Thursday, 11 August 2016

వృత్యనుప్రాస చాటు పద్యము

నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటి పటీ గంధేభ వాటీ పటీ
ర నటీ హారి పటీ సువర్ణ మకుటీ ఫ్రచ్చోటికా పేటికల్
కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠీ(టీ)శ్వరా
వీటీ = తాంబూలము; ఱవికముడి; వధూటీ = ఆఁడుది; కన్యక, ఘటీ = చిన్నకుండ; ఇరువది నాలుగు నిమిషముల కాలము, ఘనకోటీ, శకటీ = cart, ratha, కటీ = పిఱుఁదు; మొల.
తటి =ఏటిఒడ్డు; ప్రదేశము, పటీ = వస్త్రము. గంధేభ = an elephant of the best breed
వాటీ = తోట, ¬పటీర = చందనము. సువర్ణ మకుటీ = సువర్ణ కిరీటములు, హారి పటీ = (బంగరు) హారములు, (మేలైన) వస్త్రములు, ఫ్రచ్చోటికా పేటికల్ = covered baskets (with valuables
నీలకంఠేశ్వర శతకం; అజ్ఙాత కర్తృకం;
ఓ వేద తురంగా! పరమశివా! నీలకంఠేశ్వరా! నిన్ను భక్తితో సేవిస్తే పడయరాని దేమున్నది? సర్వము సముకూడునుగదా! మానవులకు నీసేవ వలన సకల భోగ భాగ్యములు వశమగుట తథ్యము!
వీటీ వధూటీ గణము (వెలయాండ్రు ) అనేక కోట్లధనము , వాహన సముదాయము , నదీతీర వనాళి , మదగజ సముదాయము , కర్పూర వాటికలు , మనోహరమైన బంగరు హారములు , కిరీటములు ,సింహాసనములు ,బంగరు పేటికలు , మొన్నగునవి యెన్నియైనను నీయనుగ్రహ లబ్ధములేగదా! యనుచున్నాడు.
ఇందు బాహ్యములైన భాగ్యముల ప్రస్తావనము మాత్రమేగలదు. కారణము భక్తునిలో లౌకికమైన విషయ లోలుపత యధికమని తెలియు చున్నది. అయినను పద్యము చెప్పిన విధానము మాత్రము అపూర్వమనక తప్పదు! 

1 comment:

  1. It is from సమగ్ర ఆంధ్ర సాహిత్యం by ఆరుద్ర అని వున్నాను కరెక్టేనా ఆర్యా?

    ReplyDelete