోధనుడు తన మనసున అది తనకు కావలె నన్న కోరికతో మొదలుపెట్టి తన మరణము కొనితెచ్చుకొనే వరకు, పై మానసిక ప్రకంపనలన్నీ పొందుట గమనించవచ్చు.(దుర్యోధనుడు మయసభలో స్థలమని భ్రమించి నీటి గుంటలో పడినపుడు ద్రౌపది నవ్విన వారిలో లేదని సభాపర్వము 47 - అధ్యాయము 6 లో చూడనగును.) ఇంకొక ఉదాహరణము తీసుకొందాము.

ఒక చక్కటి అమ్మాయిని చూడటము అనుకోకుండా తటస్తి స్తే  ఆ అమ్మాయి తల్లిదండ్రులెవరు  , ఆమెను  చూచుటకు లేక ఆకర్షించుటకు మనలో పాత్రత యున్నదా , సాంఘీక పరమైన కట్టుబాట్ల పరిధిలో వున్నామా , అతిశయించిన మన మనో  వాంఛ వల్ల జరుగబోవు విపరీత విపత్కర పరిణామాలేమిటి   అన్న ఇత్యాది విషయములు ఆలోచించక పోగా  ఆమె ఇల్లు ఎక్కడ, కాలేజి ఎక్కడ , ఇంటినుండి కాలేజీ కి ఎప్పుడు బయలుదేరుతుంది అన్న మొదలైన విషయాల గూర్చి ఆలోచిస్తాము. ఆమెను అనుసరించుటే కాక వేరెవరైనా ఆమె వైపు చూసినా సహించలేక విచక్షణా రహితంగా అతనితో యుద్ధానికి సిద్ధమై తన్నులు కూడా తినవచ్చు నెమో? ఈ వ్యాకులతకు పర్యవసానమేమి, ఇది సముచితమా !ఇది సంస్కారమా! అన్నది తరువాత ఆలోచిస్తాము.

ఇపుడు  మనసులో కలిగిన ప్రకంపనలు ఏమిటి అన్నది చూస్తాము.  అమ్మాయిని చూస్తూనే మనసులో ఈమె బాగుంది అన్న తలంపు కలిగింది. తలంపు పదే  పదే  అదే అదే మనసులో మసలుతూనే ఉండుటకు దారి తీసింది. దానితో ఆమె పై మమత  ఏర్పడింది. అంటే ఈమె నాది అన్న బలమైన భావన మనసులో పాదు చేసుకోనింది. మతి గతి తప్పింది. అన్ని ఆలోచనలు మాని అమెను గూర్చి మాత్రమే ఆలోచించ దొడిగింది. మహా భారతములో శంతనుడు సత్యవతి విషయములో ఇదే కదా జరిగినది. ఇది జరుగకుంటే భారత యుద్ధము వచ్చేదే కాదు. సత్యవ్రతునికి 'భీష్ముడు' అన్న పేరు వచ్చేది కాదు. ఆయన అవివాహితునిగా ఉండిపోయేవాడు కాదు. కౌరవ పాండవులు జన్మించేవారు కారు. భారతయుద్ధము జరిగియుండేది కాదు. చూచినారా ఎవరు చేసిన పనికి ఎవరు బలి అయినారో? ఈ విధముగా మతి కంపించడము వలన కోపము వస్తుంది. అది తన చేతగాని తనముపై కావచ్చు లేక  పరులపై కావచ్చు. కోపము ఒక విపరీతమైన మోహమును అంటే ఏవిధముగానైనా నాదే అనే  పట్టుదల  మఱ్ఱిచెట్టయి మనసులో నిలుస్తుంది. అది విచక్షణా జ్ఞానాన్ని రూపు మాపుతుంది.  మరి విచక్షణే లేకుంటే బుద్ధి పోయినట్లే కదా ! బుద్దే లేకపోతే మరి మనుషులమెట్లవుతాము.  మనుషులము కాదు విచక్షణ లేదు . అంటే మనము గుడ్డి ఎద్దులమైనాము. 'గుడ్డెద్దు చేనులో పడితే చేనుకూ నష్టమే ఎద్దుకూ నష్టమే. చేనుకు పంట చేటు ఎద్దుకు వంటి చేటు. మరి ఆక్రోశముతో దానిని కొడతాడుకదా పంటమాలి.                                                                                                      

మరి ఒక్క సారి ఆలోచిస్తే మనకు అర్థమౌతుంది దీనంతటికీ కారణము తగిన సంస్కారము లేకపోవుటేయని. అందుకే ఆదిశంకరులు అన్నారు

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జేవన్ముక్తిః

కాబట్టి బాల్యమునుంది కూడా బాలునికి శ్రద్ధ వహిచి పెద్దలు సత్సాంగత్యము ఏర్పరచినారంటే మిగతా విషయాలన్నీ తానె చూసుకొని సమాజములో చక్కని పౌరునిగా తీర్చిదిద్దుటే కాకుండా జీవన్ముక్తి కూడా కలిగిస్తుంది.    

