అజరామర
సూక్తి – 355
अजरामर सूक्ति – 355
Eternal Quote – 355
https://cherukuramamohan.blogspot.com/2021/09/355-35-5-eternal-quote-35-5-l-ll.html
षट्कर्णो भिद्यते मन्त्रः चतुष्कर्णः स्थिरो भवेत् ।
द्विकर्णस्य च मन्त्रस्य ब्रह्माप्यन्तन्न गच्छति ॥ पंचतंत्र
– हितोपदेश
షట్కర్ణో
భిద్యతే మంత్రం: చతుష్కర్ణ: స్థిరో భవేత్ l
ద్వికర్ణస్య
చ మంత్రస్య బ్రహ్మాప్యంతన్న గచ్ఛతి ll పంచతంత్రము – హితోపదేశము
సంజీవకుడు, పింగళకుడు అనే ఎద్దు, సింహం స్నేహితులు కాగా వారి మధ్య కరకట
దమనకులనే
నక్కలు భేదాలు సృష్టించి, శత్రువులై సింహమే ఎద్దును చంపేలా
ప్రేరేపిస్తారు.
దమనకుడు
పింగళకునికి జ్ఞాన బోధ చేసే సందర్భము.
దమనకుడు ఆచి
తూచి జ్ఞాన బోధ ఈ విధముగా చేయుచున్నాడు.
ఆరు చెవుల ద్వారా (విన్నది) నిరుపయోగమై పోతుంది; నాలుగు చెవులు వింటే
ధృవీకరించబడినదవుతుంది. రెండు చెవుల మధ్య ఉండే దానిని బ్రహ్మ దేవుడు కూడా
ఎరుగ శక్యము కాదు.
వినిపించిన ఎడల , అంటే చెప్పె వ్యక్తి కాక మరో ఇద్దరు విన్నారంటే ఆ మంత్రమునకు
ఫలితము దక్కదు. మానవులకు రెండు చెవులు మరియు ఒక నోరు ఉన్నప్పటికీ, వినడం
కంటే ఎక్కువగా మాట్లాడటం వారు అలవరచుకొనే ధోరణి! నిజాము చెప్పవలసి వస్తే,
వార్తలు మరియు పుకార్లు గాలి కంటే వేగంగా ప్రయాణిస్తాయి. మార్పులు చేర్పులు లేదా
సంకలన వ్యవకలనములతో అభిశంసనములతో, అతిశయోక్తులతో మారుతూ అవి
ఒక నోటి నుండి మరొక నోటికి బదిలీ చేయబడతాయి. ఏ క్షణంలోనైనా, ఒక చిన్న
సంఘటన చర్చనీయాంశంగా మారుతుంది మరియు బహుశా నిజం నుండి పూర్తిగా
వక్రీకరించబడుతుంది! కాశీలో కాకులు తెల్లని బియ్యము తిన్నాయి అన్న మాట ఆనోటా
ఈనోట పడి చివరకు ‘కాశీలో కాకులు తెల్లన’ అన్న ప్రచారము జరిగినదట. అందువల్ల
ముగ్గురు అంతకు మించిన వ్యక్తులతో రహస్యములను పంచుకొన కూడదు. ‘Secret
between three is secret of none’ అన్న ఆంగ్ల సామెతకు మాతృక ఇదియే కావచ్చు.
నాలుగు చెవులకు వినిపించేది అంటే వక్త శ్రోత మాత్రమే అయితే అది రహస్యమౌతుంది.
