Wednesday, 31 August 2016

వాస్తవము -- వ్యంగ్యము

                                                వాస్తవము -- వ్యంగ్యము

స్వార్థము సర్వస్వము కానేరదు. యస్సి, యస్టీ, ఓబీసీ, బీసీ ఓసీ అని వివిధ వర్గాలుగా విభజించి బ్రిటీషు వాడు మన నాయకుల రక్తములోని కెక్కించిన Divide and Rule ను పట్టుకొని వ్రేలాడుతూ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొనే మన నాయకులకు మనమెందుకు విన్నవించుకొని మొత్తము దేశమునే B.C. = Backward Country గా మార్చమని అర్థించకూడదు. అప్పుడు అందరికీ మన దేశములోనే కాక విదేశీయుల సానుభూతి కూడా పొందవచ్చు కదా!
యస్సి, యస్టి, బీసి యనుచు వేరుపరచి
పంచభక్ష్యములను పంచు బదులు
అసలు భారతమ్మె అయినచో బీసీగ
తెచ్చు సుఖము మనకు, దేశమునకు.
The Truth and the Irony
Yassi, yasTi, beesi yanucu vEruparaci
Pancabhakshyamulanu pancu badulu
Asalu bhaaratamme ayinacO beeseega
Teccu sukhamu manaku, dESamunaku. (TRANSLITERATION OF MY TELUGU POEM)
Segregating S.C., S.T.B.C. from the subjects and favoring them, better they declare the nation as BC (Backward Country) both the country along with every one of us will get benifited.
The true followers of the British our leaders are dedicated to divide and rule the country even today. Hence they introduced the RESERVATION FORMULA more for their own benifit. If they can declare the nation itself as B.C. (Backward Country) they can muster funds for them, for the country and jobs for us anywhere in the world



Friday, 26 August 2016

వారాంతము ( Weak End )

వారాంతము ( Weak End )
ఆద్యంతాలు అన్న శీర్షికన VVS శర్మ గారు చెప్పిన, మనకు వారాంతము శనివారమే కానీ ఆదివారము కాదు అన్న మాటను బలపరుస్తూ నాలుగు మాటలు వ్రాస్తున్నాను:
24 నిముసముల కాలము ఒక ఘడియ. 2 1/2 ఘడియలు ఒక హోర. ఈ హోరను యథాతథముగా పాశ్చాత్యులు గ్రహించి,hour అని అన్నారు.ఒక రోజుకు 24 హోరలు.
గ్రహాధిపతి సూర్యుడు కావున మొదటి హోర అర్క హోర అవుతుంది కావున ఆరోజు ఆదిత్య వారము అంటే ఆది వారము. అంటే వారము యొక్క మొదటి రోజు అయినది.
హోరాశాస్త్రము ఈ విధంగా చేబుతూవుంది.
అర్క శుక్ర బుధః చంద్ర మందో జీవ కుజః పుమాన్
సార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యేతత్ హోర లక్షణం
అంటే సూర్య ,శుక్ర,బుధ,చంద్ర,శని,గురు,కుజ ,ఈ విధంగా 7 ఎంచిన పిదప మళ్ళీ 8 వది సూర్య హోర అవుతుంది. ఆ విధంగా 25 వ హోర తరువాతి రోజుకు మొదటి హోర ఔతుంది. కావున ఆరోజు ఆ పేరు తో పిలువా బడుతుంది. ఈ వారముల వరుస ఆ విధముగా ఏర్పడినది.
పాశ్యాత్యులకది తెలియదు. వారి దేవుడు Monday నుండి సృష్టి మొదలుపెట్టి శనివారానికి పూర్తి చేసి ఆదివారము విశ్రమించినాడట. అందువల్ల అది వారికి week end అయినది. నన్ను ఒక పాఠకుడు క్రైస్తవులకు కూడా వారపు మొదటి రోజు ఆది వారమే అని అన్నాడు. అట్లయితే ఆ మాట Bible లో ఎందుకు నిర్దుష్ఠముగా వ్యక్తపరుప లేదు. Sabbat అని అనుట మాత్రమే అందు జరిగినది. క్రైస్తవ దేశాలన్నీ ఆదివారమును శెలవుదినముగా ప్రకటించుకొన్నాయి. ఆదివారము రోజు Face Book లో కూడా చాలా ఎక్కువమంది Happy Week End అని వ్రాసేది మనము చూస్తూనే ఉన్నాము కదా! ఒకవేళ రెండు దినముల శెలవు కావలసివస్తే అప్పుడు శనివారమును కలుపుకొన్నాయి. అంతే గానీ వారి మత గ్రంధము ఆదివారము వారమునకు మొదటి దినముగా తెలుపలేదు.
దైవము సాధారణ మానవునివలె శెలవు కోరుతాడా!

Thursday, 25 August 2016

వేదాల్లో అన్నీ ఉన్నాయిష కాదు ....ఉన్నాయి

వేదాల్లో అన్నీ ఉన్నాయిష కాదు ....ఉన్నాయి
(వేదఘనతను నాడు చాటిన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు,
నేడు చాటుచున్న రేమెళ్ల అవధాన్లు గారు)
లంకె
https://cherukuramamohan.blogspot.com/2016/08/blog-post_25.html


ఈ శీర్షిక క్రింద నేను ఇద్దరు వ్యక్తులను  మీకు పరిచయము చేయబోతున్నాను. ఆ పరిచయమునకు ముందుగా ఈ ఉపోద్ఘాతమును చదువండి.
వేదాల్లో అన్నీ ఉన్నాయిష’ అన్న ఈ మాట గురజాడ వారి కన్యా శుల్కము నాటకములో వారు ప్రయోగించిన వాక్యము. ఈ  వాక్యమును గూర్చి నాలో నేను తర్కించుకొన్నా ఇందులో వేదములపై ఒక తిరస్కారభావము తప్ప అన్యథా తెలియుటలేదు. బహుశ ఆంగ్లేయ పురస్కారమునకై ఈ వేద తిరస్కార  శబ్దము వాడియుంటే వారి సంస్కారమునకు నా నమస్కారము. మహనీయుడగు కుమారిలభట్టు బౌద్ధులతో లేక జైనులతో వాదించుటకు, వేదము యొక్క ఔన్నత్యమును చాటుటకు, ప్రచ్ఛన్నముగా వారి ఆరామములకు పోయి బౌద్ధము/జైనము నకు సంబందించిన విషయము గ్రహించిన పిదప వారితో వాదించినారు. శంకరులవారు, వేదసారమయిన అద్వైత సిద్ధాంతమును ప్రతిష్ఠించుటకై,   పరకాయ ప్రవేశియై కామకళా శాస్త్రము నేర్చి ఉభాయభారతీ దేవితో వాదించి, గెలిచి, ఆమె భర్తయగు మండనమిశ్రుని సార్వభౌమ ఆమ్నాయ పీఠమగు శృంగేరికి మొదటి పీఠాధిపతిని గావించినారు.
అన్నీ వేదాలలో ఉన్నాయిష’ అని నాటక పాత్రలచే పలికించినవారు మాత్రము, వేదాధ్యయనము చేసియుంటే తప్పక ఈ మాట అనియుండేవారు కాదు. వారు చెప్పినదే నిజమని వేల సంవత్సరముల క్రితము మన శాస్త్రజ్ఞులు అనుకొని వుంటే వారు గణిత, ఖగోళ, జ్యోతిష, భౌతిక, రసాయనిక, ఖనిజ, లోహ, వాస్తు, గృహనిర్మాణ, వస్త్ర, విమాన, యుద్ధ యంత్ర, ఆది శాస్త్రములను భావితరాలకు అందించి యుండగలిగేవారు కాదు. నూలు బట్టలు మన దేశమున ఉపయోగించు కాలములో పాశ్చాత్యులు పురాతన నాగరికత కలిగినవారు అని చెప్పుకునే గ్రీకులు  జంతు చర్మములు ధరించేవారు. మన దేశమునకు వేరువేరు నెపములతో వచ్చి మన శాస్త్రవిజ్ఞానమును. గ్రహించి, సంగ్రహించి, తమ దేశమునకు పోయి తమ పేరుతో ఈ విజ్ఞానమును చలామణి చేసుకొన్న వారు లెక్కకు మిక్కుటముగా వున్నారు. ఇవేవీ తెలుసుకొనక ఆంగ్లముపై మమకారముతో, ఆంగ్లేయుల ప్రాపునకై అర్రులు సాచి అనుచితమని కూడా ఆలోచించక వేదములను తూలనాడినారు.

అదే నిజమయిన మేధావి వర్గమునకు చెందిన పాశ్చాత్య శాస్త్రజ్ఞులగు,Alfred North white Head, Dr, Lin Yutang, Charles H Towness, Ervin Schrodinger, Werner Heisenberg, Albert Einstein, John Archibald Wheeler, Brian David Josephson, Roger Pol Droit, Julius R. Oppenheimer, Francois Voltaire మన దేశమును గూర్చి, మన సంస్కృతిని గూర్చి, మన శాస్త్ర విజ్ఞానమును గూర్చి మన వేదముల గూర్చి ఎంతో ఘనంగా లోకానికి చాటినారు. ‘ఇంట్లో వాడే పెట్టేరా కంట్లో పుల్ల’ అన్నట్లు తాము సంపాదించిన జ్ఞానమే అఖండ జ్ఞానమని తలచి మన వేదములనే మనము అవమానించుకున్నాము.

అట్టి మహనీయులు తాము జన్మించిన బ్రాహ్మణ వర్గమును కూడా దూషించి, ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించి మరణానంతరము కూడా మహనీయులన్న పేరును నిలుపుకున్నారు.

మరి మన మధ్యనే ఉంటూ వేద మాహాత్మ్యమును గుర్తించి, శ్రమించి వేదాధ్యయనము గావించి  వేద ప్రతిభ చాటిన ఎందఱో మహనీయులలో శ్రీయుతులు రేమేళ్ల అవధాన్లు గారు ఒకరు. వీరి పూర్తిపేరు రేమెళ్ల వెంకట సూర్య సుబ్బావధాన్లు అని తలుస్తాను.
ఇటువంటి వారిని గూర్చి పదుగురికి తెలుపుదాము. వేదము యొక్క ఔన్నత్యమును లోకానికెరుకపరచిన  అటువంటి అరుదైన వ్యక్తులను గురించి తెలుసుకొందాము. తెలిసివుంటే గురుతు చేసుకొందాము.  లేని వారి చిత్ర పటములు పెట్టి జోహారులర్పించే దానికంటే మన మధ్యనేయున్న ఇటువంటి వారిని తలచి, సన్మానించి మనలను  మనము సన్మానించుకొన్నవారమగుదాము . ఆయన నిజమైన ‘వేదమూర్తులు’. అంతకు మించి ఆయన నిరహంకారి. కొందరు పురాణ ప్రవచనకారులతో పోల్చినపుడు ఈయన సాత్వికత మనకు అవగతమౌతుంది. ఎందఱో మహామహులచేత సెబాసనిపించుకొన్న  ఈయన తనను గూర్చి చెప్పుకొనునది స్వోత్కర్షగా భావించే నిగర్వి. గౌరవనీయులగు నాటి దేశాధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ, నాటి ప్రధాని అటల్ బిహరి వాజపేయి, బైరాన్ సింగ్ షెకావత్, మురళి మనోహర్ జోషి, మొదలయిన ఎందరిచేతనో గౌరవింపబడి కూడా తన పేరుకు ప్రచారమివ్వక  ఎంతో అణకువను ప్రదర్శించటమే ఆయన గొప్పదనము.

