అజరామర సూక్తి - 181
अजरामर सूक्ति - 181దంబాచారము దరిరానీయకు
Eternal Quote - 181
https://cherukuramamohan.blogspot.com/2021/03/181-181-eternal-quote-181.html
आरभ्यन्तेऽल्पमेवाऽज्ञाः कामं व्यग्रा भवन्ति च l
महारंभाः कृतधियः तिष्ठन्ति च निराकुला: ll - शिशुपाल वध (माघ महा कवि)
ఆరభ్యన్తేऽల్పమెవా s జ్ఞాః కామం వ్యగ్రా భావంతిచ l
మహారంభాః కృతథియః తిష్ఠన్తి చ నిరాకులాః ll - శిశుపాల వధ (మాఘ మహాకవి)
మూర్ఖులు చిన్నపనిని చేబూని అడ్డమొచ్చే ఆటంకాలను అతి పెద్దవిగా తలచుతుంటారు.
అదే ధీరులు తము తలపెట్టినది పెద్ద పనిని తలపెట్టుటయేగాక అంతరాయాలు ఎంత
పెద్దవయినా అనాయాసముగా అధిగమించి అంతపనినీ ఆసాంతము నెరవేరుస్తారు .
నేను వ్రాసిన ఈ పద్యములు సందర్భోచితములని ఎంచి మీముందుంచుచున్నాను.
ఆ. గడ్డి మొలక గూడ కడు గొప్పదౌ చెట్టు
పెనుగులాడి దాని పీకినాము
మమ్ము మించు వారు మరిలేరు భువిపైన
అందురల్ప జనులు అతిశయించి
తే. శ్రేష్ఠు డెప్పుడు పరజన శ్రియము కొరకు
కొద్ది గొప్పల నెంచక కోర్కేమీర
చేత బట్టిన పని తాను చిత్తముంచి
పూర్తిజేయును ఆతడే స్ఫూర్తి దాత
కం. మలినాల మసలు ఈగలు
పలు విధముల రొదను జేయు, పనిచేయకనే
అలి తతులు రవము జేసియు
విలువౌ సుధలిచ్చి తాము వీడును వసతిన్
रभ्यन्तेऽल्पमेवाऽज्ञाः कामं व्यग्रा भवन्ति च l
महारंभाः कृतधियः तिष्ठन्ति च निराकुला: ll - शिशुपाल वध (माघ महा कवि)
मूर्खजन छोटा काम हाथ लेके बीच में आनेके छोटे छोटे अटकलों को भी बहुत बड़े समझके बैठ जाते हैं। लेकिन महान
लोग जो होते हैं वे बड़े कामों को ही थाम लेते हैं और उन कामों को पूरा करनेमे सामने कितने बडे
आपत्तियाँ भी आ पड़े वे हिलते नहीं किंतु उन आपत्तियों को तिनके के सामान मानके ,बहुत सुगम गति से उन को
पार रके चले जाते हैं।
Aarabhante’lpamevaa’jjnaah kaamam vyagraa bhavanti l
chaMahaarambhaah kritadhiyastishthanti cha niraakulaah ll
Shishupaalavadham (Maagha kavi)
Fools start an undertaking in a small way and they struggle to complete it, more over they magnify
their hurdles to gain sympathy from the others. Great men start in a big way and accomplish the
task remaining unruffled in spite of its magnitude.
స్వస్తి.
*************************************************
great poems ayyagaru
ReplyDeleteThank You Hanumantha Rao
Delete