ఓం గం గణపతయే నమః
'ఎవరు ప్రకృతిని ప్రేమిస్తారో, పర్యావరణాన్ని రక్షిస్తారో, వారిని దీవిస్తాడు విఘ్ననాయకుడు'. వినాయకపూజ
ప్రకృతికి (పార్వతీ దేవి) హాని కలిగిచని రీతలో, వినాయకుడికి నచ్చే రీతిలో, గణపతి మెచ్చే రీతిలో జరుపుకోవాలి.
భూమి/మట్టి శివస్వరూపం. ప్రకృతి పార్వతీ స్వరూపం. మట్టితో చేసిన గణపతిని పూజించడమే శ్రేష్టం. అందుకే
గణపతి సంకటహర చవితి పూజకు తదియతో కూడిన చవితే చాలా శ్రేష్టం అని చెప్తారు. తదియ అంటే పార్వతీ
దేవి/ గౌరీమాత. చవితి అంటే గణపతి. #గౌరీగణేశుడికి ప్రతీక సంకటహర చవితి. అలాగే మట్టి గణపతి కూడా
గౌరీగణపతికి ప్రతీక.
వినాయకచవితికి మట్టిగణపతులనే పూజించండి. మనం ప్రకృతిని పేమిస్తే, గణపతి మనల్ని ప్రేమిస్తాడు. మనం
ప్రకృతిని రక్షిస్తే, గణపతి మనల్ని రక్షిస్తాడు.మిత్రులారా! వినాయక చవితి సమీపిస్తున్నందున వినాయక
చవితికి సంబంధించి మట్టి గణపతినే పూజించడం ఎందుకు? గణపతి నిమజ్జనం ఎందుకు? పత్రిపూజ
ఎందుకు? గణపతి తత్వం ఏమిటి? వినాయకచవితి నివేదనలోని ఆయుర్వేద రహస్యాలు ఏమిటి? మొదలైన
అంశాలను గణపతి అనుగ్రహంతో రోజు అందించే ప్రయత్నం చేస్తాను. - 1
ఓం గం గణపతయే నమః
అసలు మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ
వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం
వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత (అంతటా ఉన్నది
పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క
విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము
కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని
నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే
లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు
పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు
(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే
పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా
వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు.
సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే
చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి
పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ
సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు
సూతుడు.
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే
కాలుష్యాన్ని నివారించండి.
ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః - 2
మట్టి గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న శౌనకాదులు సూతుడితో 'మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు?' అన్నారు శౌనకాదుల. ఆ ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.
వినండి. మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. పూజ చేస్తాం. అంతవరకు బాగాబే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి, స్థితి, లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్రజలమందుగానీ, నదీ, తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి, అంటే వ్యాపిస్తూ, పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ, భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే" అని వివరించాడి సూతమహర్షి.
సేకరణ : © మహాగణపతి పురాణం - బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. కాలుష్యాన్ని నివారించండి.
ఓం గం గణపతయే నమః
భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. అసలేంటీ #పంచీకరణం అంటే?
ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. 6 చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం అంటే భూమికి సంకేతం. కనుక #వినాయకుణ్ణి మన్నుతోనే చేయాలి.
పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్ని ఒక్కడినే చేరుతాయి. వినాయక విగ్రహ నిర్మాణంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. #పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.
ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలు, విగ్రహంతో పాటూ నీళ్ళలో కలపడం వలన ఆ నీళ్ళలో కాలుష్యం హరించబడుతుంది. రోగకారక క్రిములు నశిస్తాయి.
కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వశుభప్రదం, మంగళప్రదం.

- © మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)

No comments:
Post a Comment