భారతీయ భాషలను కంప్యూటరైజ్ చేసిన మొట్ట మొదటి కంప్యూటర్ మేధావి ఆయన.  వేదాలను కంప్యూటరైజ్ చేసిన మొదటి భారతీయుడూ ఆయనే . ‘వేదాల్లో అన్నీ ఉన్నాయిష ‘అన్న వెటకారపు మాట ఆయన్ను వేదాల పరిశోధనకు పురిగొల్పినది.  ఆ పరిశోధనలతో .... వేదాల్లో నిజంగానే అన్ని ఉన్నాయని  నిరూపించారు .  ఆయనే  డాక్టర్  రేమెళ్ల అవధానులు . ‘అంతరించి పోతున్న వేదాలను కొంతైనా పరిరక్షించినందుకు సంతోషంగా వుంది.’అంటారాయన . నిజం చెప్పాలంటే ఆయన జీవితమంతా  వేద శోధనే .  ఆ పరిశోధన గురించి ఆయన మాటల్లోనే .....
ఋగ్ , యజుః, సామ , అధర్వణ వేదాలలో మొత్తం 1131 శాఖలుండేవి . కానీ ఋగ్వేదం లో 2, యజుర్వేదం లో 6, సామవేదంలో 3, అధర్వణవేదం లో రెండు  శాఖలు ...అంటే  13 శాఖలే ఇప్పుడు లభిస్తున్నాయి .  ఇందులో అధ్యయనం జరుగుతున్నవి ఏడు శాఖలే.  కేవలం వేదాలే  కాదు... మన ప్రాచీన గ్రంధాలూ  ఇప్పుడు దొరకడం లేదు.
వేదాల్లో అన్నీ ఉన్నాయిష’ అని వెటకారంగా అనుకునే వాళ్లకు ఇదేమంత ఉపవద్రంలా అనిపించకపోవచ్చు. అలాంటి వాళ్ళంతా కొన్ని నిజాలు తెలుసుకోవాలి.
యజుర్వేద సహితం లో ...పది టు ద పవర్ ఆఫ్ 19 వరకూ అంకెల ప్రస్తావన ఉంది.  దీన్ని ‘లోక ‘ అని పిలుస్తారు. వాల్మీకి రామాయణం లో ఏకంగా మహౌఘ అంటే ...పది టు ద పవర్ ఆఫ్  62  ప్రస్తాపన ఉంది .
లంబకోణ త్రిభుజానికి సంబంధించి పైథాగరస్ కనిపెట్టాడని మనమంతా  చెప్పుకునే సిద్దాంతం బౌధాయనశుల్బ సూత్రాల్లో ఉంది.
గణితశాస్త్రంలో మనం తరచూ వాడే ‘ఇన్ఫినిటి’ గురించి ‘పూర్ణమదః , పూర్ణమిదం  పూర్ణాత్ పూర్ణముదచ్యతే ...’ శ్లోకంలో ఎప్పుడో చెప్పేశారు మన పెద్దలు.
హైడ్రోజన్ ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదంలో కనిపిస్తుంది.
ఏకతాయస్వాహా, ద్వితాయ స్వాహా, త్రితాయ స్వాహా’...ఇందులో ద్వితా అనే పదాన్నే డ్యుటీరియం గానూ, అలాగే త్రితా అనే పదాన్నే ట్రిటియం గానూ మార్చినట్లు అర్థమవుతుంది.
త్రికోణమితిని మనవాళ్ళు  ఎప్పుడో కనుక్కొన్నారు . ఆర్యభట్ట, వరాహమిహురుడు వంటివాళ్ళు సైన్, కాస్ విలువలనూ చెప్పారు.
స్టీమ్ అనే పదం పాణిని రచించిన అష్టాధ్యాయిలో కనిపిస్తుంది .  ‘స్టీమ అర్ధ్రీభావే ‘అంటే ...ఆవిరవడం అని చెప్పారు.
గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కంటే ముందు 12 వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు తన ‘సిద్దాంత  శిరోమణి’ లో భూమ్యాకర్షణ సిద్ధాంతంగా చెప్పాడు.
భౌతిక,రసాయన , వైద్య, వైమానిక...ఇలా ఏ శాస్త్రం తీసుకున్నా తత్సంబంధ సమాచారం మన వేదాల్లో కనిపిస్తుంది. మనకు లభ్యమవుతున్న వాటిలోనే ఇంత సమాచారం ఉంటే అంతరించి పోయిన వాటిలో ఇంకెంత ఉండి  ఉండాలి?

