Saturday, 9 July 2016

వేదము-భూగోళము- భాగవత పురాణము-హిరణ్యాక్షుడు

వేదము-భూగోళము-భాగవత పురాణము-హిరణ్యాక్షుడు

https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post.html

Date (article Revised): 11\౦7\2021: This is an article published by me on 9th July 2016 answering the queries raised by, now, late Pratap Nyshadam whose elder brother  Late NSLN Prasad who was my good friend  and Mr. Pavan Rohit

 Prathap Nyshadam

 Sir in Rig-Veda earth is round it is said O.k whether Rig-Veda is Earlier to Bhagavatam or Bhagavatam earlier to Rig-Veda. When earth is so well known why Vyasa wrote that Hiranyaksha through the earth into the ocean. And Lord Vishnu in Varaha avatar brought out & saved the earth. Then earth and water are together is earth now is it not so then. We say "chatusagara paryantam" on four sides we have sea . If you know try to clarify. It is not a contradiction but to know the fact if you know give the details. You collection is good

 Si Pavan Rohith Rigvedam is most early of all vedas. vedas are most powerfull thoughts of human given(prochoditam) by the god in the early stage of this earth to rishis and rishikas....but bhagavatam is just a kalpanika of some poets so those r not real.....so we have to read those books and wrote if any good message exists and leave the unnecessary matter those which make our minds confusion....

 

చి. ప్రతాప్ నీ చాయా చిత్రము చూసినపుడల్లా మీ అన్న, సహృదయుడు, నా మితృడు ప్రసాద్ గుర్తుకొస్తాడు. చాలా సంతోషం నిన్ను ఈవిధముగానైనా కలిసినందుకు. నీవు సంసారముతోగూడా మద్రాసులో ఉన్నట్లు తెలియవస్తూవుంది. నేను కూడా అక్కడ ఒక 15 సంవత్సరములు ఉండినాను. 

మీ శ్రీమతికి సంతానానికి నా ఆశీస్సులు.

ఇక నీ ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నములో నామాటలను గ్రంధముఖి లేక ఆస్య గ్రంధిలో ప్రకటించినాను. తప్పక చదివి నీ అభిప్రాయను అందులోనే తెలిపేది.

‘అనంతోవై వేదాః’ అన్నది ఆర్యోక్తి. ‘వేదం అపౌరుషేయం’ అన్నది కూడా ఆర్యోక్తి. వేదము పరమాత్మ నిశ్వాసము అని చెప్పబడుతుంది. అందువల్ల వేదములు అనాది. వాని పునాది మనకు తెలియనిది. వేదమన్నది గ్రంధము లేక గ్రంధముల సంకలనముకాదు. ఇవి ఎల్లపుడు అంతరిక్షములో ఉంటాయి. (Either- Contains Sound, as our modern scientists say which was told and demonstrated by our sages and seers since time unknown). ఎవరైతే వేనిని దర్శించినారో వేదములో అవి వారిచేత దర్శించినవిగా చెప్పబడినది. ఈ వేదములు మౌఖికములు. అవి ఉదాత్త,అనుదాత్త,స్వరిత గతిలో వేదఙ్ఞులచే ఉచ్చరించ బడుతాయి. అందుకే నాటి కాలమున లిపికి ప్రాదాన్యతనివ్వలేదు. అంతే కానీ ఆ మహనీయులకు ఒక లిపిని సృష్టించగల శక్తి లేక కాదు.
భాగవతమును గూర్చి : భాగవతము పురాణము 
మనకున్న ముఖ్యమైన మహా పురాణాలు 18. అవి ఏమిటంటే:

భద్వయం మద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయం |
అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ ||

రెండు (2) పురాణాలు ‘బ’ అనే అక్షరంతో మొదలవుతాయి. అవి భాగవతము మరియు భవిష్య పురాణములు.

రెండు (2) పురాణాలు ‘మ’ అనే అక్షరంతో మొదలవుతాయి: అవి మత్స్య మరియు మార్కండేయ పురాణములు.

మూడు (3) పురాణాలు ‘బ్ర’ అనే అక్షరంతో మొదలవుతాయి. అవి బ్రహ్మ, బ్రహ్మవైవర్త మరియు బ్రహ్మాండ పురాణములు.

నాలుగు (4) ‘వ’ అనే అక్షరంతో మొదలవుతాయి. అవి విష్ణు, వరాహ, వామన, మరియు వాయు పురాణాలు.

ఏడు (7) పురాణములు ఒక్కొక్కటి (7) అవి అ, నా, ప, లిం, గ, కూ మరియు స్కా అనే అక్షరములతో మొదలవుతాయి. అవి: అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ మరియు స్కాంద పురాణములు.

ఇవి మొత్తము 18 పురాణాలు. ఇవిఅన్నియు మహర్షి వేదవ్యాస కృతమే.