  సలహా ముఖ్యముగా యువకులు మనసు పెట్టి చదివి తమలో ఎవిధమన బలహీనతలున్నా సవరించుకొని సరియైన జీవన మార్గమునే నమ్ముకొంటారని నమ్ముతూ మీ ముందుంచుచున్నాను.

लोभात् क्रोधः प्रभवति लोभात् कामः प्रजायते 

लोभात् मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् - हितोपदेश

लोभात् क्रोधः प्रभवति

लोभात् कामः प्रजायते,

लोभात् मोहश्च नाशश्च

लोभः पापस्य कारणम्।।

लोभ से क्रोध का निर्माण होता है, लोभ वासना/इच्छा को जन्म देता है,लोभ से लालच और बर्बादी आती है, लोभ पाप के लिए कारन है|

क्रोधो सर्वार्थ नाशको" यह तो नीश्चीत है कि जो क्रोध करता है उसके सभी कार्यों का नाश होता है। क्योंकि क्रोध एक एसी मनोदशा है जो मनुष्य को पागल के समान बना देती है । क्रोध के आवेश मे आकर मनुष्य क्या करता है वह उस स्वयं को पता नही होता है । एसे मे उससे गलत कार्य हो जाता हैं ओर बाद सिर्फ पछतावे के सिवा और कुछ हाथमें नहीं होता ।

ईसीलिये हमें यत्नों से अपने क्रोध को नियंत्रित रखना चाहिए ईसे जानने के लिए हमारे पुर्वज ऋषिओ की देन क्रोध सुभाषित हमे बहुत उपयोगी साबित होंगे।..

लोभ लालच को कहते हैंलालच का अर्थ है कि बिना उचित तरीकों के धर्म, अधर्म, कर्तव्य, अकर्तव्य, उचित, अनुचित तथा आचार अनाचार का विचार किए अपनी इच्छित पसन्द की वस्तुओं पदार्थों को प्राप्त करने की अभिलाषा इच्छा करना उसमें अविवेकपूर्वक प्रवृत्त होनालोभ के कारण समाज में अव्यवस्था फैलती हैयदि कोई व्यक्ति अवैध तरीकों से अनुचित आचरण से किसी वस्तु को प्राप्त करता है तो वह शासन के नियम के अनुसार अपराधी माना जाता है और ईश्वरीय नियमों में भी अपराधी होता हैहमारे समाज में नाना प्रकार के चोर होते हैंवह लोभ की प्रवृत्ति अपनी आदत के अनुसार अनुचित तरीकों से दूसरों का धन सम्पत्तियों को हड़पने का कार्य करते हैंकई बार प्रशासन के भ्रष्ट लोग भी उनके सहयोगी बन जाते हैंउनका काम आसान हो जाता है और वह बुरे कामों में सफलता प्राप्त कर लेते हैंलोकोक्ति है कि धन से मनुष्य की तृप्ति कभी नहीं होतीउसकी लोभ की प्रवृत्ति बढ़ती जाती है और एक समय ऐसा आता है कि जब परिस्थितियां उनके प्रतिकूल हो जाती हैं और वह कानूनी शिंकजे में फंस जाता हैइससे उसका अपमान तो होता ही है, उसे नाना प्रकार के दुःख भी होते हैंसद्ज्ञान प्राप्त होने के कारण वह उससे बचने के उपाय तो करता है परन्तु उसे अपनी प्रवृत्ति बदलने की शिक्षा कहीं से नहीं मिलतीआजकल ऐसे बहुत से मामले प्रकाश में रहे हैं जब भ्रष्ट आचरण से कमाये कालाधन रखने वाले गलत काम करने वाले कानून की गिरफ्त में रहे है और अपमानित दुःखी हो रहे हैंयह ईश्वर की व्यवस्था है किअवश्यमेव हि भोक्तव्यं कृतं कर्म शुभाशुभंअर्थात् शुभ अशुभ कर्म करने वालों को अपने किये हुए कर्मों का फल भोगना ही पड़ता हैलोभ क्रोध को उत्पन्न करता है जो मानव का सर्वनाश करकेही खामोश होजाता है l