ఇదంతా చదివాక చాలామంది ఆలోచనల్లో పడతారు. కానీ, ఇప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఉన్న వాటినైనా కాపాడుకోవాలి .  నేనూ అదే చేశాను..చేస్తున్నాను .
అదే మొదటిమెట్టు ...
ఇక ఆయననను గురించి వారి మాటల్లోనే! :
  మాది తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పొడగట్లపల్లి. చిన్నప్పటి నుంచీ వేదాలూ, మంత్రాల మీద అవగాహన ఉండేది .  కాకపోతే , నా లక్ష్యం వేరేగా ఉంది. 1969 లో నేను పరమాణు భౌతిక శాస్త్రం (Nuclear Physics) లో ఎమ్మెస్సీ చేశాను. అప్పుడే మన దేశం లో కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన మొట్టమొదటి ప్రకటన ఓ ప్రైవేటు కంపెనీ నుంచి వెలువడింది.  నేను అందులో చేరి డిప్లొమా పూర్తిచేశాను. తరవాత రాజోలు  డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. రోజూ డ్యూటీ అయిపోయాక ఖాళీగా ఉండటం ఇష్టంలేక పక్కనే ఉన్న వేదపాఠశాలకు వెళ్లి  వేదం నేర్చుకునేవాణ్ణి .  ఇది పూర్తి కాకుండానే హైదరాబాదులోని ఇసిఐల్ లో టెక్నికల్  ఆఫీసర్ గా ఉద్యోగం రావడంతో 1971 లో హైదరాబాదు వచ్చేశాను. మన దేశం లో మొట్ట మొదటి కంప్యూటర్ తయారీ కంపెనీ ఇసిఐల్ .  అక్కడ శిక్షణ సమయం లో కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఎ ప్లస్  బి హోల్ స్క్వేర్ చరిత్ర కనిపించింది . దాన్ని భారితీయులు మూడువేల ఏళ్ళ కిందటే కనుక్కున్నారట.  ఆ విషయం చదివాక మన ప్రాచీన గ్రంధాలపై ఆసక్తి పెరిగింది .
తెలుగును కంప్యూటర్లోకి ....
ఇసిఐల్ లో ఎనిమిదేళ్ళు పని చేశాను. ఇక్కడ కూడా Duty అయిపోయాక వేదం నేర్చుకునేవాణ్ణి. అప్పటికి ఏ భారతీయ భాషనూ కంప్యుటరీకరించలేదు. అప్పుడు మాకు తెలుగును కంప్యూటరీకరి౦చాలన్న  ఆలోచన వచ్చింది . అందుకోసం నేనూ మా స్నేహితులమూ ఆరునెలల పాటు శ్రమించా౦. తెలుగు అక్షరాలను కంప్యుటర్లో పెట్టాం .అలా 1976 లో మనదేశం లో కంప్యుటర్లోకి వచ్చిన మొదటి దేశభాష తెలుగే...అప్పట్లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న వావిలాల గోపాల కృష్ణయ్య గారికీ ఈ విషయం తెలిసి మా ఆఫీసుకు వచ్చి నన్ను అభినందించారు, నా పనిని కొనసాగించమన్నారు. కానీ, ఆఫీసులో  ప్రోత్సహించక పోవడంతో దాన్ని పక్కన పెట్టేశా.”
ఒక వాస్తవాన్ని ఇక్కడ తెలియజేయుట అప్రస్తుతమని  నాకు అనిపించుటలేదు. నేను కొందరు ఖ్యాతికెక్కిన ప్రవచనకారులను చూసినాను. వారు సంస్కృతాంధ్రములయందు కృషి చేసినవారు. తమ ప్రవచనములలో  తమ తమ లౌకికతలను జోడించి చెప్పగలుగుతారు. కానీ వారి వచనములు శాస్త్రపరిధి లోనికి రావు. తమ వాగ్ధాటి చేత ప్రజల గుర్తింపు పొందిన వెంటనే ఒకింత అహంభావము ఆవహించుతుంది. అది వారు తమ మాటలలోనూ హావభావములలోనూ వ్యక్తము చేస్తూనే వుంటారు. మరి పరమాణు భౌతిక శాస్త్రములు (PHYSICS ELECTRONICS) లో స్నాతకోత్తర పట్టాతోకూడా, సంస్కృతములో స్నాతకోత్తర పట్టా మరియు PhD జ్యోతిషములో స్నాతకోత్తర పట్టా మరియు PhD కలిగినవ్యక్తి లేశమాత్రమయినా అహంభావము చూపక తనతో మాట్లాడు వారి స్థాయినెరిగి తదనుగుణముగా సహనమును వీడక, ఆ మాటకు వస్తే పాఠశాల విద్యార్థులకు కూడా సుబోధకముగా ఎన్నో వేదగణిత విధానములను తెలియబరచే ఆయన ప్రజ్ఞావిజ్ఞతలను ప్రశంశించలేకుండా ఉండలేక పోతున్నాను. వేదవిజ్ఞాన శాస్త్రమును సాధికారికముగా తెలియబరచే గొప్పదనము ఆయనది.
అనేకపర్యాయములు ఆయనకు ‘పద్మ పురస్కారములు’ ఎందుకు రాలేదు అని ఎంతగానో ఆలోచించి ఆయన విజ్ఞానమునకు విజ్ఞతకు అవి కొలబద్దలు కావు అన్న నిర్ధారణకు వచ్చినాను. మహోన్నతమైన ఆంధ్ర భాషలో అక్షరము ముక్క రాకపోయినా, వచ్చిన అరకొర అక్షరాలను సక్రమముగా పలుకలేకపోయినా మహానటులమనుకొనే కొందరు
 ‘పద్మవిభూషణులు’ కాగలిగినారు. అట్లగుటయే వారి గొప్పదనము కావచ్చు. అందుకే ఆ బిరుదూ వచ్చియుండవచ్చు. కానీ శ్రీయుతులు అవధాన్లు వంటివారు బాహ్యాడంబరమునకు దూరముగా ఉంటూ తామస రహితులై, కర్తవ్య దీక్షా దక్షులై, తమ జన్మకు సార్థకత ఏర్పరచుకొనుటయే పరమావధిగా ఎంచుకొని, నిరంతరాయముగా తమ పని తాము చేసుకొని పోవుచున్నారు.  ఇట్టి కృషీవలుర నిబద్ధకు అవనత శిరస్కుడనై నమస్కరించుచున్నాను.
భగవంతుడు వారికి దీర్ఘాయుస్సు, ఆరోగ్యము, వేదాభిమానము, కృషి, పట్టుదల కలకాలమూ సమకూర్చి వేదములు తెలియజేసిన ఎన్నో ఆవిష్కరణలను మనకు అందిచుతారని ఆశించుతూ, అటువంటి సార్థకజన్ములు ఇంకా ఇంకా ఈ దేశమున జన్మించి ఈ దేశ ఔన్నత్యమును జగతికి చాటవలెనని పరమాత్ముని పదేపదే ప్రార్థించుచున్నాను.
******************
మిగిలినది మళ్ళీ............
ఇక దండిభట్లవారిని గూర్చినాకు తెలిసిన మేరకు  విశధపరచుతాను.
రెండవ ప్రపంచ యుద్ధములోని అక్ష రాజ్యములలోని ప్రధాన రాజ్యమయిన జర్మనీ నియంతయగు హిట్లరు, మిత్ర పక్షాలలో ప్రధానమయిన బ్రిటనుకు పరాధీనయై  పనిచేయుచున్న భారత దేశ వేదసంపదను గుర్తెరింగి ఇచ్చటి ఒక మహా వేదపండితుని తన
గూఢచారుల సహాయముతో జర్మనీకి రప్పించుకొని  ఏవిధముగా తన అణ్వస్త్ర సంపదను అభివృద్ధి చేసుకొన్నాడో అచటి పార్లమెంట్ The German Bundestag భవనము మనకు చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ మనకు చెబుతుంది.
ఆ మహానుభావుని పేరే బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారు.
ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖములుగా, నాలుగు రూపములలో అవగతమవుతుంది అని పెద్దలు చెబుతారు. వాటిని ఆపోశనము పట్టినవాడు ఈ మహానుభావుడు. అంతటి సమున్నత ప్రతిభావంతుడు కాబట్టే హిట్లర్‌ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆయనను జర్మనీకి రప్పించుకొన్నారు.
రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన ఈ దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి ఇప్పుడు తెలుసుకొందాము. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయములను దర్శింప జేయుచుండగా ఓ చోట ఒక సనాతన భారతీయ విప్రవర్యుని ఛాయా చిత్ర పటము కనిపించింది. విస్మితుడైన ఆరాయబారి ఆయన ఎవరు అని జర్మనీ అధికారులను అడుగుటతో  వారు అతనికి బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారిని గూర్చి విపులముగా చెప్పవలసి వచ్చినది.
ఇక్కడ, మీరు గమనించవలసిన ముఖ్యవిషయము ఏమిటంటే లక్షలాది యూదులను చంపిన నియంత యగు హిట్లరును నేను వెనుకేసుకు రావటములేదు. అతనికి మన వేదములపై గల నమ్మకమును గూర్చి తెలుపుటకు ఈ ఉపోద్ఘాతమును వ్ర్రాయవలసి వచ్చినది.
తొలి ప్రపంచ యుద్ధము అణగారి పోవుటజర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమగుట, ప్రపంచమంతా ఆర్థికమాంద్యము నెలకొనుట మనకు ఎరుకపడిన అంశాలే! ఆ యుద్ధమునందు  బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానమును దిగమింగుకోలేక, ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతియన్న తన విశ్వాసమును పుష్టి చేయదలచి, తమ జాతి ఆధిపత్యమును నిరూపించదలచి ఆయన నాజీ పార్టీ స్థాపించి, వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించినాడు. అదే రీతిలో కొత్త కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించినారు. సంస్కృతము తమ జాతి మూలభాష అని తాను నమ్మి సంస్కృత భాషాధ్యయనము పట్ల జర్మన్లకు  ఆసక్తి పెంపొందించినాడు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయములలో  మారణాయుధముల రహస్యములు దాగియున్నవని ఆయన గ్రహించి,
 సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేసినాడు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఙ్మయము నుండి జర్మన్లు లబ్ధిపొందడానికి గట్టిచర్యలు  తీసుకొన్నాడు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఙ్మయము నుండి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చినాడు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ గుప్తచరులు, ఆయన కోసం భారత దేశములో అన్వేషణ ప్రారంభించినారు.
మనలో అత్యధిక శాతమునకు దండిభట్ల వారిని గూర్చి ఏమాత్రమూ తెలియదని తలచి నాకు తెలిసిన మేరకు తెలియజేయుచున్నాను.
కొన్ని నెలల క్రితము గ్రంధముఖిలో(Face Book) మన తెలుగు గడ్డ రాజమహేంద్రవరము నుండి జర్మనీకి పిలుచుకొని పోయి వేదశాస్త్ర రీత్యా అస్త్రములను తయారుచేయు విధమును బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురుత్వమున బడసినారని విను. కానీ వివరములు అంతగా లేవు. అందువలన నేను సంపాదించిన వివరములతో ఆ మహనీయుని గూర్చి  తెలియబరచుతాను. ఇటువంటి తపస్సంపన్నులైన పురుషులే   వేదములను ఈ దేశమును కాపాడుచున్నారు. వేదాలను వెక్కిరించేవారు కాదు.
రాజమహేంద్రి వాస్తవ్యులైన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు నిజమునకు బాల మేధావి. వేద  వేదాంగ నిష్ణాతుడు. వయసుతో బాటూ యజుర్వేద కర్మ కాండను ఆమూలము ఆపోశన పట్టి, అథర్వణ వేద ప్రయోగ భాగమును కూడా ఆమూలాగ్రము ఆకళింపు చేసుకొన్నాడు ఆయన.  అటువంటి ఒక మహా పండితుడు ఆంధ్రదేశమందున్నట్లు  అడాల్ఫ్ హిట్లరు కనుగొన్నాడు. ఇక రాజు తలచుకొంటే రానిదేముంటుంది. అందులోనూ హిట్లరాయె!

హిట్లరుకు వేదములందు అస్త్ర నిర్మాణ విభాగమున్నదని తెలుసు. అసలు జర్మనీ కి భారతదేశమునకు సాన్నిహిత్యము కూడా చాలా కాలముగా ఉంటూ వచ్చినది, నేతాజీ కూడా ఒక కారణము. సంస్కృతములో దీనిని శర్మణ్యదేశము అంటారు. మన సంస్కృతి, సంస్కృతము పై వారికి మక్కువ ఎక్కువ. 19వ శతాబ్దపు ప్రారంభములోనే జర్మనీ విశ్వవిద్యాలయములందు సంస్కృతమును ప్రవేశపెట్టినారు. 1843 లో మర్బుర్గ్ నందు ఫ్రాంజ్ ఓర్లాండర్ ప్రవేశపెట్టినట్లు చెబుతారు. హిట్లరుకు వేదముల పైన సంస్కృతము పైన ఎక్కువగా నమ్మకము గౌరవము ఉండేవి అని చెబుతారు.  ఆ విషయము వేదమూర్తులగు దండిభట్ల వారిని ఆహ్వానించుట తోనే తెలియుచున్నది కదా!

జర్మనులు Pulse jet engines మన వేదమూలముల నుండియే గ్రహించి  V- 8 Rocket ‘Buzz Bombs’ కు అమర్చుట జరిగినదంటారు. అందుకే వారు 1930 ప్రాంతము నుండియే భారత్ మరియు తిబ్బత్ (Tibet) దేశాలపై కన్నుంచి తమ గూఢచారి దళములను ఆయా ప్రాంతములకు పంపియుంచినారు. ఆ సమయములోనే చైనా వారు లాసా పట్టణములో దొరకిన కొన్ని తాళపత్ర ప్రతులను చండీఘడ్ కు అనువదించుటకు గానూ పంపి వాని మూలమున  అంతర్నక్షత్రమండల నౌకా నిర్మాణమునకు గడంగినారు.  ఈ విధానము అష్ట సిద్దులలోని  ‘లఘిమ’ అను సిద్ధికి సంబంధించినది అని పెద్దల మూలమున తెలుసుకొన్నాను. ఇది గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధమగు అపకేంద్ర  శక్తి(Centrifugal Force). అణిమా మహిమాచైవ గరిమ లఘిమా తథా ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం   వశత్వంచాష్ట సిద్ధయోః అని మన పూర్వులు అష్ట సిద్ధులను గూర్చి తెలిపినారు. మన విజ్ఞాన  సంపద ప్రతి దేశము తన స్వంతము చేసుకోన ప్రయత్నించినదే! ఒక్క మనము తప్ప?

