Friday, 23 April 2021

అజరామర సూక్తి – 216 अजरामर सूक्ती - 216 Eternal Quote – 216

 అజరామర సూక్తి  216

अजरामर सूक्ती -  216

Eternal Quote – 216

 

वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह ।

 मूर्खजनसंपर्कः सुरेन्द्रभवनेष्वपि ॥ नीतिशतकभर्तृहरि

వరం పర్వత దుర్గేషు భ్రాంతం వనచరైః సహ l

న మూర్ఖ జన సంపర్కః సురేంద్ర భవనేష్వపి ll             

 పర్వత దుర్గమ ప్రాంతములలో వనచరులతోనైనా తిరుగవచ్చుగానీ మూర్ఖులతో స్వర్గాములోనైన సహచరించ లేము.

సందర్భోచితముగా నేను వ్రాసిన ఈ పద్యమును చదవండి.

సకల సదుపాయ సరస భోగములను సమకూర్చే మూర్ఖునితో చెలిమికన్నా కొండల గుహల పట్టుకొని తిరుగుతూ కోతులతో సావాసము చేసినా తెలివివంతునికి కావలసిన ఎన్నో మెళుకువలు నేర్చుకొనవచ్చును.

స్వర్గము లోన మూర్ఖజన వర్గము తోడ వయస్య భావమున్

సర్గము జేయ జూడకుము సార్థకతందున లేదు గాంచగా     

దుర్గమ శైల దర్దరుల దోర్బల సీమల కోతి మూకతో

తిర్గుట మేలు సఖ్యతన తేలిక వేత్తిగ మార్పు జెందగన్  

సర్గము అనగా శాశ్వతము ,దర్దారులు అనగా గుహలు. 

మూర్ఖులవద్ద అనుభవించుటకు, 

ఆనందము పొందుటకు అన్నీ ఉన్నవి అని తలంచి, అట్టివారితో నీ పొందగలినిగినవి 

క్షణిక సుఖాలే! బాదం జీడిపప్పు ఖరీదయిన ఖర్జూరాలు తిన్నా నీవు బహిర్భూమికి (Toilet) 

మాత్రము పోక తప్పదు. రంభ ఊర్వశి మేనకల నృత్యము తిలకించినా ఇంటికి వచ్చి భార్య పాటకు నీవు నాట్యము చేయవలసినదే! చెడ్డగా తాలువ వద్దు. ఆమె ఇంటికి రాణి. ఆమె హితవు పాటించి తీరవలసినదే!  హంసతూలికా తల్పముపై పడుకొన్నా నిదురించుట నీ చేతిలో లేనిపని. ఒకవేళ మత్తుకు చిత్తయిపోతే మనుగడ దుర్భరమౌతుంది. కాబట్టి ఒక తెలివయిన వాడు పెదవాడయినా ఆతని సహవాసమును పొందగలిగితే నీవు ధన్యుడవు.

वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह ।

 मूर्खजनसंपर्कः सुरेन्द्रभवनेष्वपि ॥ नीतिशतकभर्तृहरि

भले ही वह इंद्र के स्वर्ग ही हो, मूर्खों के संग दोस्ती रखने के बजाय जंगली जानवरों के साथ पहाड़ों और गुफाओं में 

भटकना बेहतरीन हैl  

साहचर्य माहोल से नहीं बनानेका है l वह अभीभी तेज और बुद्धिमान लोगों से ही करना है l  साथ साथ रहने वालों 

के बीच में एक  सामान्य लक्ष्यएक उत्पादक दिशा और एक सुखद अनुभव होना चाहिए। यदि इसमें से कोई भी 

व्यावहारिकता नहीं हैतो बिना किसी भी सांगत्य का होना बेहतर है। कवि जिज्ञासावश कहता है कि किसी के पास 

जंगल की पहाड़ियों और गुफाओं में भटकते हुए एक धन्य समय होगाजो जंगली जानवरों के साथ बिता सकता है, तो 

भी उसे सीखने को मिलता है लेकिन, भले ही वह स्थल स्वर्ग ही क्यों  हो, मूर्खों के साथ समय बिठाना नरक से भी बड़ा 

हीन समझना चाहिए !

कई बारमूर्ख जनों का सहवास, आसपास के अन्य लोगों के लिए प्रतिकूल परिणाम लाती है। किसी के लिए कोई 

फलदायक परिणाम नहीं है। समय और प्रयास व्यर्थ जाते हैं या किसी की प्रगति के लिए हानिकारक हो जाते हैं। बार-

बारयह देखा गया है कि 'बुरी संगती अच्छे चरित्र को भ्रष्ट करती है। बेहतर यही है कि दुष्ट गणों से, दुष्ट गुणों से  किसी 

भी स्थिथी में दूर रहते हुए  आपनी पवित्रता बनी रखें !

किसी ने मजाक में कहाप्राणवायु के लिए स्वर्ग और सांगत्य के लिए नरक में जाओ'! वास्तव मेंयदि गण खराब हैतो 

वहाँ के प्राण वायु भी अस्वीकार है

vara parvatadurgeu bhrānta vanacarai saha 

na mūrkhajanasaparka surendrabhavanevapi 

- nītiśataka, bharthari

 It is rather a blessing to wander in the mountains and caves with wild animals than keeping the company of the foolish even if it is in Swarga, the palatial quarters of Indra.

It is not about the ambiance and the setting as much as it is about the company kept.  There should be a common goal, a productive direction and an enjoyable experience when in one's company.  If none of it is practical, then it is better to have no company at all.  The poet curtly says that one will have a blessed time wandering on the mountains and caves of a forest with wild animals rather than savoring the company of the ludicrous, even if the venue is Heaven itself!

Many times, the company of the idiotic brings about adverse consequences for the others around.  There is no fruitful outcome for anyone.  Time and efforts go futile or even become detrimental to one's progress.  Time and again, it has been seen that 'bad company corrupts good character'.  Isn't it better to keep your sanity than working on redoing it again!

Someone jokingly said, 'Go to heaven for the climate and to hell for the company'!  In reality, if the company is bad, reject the climate too.

స్వస్తి.

No comments:

Post a Comment