Tuesday, 9 August 2016

మంత్రం

మంత్రం – నిజంగా చింతకాయలు రాలుస్తుందా??? by Kiran MVA
“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” - అనగా మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అదీ గురువుల సత్ ఉపదేశంతో నేర్చుకుని మననం చేస్తే ఎన్నో బాధలను తీర్చగలదు, ఎన్నో కార్యాలను సఫలం చెయ్యగలదు. కానీ కొందరు వెటకారంగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని ఎద్దేవా చేస్తారు. అసలు మంత్రం, దాని వెనకున్న నిగూడార్ధం గురించి చర్చించుకుని మనకు అనుభవంలో ఏది రాల్చగలదో ముచ్చటించుకుందాం.


ప్రతీ మంత్రంలో ఓంకారం, బీజాక్షరాలు ఒక అమరికతో ఒకొక్క శక్తిని ప్రేరేరింప చేసేవి గా వుంటాయి. ముందుగా ఓంకారం గురించి చూస్తె అది “అ” కార, “ ఉ” కార, “మ” కార సంగమం. ఆకారం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన వాణి కడుపు, హృదయం స్థానంలో చలనం గమనించవచ్చు. ఉకార ఉచ్చారణతో గొంతులోను, మరియు గుండె దగ్గర మనం సెన్సేషన్ గమనించవచ్చు. “మ్” అని అంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుండి మెదడు వరకు vibration గమనించవచ్చు. ఇది ఎక్కడో ఎందుకు మీరే ఒకసారి ఉచ్చరించి చూడండి , ఆ కదలికలను మీరు ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రదేశాలలో చలనం గమనించవచ్చును. ఇవి మూడు కలిపి ఓం కారం జపించినప్పుడు కటి ప్రదేశం నుండి మెదడు వరకు, మనకున్న షట్చక్రాలు ఉత్తేజితం అవుతాయి. ఈ ఓం కారానికి frequency 425Hz గా గుర్తించారు. అదే ఓంకార మంత్రోచ్చారణ ఒక క్రమపద్ధతిలో చేసేవారికి binural waves మెదడు లో తయారవుతాయి. దాని వలన ఆల్ఫా(8-13.9Hz), బీటా(14-30Hz) ,టీటా(4-7.9), డెల్టా (0.1-3.9 హజ్)తరంగాలు మెదడులో ఉత్పన్నమవుతాయి. సైంటిస్ట్ లు దీని మీద ప్రయోగాలు చేసి ఓంకార ఉచ్చారాణ ద్వారా ఒకరి మానసిక స్థితి బీటా నుండి డెల్టా వరకు ప్రశాంతత స్థితికి వెళ్తుంది.
మానసిక ఒత్తిడి ఓంకార ఉచ్చారణ ద్వారా ఎలా తగ్గిందో ఈ క్రింద పేపర్ లో మరింత వివరంగా చర్చించబడి వుంది.
http://paper.ijcsns.org/07_book/200808/20080825.pdf
కేవలం ఓంకార మంత్రోచ్చారణ ద్వారా మానసిక ప్రశాంతత, కాన్సంట్రేషన్ పెరుగుదల, ఎక్కువ ఉత్సాహం, స్ట్రెస్ తగ్గుదల కనబడ్డాయి.
MRI scan ద్వారా మరికొన్ని విషయాలు గమనించారు. దీని ద్వారా ఎపిలేప్సి, డిప్రెషన్ కూడా తగ్గించవచ్చు అని నిర్ధారణకు వచ్చారు.
ఇక మనం మిగిలిన మంత్రాల విషయం గురించి చూద్దాం. ప్రతి మంత్రం కొన్ని బీజాక్షరాల సమాహారం. ప్రతీ బీజాక్షరానికి దాని శక్తి వుంటుంది. దానికి తత్సంబంధిత ఒక frequency వుంటుంది. ఈ బీజాక్షరాల క్రమపద్ధతి లో దాత్త, అనుదాత్త స్వరాలతో చదివినప్పుడు ఒక signature ఉత్పన్నమవుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. తత్సంబంధిత దేవతా స్వరూపానికి అది చేరి రావలసిన ఫలితం ఇప్పిస్తుంది. ఇదెలా కుదురుతుంది అని అనుకుంటే దానికి అర్ధమయ్యే ఒక ఉదాహరణ తీసుకుందాం. దీన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే మనం ముందు తెలుసుకోవాలంటే మన చుట్టూ మనకు అర్ధం కానీ, ఎన్నో తరంగాలు ఉన్నాయి. ఉదాహరణకు రేడియో లో FM ట్యూన్ చెయ్యాలంటే 88-108 