ఇటువంటి పరిస్థితులలో ‘ఆకొన్న వానికి అన్నము దొరకినట్లు’ హిట్లరుకు మన శాస్త్రిగారు  దొరకినారు. వారు ఆయన గురుత్వమును గ్రహించి ఎన్నో విషయములను సేకరించి తాము కోరిన విషయమును, వివరములను వారు గ్రహించినారు. అస్త్ర నిర్మాణము ఏ  దేశామునకైనా సహజమే! కానీ వారు కృతజ్ఞతకు పెద్ద పీట వేసి ఆయన చిత్రపటమును తమ  విదేశీ కార్యాలయములో నేటికీ అలంకరించి సముచితముగా గౌరవించుతున్నారు.
మరి వేదములలో గొప్పగొప్ప విషయములున్నట్లా లేక ‘అన్నీ ఉన్నాయిష అన్నట్లా!’ ఒక ఉన్నత  
స్థితి చేరినవారు నిజానిజములనరసి భావ ప్రకటన చేస్తే భావి తరానికి మార్గదర్శకులౌతారు.    
       దండిభట్ల వారిని గూర్చి ఇంకాస్త వివరముగా తెలుసుకొందాము. దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారు తమ ఇంటికి వచ్చేవారితో నిత్యం శాస్త్ర విషయాలపై చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కారు. ఒకానొక దినమున ఆయన విశాఖపట్టణపు  సమీపానవున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. ఆ కాలములో బస్సుల వసతి తక్కువ. వ్యక్తులలో దార్ఢ్యము ఎక్కువ. అందువల్ల ఊళ్ళు వెళ్ళుటకు కాలినడకను ఉపయోగించేవారు. ఆ విధంగా వారు వెళుతూవున్న సమయంలో హిట్లర్‌ గూఢచారులు ఆయనను సమీపించి ప్రతిఘటనకు తావులేని రీతిలో  ఆయనను అక్కడినుండి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు ఆపైన జర్మనీకి తరలించినారు. ప్రతిఘటన వుండినదా లేదా అన్నది నాకు తెలియని విషయము. దండిభట్ల గారు  జర్మనీ చేరుకొన్న సమయానికి రెండో ప్రపంచ యుద్ధానికి (1939-1945) రంగం సిద్ధమయి వుంది.
బాంబులు మిక్కుటముగా తయారుచేస్తున్నారు కానీ నిలువ చేయుటలో  ఏర్పడు వత్తిడికి అవి ప్రేలిపోతూవుండుటతో విపరీతమైన ధన జన అస్త్ర నష్టము సంభవించేది. తమ దీన స్థితిని వివరించి వేదములనుండి తగిన ఉపాయమును సూచించమని అర్థించినారు వారు. హిట్లరు గుణగణములు తెలియని శాస్త్రిగారు ఆర్త రక్షకుడై  యజుర్వేదం నుండి ఆ సమస్యకు పరిష్కారం సూచించినారు. వారి సలహా ఫలించింది. సైనిక దళపతులు దానితో ఆయనకు బ్రహ్మరథము పట్టినారు. అప్పటినుండి ఆయన వారికి పరమ పూజనీయులైనారు.
తన వేదపాండితీ ప్రకర్షచే జర్మనులకు తనవంతు సహకారం అందించి జర్మనీ పురోభివృద్ధికి ఇతోదికముగా పాటుబడినారు. కానీ వారు తర్వాత కాలములో తిరిగీ  భారతదేశమునకు రాలేక పోయినారు. కారణములు నేను చదివిన మేరకు పెద్దలద్వారా విన్నమేరకు తెలిసిరాలేదు.
దండిభట్ల వారు జర్మనీకి పోయినప్పటి నుండి వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందేదని వినికిడి. ఆయన మరణం తర్వాత కుటుంబ
భృతిగా తొంభై రూపాయల వంతున వారి శ్రీమతికి అందేదట. ఆ తరువాత ఎప్పుడు ఆగిపోయింది అన్నది మనకు ఊహకు అందని విషయము.
వేదమూర్తులగు దండిభట్ల వారు దేశానికి దూరమైనా, తర్వాత కాలములో దేశ స్వాతంత్ర్యము వచ్చినా, అటు దేశము, ఇటు రాష్ట్రము కూడా ఆయనను వెనుకకు తెప్పించే ఆలోచన చేయలేదు. అసలు అటువంటి ఒక మహనీయుడు ఆంధ్రుడై రాజమహేంద్రి లో నివసించినాడు అన్న విషయమునే పట్టించుకొని వుండరు. కానీ జర్మనులు మాత్రం ఆయనను  తమవానిగా, మాననీయునిగా, మహనీయునిగా ఇప్పటికి జర్మనీలో  పార్లమెంట్ లోని విదేశాంగ శాఖ కార్యలయంలో,దండిభట్ల వారి చిత్ర పటమును ఉంచుకొనుట వారి కృతజ్ఞతా హృదయమునకు, వారి పై గురుత్వమునకు వేదము పై భారత దేశము పై గౌరవ భావమునకు మనము ధన్యవాదములు చెప్పవలసి వుంటుంది.
అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనము కూడా వారి నికృష్ట కార్యములకు మన మూఢ జ్ఞానమును జోడిచి మన సంస్కృతిని, మన వేదములను, మన సంస్కృతమును అవహేళన చేస్తూ అవనత శిరస్కులమై అవమానముల ఊబిలో కూరుకొని యుండుటకే ఇచ్చగించుచున్నాము.
 గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే  భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యోతి, మనము పాలు త్రాగిన రొమ్మునే గుద్దుతూ వున్నా ఆతల్లిని ఆదరించే సంస్కారవంతులు విదేశాలలో వుండుటయేగాక అంకిత భావముతో ఆ తల్లి సేవ చేస్తున్నారు. ఇకనైనా మన వేదములను, సంస్కృతిని, మన ఋషి ముని శాస్త్రజ్ఞులను అవహేళన చేయక వారు మనకు అందించిన వెలుగులో క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు చేసి లోకానికి అందించి మన దేశము యొక్క గొప్పదనమును చాటుదాము.

స్వస్తి.

Thursday, 11 August 2016

ధనం దానం

ధర్మార్థం బ్రహ్మణే దానం యశోర్థం నటనర్తకే
భృత్యేషు భరణార్థంవై భయార్థంచైవ రాజసు

గోభీర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః
అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ

వేదమూల మిదం బ్రాహ్ మ్ యం
భార్యామూల మిదం గృహం
కృషిమూల మిదం ధాన్యం
ధనమూల మిదం జగత్

వృత్యనుప్రాస చాటు పద్యము

నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటి పటీ గంధేభ వాటీ పటీ
ర నటీ హారి పటీ సువర్ణ మకుటీ ఫ్రచ్చోటికా పేటికల్
కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠీ(టీ)శ్వరా
వీటీ = తాంబూలము; ఱవికముడి; వధూటీ = ఆఁడుది; కన్యక, ఘటీ = చిన్నకుండ; ఇరువది నాలుగు నిమిషముల కాలము, ఘనకోటీ, శకటీ = cart, ratha, కటీ = పిఱుఁదు; మొల.
తటి =ఏటిఒడ్డు; ప్రదేశము, పటీ = వస్త్రము. గంధేభ = an elephant of the best breed
వాటీ = తోట, ¬పటీర = చందనము. సువర్ణ మకుటీ = సువర్ణ కిరీటములు, హారి పటీ = (బంగరు) హారములు, (మేలైన) వస్త్రములు, ఫ్రచ్చోటికా పేటికల్ = covered baskets (with valuables
నీలకంఠేశ్వర శతకం; అజ్ఙాత కర్తృకం;
ఓ వేద తురంగా! పరమశివా! నీలకంఠేశ్వరా! నిన్ను భక్తితో సేవిస్తే పడయరాని దేమున్నది? సర్వము సముకూడునుగదా! మానవులకు నీసేవ వలన సకల భోగ భాగ్యములు వశమగుట తథ్యము!
వీటీ వధూటీ గణము (వెలయాండ్రు ) అనేక కోట్లధనము , వాహన సముదాయము , నదీతీర వనాళి , మదగజ సముదాయము , కర్పూర వాటికలు , మనోహరమైన బంగరు హారములు , కిరీటములు ,సింహాసనములు ,బంగరు పేటికలు , మొన్నగునవి యెన్నియైనను నీయనుగ్రహ లబ్ధములేగదా! యనుచున్నాడు.
ఇందు బాహ్యములైన భాగ్యముల ప్రస్తావనము మాత్రమేగలదు. కారణము భక్తునిలో లౌకికమైన విషయ లోలుపత యధికమని తెలియు చున్నది. అయినను పద్యము చెప్పిన విధానము మాత్రము అపూర్వమనక తప్పదు! 

Tuesday, 9 August 2016

మంత్రం

మంత్రం – నిజంగా చింతకాయలు రాలుస్తుందా??? by Kiran MVA
“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” - అనగా మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అదీ గురువుల సత్ ఉపదేశంతో నేర్చుకుని మననం చేస్తే ఎన్నో బాధలను తీర్చగలదు, ఎన్నో కార్యాలను సఫలం చెయ్యగలదు. కానీ కొందరు వెటకారంగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని ఎద్దేవా చేస్తారు. అసలు మంత్రం, దాని వెనకున్న నిగూడార్ధం గురించి చర్చించుకుని మనకు అనుభవంలో ఏది రాల్చగలదో ముచ్చటించుకుందాం.