ఏ మహా పురాణమైన ఈ క్రింది లక్షణములు కలిగి ఉంటాయి:

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ l
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం ll

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
వంశాలచరిత్ర – సూర్య చంద్ర వంశానుక్రమణిక మరియు ఆయా వంశజుల గోప్పదనమును, స్థూలముగాతెలియజేయుట.

భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి

సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), విసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కధనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పది పురాణ లక్షణాలు.

భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది. ఇందులో వివిధ విధములగు విష్ణుభక్తి బ్తత్పరులను గూర్చి తెలుసుకొంటాము. వీనికి ఒక వరుసక్రమము లేదు. ఏది ఎప్పుడు జరిగినది అన్న విషయమును ఇదమిద్ధముగా చెప్పలేము. ఎకల్పములో, ఏ మన్వంతరములో, ఏ మహా యుగములో, ఏ యుగములో, గ్రహస్థితిని అనుసరించి ప్రభవాది 60 సంవత్సరములలోని  ఏ సంవత్సరములో ఏ మాసములో ,ఏ పక్షములో, ఏ తిధి, ఏ వారము, ఏ నక్షత్రము అన్నది చెప్పలేము. ఆగణన ఇతిహాసములకు చెల్లుతుంది.

పురాణమంటే:

"పురాపి నవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావం. ఇవి అన్నీ జరిగినవే కానీ నేటి సాంఘీక నైసర్గిక పరిస్థితులతో పోల్చి కొన్ని నమ్మలేక పోవలసిరావచ్చు. అట్లని అవి జరుగలేదు అనుట పొరబాటు. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడినాయి. 

పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రపంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానం వరకూ ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి.

జిజ్ఞాసువులు ఓపికతో చదువుతారు అన్న ఉద్దేశ్యముతో మన భారతీయ కాలగణనను గూర్చి కూడా ఈ దిగువన తెలియబరచినాను.

ఈ  60 సంవత్సరముళ కాలచాక్రమేమిటి, అన్న  విషయనికి వస్తాము; భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట. 

ఇక కాలగణన విషయానికొస్తే, సూర్య సిద్ధాంతము ప్రకారము

తృటి – వాడి సూది మొన తామరాకును తాకేకాలం (1/33750 Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ సాధారణ కాలగణన చేయవచ్చును.

జీవి ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు కాలము ప్రాణము.

ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము

6 ప్రాణములు = 1 వినాడి (విఘడియ)

60 వినాడు లు = 1 నాడి (ఘడియ)

60 నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)

360 రోజులు (24 హోరలు) = 1 సౌర వర్షము

(దేవతలకు) 1 దివ్య వర్షము = 360 సౌర వర్షములు

కృతయుగము = 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)

త్రేతాయుగము = 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)

ద్వాపరయుగము = 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)

కలియుగము = 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)

మహాయుగము = 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)

ఒక మన్వంతరము = 71 మహాయుగములు

ఈ మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము

కల్పము = 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6 (మహాయుగములు)=994+6=1000మహాయుగములు

15 సంధులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే 
 పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి. వెరసి 15 మన్వంతరములు.

1 సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ. = 6 మహాయుగములు

2 కల్పములు: బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు

ఇట్టి 360 రోజులు ఒక బ్రహ్మవర్షము.

బ్రహ్మ ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు

ఇది సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని గర్విద్దాం.

 కావున వేదమునకు పూర్వము ఏమీ లేదు. సృష్టి వేదోద్భవము తరువాతనే జరిగింది. కావున పైన తెలియ బరచిన పురాణములు అందులోని కథలు ఎప్పుడు జరిగినవి అని ఇదమిద్ధముగా చెప్పలేముకానీ జరిగినవి అన్నది వాస్తవము అని మనము గుర్తుంచుకోవలెను.

భూమి గుండ్రముగా అనగా గోళాకారములో ఉన్నది అన్నది ఎన్నెన్నో విధములుగా మన పూర్వులు తెలిపినారు. ఒకపరి తిలకించండి.

భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది  16,17 శతాబ్దాలకు చెందిన 

కెప్లర్,కోపర్నికస్,గెలీలియోలని మనకు పాఠ్య పుస్తకములలో బోధించినారు, కానీ  

అంతు తెలియని కాలముననే ఋగ్వేదము ఈ విధముగా చెప్పినది..

.“చక్రాణాసః పరీణహం పృథివ్యా....అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు అని 

.ఒకనిడువైన సరలరేఖగీచి ఆ సరళరేఖ మధ్య బిందువును కేంద్రముగా తీసుకొని అతి 

పెద్దవృత్తమును గీచి కొంచెము కొంచెముగా

వ్యాసార్ధ మును తగ్గించుకొంటూ పైకి క్రిందికీ మధ్యలో ఖాళీ లేకుండా వృత్తములను 

గీచితే అదే భూగోళము.

అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో

"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"

"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది" అని దాని అర్థం.

ఆర్యభట్టు రచించిన "ఆర్యభటీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం " 

భూగోళః సర్వతో వృత్తః" అంటే " భూమి, ఒకే సరళ రేఖ పై ఉన్న బిందువులు 

కేంద్రములుగా కలిగి, మధ్య వృత్తము నుండి అటు పైకి ఇటు క్రిందికి రాను రానూ 

తగ్గుతూ వచ్చే వ్యాసార్ధములతో నిర్మింపబడిన అనంత వృత్తముల సమూహము. 

క్రీ.శ.505 లో వరాహమిహిరుడు " పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ 

గోళః..(13-1)"

అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా 

రెండు అత్యంత శక్తి వంతమైన అయస్కాంత శిలల మధ్య, ఖగోళంలో తారలతో 

నిలిచిఉంది"అన్నాడు.

'లీలావతి' గ్రంథం లో భాస్కరాచార్యుడు-2 ఈ విధముగా చెబుతాడు " నీవు 

చూసేదంతా నిజము కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."

ఇంతగా చెప్పిన ఈ విషయములన్నీ 16, 17 శతాబ్దములకు ఎంతో ముందు చెప్పినవే! 

ఇక హిరణ్యాక్షుని గూర్చి:

హిరణ్యకశిప, హిరణ్యాక్షులు అన్నదమ్ములు అన్న విషయము మనకు తెలిసినదే. మనము పురాణములలో చూసే పేర్లు సాంకేతికమైనవి. ఉదా. హిరక్న్య కశిపుడు అంటే బంగారు మంచము పై హంసతూలికా తల్పమును ఏర్పరచుకొని పడుకునేవాడు. అంటే తనకొరకు లోకాలనే జయించిన తమ్ముడు హిరణ్యాక్షుడు సమర్థ వంతులైన మంత్రి సామంతాది పరివారము, శుక్రాచార్యుల వంటి గురువు వుంటే బంగారు తల్పము కలిగి యుండుటలో ఆశ్చర్యమేమి.

ఇక హిరణ్యాక్షుడు అంటే బంగారపు ఇరుసు(అక్షము=కన్ను, ఇరుసు) అనిగానీ లేక హిరణము అంటే లేడి అనేఅర్థము కూడా వుంది. పరుగులో లేడికి సాటి లేదు. అందుకే లేడికి లేచిందే పరుగు అన్న సామెత కూడా ఉన్నది. సంస్కృతములో ఒకే పదానికి ఒకటికి మించిన అర్థములు ఎక్కువ. మనము సందర్భోచితముగా కావలసిన అర్థమును గ్రహించవలసియుంటుంది. ఒకలోకము నుండి ఇంకొక లోకమునకు పోవుటకు దూరమును బట్టి విమానములు, అగ్నిరథములు వాడేవారు.  క్షిపణులని, ఉపగ్రహాలని, అంతరిక్ష నౌకలని నేడు మనము పిలిచే satellites ను నాడు   అగ్ని రథములని అనేవారు. అందులో లోకాలపై దండయాత్రకు వెడలేవారు. లోకాలన్నే జయించిన తరువాత, రాక్షస బుద్ధి కదా, ధృవ నక్షత్రమును చూసే ఉత్తర ధృవ దిశను కాస్త కదిలించి, భూభ్రమణమును వేగవంతము చేయవలెననుకొన్నాడో ఏమో  తన అగ్ని రథములో అంతరిక్షము చేరినాడు. ఆతడు విధాత వరబల సంపన్నుడు. అందుకే భూగోళపు ఇరుసును కదిలించినాడు. ఇపుడు మనము గుర్తుంచుకోవలసినది ఏమిటంటే భాగవతము వ్రాసిన వ్యాసులవారు సామాన్యునికి కూడా  అర్థమయ్యే రీతిలో పురాణములు వ్రాసినారు. అందువల్ల శాస్త్ర సంబంధమైన విమర్శన చేయకుండా లోకిక పరమైన అవగాహన మనకు కలిగించుటకు చాపచుట్ట అని వ్రాసినారు. అంతరిక్షములో ఎప్పుడైతే భూగ్రహాన్ని కదిపినాడో చుట్టూ జలమయమైన భూమి సముద్రములచే కల్లోలితమైనది. ఎగసి పడే అలలను గమనించితే చాపను చుట్టే రీతి మనకు ద్యోతకమౌతుంది. అందుచే ఆ విధముగా వ్రాయబడినది. అటువంటి కదలిక ఎక్కడలేని రేడియో ధార్మిక శక్తిని వేలువరించుతుంది. పంది, బొద్దెంక (పరిడె) రేడియో ధార్మిక శక్తికి  చలించనివి. అందువల్ల విష్ణుమూర్తి వరాహావతారమును ఎత్త వలసి వచ్చింది. ఆయన స్వరూపము కోరలు మన ఊహకు అందనంత గొప్పవి బలమైనవి. ఆ భూగోళమును ఎత్తినపుడు ఒకకోర పై భూమి బరువు ఎక్కువగా మోయవలసి వచ్చుటచే భూమినుండి ఒక  శకలము వీడి అంతరిక్షములో భ్రమించనారంభించియుండవచ్చును. అదే మన అంగారక గ్రహము(Mars). 

స్వస్తి.

 

 

Monday, 4 July 2016

రామాయణం ఒక భూగోళ శాస్త్రము


Kiran Mva  4th Aug 2015
రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.
తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, - బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
ఋషభము అని పర్వతము
మధుర జలధి (జపనీస్ సి )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.
దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
అది దాటాక భూమి సరిహద్దు
పశ్చిమ దిక్కుకు సుషేణుడు
వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు
ఉత్తర దిక్కుకు శతవాలి
ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.
ఎవరన్నారండి మన వాజ్మయం పుక్కిట పురాణాలు అని, వాటిలో నిజాలు లేవని?
https://www.google.co.in/maps/@25.4796902,77.987956,3z
మరి కొన్ని వివరాలు ఇంకొక టపాలో
ఇంకొన్నివివరాలు https://ramanan50.wordpress.com/…/rama-empire-reply-to-cri…/
స్వస్తి!!
సర్వం శ్రీ వేంకటేశ్వర అర్పణమస్తు

యవనుల గ్రహ పద్దతి

మనమూ, మఱియు గ్రీకు వారు ఒకే విధమైన వారాలను పాటిస్తాము. దానికి కారణం మన ఈ గ్రహ పద్దతి యవనుల 

(గ్రీకులు) నుండి ప్రారంభమైందన్న ఒక వాదన. నేను చదివినదాని ప్రకారము. యవనాచార్యులు అనే ఋషి వ్రాసిన 

ఒక జ్యోతిష్యగ్రంథము ఆధారముగా ఈ వాదన ప్రారంభమైనది. ఆ యవనాచార్యులు ఎవరు అనేది ఇదమిత్థంగా 

ఎవరూ నిర్ణయింపలేకపోయినారు. కానీ అన్నిటికన్నా ముందునుండి ప్రాచుర్యంలో ఉన్నది, ఇప్పటికీ జ్యోతిషీ 

వేత్తలందరూ ప్రామాణికముగా పాటించేది బృహత్పరాశర హోరా శాస్త్రము. పరాశరుడు వేదవ్యాసుని తండ్రి. 

వేదవిజ్ఞానము యవనులు, మ్లేచ్చులు, బార్బరికులు, కుషనులు, చీనులు తదితర జాతులు పుట్టకముందే 

ఉద్భవించింది. దానిని అప్పటికే వ్యాసుడు విభజించినాడు. (ఆ కాలంలో ఆంధ్రులను కూడా నాగరికత లేని వారు 

అని పిలిచే వారంట - ఆంధ్రభాగవతములో పోతనామాత్యులు దీనిని రాయలేదు కానీ, సంస్కృత భాగవతములో 

వ్యాసుడు రాసినాడు). ఆంధ్రులు నాగరికులు అని తెలిపిన మొట్టమొదటి ఋజువు సుమారు 1500 ఏళ్ళ కిందటిది. 

దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది, యవనులు (గ్రీకులు) మన సంప్రదాయాలను అనుసరించినారో లేక మనము 

వారి సంప్రదాయాలను   అనుసరించినామో. దీనికంతా కారణము, మనపై రుద్దబడిన ఆంగ్లవిద్యా మహిమ. వారు 

గ్రీకు సంప్రదాయానుయాయులు కనుక ఈ విధమైన ప్రచారము జరిగి ఉండవచ్చు. దీనినే మనము ఇంకా 

పఠిస్తూ, పాటిస్తూ ఉండడం మన జాతి దౌర్భాగ్యం.