secret between two is secret of God అన్నది స్పానిష్ సామెత పై మాటను
బలపరచుతుంది. ఒక గురువు తన శిష్యుడికి ఒక మంత్రము నేర్పించినప్పుడు, అతను
తన చెవిలో ఒక రహస్యాన్ని చెప్పినట్లుగా బోధిస్తాడు. ఇది మంత్రం యొక్క శక్తిని
బలపరుస్తుంది. మరింత ప్రాపంచిక స్థాయిలో, ఒక ఆలోచనను తల్లిదండ్రులు, జీవిత
భాగస్వామి, స్నేహితుడు లేదా శ్రేయోభిలాషితో పంచుకుంటే, అతను తన ఆలోచనలపై
తిరిగి ధృవీకరణతో పాటు మరియొక అభిప్రాయాన్ని పొందుతాడు. దానిని బట్టి అతను
ఆ దిశగా మరింత కొనసాగవచ్చు లేదా దానిని వదిలివేయవచ్చు. ప్రతిఒక్కరికీ పదేపదే
అలాంటి సాంగత్యము
అత్యంత అవసరము.
కానీ రెండు చెవుల మధ్య ఉండే ఆలోచన యొక్క ఫలితము అంటే తనలోనే రహస్యము
దాగియుండినదంటే బ్రహ్మ దేవునికి కూడా తెలిసే అవకాశము లేదు. మదిలో నిలిచిన
ఆలోచనల ఫలితాన్ని ఊహించడం అసాధ్యం. ఒక వ్యక్తి తన ఆలోచనలను అనేక
విధాలుగా విశ్లేషించుకొనగలడు. ఫలితం ఏ సమయంలోనైనా అతని మనస్తత్వంపై
ఆధారపడి ఉంటుంది. అంతిమ ఫలితాన్ని ఎవరూ ఊహించలేని విధంగా మనస్సు చాలా
సంక్లిష్టముగా అట్టివారు చేసుకొని ఉంటారు! సృష్టికర్త కూడా ఫలితాన్ని గ్రహించలేడని
చెప్పుట కవి చమత్కృతి.
ఉబుసుపోకకు ఒక విషయాన్ని ప్రచారం చేయుట మీ ఆలోచన అయితే, దాని గురించి
ఇద్దరు వ్యక్తులతో మాట్లాడండి. అలాగే, మీరు చెప్పిన విషయమును మరువకుండా
గుర్తుంచుకోండి.
ఏదైనా నిగూఢమగు సలహాలను పొందుటకు మాత్రము ప్రియమైన వ్యక్తితో లేదా మీరు
చేస్తున్న రంగంలోని అధికారితో
చర్చించండి. క్రమశిక్షణ అన్నింటా అత్యంత అవసరము.
ఇరువురి తోడ
రహస్యము
సరికాదది పంచుకొనకు
చక్కగ ఒకనిన్
పరికించి తెలుపు
లేనిచొ
మరి తెల్పక
మదిన యుంచు మంచిది రామా!
మిత్రభేదములోనే
దానకుడు మరియొక మాట చెబుతాడు.
దరీషు
కించిత్ స్వజనేషు కించిద్ గోప్యం వయస్యేషు సుతేషు కించిత్l
యుక్తం న వా
యుక్తం ఇదం విచింత్య వదేద్ విపశ్చిన్ మహతో ऽనురోదాత్ ll 109
కొన్ని విషయాలు భార్య నుండి, కొన్ని బంధువుల నుండి, కొన్ని అదే వయస్సు స్నేహితుల
నుండి, కొన్ని కొడుకుల నుండి దాచబడాలి. తెలివైన వ్యక్తి ముందుగా పరిస్థితికి సరైనది
ఏమిటో బాగా ఆలోచించాలి, ఆపై ఎవరైనా అతనిని పదేపదే అభ్యర్థించినప్పటికీ, తాను
నిర్ణయించుకొన్న మాట మాత్రమే మాట్లాడాలి.
ఈ జీవన
సూత్రములను పాటించినచో మనిషి మనుగడకు మరి తిరుగే ఉండదు.
