అజరామర సూక్తి – 218
अजरामर सूक्ती - 218
Eternal Quote – 218
https://cherukuramamohan.blogspot.com/2021/04/218-218-eternal-quote-218.html
बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् ।
वने सिंहो मदोन्मत्तः शशकेन निपातितः ॥ - चाणक्य नीति
బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేశ్చ కుతో బలమ్ l
వనే సింహో మదోన్మత్తః శశకేన నిపాతితః॥
బుద్ధి బలమే బలము. శారీరికముగా ఎంతబలవంతుడైనా, బుద్ధిహీనునకు బలమెక్కడిది? దుర్గాటవీ మధ్యమున తన శక్తికి మురిసిపోయి తాను మృగరాజని విర్రవీగిన సింహము బుద్ధికుశలత కలిగిన కుందేలుచే చంపబడెనని పై శ్లోకములో చాణక్యులవారు తమ నీతిశాస్త్రంలో తెలియచేస్తున్నారు. ఇంకా వివరించాలంటే బుద్ధి ఉన్నవాడు అనేక విధాలుగా సమాజంలో మనగలుగుతాడు. ఎంత సంపద కలిగినా మూర్ఖుడు సమాజమునకు పనికిరాడు.
సమస్య ఏదయినా ఏర్పడినా లేక ఏదయినా క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, అటువంటి అపాయములకు ఉపాయమే తగిన మందు. బుద్ధిహీనుడు తనకు బలమున్నా కూడా తెలివితేటలు లేనియెడల క్లిష్టపరిస్థితుల నుంచి తప్పించుకొనజాలడు. కావున బుద్ధిబలమే బలము. దానికి సింహం, కుందేలు కథ ఉదాహరణగా తెలియచేస్తున్నారు చాణక్యులవారు.
ఒకానొక అడవిలో మృగరాజగు సింహము ఉండేది. అది, అహంకరించి విచాక్షణారహితముగా జంతువులను వధిస్తుండేది. దీంతో మిగతా జంతువులన్నీ సమావేశమై కుందేలు సలహా మేరకు రోజుకొక జంతువును సింహానికి ఆహారంగా పంపితే కొంతవరకు జంతువులను రక్షించవచ్చని తీర్మానించినాయి.
సింహమును ఆ సలహాకు ఒప్పించి రోజుకు ఒక జంతువును పంపేది ఆ అడవిజంతు సముదాయము. ఒక రోజు కుందేలు వంతు వచ్చింది. దీనికి ఒక ఉపాయం ఆలోచించి ఆ రోజు ఆ కుందేలు సింహం వద్దకు ఆలస్యంగా ఆహారానికి వెళ్లింది. అప్పటికే ఆకలేసి ఉన్న సింహం గాండ్రించుతూ, కుందేలు వైపుకు దూసుకొచ్చింది. కుందేలు ఏమాత్రం భయపడకుండా ‘రాజా నేను చెప్పేది విను. నేను నీ దగ్గరకు తొందరగానే వస్తున్నాను. కాని దారిలో మరియొక సింహం నన్నడ్డగించింది. దాంతో ఏదో రకంగా తంటాలుపడి తప్పించుకుని నీ వద్దకు వచ్చేటప్పటికి ఆలస్యమైందని’ చెప్పింది. దాంతో సింహం ‘ఈ అడవిలో రాజుగా నేనుండగా ఇంకో సింహమా? అని దాన్ని నాకు చూపించు, చంపేస్తా’నని చెప్పింది. కుందేలు ఆ సింహాన్ని ఒక పాడుపడినా నీరు కలిగిన బావి వద్దకు వెళ్లి దానిలో ఉందని చెప్పింది.
సింహం ఆ బావి నీటిలో, రత్న ప్రతిబింబమును చూసి దానిని తన ప్రత్యర్థి సింహమని భావించి నూతులోకి దూకి చనిపోయింది. అగ్గిపుల్ల చాలా చిన్నదయినా అది కొండంత మంటకు కారణము కాగలదు.