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 7

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 7

గగన యానము
నిప్పు లేనిదే పొగరాదు కానీ పొగలేకున్నా నిప్పు వుండవచ్చు.ఈ దృష్టాంతము ఎందుకు చెబుతున్నానంటే హిమాలయము అన్న ఒక పేరును తీసుకొందాము. ఆ పేరు వింటూనే ఇంకా ఆ పర్వతమాలను చూడని శిశువు మనసులో పెద్ద పెద్ద మంచురాళ్ళు కలిగిన అపరిమితమైన ఎత్తుగల ఒక పర్వతమును వూహించుకొంటాడు . ఇక్కడ హిమాలయము వాస్తవము కానీ ఆ శిశువు వూహించిన విధముగా మంచురాళ్ళు వుండవు గానీ మంచు తో కప్పబడిన రాళ్ళు వుంటాయి. అది తాను వెళ్ళి చూసినవెంటనే వాస్తవము గ్రహించగలుగుతాడు.కాబట్టి విమానముల గూర్చి విననిదే విపరీతమైన ఊహలతో మన పూర్వులు భాగవత ,భారత, రామాయణాలలో , పురాణాలలో, శాస్త్రాలలో విమానముల గూర్చిన ప్రస్తాపన తెచ్చియుండరు. అందులోకూడా ఎన్నో విధములైన విమానములను గూర్చి విశధ పరచియుండరు. ఇందులోని నిజానిజాలను పరికించి,పరిశీలించి, పరీక్షించి, పరిశోధించితే వాస్తవము మనకు తెలుస్తుంది. భారతములో ధృతరాష్ట్రుని యొక్క సంతాన వ్యామోహాన్నిగూర్చి మనమెంతో ఈసడించుకొంటాము. కానీ మహాభారతములో ధృతరాష్ట్రుడు తనది తప్పని తెలిసినా తన సుతులపై వ్యామోహము చంపుకోలేక పోతున్నానంటాడు. అదేవిధంగా దుర్యోధనుడు తనకు దాయాది మాత్సర్యము తప్పని తెలిసినా తానది మానుకోలేనని చెబుతాడు. ఈ మాట ఎందుకు చెప్పుకువచ్చినానంటే మన పూర్వులు తప్పో ఒప్పో నిజానికే ప్రాధాన్యమునిచ్చేవారు అని తెలియ బరచుటకు. ఇంకొక విషయము గమనించండి.
ప్రసిద్ధ ఆధునిక గణిత శాస్త్రవేత్త తనచే తెలియబరుపబడిన ఎన్నో గణిత సూత్రములు, నామక్క ల్ నరశింహస్వామి దేవేరి నామగిరి తాయరు (లక్ష్మీ దేవి) తనకు నిద్రావస్థలో తెలిపినవే యని స్వయముగా తెలియబరచినారు.ఆ విషయమును వారి మాటలలోనే చదవండి "While asleep, I had an unusual experience. There was a red screen formed by flowing blood, as it were. I was observing it. Suddenly a hand began to write on the screen. I became all attention. That hand wrote a number of elliptic integrals. They stuck to my mind. As soon as I woke up, I committed them to writing."

అనేకల్ అన్న ఊరికి  చెందిన సుబ్బరాయ శాస్త్రి అన్న ఒక మహా పండితుడు  భరద్వాజుని 'విమాన శాస్త్రాన్ని శ్రీ G.వెకటాచల శర్మ అను పండితునిద్వారా, తాను చెబుతూవుంటే, వ్రాయించినాడు కానీ ఆయన చెబుతూ పొయిన ఆ శాస్త్రము ఏకాలమూకు చెందినదన్న ఆధారము లేదని కొందరు పాశ్చాత్య అనుయాయులు పనికట్టుకొని ప్రచారము చేసినారు. రామానుజన్ గారు చెప్పినది నమ్మక తప్పలేదు ఎందుకంటె అవి గణిత పరముగా సాధింపబడినవి(ఇప్పటికీ సాధింపబడనివి కూడా వున్నాయనుకోండి). వైమానిక శాస్త్రములోని ఇబ్బంది ఏమిటంటే ఈ పాశ్చాత్య వ్యామొహకులకు సంస్కృతము క్షుణ్ణముగా తెలియదు.శాస్త్రములలో తెలిపిన సాంకేతిక పదముల తమ అనువాదమును యదార్థమునకు అనుసంధించుకోలెరు.ఈ సందేహాలన్నీ అందుకే!


అసలు విమానముల ప్రస్తాపన వేదములలోనే వస్తుంది.ఈ విషయము పరిశీలించండి.
యజుర్వేదము, 10:19

ఓ నిపుణవంతుడైన అభియంతా (Engineer)!  శ్రేష్ఠులగు నిపుణులు నడపగల నావలను నిర్మించు. మేఘములు దాటి గగన తలము పై విహరించు విమానముల నిర్మించు.అటు నీటిలోనూ ఇటు గాలిలోను పయనించగల సాధనములను నిర్మించు. అవి మెరుపుల నడుమ కూడా పయనించగల శక్తిని ప్రసాదించు.ఏఏ భగవత్సృష్టిలో మమ్ము కీర్తివర్ధనుల గావించు.
వేదములలో
1. విమాన నిర్మాణ యానముల గూర్చిన ప్రస్తాపన వున్నది.
2. ఆధునిక సాంకెతిక విజ్ఞాన సంబంధిత విషయములెన్నో మనకు వానిలో కనిపించుతాయి.
3. భూమ్యాకాశ యుద్ధముల గూర్చిన వివరణ విశ్లేషణలెన్నో వానిలో అగుపించుతాయి.
4. నేడు మన శాస్త్రజ్ఞులు ప్రయత్నించేఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మానసిక మరియు తాపసిక   శక్తుల గూర్చిన వివరణలందులో ఎన్నో వున్నాయి.
5.గ్రహానర వాసులు.
6. గ్రహాంతర యానము.
7. గ్రహాంతర యానమునకు తాపసిక,వైజ్ఞానిక శక్తుల వినియోగము.
వంటి ఎన్నో విషయములు మనకు తెలుస్తాయి.