ప్రతీ మంత్రంలో ఓంకారం, బీజాక్షరాలు ఒక అమరికతో ఒకొక్క శక్తిని ప్రేరేరింప చేసేవి గా వుంటాయి. ముందుగా ఓంకారం గురించి చూస్తె అది “అ” కార, “ ఉ” కార, “మ” కార సంగమం. ఆకారం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన వాణి కడుపు, హృదయం స్థానంలో చలనం గమనించవచ్చు. ఉకార ఉచ్చారణతో గొంతులోను, మరియు గుండె దగ్గర మనం సెన్సేషన్ గమనించవచ్చు. “మ్” అని అంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుండి మెదడు వరకు vibration గమనించవచ్చు. ఇది ఎక్కడో ఎందుకు మీరే ఒకసారి ఉచ్చరించి చూడండి , ఆ కదలికలను మీరు ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రదేశాలలో చలనం గమనించవచ్చును. ఇవి మూడు కలిపి ఓం కారం జపించినప్పుడు కటి ప్రదేశం నుండి మెదడు వరకు, మనకున్న షట్చక్రాలు ఉత్తేజితం అవుతాయి. ఈ ఓం కారానికి frequency 425Hz గా గుర్తించారు. అదే ఓంకార మంత్రోచ్చారణ ఒక క్రమపద్ధతిలో చేసేవారికి binural waves మెదడు లో తయారవుతాయి. దాని వలన ఆల్ఫా(8-13.9Hz), బీటా(14-30Hz) ,టీటా(4-7.9), డెల్టా (0.1-3.9 హజ్)తరంగాలు మెదడులో ఉత్పన్నమవుతాయి. సైంటిస్ట్ లు దీని మీద ప్రయోగాలు చేసి ఓంకార ఉచ్చారాణ ద్వారా ఒకరి మానసిక స్థితి బీటా నుండి డెల్టా వరకు ప్రశాంతత స్థితికి వెళ్తుంది.
మానసిక ఒత్తిడి ఓంకార ఉచ్చారణ ద్వారా ఎలా తగ్గిందో ఈ క్రింద పేపర్ లో మరింత వివరంగా చర్చించబడి వుంది.
http://paper.ijcsns.org/07_book/200808/20080825.pdf
కేవలం ఓంకార మంత్రోచ్చారణ ద్వారా మానసిక ప్రశాంతత, కాన్సంట్రేషన్ పెరుగుదల, ఎక్కువ ఉత్సాహం, స్ట్రెస్ తగ్గుదల కనబడ్డాయి.
MRI scan ద్వారా మరికొన్ని విషయాలు గమనించారు. దీని ద్వారా ఎపిలేప్సి, డిప్రెషన్ కూడా తగ్గించవచ్చు అని నిర్ధారణకు వచ్చారు.
ఇక మనం మిగిలిన మంత్రాల విషయం గురించి చూద్దాం. ప్రతి మంత్రం కొన్ని బీజాక్షరాల సమాహారం. ప్రతీ బీజాక్షరానికి దాని శక్తి వుంటుంది. దానికి తత్సంబంధిత ఒక frequency వుంటుంది. ఈ బీజాక్షరాల క్రమపద్ధతి లో దాత్త, అనుదాత్త స్వరాలతో చదివినప్పుడు ఒక signature ఉత్పన్నమవుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. తత్సంబంధిత దేవతా స్వరూపానికి అది చేరి రావలసిన ఫలితం ఇప్పిస్తుంది. ఇదెలా కుదురుతుంది అని అనుకుంటే దానికి అర్ధమయ్యే ఒక ఉదాహరణ తీసుకుందాం. దీన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే మనం ముందు తెలుసుకోవాలంటే మన చుట్టూ మనకు అర్ధం కానీ, ఎన్నో తరంగాలు ఉన్నాయి. ఉదాహరణకు రేడియో లో FM ట్యూన్ చెయ్యాలంటే 88-108 Mhz లో మార్చుకోవాలి. అందునా దానికి లైన్ of sight మాత్రమె ఆ సిగ్నల్ tap చెయ్యగలదు. అందుకే వైజాగ్ FM రేడియో వేరు, విజయవాడ FM రేడియో స్టేషన్ వేరు. ఒకొక్క ఊరిలో ఆ FM సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ని అందుకోవాలంటే దానిని అర్ధం చేసుకునే FM receiver ఉండాలి. ఆ frequency కి మనం ట్యూన్ చేసుకుంటే ఆ కార్యక్రమం మనం వినగలం. అదే AM రేడియో అంటే కొన్ని latitudes వరకు వ్యాపిస్తుంది. అందుకే మనం శ్రీలంక AM రేడియో కూడా వినగలం. అలాగే satellite రేడియో ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కార్యక్రమం కూడా వినవచ్చు. వాటికి తత్సంబంధిత receiver తప్పని సరి.
మన ఋషులు, యోగులు ఒకొక్క దేవతకు సంబంధించిన signature కనుగొన్నారు. వారు చెప్పిన పద్ధతిలో సాధన చేస్తే ఆ దేవతా స్వరూపాన్ని మనం అనుసంధానించుకోవచ్చును. సర్వత్రా వ్యాపించి ఉన్న దేవతా శక్తిని ఆ మంత్రాల ద్వారా మనం ఉత్తేజితం చేసుకుంటాం. ఎలాగంటే బయట ఎలక్ట్రిక్ pole మీద కరెంట్ వెళ్తుంటుంది, దాన్ని మనం ఒక వైర్ తగిలించుకుని మనం ఇంట్లో పవర్ తెచ్చుకున్నట్టు. ఆ శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ మంత్రధ్వని ద్వారా ఆ అనంతశక్తిని మనం కొంత మనలోకి తెచ్చుకున్నట్టు. బయటున్న ఎలక్ట్రిక్ pole కొంత ఎత్తులో వుంటుంది. దానికి మన ఇంటినుండి తగిలించాలంటే ఆ వైర్ కి ఇంత అని నిర్దుష్టమైన పొడుగు ఉండాలి, ఆ వచ్చేది 5amperes లేక 15 amps అన్నదాన్ని బట్టి ఆ వైర్ మందం వుంటుంది. అలాగే మనం ఏ కామ్యం కోసం చేస్తున్నామో ఆ కారణాన్ని బట్టి ఒకొక్క మంత్రం అన్ని సార్లు మననం చెయ్యాలని చెప్పబడి వుంది. ఒకే మంత్రం ఒక కామ్యానికైతే 15000 జపం చెప్పబడి వుంటే కొన్నింటికి 64వేలు ఇలా రకరకాలు గా వుంటుంది. ఆ శక్తి మండలం దగ్గర నుండి మనకు ఎంత శక్తి కావలసి వస్తుంది అంత మనకు గురువులు మంత్రజపం చెయ్యమని చెబుతారు. ఎలాగైతే ఒక ఎనర్జీ ఎక్స్పర్ట్ ఒక ఇంటికి ఎంత పవర్ కావాలని చెప్పగలడో, గురువులు మన కామ్యాన్ని బట్టి ఎంత శక్తి మనకవసరమో అన్ని వేల మంత్రజపం చెయ్యాలో చెబుతారు. నమ్మకంతో చేస్తే తప్పక ఫలితం వుంటుంది.
ఇక్కడ మరొక కోణం వుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ కేవలం మౌఖికంగానే కాదు, మౌనంగా కూడా వారి భావాల ద్వారా జరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపింపబడివుంది. వీటిని మనం నిత్యం అనుభవిస్తూనే వుంటాం. చూడండి కొంతమందిని కలవగానే ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరిని కలవగానే వారినుండి దూరం పోవాలని వుంటుంది. ఒకొక్కరి భావాలు మరొకరితో మాటల్లేకుండానే కలుస్తాయి, వికర్శితం అవుతాయి. ప్రతి ఒక్కరికీ కొంత ఆరా (aura) వుంటుంది. మంత్రజపం ద్వారా మన aura పెంచుకోవచ్చు. అది ఎవరితో వికర్శితమవుతోందో వాటిని సర్దవచ్చు. కేవలం మనలోనే కాదు, ఒక పరిస్థితికి ఎవరెవరితో సంబంధం వుందో దాన్ని ట్యూన్ చెయ్యగల సామర్ధ్య౦ మంత్రజపానికి వుంది.
మరికొన్ని వివరాలు మరొక టపాలో చెప్పుకుందాం.
నిజం. మంత్రం కాయానికి ఉన్న “చింత”ను రాలుస్తుంది. నమ్మకంతో ప్రయత్నించి అనుభవించండి. తప్పక ఫలితాన్ని చూస్తారు.

Friday, 5 August 2016

జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాముల అనుగ్రహ భాషణము

జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాములు , తమ శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా చేసిన అనుగ్రహ భాషణము [ కన్నడ 

భాషణమునకు తెలుగు అనువాదం- పూర్తి పాఠం ]

ఇది అత్యంత స్ఫూర్తి దాయకము , విజ్ఞానదాయకము , ఆసక్తి కరమూ అయినది. దీనిలో ఎంతో విలువైన సమాచారము ఉంది ||

శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం|


అరవిందసమాన సుందరాస్యాం| అరవిందాసన సుందరీముపాసే ||

ఆదిశంకరుల గురించి మనదేశములోనే ... దేశములోనే కాదు , ఈ విశ్వములోనే తెలియనివారుండరు. మన సనాతన ధర్మానికీ , 
ఉపనిషత్ సిద్ధాంతానికీ వారు చేసిన సేవ , ఎన్ని సహస్ర మానములు గడచినా ఈ జనత , గుర్తుపెట్టుకొనునటువంటిది. 

కేవలము ముప్పైరెండు సంవత్సరముల కాలము ఈ భూమిపై కనిపించినట్టి ఆ మహాపురుషుడు చేసినట్టి కార్యము మాత్రము 

యుగయుగములవరకూ నిలుచునట్టిది. మనుష్యుని పురోగతికి ఏకమాత్రమైన సాధనము ’ధర్మము’ అని చెప్పతగినట్టిది. అట్లే , 

మనుష్యుని పతనానికి ఏకమాత్రమైన సాధనము ’ అధర్మము ’ అని చెప్పతగినది.ఈ ధర్మము , అధర్మమూ అను ఈ రెండూ , 

మనిషి గొప్పదనానికీ , నీచత్వానికీ సాధనమైనటువంటివి. ఇందులో ఏవిధమైన అనుమానమూ , మార్పూ లేదు. శృతి , 

స్మృతి , ఇతిహాసములు , పురాణములు , దర్శనములు --వీటన్నిటిలోనూ , వేరే ఇతర విషయములలో అభిప్రాయ 

భేదమున్ననూ , ఈ ఒక్క విషయములో మాత్రము ఎటువంటి అభిప్రాయ భేదమూ లేదు. ధర్మము సుఖానికీ , పుణ్యానికీ 

హేతువనీ , అధర్మము కష్టానికీ , పాపానికీ హేతువని ప్రతియొక్క దార్శనికుడూ ఒప్పుకున్నట్టిదే. అందుకే , శాస్త్ర పరిభాషలో 

కొన్ని ’ సర్వతంత్ర సిద్ధాంతములు ’, మరికొన్ని ’ ప్రతి తంత్ర సిద్ధాంతములూ ’ అని చేయబడినవి. వాటిలో ’ సర్వతంత్ర 

సిద్ధాంతము ’ అను మాట సర్వులూ , సర్వమూ ఒప్పుకున్నది. ఈ ధర్మాధర్మములే సుఖ దుఃఖాలకు హేతువులు 

అన్నది సర్వతంత్ర సిద్ధాంతము. అద్వైతులుకానీ , ద్వైతులు కానీ , విశిష్టాద్వైతులైనా కానీ , శక్తి విశిష్టాద్వైతులైనా కానీ , 

బౌద్ధులు కానీ , జైనులు కానీ, వీరశైవులే కానీ , ఈ విషయములో మాత్రము ఎవరికీ యే భిన్నాభిప్రాయమూ లేదు. కాబట్టి మనము , 
నిత్య సత్యమైనట్టి ఈ యొక్క సిద్ధాంతమును అనుసరిస్తూ మన జీవితాలను సాగించినపుడే మన జీవితము పవిత్రమవుతుంది, 

ఉత్తరోత్తరా మనకు ఇంకా ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గనక మరచి మనమేదైనా అధర్మపు దారి తొక్కితే , 

అధర్మ మార్గములో నడచుకుంటే మన జీవితాలను మనమే వ్యర్థము చేసుకున్నట్టవుతుంది. ఇది నిత్య సత్యమైన విషయము.

ఆది శంకరులు మనకు కొత్తగా దేనినో ఉపదేశము చేసినారు అని మేమేనాడూ చెప్పము. దేనిని శాస్త్రములు స్పష్టముగా 

చెప్పినాయో, దానిని జనులు మరచిపోయినప్పుడు , జనులకు దానిని గుర్తుచేసినారు. ఈ సిద్ధాంతాన్ని మరచి ప్రజలు 

కేవలము పశువులు ,  మృగముల వలెనే జీవితాలను గడుపుతున్నటువంటి సందర్భములో , శంకర భగవత్పాదులు , ’ ఈ 

రీతిలో మీరు జీవితాలను వ్యర్థము చేయుట సరియైనది కాదు , జీవితము అత్యమూల్యమైనది , ఇది పదేపదే దొరకునట్టిది 

కాదు, ఇటువంటి అమూల్యమైన జీవితాలను వ్యర్థము చేసుకొనకండి, సార్థకము చేసుకొనండి , 

సార్థకము చేసుకోవాలంటే ఏకమేవ మార్గము ధర్మాచరణమే. ధర్మమార్గమును ఎవ్వరూ తప్పకండి. ధర్మ మార్గమును తప్పితే 

మీకు ఇహములో దుఃఖము కలుగును అని అనిపించకున్ననూ ఈ శరీరమును వదలిపోయిన తరువాత మీరు అధిక దుఃఖాన్ని 

అనుభవిస్తారు. మనుషికి ఒక ఆశ యేమంటే , యే జన్మలోనైనా సరే నేను సుఖముగా ఉండవలెను. యే జన్మలోనూ నాకు 

దుఃఖము కలుగకూడదు , కష్టములు కలుగకూడదు-- ఇది ప్రతి మనిషికీ అంతరాళములో ఉండే ఆశ. శంకరులన్నారు , ’ 