निम्न दिए गए पूरे श्लोक और उनके भावार्थ ऊपर बतायागया अमरवाणी का ही टिपण्णी है l

लभन्ते ब्रह्मनिर्वाण

मृषयः क्षीणकल्मषाः,

छिन्नद्वैधा यतात्मानः

सर्वभूतहिते रताः

 जिनके सब कष्ट एवं पाप नष्ट हो गए हैं, जिनके सब संशय ज्ञान द्वारा निवृत्त हो गए हैं, जो सम्पूर्ण प्राणियों के हित में लीन हैं और जिनका जीता हुआ मन निश्चल भाव से परमात्मा में स्थित है, वे ब्रह्मवेत्ता मनुष्य शांत ब्रह्म को प्राप्त होते हैं

क्रोधमूलो मनस्तापः

क्रोधः संसारबन्धनम्

धर्मक्षयकरः क्रोधः

तस्मात्क्रोधं परित्यज

क्रोध ही मनके दुःख(ताप) का कारण है , संसार के बंधन का कारण भी क्रोध हैं, धर्म का क्षय करने वाला भी क्रोध है , इसी लिए बुद्धिमान को क्रोध का परित्याग करना चाहिए ।।

धृतिः क्षमा दमोऽस्तेयं

शौचमिन्द्रियनिग्रहः

धीर्विद्या सत्यमक्रोधो ,

दशकं धर्म लक्षणम्

इस श्लोक में धर्म के दस लक्षण बताये है 1. धृति(धैर्य), 2. क्षमा, 3. दमः(कामनाओ का दमन), 4. अस्तेय(चोरी न् करना) , 5. शौच(पवित्रता) 6. इन्द्रियनिग्रह , 7. धी:(बुद्धि) , 8. विद्या , 9.सत्यम् , 10. क्रोधः ।।

अत्यन्तकोपः कटुका वाणी

 दरिद्रता स्वजनेषु वैरं

 नीचप्रसङ्ग: कुलहीनसेवा

 चिह्नानि देहे नरकस्थितानाम्

जिसमे अत्यंत क्रोध , कटु वाणी , दरिद्रता , सम्बन्धियो से शत्रुता , नीच संगति , कुलहीन की सेवा यह सभी लक्षण होते है वह यहां पृथ्वी पर ही नरक भोगने का फल पाता है ।।

जो गीता में भगवान बोले हाँ उन्ही श्लोकों का सा निवेदन किया गया है l

lobhāt krodha prabhavati lobhāt kāma prajāyate

lobhāt mohaśca nāśaśca lobha pāpasya kāraam - hitopadeśa

Greed (or avarice) is an uncontrolled longing for increase in the acquisition or use of material gain (be it food, money, land, or animate/inanimate possessions); or social value, such as status, or power. Greed has been identified as undesirable throughout known human history because it creates behavior-conflict between personal and social goals. Regardless of purpose, greed intends to create an inequity of access or distribution to community wealth.

From greed originates anger; greed gives rise to lust/desire; from greed (come) attachment and ruin.  Greed is the cause of sin.

Poverty wants much, but avarice... everything!  A poor person wants many things to make his ends meet.  He is satiated after that.  But he who is greedy is always wanting something.  Greed is like a monster, standing with his mouth wide open, to devour everything that comes its way.  The more that greed is fed, the more hungry it gets!

Apart from all the havoc that greed causes, it is the originator of anger.  When the greedy do not get what their heart desires, the first response is to get angry.  Anger breeds resentment, another unhealthy emotion.  Anger first burns the one who is angry even before causing any harm to the person he is angry with!

Greed gives rise to lust.  Lust is never quenched and is flamed further with indulgence.

Greed conjoined with lust and anger can only lead towards attachment and destruction, all of which, lead one towards committing sin.  They say hell has 3 gates - lust, anger, and greed.  All of these can originate from greed.  The best way to keep away from spiraling down this ladder of fall is to keep greed at bay.

In Bhagadgeetha also Bhagvan Shreekrishna comprehensively explained about these deadly weaknesses.

So keep away from Lobha, Krodha and Kama as they are detrimental for virtuous living.

స్వస్తి.

 

No comments:

Post a Comment