 వ్యాస భాగవతము 3.23.11 నుండి 3.23.41  ఒకసారి పరికించితే తన అర్ధాంగి కోరిక మేరకు ఆకాశ హర్మ్యమును తన తపో బలముతో నిర్మించి    మేరు పర్వతమునందేకాక, వైశ్రంభక,సురాసన,నందన,పుష్పభద్రక,చైత్రరథ్య,మానస సరోవర ప్రాంతములన్నియును విహరించి ఆమెకు తృప్తిని కలిగించి అత్యుత్తమ సంతతిని పొందుతాడు.ఆమెతో గ్రహాంతర, లోకాంతర యానము గావించినాడు. ఆ విమానము యొక్క గుణములేవి యని పరిశీలించుదాము.
భ్రాజిష్ణున విమానేన
కామజ్ఞేన మహీయస
వైమానికాన్ అత్యాసెత్
చరన్ లోకాన్ యధానిలః
 తాను కోరిన దిక్కునకు తన నియంత్రణలోని విమానమును పలు దిశల వీచు గాలివలె ఎన్నో లోకములు అంటే గ్రహములు, భార్యా సమేతుడై తిరిగినాడు.
ఇటువంటి విషయాన్నే త్రిపురాసురుల యందు కూడా గమనించుతాము. ఇక రామాయణమునందలి పుష్పక విమానమును గూర్చి మనకు తెలిసినదే. లంకకు సీతాన్వేషణమునకు వెడలిన  హనుమంతుడు నవరత్న ఖచితమయమైన, ఇది భవనమా అన్నట్లున్న,  పుష్పకమును చూసినట్లు వివరింపబడినది.
వైమానిక శాస్త్రములోని మొదటి ప్రకరణములో తన రచనకు ముందు వున్న, తాను పరిశీలించిన గ్రంధముల పాట్టిక ఇచ్చినారు. అందులోని ముఖ్యమైన కొన్ని ఈ క్రింద ఉటంకించడమైనది.  1. అగస్త్య కృతాశక్తి సూత్రములూ ఈశ్వర(ఎవరన్నది నాకు తెలియదు)'సౌదామిని కలా,భరద్వాజుడే రచించిన అంశుబోధిని,శాక్తాయన్ కృతమగు 'వాయుతత్వ ప్రకరణమూ,నారదకృతమైన వైస్వానర తంత్రము మొదలైనవి.విమాన శాస్త్రమునకు తీక టిప్పణి వ్రాసిన బొధానంద్ గారు ఈ విధముగా తెలిపినారు: 
నిర్మాత్య తద్వేదాంబుధిం భరద్వాజో మహామునిః| 
నవనీతం సముధ్గృత్య యంత్ర సర్వస్వ రూపకం|| 
నానా విమాన వైచిత్ర్య రచనాక్రమ బోధకం|| 
అష్టాధ్యాయౌర్విభజితం శతాధికరణౌర్యుతం|| 
సూత్రిః పంచశతైర్యుక్తం వ్యోమయాన ప్రధానకం
వైమానికాధికరణాత్సర్వం ముక్తంభగవతాత్స్వయం 
'వేద సముద్ర మంథనము చేసి సామాన్య మానవునికి సులభముగా ఉపయుక్తమౌ రీతిన, యంత్రసర్వస్వమన్న వెన్నను అందునుండితీసి అందించినారౌ భరద్వాజులవారు. ఆ గ్రంథమునదలి 40 అధికరణమందున విమాన సంబంధిత విషయ ప్రస్తాపన జరిగినది. ఇది 8 అధ్యాయములుగా విభజింపబడినది.అందులో 100 అధికరణములు,500 శ్లోకములు విమానవిషయ ప్రధానమైనవే!
భారతీయ వైమానుక శాస్త్రమును గూర్చి ప్రాక్పశ్చిమ శాస్త్రజ్ఞులేమన్నారో చూడండి.

Johannes Adrianus Bernardus van Buitenen (21 May 1928 – 21 September 1979) was anIndologist at the University of Chicago where he was the  Professor of Sanskrit in the Department of South Asian Languages and Civilizations. తన mahaa bhaarata Volume--3 లో The Razing of Soubha మరియు  The War of The Yakshas ఈ క్రింది విధముగా రచయిత చేతనే వివరించ బడినది : "The areal city is nothing but an armed camp of flame throwers and thundering canon, no doubt a space ship అందులొనే నివత కవచములు అన్నపదమునకు space suits తప్ప అన్యము కాదని ఆయనే చెప్పినారు. 

