అజరామర సూక్తి – 350
अजरामर सूक्ति – 350
Eternal Quote – 350
https://cherukuramamohan.blogspot.com/2021/09/350-350-eternal-quote-350.html
अनुगन्तुं
सतां धर्म कृत्स्नं यदि न शक्यते ।
स्वल्पमप्यनुगन्तव्यं
मार्गस्थो नावसीदति ॥ अज्ञात
అనుగంతుం సతాం ధర్మ కృత్స్నం యది న శక్యతే l
స్వల్పమప్యనుగంతవ్యం మార్గాస్థో నావసీదతి ll
అజ్ఞాత
నియమనిష్ఠాగరిష్ఠుల యొక్క నీతివంతమైన మార్గాన్ని అనుసరించడం కష్టం మరియు
అసాధ్యం అనిపించినప్పటికీ, ఎవరైనా తదేక ధ్యాసతో కొంచెం కూడా అనుసరిస్తే,
అతను తన జీవిత లక్ష్యము నుండి చలించక ముందునకు సాగుతాడు.
భారీగా అంగలు వేసుకొంటూ అతి శీఘ్రముగా గమ్యము చేరనవసరము లేదు. ఉన్నతిని,
అది ఏరంగమైనాసరే, ఆధ్యాత్మికమే కానీ ఆదిభౌతికమే కానీ ఎవరైనా కావాలనుకుంటే
గొప్పవారి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే, తానూ ఉన్నతిని పొండుతాడేగానీ
పాతాళానికి పడిపోడు. అతనుతన మార్గములో అనేక అడ్డంకులు ఎదుర్కొనవలసి
రావచ్చు. కష్టముగా ఉండటమే కాదు, అసాధ్యమని కూడా అనిపించవచ్చు!
అయినప్పటికీ, అటువంటి ఉన్నతుల మార్గము దొరికిన ఎడల దానిని వడసి పట్టుకొని
కొంచెం అదే మార్గములో కొనసాగితే, అనుసరించిన ఆ వ్యక్తి సరైన దిశలో తన
లక్ష్యమువైపు పురోగమించగలుగుతాడు.
అల్ప ప్రాణియగు ఒక చీమ కూడా కేవలం ఈనపుల్లలకన్నా హీనమైన కాళ్ళతో
దూరమన్న మాటను దరిజేర్చకుండాతన పుట్టాను చేరుకొంటుంది. అది, దాని పట్టుదల
కారణంగా, ప్రాథమిక బిందువు నుండి, ఏ తిండి నలుసునో పట్టుకొని వదలక,
దూరమును సరుకుగోనక తన లక్ష్యమును లేక గమ్యమును చేరుకొంటుంది! ధర్మ
మార్గంలో ఉన్న వ్యక్తి కూడా అదేవిధముగా కష్టాలకు కడగళ్ళకు కాసంత కూడా
కుంచించక తన జీవితమంతా ధర్మబద్ధమైన చర్యలను పరిమాణము చిన్నదా పెద్దదా
అని పట్టించుకోకుండా, తన పనిని తానూ చేస్తూ పోయినాడంటే, అతను కూడా
తాననుసరించిన వ్యక్తివలె ఎంతో పుణ్యమును కూడబెట్టుకొనగలుగుతాడు. తన
హృదయములో ధర్మము మాత్రమె కలిగినవాడు ధర్మ మార్గము నుండి పడిపోయే
అవకాశమే ఉండదు
కదా!
చంద్ర మండలము చేరే PSLV ఒకే చోట తయారు కాదు. ఎన్నో చోట్లనుండి ఎంతో
అవసరమైన అంగములను అందిపుచ్చుకొని వానిని సమీకరించి సమాగతము చేస్తారు.
కావున ఎంతో గొప్ప పనులు కూడా చిన్న పనులతోనే రూపొందించబడుతాయి.
వాస్తవానికి, మంచి ఉద్దేశ్యాలతో చేసిన పనుల పర్యవసానము నుండియే నిజమైన
ఆనందము వస్తుంది. ధర్మబద్ధమైన కఠోర పరిశ్రమ విధి విధానమును కూడా
మార్చగలుగుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనికదా పెద్దలు చెప్పిన
మాట!