నిజముగా మీకు ఈ ఆశ ఉంటే దానికి తగినట్టే ప్రవర్తించండి. విద్యార్థులకు , తాము పరీక్షలో మొదటి శ్రేణిలో పాసు కావలెనన్న 

ఆశ ఉంటుంది, కానీ పుస్తకము ముట్టేందుకు మనసు రాదు. శంకరులంటారు , ’ నువ్వు 

పుస్తకమే ముట్టకపోతే మొదటి శ్రేణిలో లో ఎలా పాసవుతావు ? నీకు నిజంగా మొదటి శ్రేణిలోపాస్ కావలెనన్న ఆశ ఉంటే 

తీవ్రముగా కృషి చేయ వలెను. అట్లే , జీవితమును సార్థకము చేసుకోవాలంటే ధర్మమార్గము లోనే నడవవలెను. అధర్మ 

మార్గములో నడవద్దు. ఒకోసారి అనిపిస్తుంది, ధర్మ మార్గములో నడచుట చాలా కష్టము అని. అయితే , మనకు ఉత్తమమైన 

ఫలము దొరకాలంటే మొదట కష్టము అనుభవించే తీరవలెను. విద్యార్థులకు కూడా చదవడం అంటే చాలా కష్టము 

అనిపిస్తుంది. మరి మొదటి శ్రేణిలో లో పాసవవలెనంటే కొంచమైనా కష్టము పడవద్దా ? అట్లే , ధర్మ మార్గమున 

నడచుట కష్టము అని ఎవరైనా దానిని వదలివేస్తే , తమకు అపేక్షితమైన ఫలము మాత్రము దొరకదు. దానినే శంకరులు చాలా 

స్వారస్యముగా చెప్పినారు, ’ ఈ జనులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి కనిపిస్తున్నది, 

|| పుణ్యస్య ఫలమిఛ్చంతి పుణ్యం నేఽఛ్చంతి మానవాః | 

న పాప ఫల మిఛ్చంతి పాపం కుర్వంతి యత్నతః || "

 అని. పుణ్యఫలమైన సుఖము కావాలని అందరూ కోరుతారు , కానీ ఆ సుఖము కోసము పుణ్యమును చేయుటకు మాత్రము 

ఎవరూ 

ముందుకు రారు. పాప 

ఫలమైన దుఃఖము ఎవరికీ వద్దంట , కానీ ఆ దుఃఖాన్ని ఇచ్చునటువంటి పాప కార్యాన్ని అందరూ ప్రయత్నపూర్వకంగా 

చేస్తారు. ఇది మనుషులలో ఒక 

విచిత్రమైన ప్రవృత్తి అని , నేను చెప్పుట లేదు , వందలాది సంవత్సరములుగా వెనుకతరాల వారు మనుషుల ప్రవృత్తులను 

అధ్యయనము చేసినవారు 

చెప్పిన మాట. కానీ ఈమాట నిజమనిపించేటట్టు మనం ఉండకూడదు.

పుణ్యఫలమైన సుఖాలను అనుభవించాలనుకుంటే , ఆ సుఖాలను ఇచ్చే పుణ్యకార్యాలను మనం చేయవలెను. అనగా , 

ధర్మమునే ఆచరించవలెను. పాప 

ఫలమైన దుఃఖమును మనము అపేక్షించుట లేదు అంటే , ఆ దుఃఖజనకములైన పాప కార్యములను మనము చేయరాదు. 

దీనినే శంకర భగవత్పాదులు 

మనకు విస్తారముగా వివరించి చెప్పినారు. వారు అనేక విధములైన భాష్యములు , ప్రకరణములు , స్తోత్రములూ రాసినారు, 

అతి సంక్షిప్తమైన 

గ్రంధములనూ రాసినారు. అన్నిటి సారాంశమూ ఒక్కటే , ’ ధర్మ మార్గములో ఉండు , అధర్మ మార్గమునకు పోవద్దు .’ అలాగే , ప్రజలకు దీనిని మనము 

పదే పదే చెప్పుచుండవలెను. అలాగే పిల్లలకు , ’ నువ్వు బాగా చదవవలెను , గురువుల వద్ద వినయముతో ఉండవలెను , సహ పాఠుల వద్ద స్నేహముతో 

ఉండవలెను , ఇతరుల పెన్సిలూ , పెన్నూ దొంగతనము చేయకూడదు , గురువుల ఎదుట ఏనాడూ అబద్ధము చెప్పవద్దు , ’ అని వారికి ఒకసారి చెప్పితే 

చాలదు , ప్రతి దినమూ పదే పదే చెప్పుతూనే ఉండవలెను. ఎందుకంటే ఒకసారి చెబితే మరచిపోవచ్చు. పిల్లలకు దినమూ అలాగ చెప్పునట్లే , ప్రజలకు 

కూడా అలాగే ధర్మమును గురించిన ప్రబోధము నిరంతరమూ చేయవలెను అను కారణము చేతనే , శంకరులు ఈ మఠముల వ్యవస్థ చేసినారు. దీనికి 

సన్యాసులను నియమించినారు. ఎందుకనగా , సన్యాసులకు ఉండే ఒక వైశిష్ట్యమేమనగా , అతనికి భార్యా బిడ్డలు ఉండరు కాబట్టి , అతడికి మొదటగా , 

స్వార్థము ఉండదు. భార్యా బిడ్డలుంటేనే కదా స్వార్థము వచ్చేది ? భార్యకు నగలు చేయించాలి , పిల్లలను చదివించాలి ,పెళ్ళిళ్ళు చేయాలి... ఇటువంటి 

లంపటాలు సన్యాసికి ఉండవు , ఆవైపుకే అతని మనసు పోదు. ఇంకొకటేమంటే , ఆ సన్యాసి వేదాంతమును అధ్యయనము చేసి ఉండుట వలన అతడికి ఏ 

విధమైన ఆశలూ ఉండవు. -- నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించే. దేనిమీదా అతడికి వ్యామోహము ఉండదు కాబట్టి ధర్మ ప్రచారము చేయుటకు 

సన్యాసికి ఎక్కువ అవకాశము ఉంటుంది. స్వార్థము ఎప్పుడైతే ఉండదో , అప్పుడతడికి ఇంకే విధమైన పనులూ ఉండవు. అందువలన సన్యాసి పరంపరను 

శంకరులు తమ చతురామ్నాయ పీఠములలో ఏర్పరచినారు.

సన్యాసులే ఈ పీఠములకు అధిపతులుగా ఉండవలెను , ఈ పీఠానికి వచ్చినవారు సర్వ కాలములలోనూ జనులకు ధర్మ ప్రచారమునే 

చేయుచుండవలెను, తాము స్వయముగా ధర్మాచరణము చేయవలెను. ఇతరులకు ఉపదేశము చేయుటలో మాత్రమే నిమగ్నమై ఉండరాదు. కన్నడ 

భాషలో ఒక సామెత ఉంది,మీకందరికీ తెలిసే ఉండును , " చెప్పేదేమో పురాణములు , తినేదేమో వంకాయలు " అని. అట్లుకారాదు. ఇతరులకేమి 

ఉపదేశము చేస్తారో దాన్ని మీరుకూడా అక్షరాలా పాటించండి. దీనినే శంకరులు ,తమ మఠములకు అన్వయించునట్టుగా ఒక చట్టాన్ని రాసినారు. ఆ చట్టం 

పేరే ’ మఠామ్నాయము ’ . నాలుగు మఠముల లోనూ ఉన్న సన్యాసులు ఇలా ఇలాగుండవలెను , అలాగుండవలెను అని చెప్పునపుడు , ఆ సన్యాసుల 

యోగ్యతను చెప్పునపుడు || శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విచక్షణః || అంటే , ఆ సన్యాసి శుచిగా , శుద్ధంగా ఉండవలెను , అనగా శుద్ధ 

చారిత్ర్యవంతుడై ఉండవలెను. చరిత్ర శుద్ధి ఉండవలెను , జితేంద్రియుడై , వేద వేదాంగముల అధ్యయనము చేసిఉండవలెను , శాస్త్రజ్ఞుడై ఉండవలెను , || సః 

మదాస్థానమర్హతి || అంతటివాడే ఈ పీఠములో కూర్చొనుటకు యోగ్యుడై ఉంటాడు. అటువంటి యోగ్యత లేనివాడిని ఈ పీఠమునకు తీసుకొని రాకూడదు. 

--అని శంకరులు ఆనాడే అనుజ్ఞనిచ్చినారు.


ఆ అనుజ్ఞను శృంగేరీ శారదాపీఠము మాత్రమే ఆనాటినుండీ పాటిస్తూ వస్తున్నది . ఈ పీఠపు విశిష్టత అదే. ఆ యోగ్యత లేని వ్యక్తిని ఈ పీఠమునకు 

ఎవ్వరూ తీసుకురాలేదు. శృంగేరీ పీఠపు ఇతిహాసాన్ని శంకరుల నుండీ ఈనాటి వరకూ చూస్తే ఆ యోగ్యత లేని యే ఒక్క వ్యక్తి కూడా ఈ పీఠానికి 

అధికారిగా రాలేదన్నదే ఇక్కడి విశిష్టత. మరియూ ఇంకొక వైశిష్ట్యత ఏమనగా , ఈ పీఠములో బ్రహ్మచారిగానే సన్యాసాశ్రమమునకు వచ్చుట. 

గృహస్థాశ్రమము నుండీ సన్యాసాశ్రమము నకు వచ్చుట లేదు. మా పరంపరలో ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యాసియై , సన్యాసి 

ధర్మమును తు. చ. తప్పక పాలించి , శాస్త్రానుగుణముగా తమ జీవితాన్ని గడిపి, ప్రజలకు ధర్మ ప్రబోధనము చేసి , ఈ పీఠమునకు తాము వచ్చి 

సార్థకతను చేకూర్చినారు అనునది , నాటి నుండీ నేటి వరకూ వచ్చిన పీఠాధిపతులను చూస్తే మనకు తెలియునటువంటి నిత్యసత్యమైన మాట. దీన్ని 

మేము వెనుకటి గురువుల చరిత్రను గ్రంధాల మూలముగా చూసియున్నాము , మా గురువులలో ప్రత్యక్షముగనే చూసినాము. మా గురువులైన 

జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి వారు , తమ పదునాలుగో యేటనే సన్యాసమును స్వీకరించినారు. పదునాగేళ్ళ వయసులో బ్రహ్మచర్యాశ్రమము 

నుండీ సన్యాసి అయినారు. సకల శాస్త్రములనూ ఆధ్యయనము చేసినారు. సకల శాస్త్ర పారంగతులూ అయినారు. మఠపు సాంప్రదాయములను తమ 

గురువుల ముఖమున సంపూర్ణముగా తెలుసుకున్నారు. మఠపు ఉన్నతి కోసము , శిష్యుల ఉన్నతి కోసము తమ జీవితమును ధారపోసినారు. వారు 

ముప్పైఅయిదు సంవత్సరముల పాటు ఈ పీఠాధిపత్యమును నెరపినారు, దానిలో సుమారు పదునైదు సంవత్సరములు యాత్రలలోనే గడిపినారు. 

