Tuesday, 6 April 2021

అజరామర సూక్తి – 200 अजरामर सूक्ती - 200 Eternal Quote - 200

 అజరామర సూక్తి  200

अजरामर सूक्ती -  200

Eternal Quote - 200

https://cherukuramamohan.blogspot.com/2021/04/200-200-eternal-quote-200.html

यत्रोऽत्साहसमारम्भः यत्रालस्यविहीनता ।

नयविक्रमसंयोगः तत्र श्रीरचला ध्रुवम् ॥ पञ्चतन्त्रमित्रसम्प्राप्ति

యత్రోత్సాహ సమారంభః యత్రాలస్య విహీనతా l

నయవిక్రమ సంయోగః తత్ర శ్రీ రచలా ధృవం ll  పంచతంత్రము-మిత్ర సంప్రాప్తి

ఎవరయితే చేయవలసిన పనిని ఉత్సాహముతో ఉల్లాసముతో ప్రారంభించుతారో

ఎక్కడయితే సోమరితనమునకు తావు లేదోఅక్కడ శ్రీ అనగా సంపద స్థిరముగా 

ఉంటుంది. ‘శ్రీ’ అన్న మాటకు ‘ధనము’ మాత్రమే అర్థము కాదు. శ్రేయోదాయకమైన 

ప్రతిదీ ‘శ్రీ’ యనియె పిలువబడుతుంది. అందుకే చేయవలసిన ఎపనినైనా సమధిక 

ఉత్సాహముతో ప్రారభించి పూర్తి చేసేవరకు ఎటువంటి గ్లానిని కలుగకుండా పనిలో 

పరమాత్ముని చూచుకొంటూ పూర్తిచేయాలి. . వారికి ధనము, ధాన్యము, పశువులు, 

సంతతి. ఆరోగ్యము, అయినవారు, దీర్ఘాయువు (ఇవి అన్నీ ‘శ్రీ’లే ) లకు కొదవ ఉండదు.

ఈ దిగువ నేను వ్రాసిన పద్యము ఔచిత్యభంగము కాదని మీ ముందు ఉంచుచున్నాను.

ఏమరి కూడ తాను పని  ఏమియు చేయక హాయిగా సదా

సోమరి, తిండితా తినుచు సొక్కుచు సోలుచు నిద్రపోవుటన్

సేమముగా దలంచి మరి సేయగనోపడు ఎట్టి కార్యమున్

ఏమని చెప్పగానగును ఎందుకు పుట్టెనొ భూమి భారమై

మరి ఇటువంటి వారు జీవితమున ఉత్సాహము ఎక్కడనుండి తెచ్చుకోగలుగుతారు. అదే లేకుంటే చేసేదేముంది. కాబట్టి నలుగురికీ ఉపయోగపడే పనిని ఉత్సాహముతో చేపట్టి, తనసహచారుల్లను ప్రోత్సహించుచూ, వారి సౌఖ్యమునకు తగిన విధముగా సహకరించు వాడే సకలసద్గుణ సముపెతుడౌ సజ్జనుడు.

ఇక్కడ మరొక విషయము తెలియజేస్తాను. ఒక పనిని పట్టుదలతో చేసేవాడు యోగ్యుని 

సలహా కోరుటకు వెనుకాడడు. కారణం తాను తలపెట్టిన కార్యమును సాధించ తగిన 

ఉపాయము తోచక తలబట్టుకొని కూర్చునేకంటే యోగ్యుని కాళ్ళుపట్టుకునియైనా 

పూర్తిచేస్తాడు. ఈ విషయమును తెలుపుతూ మనకు భాస్కర శతకములో ఒక చక్కని 

పద్యము కనిపిస్తుంది. చూడండి.

తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్

వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం

గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్

గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!

తెలియని అంటే తనకు తెలియనటువంటికార్యము + ఎల్లన్ అంటే ఏ పనినయినా

కడతేర్చుటకు అంటే చేయటానికిఒక్క వివేకిన్ అంటే ఒక జ్ఞానసంపన్నుడిచేకొనన్ 

వలయున్ అంటే సలహా తీసుకోవాలిఅట్లు + ఐనన్ అంటే అలా చేయటం వలన

దిద్దుకొనవచ్చున్ అంటే తప్పులను సరిదిద్దుకోవచ్చునుప్రయోజన మాంద్యము అంటే 

పని చేయటంలో ఆలస్యంఏమియున్ అంటే ఏమాత్రంకలుగదు అంటే ఉండదు

ఎట్లనన్ అంటే ఎలాగంటేనరుండు అంటే మనిషిఫాలమందును అంటే 

నుదుటియందుతిలకంబు అంటే బొట్టునుఇడునప్పుడు అంటే పెట్టుకొనేటప్పుడు

చేతను అంటే చేతిలోఅద్దమును అంటే అద్దాన్నికలిగినన్ అంటే కలిగి ఉన్నట్లయితే

అది చూచి అంటే ఆ అద్దంలో చూసుకొనిబొట్టును, చక్క చేసుకొనును కాదె అంటే 

చక్కగా పెట్టుకుంటాడు కదా!

మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో 

చూసుకుంటూ చక్కగాపద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని 

పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే, 

ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును.

ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని 

గురించి ఇతరులను అడిగి తెలుసుకొనకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం 

దిద్దుకోవటం ఎంత సులభమోఅదే విధంగా తెలియని విషయాలను అడిగి 

తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించినాడు.

కావున నిరంతరము నిండిన ఉత్సాహముతో కార్యమునకు గడంగిన వాడే నిజమైన 

శ్రీమంతుడు.

 

यत्रोऽत्साहसमारम्भः यत्रालस्यविहीनता ।

नयविक्रमसंयोगः तत्र श्रीरचला ध्रुवम् ॥ पञ्चतन्त्रमित्रसम्प्राप्ति

जीवन में किए गए किसी भी कार्य को पूरा करने के लिए उत्साह होना चाहिए। जहाँ प्रयत्न में उत्साह है

वहाँ कोई अकर्मण्यता नहींवहाँ विनम्रता और साहस का संयोग बना रहता है और वहां  ‘श्रेय’ का 

स्थिर होना निश्चित है

किसी भी कार्य में उत्साह के साथ अपनाने से वह आसान बनाता है। उनकी प्रतिबद्धता उन्हें वह 

हासिल करने में सक्षम बनाती हैजिस पर उन्होंने अपने उत्साह से ध्यान केंद्रित किया। जब किसी 

चीज में उत्साह और जोश होता हैतो यह उसके चारों ओर उत्साह पैदा करता है। यह लक्ष्य को जल्द 

और बेहतर तरीके से पूरा करने के लिए उनमें उत्सुकता की भावना को प्रज्वलित करता है। चेहरे पर 

ईर्ष्या और जलन लाकर काम  करने केलिए उद्युक्त होता हैवह ज्यादा समय तक टिक नहीं 

सकता क्योंकि उसकी जिद से उत्पन्न हुई उन दुष्ट परणामों से उसकी प्रतिबद्धता अच्छी तरह से धन

मित्रोंशुभचिंतकों दूर कर्देगी।  उसी लिए अगर कोईभी अच्छा फल हासिल करना है तो उत्तेजौर समर्पण के 

साथ करनेसे ही ‘श्री’ मने धन दौलत, मित्र, शुभ चिन्तक, गौरव सबकुछ मिलता है l

      

उत्साह के बारे मेंयह कहा जाता है कि यह केवल बुद्धिमानों के अनुरूप है। उत्साह वास्तविक रूपमें 

प्रतिबद्धता को प्रज्वलित करता हैप्रतिबद्धता ऊर्जा पैदा करती है और जब ऊर्जा होती हैतो कार्य 

को प्राप्त करने के लिए आगे बढने के लिए दिशा दिखाई देता है। जहाँ गलत ऊर्जा नहीं हैवहाँ 

अकर्मण्यता के लिए कोई जगह नहीं है। निष्क्रियता व अलासत्वयह शब्द सिर्फ आलस्य को कुछ पल 

केलिए उत्तम दर्जे पे बिठा सक्ता है लेकिन वह केसी काम की नहीं है!

उचित ज्ञान एक व्यक्ति में विनम्रता और गतिशीलता लाता हैं और यह मार्गदर्शनसलाह और ज्ञान 

और साहस के माध्यम से कार्य को पूरा करने का संकेत देता है। फिर समृद्धि का कोई रोक नहीं है। 

जहाँ समृद्धि हैवहाँ बहुतायत है और बहुतायत ‘श्रिया’ की ओर जाता है l श्रिय’ व ‘श्रेय’ के बारेमें ऊपर 

परिभाषित किया गया है। इसलिएधन की आकांक्षा के लिएइन अति आवश्यक गुणों को विकसित 

करें !

Yatro’tsāhasamārambha yatrālasyavihīnatā 

nayavikramasayoga tatra śrīracalā dhruvam 

- Pañcatantra, mitrasamprāpti

Any task taken-up in the life should invariably contain zeal to accomplish it. Where there is zeal in the effort, no indolence, there, the conjugation of humility and courage persist and wealth is certain to be steady.

A zealot in any action makes the task easier.  His commitment enables him to achieve that on which he concentrated out of his zeal. When there is enthusiasm and passion in what one is undertaking, it kindles gusto in him around.  It ignites a sense of eagerness in him to reach the goal sooner and better. To be zealous in the face the hurdles and brick walls he comes across constantly, cannot sustain longer as his commitment originated by his zeal there  good wellbeing wealth, friends well-wishers and so on will get augmented. That is called SHREE (श्री).

About zeal, it is said that it suits only the wise. If the zeal is real in its true sense it ignites commitment, the commitment create energy and when there is energy, shouldn't there be a sense of direction leading to proceed in achieving the task.  Where there is no misdirected energy, there is no place for indolence.  'Indolence', the word just makes laziness appear classy, but is useful nowhere!

Wisdom and proper knowledge bring humility and servility in a person and that prompts to accomplish the task through guidance, advice and enlightenment and courage. Then there is no stopping of prosperity.  Where there is prosperity, there is abundance and abundance leads to wealth where wealth stands as defined above.  Hence, for aspiring wealth, inculcate these very essential attributes.

స్వస్తి.

****************************************

No comments:

Post a Comment