భర్తృహరి సుభాషితాలలోని ఈ శ్లోకమును చూడండి:
యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం
తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః
ఈ శ్లోకానువాదము ఏనుగు లక్ష్మణ కవి గారి మాటలలో ఈ దిగువ చూడండి.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్
ఇక్కడ గజేంద్రమోక్షణము లోని గజరాజు అహంకారము గైకొనబడినది. మొదట అహంకరించి అరణ్యమును, సరస్సును అల్లకల్లోలము చేసినది. అంతర్మధానము చేత అహంకారము ఎప్పుడయితే ఉదిగినదో ఆప్పుడు ఆ ఏనుగుకు భగవత్ సాక్షాత్కారము జరిగినది. మనమైనా అంతే. అన్నీ మనకే తెలుసునని విర్రవీగక, తెలియనిది చాలా ఉన్నదని గ్రహించి, విబుధజన సేవలో మనకు తీరుబడి ఉన్న కాలమును గడిపితే చాలు. మంకు తగిన మేరకు జ్ఞాన సముపార్జన చేయవచ్చు.
ఈ సూక్తి ఏ కాలమునకైనా ఆమోద యోగ్యము మరియు ఆచరణ యోగ్యము. ఎప్పుడైతే మనకు తెలియనిది ఏదీ లేదనుకొంటామో, అదే మన జీవిత చరమాంకము.
మనిషి మెదడుకున్న అతి ముఖ్యమైన శక్తి నేర్చుకోనుట, కొంగ్రొత్త విషయములను తెలుసుకొనుట. దీనినే గ్రహణ శక్తి అంటారు. ఇది 12 సంవత్సరముల వరకు పిల్లలలో అమితముగా ఉంటుంది. తరువాత రానురానూ తగ్గుతుందంటారు. తగ్గినా మనలో ఉన్న జిజ్ఞాస సడలకూడదు.
ఈ శ్లోకములు మనయొక్క నిజమైన సంపత్తి. తెలుసుకొని ఆచరణలో పెడితే మనకు అవ్యయ శుభములు చేకూరుతాయి.
बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेश्च कुतो बलम् |
वने सिंहो मदोन्मत्तः शशकेन निपातितः || - चाणक्य नीति (10\16)
जो व्यक्ति बुद्धिमान होता है वही बलशाली भी होता है | एक बुद्धिहीन व्यक्ति (शारीरिक बल होते हुए भी ) भला कैसे बलशाली हो सकता है ? देखो न, वन में एक साधारण खरगोश भी एक मदोन्मत्त और शक्तिशाली सिंह का नाश करने में समर्थ होता है |
इस सुभाषित द्वारा यह तथ्य प्रतिपादित किया गया है कि मात्र शक्तिशाली होना ही पर्याप्त नहीं है और उस शक्ति
का उपयोग करने के लिये बुद्धि भी उतनी ही आवश्यक होती है, जिसे 'पञ्चतन्त्र' की एक कहानी ' चतुर खरगोश और मूर्ख सिंह' के उदाहरण द्वारा व्यक्त किया है | इस कहानी में खरगोश सिंह को चतुराई से यह मानने को विवश कर देता है कि एक कुंवें के अन्दर उसकी जो परछाई है वह एक अन्य सिंह है और उस से लडने के लिये वह कुंवें में
कूद गया और मारा गया | )
buddhiryasya balaṃ tasya nirbuddhestu kuto balam ।
vane siṃho madonmattaḥ śaśakena nipātitaḥ ॥ - cāṇakya nīti
He who has wisdom has strength. Where is that strength for the foolish? The intoxicated lion in the forest got thrown down by the rabbit. (In the panchatantra story of The Lion and the Rabbit.)
One doesn't always have to be physically strong to win over his opponent. Many times, a little extra wisdom goes a long way! If one is wise enough and can think on his toes, he can bring himself out of the toughest situations. Like in the panchatantra story, a little hare fells a huge lion! He tells the lion that there is another lion dwelling inside a well, claiming to be the King of the jungle. The dumb lion, not seeing that it is his own reflection, pounces into the well in an effort to kill that 'other' lion and brings about his own end!
Even physical power proves useless to someone who isn't wise. He needs the wisdom to know and decide how to channelize his energies effectively. Else, all his efforts will prove futile.
It is not always muscle power that comes out victorious. Be wise!
స్వస్తి.
No comments:
Post a Comment