దేశసంచారము చేసినారు. సంచారములోనే తమ జీవితపు అర్ధ భాగాన్ని గడిపినారు. సంచారము ఎందుకు చేసినారు అనగా , ధర్మము గురించి 

ప్రచారము ఉపదేశముల కోసమే. ప్రజలకు వేదాంత తత్త్వమును తెలుపుటకోసమే. జనులను సన్మార్గములో నడిపించుట కోసమే. యాత్రలు చేయుటే కాదు , 
శృంగేరీని విశేషముగా అభివృద్ధి చేసినారు. వారి దర్శనము చేసినవారు , వారి అనుగ్రహమును పొందినవారు వారి అద్భుతమైన మహిమను 

అనుభవించినట్టి వారు ఈనాడు కూడా మన మధ్యలో చాలామందే ఉన్నారు. వారు 1974 లో నాకు సన్యాస దీక్షనిచ్చి ,నన్ను తమ ఉత్తరాధికారిగా 

నియమించినారు. వారిది అత్యంత విశాలమైన దృష్టి, నేను ఎక్కడో ఆంధ్ర దేశములో పుట్టినవాడిని,నాకు ఈ దేశపు చరిత్ర కానీ , ఈ మఠపు చరిత్ర కానీ 

ఇక్కడి సంస్కృతిగానీ , ఇక్కడి ఆచార వ్యవహారములు గానీ ఏమీ తెలిసి ఉండలేదు. అటువంటి నన్ను ఈ మఠపు ఉత్తరాధికారిని చేసి , ఇప్పుడు నేను 

నాకు ఏమేమి లేకుండెను అని చెప్పినానో అవన్నీ సంపూర్ణముగా నాకుండునట్లు చేసి నన్ను ఈ పీఠపు రక్షణకు నియమించినారు. వారు యే భరోసాతో 

నన్ను ఉత్తరాధికారిగా చేసినారో ,ఆ భరోసాను కాపాడుకున్నానన్న తృప్తి నాకుంది. వారు , ఈ పీఠాన్ని నేను అభివృద్ధి చేస్తాను , ప్రజలకు ఎక్కువగా 

ఉపకరించు కార్యములను చేస్తాను ,ఇంకా ఎక్కువ ధర్మ ప్రచారము చేస్తాను , మన భారతీయ సంస్కృతికి దోహదమగునట్లుగా అనేక పనులను చేస్తాను 

అన్న నిరీక్షణ కలిగి ఉండేవారు. ఈ దినము ఇక్కడ జరిగినదంతా చూసినవారందరూ , వారి నిరీక్షణ అంతా సత్యమైనది అన్న తృప్తితో కూడిన భావనలో 

ఉన్నారు. ఇదంతా కేవలము వారి కృప వల్లనే అయింది. నేను పదే పదే చెప్పునదేమంటే , దీనిలో ఏదైనా నాగొప్పతనముందని నేను అనుకొని ఉంటే అది 

కేవలము మూర్ఖత్వము. నా గొప్పదనమేదీ లేదు , ఇది కేవలము వారి కృప , మరియూ ఆ జగన్మాత శారదాదేవి యొక్క కృప మాత్రమే. నాకు ఎన్నో 

సందర్భములలో అనేకమైన సమస్యలు వచ్చినపుడు , నా గురువులనూ , ఆ జగన్మాత శారదనూ స్మరించినపుడు , అన్ని సమస్యలూ పరిహారమై, యేది 

అసాధ్యమైన పని అని భయపడి ఉంటానో అది పువ్వును ఎత్తిపెట్టినంత తేలికగా అయిపోయిన సన్నివేశములు అనేకములున్నాయి. అవి నాకు 

గుర్తున్నాయి , ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నాతోపాటే ఉన్న మన గౌరీశంకర్ కు తెలుసు.

ఇటువంటి ఉజ్జ్వలమైన పరంపరయే శృంగేరీ శారదా పీఠపు పరంపర , ఈ పరంపరను ముందుకు కొనసాగించి తీసుకు వెళ్ళవలసిన భారము నామీద 

ఉన్నందువలననే , దీన్ని సరిగ్గా నిర్వహించుట నా కర్తవ్యమైనందువల్ల , ఈ దినము ఈ ఉత్తరాధికారియగు శిష్య పరిగ్రహణము చేసినాను , ఈ దినము, 

ఆనంద నామ సంవత్సరపు, ఆశ్వయుజ మాసపు కృష్ణ పక్షపు ద్వాదశి ,సోమవారము అంటే 1974 వ సంవత్సరము నవంబరు పదకొండో తారీఖును 

గుర్తు చేస్తున్నది. ఇదే రీతి యైనటువంటి సన్నివేశము ఆనాడు కనిపించింది , అదే నేడు మరలా పునరావృత్తమయింది. జయనామ సంవత్సరపు , 

మాఘ మాసపు శుక్ల పక్షపు తృతీయ శుక్రవారము , 2015 , జనవరి 23 వ తారీఖున . నా గురువులు నాచే శాస్త్రాధ్యయనము చేయించి, నాకు మఠపు 

సాంప్రదాయములను తెలిపి, మఠపు శిష్యులనందరినీ పరిచయము చేసి, నాకు ఈ భారమును అప్పగించినారు. అదే విధముగా , మా శిష్యులను అదే 

రీతిలో సిద్ధం చేసి, వారికి సన్యాస దీక్షను ఇచ్చినాను. జాతకమును చూసి సన్యాసమును ఇచ్చే పద్దతి ఇక్కడ మా దగ్గరలేదు. పిల్లవాడి జాతకము 

అనేకులకు చూపించి, ఆ అనేకులలో యే ఒక్కరైనా , ’ ఈ పిల్లవాడి జాతకములో సన్యాస యోగము లేదు ’ అని చెప్పితే , ’ అయితే వద్దు , ఈ పిల్లవాడికి 

సన్యాస దీక్ష ఇచ్చుట తగదు ’ అని నిర్ధారించుట కొన్ని చోట్ల ఉందని విన్నాము , అయితే మా గురువులు అలాగ చేయలేదు , నేను కూడా అలాగ 

చేయలేదు. మా గురువులు , నాకు సన్యాసము ఇచ్చిన తరువాత అడిగినారు , " స్వామీ , మీరు పుట్టిన తిథి యేది ? " అని. ఎందుకడిగినారంటే , 

స్వాముల పుట్టిన దినమున మఠములో ’ వర్ధంతి ’ అని చేస్తారు , అందుకని అడిగినాను అన్నారు. నేను కూడా వీరిని అదే అడిగినాను. ’ మీరు పుట్టిన 

తిథి యేదయ్యా , ఎందుకంటే మఠములో స్వాముల పుట్టిన రోజు ’ వర్ధంతి’ జరుపవలెను అని. జాతకమును చూసి సన్యాసమును ఇచ్చుట కాదు , వ్యక్తి 

గుణమును , స్వభావమునూ చూసి ఇవ్వవలెను. ఆ వ్యక్తికి ఉండవలసిన మనస్సును చూసి. ఈ వ్యక్తి స్వభావము ఎట్లుంది, మనసెట్లుంది, వైరాగ్యము 

ఎట్లుంది, జనులపైన మమత , ప్రేమ ఎట్లున్నాయి.. వీటిని చూసి మేము సన్యాసము నిస్తాము, ఇది శృంగేరీ మఠపు పద్దతి. ఆ పద్దతికి అనుగుణముగా 

మా గురువులు యేరీతిలో జరిపించినారో , అదే పద్దతిలో జరిపించుట మాకర్తవ్యము అని భావించి , అట్లే చేసినాము.

దిలీప మహారాజు యొక్క రాజ్యమును వర్ణించునపుడు కాళిదాస మహాకవి ఒక మాటంటాడు , || రేఖామాత్రమభిక్షుణ్ణాత్ కామనోర్వత్మనఃపదమ్ నవ్యతీయుర్ప్రజాః తస్మిన్నియంతుర్నీమివృత్తయః || దిలీప మహారాజుయొక్క రాజ్యములో ఉండే ప్రజలు , వెనుకటి రఘువంశ రాజులు ఏ మార్గమును యేర్పరచినారో , ఆ మార్గము నుండీ ఒక్క అంగుళము కూడా ఇటుపక్కకు , అటుపక్కకు వెళ్ళేవారు కారు. అదేరీతిలో నడచుకునేవారు. అదే 

మార్గమును అనుసరించేవారు. శృంగేరీ పీఠములో కూడా అదే ఉత్క్రమము.వెనుకటి గురువులు యేమార్గమును మనకు వేసి ఇచ్చినారో , ఆ 

మార్గమునుండీ అటూ ఇటూ వెళ్ళే ప్రశ్నే లేదు. ఈ రోజు శిష్య స్వీకార మహోత్సవమును ఉదయము మనము జరిపిన క్రమమునే ,1974 నవంబరులో 

చూసినవారు ఒక ఐదారు మంది ఉన్నారిక్కడ. వారు , ఆ దినము యేమేమి ఎలాగ జరిగిందో , అదే పద్దతిలో ఈ దినము జరిగింది అన్న సంతోషము వారి 

ముఖములో నేను చూసినాను. ఇది ఈ శృంగేరీ మఠపు వైశిష్ట్యత. ఆ జగదంబ శారదాంబయే ఇక్కడి ఉత్తరాధికారిని నిర్ణయించినది. మేము కాదు. ఆ 

మాత ఎవరిని నిర్ణయిస్తుందో వారికే మేము ఉత్తరాధికారమునిస్తాము. 

కాబట్టి మేము ఆ బాధ్యతను మాపైన వేసుకున్నదే లేదు. అందువలన , మా గురువులు ఆ సంవత్సరము నవరాత్రులలో చివరిరోజు , పల్లకీ ఉత్సవము 

అయిన తరువాత వచ్చి అమ్మ దగ్గరకు వెళ్ళి , అక్కడ ఒక అయిదు నిమిషాలుండి, అమ్మ అనుజ్ఞ పొంది బయటకు వచ్చి ప్రకటన చేసినారు. అంతవరకూ 

వారు ప్రకటించలేదు. అనేక శిష్యులు వారిని అడిగేవారు ," తమకు వయసు యాభై ఆరు వచ్చిందే , ఉత్తరాధికారి గురించి యేమైనా ఆలోచించినారా ? ’ 

అని. ’ నాకెందుకయ్యా , ఆ భారము ఆ మహామాతదే. ఆ మహామాత ఎప్పుడు తీర్మానము చేయునో అప్పుడే అగును , నేనెందుకు దానిగురించి బుర్ర 

పాడుచేసుకోవలెను ’ అన్నారు. ఆ నవరాత్రులలో చెప్పినారు , " ఆ జగన్మాత నాకు అనుజ్ఞనిచ్చింది, ఈ వ్యక్తిని నువ్వు ఉత్తరాధికారిగా నియమించు 

అంటూ జగన్మాత అనుమతినిచ్చింది,ఇకఎటువంటి ప్రశ్నలకూ తావులేదు , ముందరి ద్వాదశినాడు వీరికి సన్యాసము అగును " అన్నారు. అదే , ఈసారీ 

పునరావృత్తి అయింది. 


