Thursday 25 March 2021

అజరామర సూక్తి – 188 अजरामर सूक्ति – 188 Eternal Quote – 188

 అజరామర సూక్తి – 188

अजरामर सूक्ति – 188

Eternal Quote – 188

https://cherukuramamohan.blogspot.com/2021/03/188-188-eternal-quote-188.html

मन्दोऽप्यमन्दतामेति संसर्गेण विपश्चितः l
पङ्कछिदः फलस्येव निकर्षेणाविलं पयः ll - मालविकाग्निमित्रम (महाकवि कालीदास)
మందోsప్యమందతామేతి సమ్సర్గేణ విపశ్చితః l
పంకచ్ఛిదః ఫలస్యేవ నికర్షే ణాబిలమ్ పయః ll - మాళవికాగ్నిమిత్రము

(మహాకవి కాళీదాసు )
పూర్వము వర్షము వచ్చినాఏటినీరు త్రాగేవారుఏటినుండి ఆ బురద నీరే తెచ్చి 

అందులో 'చిల్లగింజలువేసేవారు అప్పుడు ఆ బురుద అంతా అడుగునకు దిగి పైన స్వచ్చమైన నీరు తేరేది." బురదనీటికి యిండుప కాయ గంధంతగిలితే తేటపడినట్లు" అంటాడు మహాకవి కాళీదాసుఅందుచేత పండిత జన సాహచర్యం మంచిదని తాత్పర్యం! 

ఈ విషయాన్ని తాను వ్రాసిన 'మాళవికాగ్ని మిత్రమునాటకములో ఉపయోగించు 

చున్నాడు. " ఏ విధముగా నిర్మాలీ ఫలములు మంచినీటి నుండి బురుదను దూరము 

చేస్తాయో అదే విధంగా విజ్ఞుని సహవాసముతో అజ్ఞులు (జ్ఞానహీనులు) తమ మూర్ఖతను 

దూరము చేసుకొన వచ్చును .
ఎంత అర్థవంతమైన మాటో గమనించండి. మన పూర్వీకులు చెప్పిన 'సోదాహరణ 

సద్వాక్యము'లకన్నా మించి చెప్పగలిగిన విజాతీయుడు లేడు. మన పెద్దల పెద్దతనమును 

గుర్తించండి. దేశ గౌరవమునకు వన్నెతెండి .

అసలు ఇవి మనసు పెట్టి చదివితే మీకు కర్తవ్యము తనకు తానే బోధపడగలదు .

ఈ దిగువ వున్నా శ్లోకమును కూడా ఒక పర్యాయము చదువండి.

సంఘః సర్వాత్మనా త్యాజ్యః  సచేత్యక్తుం న శక్యతే l

సాధవ సత్వాభి గాంతవ్య సంతహ్ సంఘస్య భేషజం II

మీ హృదయపూర్వక హృదయ సంబంధాలన్నింటినీ వదిలించుకోండికొన్ని కారణాల 

వల్ల మీరు అలా చేయలేకపోతేవివేకవంతులైన పురుషులను ఆశ్రయించండి. 

వివేకవంతుల సాంగత్యము మొండిరోగాములకు కూడా సంజీవని వంటిది.

ధర్మరాజును ఒకసారి గమనించండి. ఆయన ఈ ధర్మ పరాయణతను తన తల్లిపితామహుడు భీష్ముడుగురువులు ద్రోణ కృపుల వద్దనుడి మరియు పినతండ్రి 

విదురుని వద్దనుండి కూడా శ్రద్ధతో గ్రహించినాడు. స్వార్థపరుడగు దుర్యోధనుడు 

‘అస్థానపతితమైన దాతృత్వము’ కలిగినవాడు. అంటే దాతృ గుణము వున్నది కానీ 

స్వార్థము అతనిని విచక్షణారహితుని చేసినది. అందుకే కర్ణునికి అంగరాజ్య 

మివ్వగలిగినాడు కానీ ధర్మరాజుకు వాడిసూది మొన మోపిన స్థలము కూడా 

ఇవ్వనన్నాడుఅందుచే మాత్సర్య మదొన్మత్తుడగు దుర్యోధనుడుఅసందర్భ ప్రలాపి రూక్షా స్వభావుడునగు శిశుపాలుడు దారుణ 