Mhz లో మార్చుకోవాలి. అందునా దానికి లైన్ of sight మాత్రమె ఆ సిగ్నల్ tap చెయ్యగలదు. అందుకే వైజాగ్ FM రేడియో వేరు, విజయవాడ FM రేడియో స్టేషన్ వేరు. ఒకొక్క ఊరిలో ఆ FM సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ని అందుకోవాలంటే దానిని అర్ధం చేసుకునే FM receiver ఉండాలి. ఆ frequency కి మనం ట్యూన్ చేసుకుంటే ఆ కార్యక్రమం మనం వినగలం. అదే AM రేడియో అంటే కొన్ని latitudes వరకు వ్యాపిస్తుంది. అందుకే మనం శ్రీలంక AM రేడియో కూడా వినగలం. అలాగే satellite రేడియో ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కార్యక్రమం కూడా వినవచ్చు. వాటికి తత్సంబంధిత receiver తప్పని సరి.
మన ఋషులు, యోగులు ఒకొక్క దేవతకు సంబంధించిన signature కనుగొన్నారు. వారు చెప్పిన పద్ధతిలో సాధన చేస్తే ఆ దేవతా స్వరూపాన్ని మనం అనుసంధానించుకోవచ్చును. సర్వత్రా వ్యాపించి ఉన్న దేవతా శక్తిని ఆ మంత్రాల ద్వారా మనం ఉత్తేజితం చేసుకుంటాం. ఎలాగంటే బయట ఎలక్ట్రిక్ pole మీద కరెంట్ వెళ్తుంటుంది, దాన్ని మనం ఒక వైర్ తగిలించుకుని మనం ఇంట్లో పవర్ తెచ్చుకున్నట్టు. ఆ శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ మంత్రధ్వని ద్వారా ఆ అనంతశక్తిని మనం కొంత మనలోకి తెచ్చుకున్నట్టు. బయటున్న ఎలక్ట్రిక్ pole కొంత ఎత్తులో వుంటుంది. దానికి మన ఇంటినుండి తగిలించాలంటే ఆ వైర్ కి ఇంత అని నిర్దుష్టమైన పొడుగు ఉండాలి, ఆ వచ్చేది 5amperes లేక 15 amps అన్నదాన్ని బట్టి ఆ వైర్ మందం వుంటుంది. అలాగే మనం ఏ కామ్యం కోసం చేస్తున్నామో ఆ కారణాన్ని బట్టి ఒకొక్క మంత్రం అన్ని సార్లు మననం చెయ్యాలని చెప్పబడి వుంది. ఒకే మంత్రం ఒక కామ్యానికైతే 15000 జపం చెప్పబడి వుంటే కొన్నింటికి 64వేలు ఇలా రకరకాలు గా వుంటుంది. ఆ శక్తి మండలం దగ్గర నుండి మనకు ఎంత శక్తి కావలసి వస్తుంది అంత మనకు గురువులు మంత్రజపం చెయ్యమని చెబుతారు. ఎలాగైతే ఒక ఎనర్జీ ఎక్స్పర్ట్ ఒక ఇంటికి ఎంత పవర్ కావాలని చెప్పగలడో, గురువులు మన కామ్యాన్ని బట్టి ఎంత శక్తి మనకవసరమో అన్ని వేల మంత్రజపం చెయ్యాలో చెబుతారు. నమ్మకంతో చేస్తే తప్పక ఫలితం వుంటుంది.
ఇక్కడ మరొక కోణం వుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ కేవలం మౌఖికంగానే కాదు, మౌనంగా కూడా వారి భావాల ద్వారా జరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపింపబడివుంది. వీటిని మనం నిత్యం అనుభవిస్తూనే వుంటాం. చూడండి కొంతమందిని కలవగానే ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరిని కలవగానే వారినుండి దూరం పోవాలని వుంటుంది. ఒకొక్కరి భావాలు మరొకరితో మాటల్లేకుండానే కలుస్తాయి, వికర్శితం అవుతాయి. ప్రతి ఒక్కరికీ కొంత ఆరా (aura) వుంటుంది. మంత్రజపం ద్వారా మన aura పెంచుకోవచ్చు. అది ఎవరితో వికర్శితమవుతోందో వాటిని సర్దవచ్చు. కేవలం మనలోనే కాదు, ఒక పరిస్థితికి ఎవరెవరితో సంబంధం వుందో దాన్ని ట్యూన్ చెయ్యగల సామర్ధ్య౦ మంత్రజపానికి వుంది.
మరికొన్ని వివరాలు మరొక టపాలో చెప్పుకుందాం.
నిజం. మంత్రం కాయానికి ఉన్న “చింత”ను రాలుస్తుంది. నమ్మకంతో ప్రయత్నించి అనుభవించండి. తప్పక ఫలితాన్ని చూస్తారు.

No comments:

Post a Comment