ఈ పద్దెనిమిది దినముల వెనుక , ఇప్పుడే మన శాస్త్రులు చెప్పినట్టే , ’ మనవూరివారందరూ చేరి ,’ తమకు పట్టాభిషేకమై ఇరవై అయిదు సంవత్సరాలైనది, 

దానిగుర్తుగా ఒక రజతోత్సవము చేయవలెను ’ అని విజృంభణగా చేసినారు. ఆ దినము గురువుల పల్లకీ ఉత్సవము జరగవలెను అని అందరూ 

భీష్మించినారు. సరేలెమ్మని పల్లకీ ఉత్సవము అయినాక లోపలికి వెళ్ళి అమ్మదగ్గర ప్రార్థన చేసినపుడు , అమ్మ నాకు ప్రేరణ ఇచ్చినారు. ’ ఈ పిల్లవాడికి 

సన్యాసము నిచ్చివేయవయ్యా ’ అని. ఆ దినము మా గురువులకు యే విధముగా అమ్మ అనుజ్ఞ దొరికినదో , అదే విధముగా నాకు కూడా అమ్మవారి 

అనుజ్ఞ దొరికినది. ఆ అనుజ్ఞనే నేను ఆ సభాముఖముగా చెప్పినాను. మా అధికారులన్నారు , ’ అదెవ్వరికీ తెలియనే లేదు , గురువులతో పాటే ఎల్లపుడూ 

ఉండేవారికి కూడా ఆ సంగతే తెలియలేదు , ఉన్నపాటున ఒక్కసారిగా గురువులు చెప్పినారే ’ అని. అమ్మ అనుజ్ఞ లేనిదే నేను మాత్రం ఎలాగ చెప్పగలను 

? అమ్మవారి అనుజ్ఞ దొరకగానే వెంటనే చెప్పినాను. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమము , శృంగేరీ మఠములో అనూచానముగా వస్తున్నట్టి ఒక 

కార్యక్రమమే.

నాకు సంతోషము కలిగించేదేమిటంటే , మన రాష్ట్రపు అనేకులు , మన అధికారులు చెప్పినట్లుగా మన రాష్ట్రపు చుక్కానిని పట్టినట్టి అనేక అధికారులు , 

విశేషమైన అభిమానముతోవచ్చి ఈ కార్యక్రమములో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరికీ , మన రాష్ట్రపు వారే కాదు , బయటి రాష్ట్రాలవారే కాదు , మన 

దేశపు వారందరికీ ’ శృంగేరీ మఠము యే రాజకీయాలకూ సంబంధించిన మఠము కాదు , శృంగేరీ జగద్గురువులు రాజకీయాలకు అతీతముగా ఉండేవారు , 
తమ కర్తవ్యములో మాత్రమే నిరతులై ఉండేవారు. తమకు సంబంధము లేని విషయములలో యేమాత్రమూ తలదూర్చనివారు , ’ అన్నట్టి పరిపూర్ణమైన 

భావము మన దేశములో ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి, సర్వులకూ , ఇక్కడికి వచ్చుట , ఆశీర్వాదము పొందుట అనేది ఒక గర్వించతగ్గ విషయము , అదొక 

సంతోషించ వలసిన విషయము. అందువలననే , ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వాదము తీసుకొనుట అనేది ఎప్పటినుండో జరుగుతున్నది. వెనుక , 

మైసూరు మహారాజుల పాలన మన రాష్ట్రములో ఉన్నపుడు , శృంగేరీపీఠములో ఉత్తరాధికారి నియమితులై శిష్య స్వీకారము చేయువేళ , మహారాజులకు 

శ్రీముఖమును పంపుట , మహారాజులు స్వయముగా తామే వచ్చుట , లేదా , ఒకవేళ అత్యవసరమైన పరిస్థితిలో వారికి వచ్చుటకు వీలుకాకపోతే , 

తమకు అత్యంత ఆప్తులైన ప్రతినిధులను , అనగా , దివాను వంటి ప్రతినిధులను పంపుట అనేది, శృంగేరీ మఠములో శత శతమానములనుండీ వస్తున్న 

ఆచారము. మరియూ , అమ్మవారి అనుజ్ఞ చేత గురువులు ఎవరిని ఉత్తరాధికారులుగా ఎంచి ప్రకటిస్తారో వారిని కూడా అత్యంత సంతోషముతో స్వీకరించి, 

జగద్గురువుల వలెనే గౌరవించే ఒక సంప్రదాయము ఆనాటినుండే వస్తున్నది. ఆ సంప్రదాయము వలెనే , ఈనాడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వపు 

ప్రతినిధులుగా జయచంద్రులు , అభయ చంద్రులు వచ్చినారు , అంతే కాక , ఎడ్యూరప్ప , శంకరమూర్తి , అనంత కుమార్ , రామచంద్ర గౌడులు , జీవ రాజు 

వంటి అనేక ప్రముఖులు అత్యంత ప్రేమ , అభిమానము , మమతలతో ఇక్కడికి వచ్చి ఈ వచ్చి ఈ కార్యక్రమములో భాగము వహించినారు. వారందరికీ 

నా పరిపూర్ణమైన ఆశీర్వాదములు.

మన మఠపు శాఖా మఠములు మన రాష్ట్రములోనూ , బయటి రాష్ట్రములలోనూ ఉన్నాయి, వాటిలో శివగంగ మఠము , మరియూ ఎడత్తిరి 

యోగానందేశ్వర మఠముల వారు మాపై అత్యంత శ్రద్ధాభక్తులు కలవారు. ఆ మఠాధిపతులు , పురుషోత్తమ భారతీ స్వాములు , మరియూ శంకర భారతీ 

స్వాములు అత్యంత సంతోషము , శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చినారు, వారిని నేను పరిపూర్ణముగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే , ఆంధ్ర దేశములోని ’ 

ధర్మపురి ’ అను ఊరిలో ఉన్నట్టి ’ సచ్చిదానంద సరస్వతీ స్వాములు’ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చినారు , వారికి కూడా నా ఆశీర్వాదములు. మా 

అధికారులు చెప్పినారు, పత్రికా ప్రతినిధులు మరియూ టీవీ మాధ్యమము వారు ఈ కార్యక్రమములో మాకు అత్యంతముగా సహకరించినారు , 

వారందరికీనూ నా ఆశీర్వాదములు. అందరికన్నా ముఖ్యముగా మా మఠపు శిష్యులు , ఈ దినము ఇంత సంఖ్యలో వస్తారని నేను ఊహించనేలేదు. 

ఎక్కడెక్కడినుండో వచ్చినారు, కేవలము ఈ కార్యక్రమమును చూడవలెనన్న అభిలాషతోనే. ’ నేను ఈ రోజు ఎవరినీ చూచుటకుగానీ మాట్లాడుటకుగానీ 

వీలుకాదని చెప్పినాను , అయితే , ’ తమరు మమ్మల్ని చూచుట , మాట్లాడుట కాకపోయినా , తమరిని చూచుటకు మేము వస్తాము , మమ్ములను 

తమరు చూడవలెనని నిర్భంధము చేయము ’ అంటూ అంతటి ప్రేమాభిమానాలతో మా శిష్యులు వేల వేల సంఖ్యలో వచ్చినారు. వారందరికీ కూడా నా 

పరిపూర్ణ ఆశీర్వాదములు. ఇక ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పవలసినది యేమీ లేదు , 

మా ఉత్తరాధికారి స్వాములకు మేము . ’ విధుశేఖర భారతీ ’ అనే యోగపట్టమును ఇచ్చినాము. అనేకులు అడిగినారట , ’ దీని అర్థమేమి ? ’ అని. మా 

పరమ గురువులు , ’ చంద్రశేఖర భారతీ ’ అను అవిధానముచేత జగత్ప్రసిద్ధి పొందినవారు , వారి నామమును వినని వారెవరూ ఉండరు , వారి 

నామధేయమునే వీరికి పెట్టవలెను అని నాకు అభిప్రాయముండినది. కానీ , అదే పేరునే పెడితే , మాకు అత్యంత గౌరవ పాత్రులైన వారి పేరుతో మా 

శిష్యులను పిలుచుట అన్నది మా మనసుకు సమంజసము అనిపించలేదు. చంద్రశేఖర భారతులు మాకు పరమ గురువులైనప్పుడు , చంద్రశేఖర 

భారతులు మా శిష్యులు అని అంటే అది సమంజసము కాదు, అయితే , ఆ పేరంటే నాకు అత్యంత అభిమానము , కాబట్టి , సంస్కృతములో చంద్రుడికి ’ 

విధు ’ అన్నది పర్యాయ పదము కాబట్టి, || ఇమాంసుశ్చంద్రమాః చంద్రః ఇందుః కుముదవాన్ భవః విధుఃసుధాంసుః శుభ్రాంశుః || అని కోవై. చంద్రునికి ’ 

విధు ’ అనేది పర్యాయ పదము , ఎలాగంటే , రామః అన్నా , సీతాపతి అన్నా , దాశరథి అన్నా రాముని పేరే అన్నట్లు , అలాగే , చంద్రః అనేది, విధుః ’ 

అనేది రెండూ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల , ’ చంద్రశేఖర భారతీ ’ అనుటకు బదులుగా , ’ విధుశేఖర భారతీ ’ అని అంటున్నాను. అంతే తప్ప 

దీనికి ఇంకే విధమైన అర్థమునూ కల్పించవలసిన అవసరము లేదు. ఆ చంద్ర శేఖర భారతులను జ్ఞాపకము చేసుకొని , వారిని మేము మరలా 

చూస్తున్నాము అనే అభిప్రాయముతో , ’ విధుశేఖర భారతీ ’ అనే పేరు వారికి పెట్టినామే తప్ప మరేమీ కాదు. ఈ మా శిష్య స్వాములు , అత్యంత 

యోగ్యులై, శాస్త్రములో విశేషమైన పాండిత్యమున్న వారై, మా మనసును అత్యంత సంతోష పరచినారు. అయిదారు సంవత్సరముల నుండీ వారు 

మాదగ్గర శాస్త్రాధ్యయనము చేస్తున్ననూ కూడా వేరే యే ఇతర విషయములకూ వెళ్ళక , వేరే యే వ్యవహారములకూ తలదూర్చక , ఎవరితోనూ 

సంబంధములు పెట్టుకోక , తామేదో , తమ పాఠమేదో అంతే తప్ప ఇంకే విధమయిన వాటితోనూ సంబంధము లేక , వేరే దేనియందూ ఆశ అన్నదే 

లేకుండా ఉన్న ఈ అన్ని విధముల యోగ్యతలను చూచియే అమ్మవారు అనుజ్ఞ నిచ్చినందున వీరికి పట్టాభిషేకము చేయుట జరిగినది.