षट्कर्णो भिद्यते मन्त्रः चतुष्कर्णः स्थिरो भवेत् ।
द्विकर्णस्य च मन्त्रस्य ब्रह्माप्यन्तन्न गच्छति ॥ पंचतंत्र
– हितोपदेश
किसी तीसरे के कानों तक पहुंच जाता है तो वह् फिर रहस्य नहीं रहता या अपनी शक्ति खो देता है |
संजीवक नामक बैल और पिंगलक नामक शेर दोस्त हैं, जबकि करटक और दमनक दो सियार
व जम्बुक उन दोनों के बीच बीच मतभेद पैदा करती हैं और दुश्मनों को, शेर, बैल को मारने
केलिए उकसाती हैं।
वह प्रसंग जिसमें दमनक पिंगलाक को ज्ञान प्रदान करता
है।
नहीं पा सकते हैं. यानी वह् सदैव गुप्त ही रहेगा |
तुलसीकृत रामायण में राजा प्रतापभानु की कथा के प्रसंग में भी यह चौपाई है -
'छठे श्रवन यह परत कहानी नाश तुम्हार सत्य मम बानी ' अर्थात तीसरे व्यक्ति तक पहुंचने पर कोई
रहस्य फिर गुप्त नहीं रहता है | )
जो छह कानों से सुना जाता है, वह चकनाचूर हो जाता है; जो चार कानों से सुना जाता है, उसकी पुष्टि
होती है। जो दो कानों के बीच ही रहता है, उसका अंत ब्रह्मा भी नहीं कर सकता!
जाता है। वैसे तो इंसान के दो कान और एक मुंह होता है, लेकिन प्रवृत्ति सुनने से ज्यादा बोलने की
होती है! समाचार से ज्यादा अफवाहें हवा से तेज चलती हैं। वे समावेशन या विलोपन या अतिशयोक्ति
के साथ अलग-अलग संस्करणों के साथ एक मुंह से दूसरे में प्रसारित होते हैं। कुछ ही समय में, एक
छोटी सी घटना शहर में चर्चा का विषय बन जाएगी और शायद सच्चाई से पूरी तरह विकृत हो जाएगी!
जब कोई गुरु अपने शिष्य को मंत्र सिखाता है, तो वह उसे अपने कान में ऐसे सिखाता है जैसे कोई
रहस्य बता रहा हो। इससे मंत्र की शक्ति मजबूत होती है। अधिक सांसारिक स्तर पर, यदि कोई विचार
माता-पिता, जीवनसाथी, मित्र या शुभचिंतक के साथ साझा किया जाता है, तो उसे अपने विचारों पर
एक पुन: पुष्टि के साथ-साथ दूसरी राय भी मिलती है। उसके आधार पर वह, या तो उस दिशा में आगे
बढ़ सकता है या उसे छोड़ सकता है। हर किसी को ऐसे साउंडिंग बोर्ड की बार-बार जरूरत होती
है।
लेकिन दो कानों के बीच अर्थात् अपने ही सिर में रख्लेनेवाले विचारों का परिणाम ब्रह्मा भी नहीं देख
सकता! भीतर रखे गए विचार अटूट हैं और उनके परिणाम की भविष्यवाणी करना असंभव है। कोई
भी अपने विचारों के माध्यम से कई अलग-अलग तरीकों से घूम सकता है। परिणाम किसी भी समय
उसकी मानसिकता पर निर्भर करता है। मन इतना जटिल है कि कोई भी अंतिम परिणाम का
अनुमान नहीं लगा सकता! कवि मजाक में इस तर्क का विस्तार करते हुए कहता है कि रचनाकार माने
भगवान् भी परिणाम को नहीं समझ सकता :)।
दुनियाँ भर फ़ैल सकता है l
व्यक्ति या किसी ऐसे व्यक्ति से चर्चा करें जो उस क्षेत्र में एक प्राधिकरण है जिसमें आप उद्यम कर रहे
हैं। क्योंकि बिना अनुशासन के प्रतिज्ञान ही भ्रम की शुरुआत है!
