Sunday, 5 September 2021

అజరామర సూక్తి – 354 अजरामर सूक्ति – 354 Eternal Quote – 354

 అజరామర సూక్తి 354

अजरामर सूक्ति 354

Eternal Quote 354

https://cherukuramamohan.blogspot.com/2021/09/354-354-eternal-quote-354.html

तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते

द्वापरे यज्ञमित्यूचुः दानमेकं कलौ युगे ॥ - पराशरस्मृति

 

తపః పరం కృతయుగే త్రేతాయాం ఙ్ఞానముచ్యతే l

ద్వాపరే యఙ్ఞమిత్యుహ దానమేకం కలౌ యుగేస్వస్తి ll పరాశర స్మృతి

కృతయుగం తపస్సు చేయడం

త్రేతాయుగం ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని పొందడం

ద్వాపరయుగం యఙ్ఞ, యాగాదులు చేయడం

కలియుగం భగవదర్పణముగా  దాన ధర్మాలు చేయడం

మనకు నిర్దేశింపబడిన మార్గాలు.

ప్రతి యుగమునకు పాటించవలసిన స్మృతి ఏది అన్నది మన ఋషులు మనకు 

నిర్దేశించినారు. అవి ఈ క్రిందివిధముగా ఉన్నవి.

సత్య (కృత) యుగం మనుస్మృతి

త్రేతా యుగం గౌతమ స్మృతి

ద్వాపర యుగం శంఖ స్మృతి

కలియుగం పరాశర స్మృతి

కావున కలియుగానికి అనుసరణీయమైన ధర్మ శాస్త్రం “పరాశర స్మృతి”

ముందు ఇక్కడ అసలు ‘ధర్మము’ అంటే ఏమిటి అని అతి సూక్ష్మముగా తెలుపుతాను.

సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ 

న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో

ఏ కారణము చే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్థం , శక్తి ఒక దానితోనొకటి 

అనుసంధానించబడి మనుగడ సాధిస్తాయో , ఏ కారణము చే ఈ ప్రపంచము

బ్రహ్మాండ మండలము తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో , అట్టి దానిని ధర్మము గా నిర్వచించినారు.

 శాంతి, దయ, అహింస, సత్యము, అస్తేయము, ఉపకారము, సానుభూతి, శౌచము 

మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.

ధర్మానికి వేదాలు ప్రమాణాలు. ధర్మాధర్మ విచక్షణ వచ్చినపుడు సత్పురుషులు ఆలోచించి 

తగిన నిర్ణయం చేసి ధర్మ పక్షపాతులై వ్యవహరిస్తారు. ఇటువంటి ప్రమాణికమైన ధర్మాన్ని 

ఆచరించినవారు ఇహలోకాల్లో కీర్తిని, సుఖాన్ని, ఆపిడప పరమపదమును పొందుతారు. 

పొందుతారు.

ఇంకా పరాశర స్మృతిలో ఏయే యుగంలో ధర్మాచరణ ఏయే విధంగా జరగాలో ఈ 

కింది విధంగా వివరించబడింది

“తపః పరం కృతయుగే

త్రేతాయాం ఙ్ఞానముచ్యతే

ద్వాపరే యఙ్ఞమిత్యుహ

దానమేకం కలౌ యుగే”

అన్న ఈ శ్లోకమునకు అర్థము ముందే చెప్పుట జరిగినది.ఇంకా దానం కూడా ఏ ఏ 

యుగాలలో ఏయే విధంగా చేసేవారో కూడా పరాశర స్మృతి వివరిస్తుంది

కృత యుగం దాత (donar) దాన గ్రహీత అందుకు అర్హుడేనా అని విచారించి

త్రేతాయుగం దాత గ్రహీతను అభ్యర్థించి (request)

ద్వాపర యుగం దాన గ్రహీత కోరినది దానం చేసి

కలియుగం ప్రత్యక్ష సహాయం చేయలేకుంటే ద్రవ్య రూపములోనైన దానము చేసి

విష్ణు పురాణం

పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి బోధించిన పురాణమే “విష్ణు పురాణం”

వీరు సాక్షాత్తు వేద వ్యాసుల వారికి తండ్రి గారు మరియు శక్తి మహర్షి పుతృడు మరియు 

వసిష్ఠుల వారి పౌతృడు ( మనుమడు)

హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ

పై శ్లోకము కృష్ణయజుర్వేదాంతర్గత కలిసంతరణ ఉపనిషత్ లోనిది.

మరి ఇక్కడ హరిని గూర్చి మాత్రమే తెలుపబడినదని హరుని తలువకూదదని 

సంశయించనవసరము లేదు.

శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః

విష్ణువు యొక్క రూపం శివుడు.,శివుడి యొక్క రూపం విష్ణువు,. ఈయన హృదయము 

ఆయనయితే ఆయన హృదయము ఈయన. ఇంకొక ముఖ్యమైన మాట గమనించండి.

యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణుమయః శివఃI

యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషిII

అని చెప్పుచున్నది మనకు వేదార్థము. ఈ శ్లోకములు చాలా మందికి తెలిసే వుంటాయి. 

ఈశ్వరునికి కాలుడు అని ఒకపేరు. పైగా ఆయన లయుడు. తమోగుణ ప్రతీక అంటారు 

ఆయనను. కానీ ఆయన శరీరము అంతా తెలుపే. దానికి తోడూ తెల్లనైన భస్మము 

ధరిస్తాడు. వెండికొండలో ఉంటాడు. స్వచ్ఛమైన చంద్రుని కలిగియుంటాడు. ఆయన 

వాహనము నంది తెలుపు. ఎప్పుడూ చల్లదనము కలిగియుంటాడు. అభిషేక ప్రియుడు. 

ఈవిధముగా అన్నీ సత్వగుణ ప్రధానములగు గుణములనే కలిగియుంటాడు. మరి 

విష్ణువో రాజసికగుణ ప్రధానుడు. కానీ ఆయన తామసిక చిహ్నమగు నలుపు. ఆయన 

పవళించే ఆదిశేషుడు నలుపు. ఆయన వాహనము గరుత్మంతుడు నలుపు. ఆయన స్థితి 

నిరత నిద్ర.

మనము కాస్త పరిశీలనాత్మకముగా ఆలోచించితే శివుని స్వరూప స్థితిగతులు సత్వగుణ 

సూచకములు. కానీ ఆయన లయ కర్త. మరి విష్ణువో బాహ్యలక్షణములన్నీ 

తామసికములు కానీ కర్తవ్యము మాత్రము రాజసికమగు  దుష్ట శిక్షణ లోక రక్షణ. ఈ 

విధమగు ఆలోచన చేస్తే వారిది అభేద వ్యాజ్యము అని మనకు అర్థమైపోతుంది.

యోగ శాస్త్రము ప్రకారము విష్ణువుది జల తత్వము. శివునిది అగ్ని తత్వము. 

జలమయమైన సముద్రములో బడబానలము ఉన్నది. అదే 'విష్ణోశ్చ హృదయం శివం'. 

సూర్యుడు అగ్ని తత్వము. అందుకే ఆయనకు, ద్వాదశాదిత్యులలో  ‘త్వష్ట’ అన్నపేరు 

కూడా వున్నది. ఏకాదశ రుద్రులలో ‘త్వష్ట’ కూడా ఒక రుద్రుడు. ఇదికాక సూర్యుని 

నారాయణావతారముగా కూడా తలచుతారు. సూర్యుని వేడిమి చేతనే కదా మేఘాలు 

సృష్టింప బడేది. మరి అప్పుడు అగ్ని జలదములనేర్పరచి జాలమునకు హేతువగుచున్నది 

కదా! ఇవన్నీ విష్ణువు శివుడు వేరుకాదు అన్న విషయమును తేటతెల్లము చేయుటకే!

కలియుగమునకు ముఖ్య ధర్మము దానమైనా, ఆ విషయములో దానముకన్నా 

నిదానము ఎక్కువగా పాటించుతాము. అట్లుకాకుండా ధర్మ బద్ధమగు జీవితమును 

గడుపుతూ దానపరత్వమును కలిగియున్న, అతడు అవశ్యము అనుసరణీయుడు. 

అసలు కలియుగ ధర్మములన్నీ కలబోసి తెలిపిన ‘భర్తృహరి సుభాషితములు-నీతి 

శతకము-- సుజన పధ్ధతి’ లోని ఈ ఒక్క శ్లోకార్తమును ఆచరణలో ఉంచితే చాలు.

ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం

కాలే శక్త్యా ప్రదానం యువతిజనకథా మూకభావః పరేషామ్‌ ।

తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ భూతానుకంపా

సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాః ॥

భర్తృహరి సుభాషితములు-నీతి శతకము-- సుజన పధ్ధతి

భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ద్వారా 

తెలుసుకుందాం.

 పరహింసా పరకీయ విత్తహరణా భావంబు సత్యవ్రతా

దరముం దానపరత్వ మన్యవనితో దంతోక్తి మూతకత్వమున్‌

బరతృష్ణాఝర భంజనంబు గురు నమ్రత్వంబునుం బ్రాణభృ

త్కరుణాశాస్త్ర సమత్వసద్విధులు భద్రప్రాప్తికిన్‌ మార్గముల్‌

ఇంద్రియాల వ్యామోహంలో పడి కొట్టుకుపోకుండా ఉండాలంటే కొన్ని లక్షణాలను 

కవచాలుగా ధరించాలి. కవచం ఉన్న వాడికి బాణం దెబ్బ తగలకుండా ఉన్నట్టుగా

చేతికి తొడుగు తొడుక్కుంటే కరెంట్‌ షాక్‌ కొట్టకుండా ఉన్నట్టుగా, దుర్గుణాలు మన మనస్సుకు అంటకుండా ఉండటానికి కొన్ని కవచాలు మనం ధరించాలి. అందులో ‘పరహింస’ ఇతరులను బాధపెట్టడం, ‘పరకీయవిత్త హరణము’ ఇతరుల సొమ్ము ఆశించే విషయంలో ఆ జోలికి పోవద్దు. ‘దానపరత్వము’ కూడా ప్రత్యేక గుణముగా చెప్పబడినది. ఇవి పాటించేవారి జన్మ ధన్యము.

तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते

द्वापरे यज्ञमित्यूचुः दानमेकं कलौ युगे ॥ - पराशरस्मृति

कृतयुग में तपस्या सर्वोत्तम थी; त्रेतायुग में, ज्ञान, द्वापरयुग में अग्नि यज्ञ; कलियुग में, केवल दान

कृतयुग जिसे सत्ययुग के नाम से जाना जाता है, 4 युगों के प्रारम्भ का  पहला बिंदु हैउस युग के 

दौरान, बहुत कठिन और कठोर तपस्या को सबसे अधिक फलदायी माना जाता थाधर्म बहुत अच्छी 

तरह से स्थापित था और सबसे अधिक गुणी होने के लिए, गहन तपस्या और ध्यान करने की 

आवश्यकता थी

धर्म के कुछ कमजोर पड़ने के बाद, त्रेतायुग आयाउस युग के दौरान, व्यक्ति ज्ञान (ज्ञान) के माध्यम 

से मुक्ति प्राप्त कर सकता थासदाचारी होने के लिए शास्त्रों को सीखना और पवित्र जीवन व्यतीत 

करना आवश्यक थाधर्म के और पतन ने द्वापरयुग को जन्म दियाइस युग में, देवताओं को उनके 

गुणों को बढाने के लिए यज्ञ करना और अग्नि के माध्यम से प्रसाद देना आवश्यक था

धर्म के और क्षीण होने के बाद, कलियुग नामक युग आयायहाँ समय की कमी है और मूल्यों से 

आसानी से समझौता किया जाता है! ध्यान भटकाने और आकर्षण से दूर रहने के लिए वास्तव में कड़ी 

मेहनत करनी पड़ती हैइस युग में सदाचारी होने के लिए निःस्वार्थ भाव से दान देने की जरूरत है

पुण्य प्राप्त करना इतना सरल बना दिया गया हैकिसी को बहुत कठोर तपस्या नहीं करनी पडती है 

और ही कई शास्त्रों को समझना पड़ता है और ही कठिन यज्ञ करना पड़ता हैसंपत्ति के मोह को 

त्यागना और दूसरों को, जिनको देने की आवश्यकता है, उदारतापूर्वक बांटना ही एक गुणी बनाने के 

आवश्यक है! क्या इसकी मांग नहीं की जा सकती है?

 देना विभिन्न स्तरों पर हो सकता है। "यदि तुम्हारे पास बहुत है, तो अपने धन में से दो, यदि तुम्हारे पास 

थोड़ा है, तो जितना दे सकते हो उतना ही दो लेकिन कैसे भी हो देनेका तो अपने हृदय से दो।" जो 

दिया जाता है वह उतना मायने नहीं रखता जितना दिया जाता हैजब आप अपनी संपत्ति देते हैं तो 

आप बहुत कम देते हैंयह तब होता है जब आप निस्वार्थ भाव से देते हैं कि आप वास्तव में देते हैं

जो भी देना है तो दिल से दो!

tapa para ktayuge tretāyāṃ jñānamucyate

dvāpare yajñamityūcu dānameka kalau yuge ॥- parāśarasmti

In ktayuga penance was best; in tretāyuga, knowledge, it is said; they say fire sacrifices in the dvāparayuga; in kaliyuga, it is only giving.

Ktayuga better known as satyayuga, is the first of the cycle of 4 eras. During that era, very tough and rigid penances were deemed as the most rewarding. Dharma was very well established and to be the most virtuous, one needed to perform intense penances and meditations.

After some dilution of dharma, came the tretāyuga. During that epoch, one could attain liberation through the mode of jñāna (knowledge). Learning the scriptures and leading a pious life were essential to be virtuous.

Further fall of dharma gave rise to the dvāparayuga. In this age, one was required to perform sacrifices and give offerings to the deities through the fire in order to increase their virtues.

After dharma dwindled furthermore, the eon called kaliyuga came. Here time is crunched and values are compromised easily! One has to work really hard to keep on track from distractions and attractions.  During this era, to be virtuous, all one needs to do is give selflessly! Gaining virtue has been made so simple. One doesn't have to perform very rigorous penances nor understand multitudes of scriptures nor perform tough sacrifices. Giving up the attachment to possessions and sharing with fellow beings generously is all that is required to make one virtuous! Is that too much to ask for?

Giving can be at various levels. "If you have much, give of your wealth; if you have little, give of your heart." It is not what is given that matters as much as how it is given. You give little when you give your possessions. It is when you give selflessly that you truly give.

Give heartily!

స్వస్తి.

 

No comments:

Post a Comment