కాబట్టి, మన విధికి బాధ్యత వహిద్దాం మరియు ధర్మబద్ధమైన చర్యల ద్వారా సరైన
దిశానిర్దేశం చేద్దాం!
अनुगन्तुं
सतां धर्म कृत्स्नं यदि न शक्यते ।
स्वल्पमप्यनुगन्तव्यं
मार्गस्थो नावसीदति ॥ अज्ञात
यद्यपि महान के नेक मार्ग पर चलना कठिन और असंभव प्रतीत होता है, लेकिन यदि कोई
थोड़ासा भी अनुसरण करता है, तो वह अपने जीवन के लक्ष्य से नहीं गिरेगा बल्कि आगे
निकलसकता है l
बड़े कदमों की जरूरत नहीं! यदि कोई चाहता है और महानों के मार्ग पर चलने का प्रयास करता
है, तो उसे रास्ते में कई बाधाओं का सामना करना पड़ सकता है। यह न केवल मुश्किल हो
सकता है, बल्कि यह असंभव भी लग सकता है! फिर भी, यदि कोई कम-से-कम थोड़ा-थोड़ा
समझ लेता है और उसी रास्ते पर चलता रहता है, तो वह सही दिशा में आगे बढ़ेगा l
ऐसा कहा जाता है कि चींटी भी अपने परमाणु जैसे पैरों पर टिके रहकर मीलों तक जा सकती है।
तथ्य यह है कि यह चल रहा है और कहीं और अपना पिपीलिकपुट पहूंचरहा है l अंत में, अपने
हठ के कारण, यह अपने शुरुआती या आद्य बिंदु को मीलों पीछे छोड़ देता है! ऐसा ही धर्म के
पथ पर चलने वाला व्यक्ति होता है। यदि वह अपने जीवन काल में नेक कार्य, चाहे आकार या
क्षमता में छोटा क्यों न हो, करता रहे, तो वह अपने श्रेय में बहुत अधिक पुण्य अर्जित करेगा! पुण्य
के साथ रहनेवाला कोई भी धर्म के पथ से कैसे गिर सकता है?!
छोटे-छोटे कर्मों से ही महान कार्य बनते हैं। अन्थारिक्ष जानेवाली PSLV एक ही जगह पर नहीं
बनता l उसमे उपयुक्त करनेवाले भिन्न भिन्न अंग कई जगहों से आते हैं l उसी तरह जो लोग अपने
धर्मं मार्ग पर अटल रहकर अपना रफ़्तार नहीं छोड़ते वे जरूर क न एक दिन अपने लक्ष्य पाते हैं l
सच्चा सुख अच्छे इरादों के साथ किए गए कर्मों के आनंद से मिलता है। ये चीजें हैं जो किसी के
भाग्य को आकार देती हैं। सच्चे विजेता वे लोग होते हैं जो कभी असफल नहीं होते बल्कि वे कभी
हार नहीं मानते।
तो,
आइए हम अपने भाग्य को संभालें और सद्गुणों के माध्यम से इसे
सही दिशा दें!
anugantuṃ satāṃ
dharma kṛtsnaṃ
yadi na śakyate
।
svalpamapyanugantavyaṃ
mārgastho
nāvasīdati
॥ ajnaatha
Although following the righteous path of the noble is difficult and seems
impossible, if one follows even a little bit, he will not slump (from the goal of his
life).
No need for gigantic steps! If one wants to and attempts to tread on the path of
the noble, there may be many hurdles he may face on the way. It may not only
be difficult, but it might even seem impossible! In spite, if one continues to grasp
at least a little bit and persist on the same path, he will be progressing in the
right direction.
It is said that even an ant can traverse miles by just keeping at it. The fact that it
is moving means it is covering ground and reaching someplace else. Finally,
due to its persistence, it would have left its starting point miles behind! Similar is
a person on the path of dharma. If he keeps doing righteous acts (however
small in size or caliber) through his lifetime, he will accumulate a great deal of
virtue to his credit! How can one with virtue in his account ever fall off from the
path of dharma?!
Great acts are made up of small deeds. In reality, true happiness comes from
the joy of deeds that are done well with good intentions. These are the things
that shape one's fate. True winners are not people that never fail but people that
never quit.
So, let's take charge of our fate and give it the right direction through virtuous
actions!
స్వస్తి.
No comments:
Post a Comment