यदि परम गोपनीयता ही लक्ष्य है, तो अपना मुँह मत खोलो! फिर, भगवान ब्रह्मा भी इसका पता नहीं
लगा सकते ।
इस सिलसिलेमे दमनक पिंगलक से ऐसा अपना उपदेश जारी रखता है l
दारिशु किंचित स्वजनेशु किंचिद गोप्यं वयास्येषु सुतेशु किनचित् l
युक्तं नवायुक्तं इदं विचिन्त्यं वदेद् विपश्चिन महतो ऽनुरोदात् ll 109
कुछ बातें पत्नी से छुपानी पड़ती हैं, कुछ रिश्तेदारों से, कुछ उसी उम्र के दोस्तों से, कुछ बेटों से।
बुद्धिमान व्यक्ति को पहले ध्यान से सोचना चाहिए कि स्थिति के लिए क्या सही है, और फिर खुद के
लिए फैसला करना चाहिए, भले ही कोई उससे बार-बार अनुरोध करे।
क्या करना है कैसे करना है चुनना आपको है!
ṣaṭkarṇo
bhidyate mantraḥ catuṣkarṇaḥ
sthiro bhavet ।
dvikarṇasya ca mantrasya brahmāpyantanna gacchati ॥Panchatantra -
Hitopadesha
That which is (heard) by six ears gets shattered; that which is (heard) by four
ears gets affirmed. That which stays between the two ears, even Lord Brahma
cannot get to the end of it!
Mitrabheda is the story of Sanjeevaka and Pingalaka, the bull and the lion are
friends, while the jackals Karataka and Damanaka create differences between
the
oppressors and incite the enemies to kill the lion and the bull.
In this context Damanaka councils Pingalaka in the following way.
Spells, thoughts or secrets! That which is heard by six or more ears, (meaning
the speaker and two others) gets broken. Although humans have two ears and
one mouth, the tendency is to speak more than to listen! News and rumors travel
faster than wind. They get transmitted from one mouth to another with the
versions varying with inclusions or deletions or exaggerations. Within no time, a
small incident will become the talk of the town and probably completely distorted
from the truth itself!
That which is heard by four ears (meaning the speaker and only one other
person) gets affirmed. When a guru teaches a mantra (spell) to his disciple, he
teaches it in his ear as if telling a secret. This strengthens the potency of the
mantra. On a more mundane level, if a thought is shared with a parent, spouse,
friend or well-wisher, he gets a re-affirmation as well as a second opinion on his
thoughts. Depending on that he could either continue further in that direction or
abandon it. Everyone needs
such a sounding board time and again.
But the outcome of the thought that stays between two ears (meaning in one's
own head) cannot be foreseen even by Lord Brahma! The thoughts kept within
are unbreakable and predicting their outcome is impossible. One can meander
through his thoughts in many different ways. The outcome is dependent on his
mindset at any given time. The mind is so complex that no one can guess the
end result! The poet jokingly extends this logic to say that even the creator
cannot comprehend the outcome.
If publicizing a matter is your idea, talk about it with two people. Also, remember
that he who gossips with you, gossips of you!
If reassurance or advice about something is the quest, discuss it with one near
or dear person or a person who is an authority in the field you are venturing into.
Because affirmation without discipline is the beginning of delusion!
In
this connection, Damanaka continues his preaching from Pingalaka.
Daarishu
kinchit svajaneshu kinchid gopyan vayaasyeshu suteshu kinachit l
Yuktan
navaayuktan idan vichintyan vaded vipashchin mahato nurodaat ll 109
Certain things have to be hidden from the wife, some from relatives, some from
friends of the same age, some from sons. The wise man must first think carefully
about what is right for the situation, and then decide for himself, even if one
requests him repeatedly to disclose it.
If ultimate secrecy is the goal, do not open your mouth! Then, even Lord Brahma
can't figure it out. The choice is yours!
మానవ నిత్య జీవనంలో అత్యంత ఉపయోగకరమైన అజరామర సూక్తి. ధన్యవాదాలు రామమోహనరావుగారికి
ReplyDelete