మరణమునకు గురియైనారు. ధర్మరాజు తన ధర్మబుద్ధిచే సశరీరుడై స్వర్గారోహణము 

చేసి ఇంద్రునితోకూడి ఇంద్ర సింహాసనమును అధిష్ఠించినాడు. అది 

నీతినియమమునిష్ఠనిబద్ధతనిష్కాపట్యముధర్మాచరణ మున్నగు సల్లక్షణముల 

అనుసరణ యొక్క సత్ఫలితము.‘త్యాగేనంకే అమృతత్వ మానసుః’ అని అంటూవున్నది వేదము. త్యాగము చేతనే  అమృతత్వమును పొందవీలవుతుంది. 

 मन्दोऽप्यमन्दतामेति संसर्गेण विपश्चितः l

पङ्कछिदः फलस्येव निकर्षेणाविलं पयः ll - मालविकाग्निमित्रम ( महाकवि कालीदास)

जिस तरह 'निर्माली'' फल से गड़े के पानी शुद्ध होकर पीनेके लायक बनते हैं उसी तरह मूर्ख भी सतसांगत्य से अपने मू

र्खता को दूर करके योग्य पुरुष बनजाता है |

एक बार इस श्लोक का भी कदर कीजिए l

 संगसर्वात्मना त्याज्य चेत् त्यक्तुं  शक्यते  I

साधव सत्वभि गन्तव्यसंतसङ्गस्य भेषजं  II
संग/आसक्ति सर्वथा त्याज्य हैपर यदि ऐसा शक्य  हो तो सज्जनों का संग करना । साधु पुरुषों का सहवास जडीबुटी है (हितकारक है)
दुर्योधन को देखीए l वो दानी था लेकिन जनानी नहीं था l वे कर्ण को अंगा राज बनाए लेकिन धर्माज को सुईं का 

तेज भाग दीकेलिए भी नहीं मानाल लेकिन धर्माज जो अपने बुजुर्गोंसे सीईएखा उन सब अच्छे गुणोंकोजैसके तैसे 

लागू करदिये l वही कारण है की वे सजीव स्वर्ग पथारे l

 इन सूक्तियां हमें धर्मं पथ गिखाते हैं और धर्मं पथ पर रखते हैं l उस राह पर चलना, अगर हम अपना कर्त्तव्य बनायेंगे तो हम इस समाज का मार्गदर्शक बनसक्ते हैं l

 Mando’pyamandataameti samsargena vipashchitah l

Pankachchhidah phalasyeva nikashenaavilam payah ll - Malavikaagni mitraM Natakam (Mahakavi Kalidasa) 


Even a fool becomes clever by association with the wise just as even muddy water becomes clear when it comes into contact with the fruits of the nirmalee tree (i.e. when the fruits are put in the water).Tihi is a quotation from 'Malavikaagni mitramu'
of Mahakavi Kalidasa.No poet on the face of the earth used as many similes as he has used.
Enough if we go through keenly the sayings of our great ancisters and put them into practise that is more than sufficient. We need not search for the quotes of a foreigner. If these advices are implemented by the youth they can enable the country's flag flutter sky high in the days to come.

In this context you can go through this text.
sangah Sarvatmana Tyajyah Sa Chettyaktum, na Shakyate 
l

Sadhava Satvabhi gantavyah Santah Sangagasya Bhapeshman II

Get rid of all earthly attachments with all your heart, if for some reason you are not able to do that, approach men of wisdom. Wise men are the anti-dote for attachment.
Duryodhana was so kind to give Angarajya to Karna, but not even the sharp portion of a needle to Dharmaraja. Whereas Dharmaraja having learnt all the morals from his elders like Mother, Bhishma, Drona, Krupa and Vidura implemented in toto and hence could reach Swarga without death.

స్వస్తి.

1 comment: