అజరామర సూక్తి - 190
अजरामर सूक्ति - 190
Eternal Quote - 190
https://cherukuramamohan.blogspot.com/2021/03/190-190-eternal-quote-190.html
विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः l
వికారహేతౌ సతి విక్రియన్తే యేషాం న చేతాంసి త ఏవ ధీరాః l
కుమారసంభవము(మహాకవి కాళీదాసు)
వికారహేతువు- మనస్సు చలించేఅవకాశం, వున్నా చలింపక స్ధిరంగావుండేవాడే
ధీరుడు. అంటే పరిసరముల,పరిస్థితుల ప్రభావమునకు లోబడని మనోధృఢత
కలిగినవాడే ధైర్యవంతుడు . అంటే స్థిమితము స్థైర్యము కలిగియుంటేనే మానవుడు
దేనినయినా సాధించగలడు. సుగ్రీవునితో మైత్రి కలిగే వరకూ ఒకవిధముగా సీతను పోగొట్టుకొని రాముడు ఒంటరి అయినాడు. అయినా సీతను వెదకే ధృడతను
విడువలేదు. రావణుడే సీతాపహరణము చేసినది అని తెలిసి కూడా నేరుగా లంకపైకి
దండయాత్రకు పోలేదు. తనకు ముందు సీత జాడ ముఖ్యము. ఆమెను రావణుడు
భూమందలములోని ఏ ప్రాంతమున దాచినాడో తెలుసుకోనుతయే ముఖ్యమని తలచి,
సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి కుదిరిన తరువాత కపులను భూమండలము లోని
అన్నిదిక్కులకూ పంపుట జరిగినది. చివరకు రావణుని చంపి సీతను రావణ చార నుండి
విడిపించుట జరిగినది.
ఈ సందర్భమున ఈ ‘ధైర్య పధ్ధతి -నీతి శతకం – భర్తృహరి’ శ్లోకము ఎంతో
ఉచితమైనది. ఒకపరి తిలకించండి:
రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా
న భేజిరే భీమ విషేణ భీతిమ్ ।
సుధాం వినా న ప్రరయుర్విరామం
న నిశ్చితార్థాద్విరమంతి ధీరాః ॥ ధైర్య పధ్ధతి -నీతి శతకం - భర్తృహరి
తనిసిరే వేల్పులుదధి రత్నములచేత?
వెఱచిరే ఘోరకాకోల విషముచేత?
విడిచిరే యత్నమమృతంబు వొడముదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు." - భర్తృహరి.
అమృతము కొరకు సముద్ర మంతనము చేయునపుడు, మొదట వచ్చిన రత్నములకు
ఆశపడలేదు, పిమ్మట వచ్చిన కాలకూట విశామునకు భయపడలేదు, కారణము
వారిలక్ష్యము అమృతమే!
विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः l – कुमार संभवं (महाकवि कालीदास)
जो हालत का गुलाम नहीं बनता और मानसिक दृढता अप्नाता है वही धैर्यवान होथा है
भर्तृहरिहरी के इस श्लोक को देखीए:
रत्नैर्महार्हैस्तुतुषुर्न देवा न भेजिरे भीमविषेण भीतिम् ।
सुधां विना न प्रययुर्विरामं न निश्चिदार्थाद्विरमन्ति धीराः ॥ –नीतिशतकम्, भर्तृहरिः
अति मूल्यवान रत्नों के ढेर मिलने पर देवगण संतुष्ट न हुए, या भयंकर विष निकलने पर वे डरे नहीं; अमृत न मिलने तक वे रुके नहीं (डँटे रहे) । उसी तरह, धीर व्यक्ति निश्चित किये कामों में से पीछे नहीं हटते ।
Vikaarahetau sati vikriyante Yeshaam na chetaamsi ta eva dheeraah l
Kumarasambhavam (Mahakavi Kalidasa)
Only he can be considered a dheera (a person of courage) whose mind is not
disturbed or overcome by emotions even in the presence of objects of temptation. Go
through this Bhartruhari SubhAShita:
Ratnaairmahabhesthushushurna deva
Na bhejire Bhima vishena Bhitim l
Sudhaam vinaa na prayayurviraamam
Na nishchtaarthadwiramanti Dheerah ll
Gods did not get satisfied by precious stones; were not afraid by dangerous
poison; did not stop until they attained the immortality nectar. Courageous
people never quit (in) the (middle of) goals they decide (to attain.)
స్వస్తి.
very good ayyagaru
ReplyDeleteExcellent analysis
ReplyDelete