It is in the study of creativity that Indian science continues to be relevant .If students had access to authoritative narratives  of Indian Science in the University, they would not pay attention to outlandish claims of ancient flying machines. 

         -- Subhash Kak, Regents Professor of Electrical and Computer Engineering                      at Oklahoma State University and a Vedic Scholar

మనస్పూర్తిగా మనపూర్వులను, వారి సత్య నిష్ఠను, వారి శక్తి సామర్థ్యాలను నమ్ముతున్నాను కాబట్టి నా శక్తికి మించిన ప్రయాసపడి ఈ పూర్వీక వైమానిక జ్ఞానాన్ని గూర్చి మరియు పూర్వుల గొప్పదనమునుగూర్చి నేటి తరానికి తెలియజేయవలెనన్న తపనతో వ్రాస్తున్నాను.సమయము వెచ్చించి చదివేది.విషయము 10 మందికి పంచితే ఏ ఒక్క విశేషజ్ఞుడైనా ఒక అడుగు ముందుకు వేసి పరిశోధించితే మన పూర్వుల జ్ఞాన సంపదనుగూర్చి లొకానికి చాటిన వారవుతారు.
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 8 లో విమాన శాస్త్రాన్ని గూర్చి ఇంకాస్త తెలుసుకొందాము......

భారతీయ శాస్త్ర విజ్ఞానము ...8

భారతీయ శాస్త్ర విజ్ఞానము ...8
వైమానిక శాస్త్రము

బొధానంద వృత్తి,శౌనక సూత్రములు. మణిభద్ర కారిక ఇత్యాది గ్రంథములలో 25 విధాల విమానాలున్నయని తెలిపినారు.ఇవి 'రాజ లోహ'మన్న లోహవిశేషము తో తయారు చేస్తారట.సౌమ సుందల మార్ధిక మన్న లొహములను 3:8:2 నిష్పత్తిలో కలిపి ప్రత్యేకమన శ్రద్ధతో అగ్ని కుండములో (Furnace) 272 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కాచి ఈ లోహమును తయారు చేస్తారట.ఈవిషయాలలో దేశవిదేశాలలో ఎన్నో ప్రయోగములు గుప్తముగా జరుగుచున్నవని తెలియవచ్చుచున్నది.
విమానపీఠమును రాజ లోహముతో తయారుచేయవలెన్నది పై శాస్త్రములందు చెప్పిన మాట. ఈ పీఠము యొక్క బరువు మొత్తము విమానపు బరువులో 1/100 వుండవలెనట. వెడల్పు విమానపు ఎత్తులో సగము వుండవలెని యున్నది. ఈ విమాన స్తంభమును హటకాస్య లోహముతో చేయవలెనని లల్లడు తన యంత్ర కల్పతరువులో వ్రాసినట్లు చెప్పబడివుంది. లోహతంత్రమను గ్రంథములో ఎలోహ మూలకములనేవేవి మిశ్రణము చేయవలెనో ఇందుకు వాడవలసిన ప్రత్యేకమైన కొలిమి (Special Furnace) మరియు ఎంత ఉష్ణోగ్రత అవసరము అన్న విషయమును గూర్చి తెలుపబడినదట. ఇవికాక విమాన నిర్మాణమునకు వలయు విషయములెన్నో వివిధ గ్రంథములలో వివరించబడినది. కాబట్టి విమాన నిర్మాణము మన పూర్వులకు విశధముగా తెలియునని తెలియవచ్చుచున్నది.
ఇక విమానములలోని వివిధ రఖములను పరిశీలించుదాము. విమానాలను పూర్వులు రెండు విధములుగా విభజించినారు.1. మాంతికము :ఇందులో 25 విధములగు విమానములున్నాయి అని సౌనక సూత్రములు చెబుతూవుంటే మణిభద్ర కారికలో 32 అని తెలుప బడింది. ఇక తాంత్రిక విమానములు భైరవాది 57 విధములు గలవని భరద్వాజులవారు చెప్పడము జరిగింది.నేను ఎక్కువ వ్రాసేకొద్దీ చదువరులకు శ్రద్ధ తగ్గుతుందని వ్రాయుట లేదు. ఒక మూడు నాలుగు తాంత్రిక విమానముల గూర్చి అతి క్లుప్తముగా వివరించుతాను.
1. శకునము : ఈ విమానమునకు 28 భాగములు గలవని విమాన శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏవన

 పీఠము(Floor Board) ; బోలు కంభము (Shallo Mast) ;  మూడు చక్రములు కలిగి రంధ్రాలతో కూడుకొన్న  కీలకములు ( hree wheeled keelakas,may be joints, with holes) ; 4 తాపకములు (Heaters) , వాయు చూషక నాళములు (air-suction pipes),   జలావరణము (Water Jacket) , తైల భాండము (Oil Tank), వాయు తాపకము (Air Heater) , దాహకము (chhullee or Heater) , ఆవిరి భట్టీ(Steam Boiler),   విద్యుదుత్పాదక యంత్రము( electric generator) , వాయు ప్రేరక యంత్రము (air propelling machine)  , వాతపా యంత్రము లేదా వాయు చూషక నాళము (Air Succsion Pipe) , దిక్ప్రదర్శక  ధ్వజము  ( direction indicating banner), శకున  యంత్రము (Sakuna Yantra, May be the maine engine) , రెండు రెక్కలు( two wings ) , విమానము ఎగురుటకు వలయు తోక భాగము( tail portion for helping vimaana to rise), ఔష్మ్యక యంత్రము ( Thermodynamic mechanism )  సూర్య కిరణాకర్షణ యంత్రము ( sun-ray attracting bead) వ్ ఈ 28 శకున విమానము యొక్క భాగములు.
2. సుందర విమానము : ఇది 8 భాగములను కలిగియుంటుంది. అవి

పీఠము (ground plate), ధూమ్ర నాళము లేక ధూమోద్గత యంత్రము (smoke chimney),5 వాయు యంత్రములు( 5 gas-engines),  భుజ్య లోహ (ప్రత్యేక పద్ధతిలో వివిధ మూల లోహ మిశ్రణముతో తయారు చేయబడుతుంది)నాళము (bhujya metal pipe), వాయు ఉత్పాదకము లేక కొలిమితిత్తి (wind blower), విద్యుతుద్పాదక యంత్రము (Electricity Generator) చతుర్ముఖ తాపోత్పాదన యంత్రము (four-faced heater)  మరియు విమాన నిర్ణయము (outer cover). వీని పొడవెడల్పులనే కాక  ఎత్తూ ఎంత వుండవలసినది తెలుపుతూ ఏదేది ఎక్క్డెక్కడ ఏవిధముగా వుంచవలెనన్నది కూడా ముందుతెలిపిన గ్రంథములలో వివరించినారు.
3. రుక్మ విమానము

పీఠ రుక్మ విమానస్య కూర్మాకారం ప్రకల్పయేత్
వితస్తిహసాయామం గాత్రమె కవితస్తికం
రుక్మము అనగా బంగారు. బంగారు ప్ధానముగ ఇంకా మరికొన్ని లోహ మిశ్రణములతో ఒక లోహమును తయారుచేసి దానిని రుక్మము యొక్క తయారీకి వుపయోగించుతారు. ఈ లోహమును రాజ లోహమన్నారు. రుక్మము అంతరీక్ష నౌక.ఇది స్తూపాకారము కలిగియుంటూ అండమును బోలియుంటుంది. మానవ చోదితము. తారాజువ్వ వలె ఆకాశమునకెగుస్థుంది. రష్యనులు మనిషి లేకుండా మన శాస్త్ర గ్రంథ సహాయముతో తయారు చేసి విజయము సాధించినారట.అతిపెద్ద అంతరీక్ష నౌకగా దీనిని తయారుచేస్తే ప్రయాణీకులను గ్రహాంతరసీమలకు తీసుకుపోగలుగుతుంది.మనుష్య రహితముగా చిన్నదిగా తయారుచేస్తే అస్త్ర వాహకముగా వుపయోగ పడుతుంది.  ఆర్థిక సహాయము ప్రభుత్వ ప్రోత్సాహము లేక మన దేశమున మన  పూర్వుల విజ్ఞానము అడవిగాచిన  వెన్నెలయిపోయినది.

 త్రిపుర విమానము
మస్త్య పురాణము లో త్రిపుర విమానమును గూర్చి కూడా వర్ణించినారు. అంటే త్రిపురాసురులు ఆకాశములో హర్మ్యములు నిర్మించినారు శివుదు వారి పురములను యుద్ధములో కూల్చినాడు అని చదివియుంటాము. ఈశ్వరుడు ప్రయోగించిన అస్త్రములను నేడు మనము missiles అన్న పేరుతో పిలుస్తాము.  ఇది ఒక అతిపెద్ద అంతరిక్ష నౌక. గగనములో చలనము లేకుండా నిలబదగలదు.ఏదిశలో పయనించవలెనంటే ఆ దిశలో ప్రయాణము చేయగలదు.
సౌభకము:

ఈ సౌభక విమానము యొక్క ప్రస్తాపన సంస్కృత వ్యాస భారతములొవస్తుంది. భక్తి వేదాంత ప్రభురిల స్వామి వారు భాగవత పురాణమును ఉటంకించుతూ సౌభకమును గూర్చి ఈ విధముగా చెప్పినారు .
" సాళ్వుని యొక్క సౌభక విమానము , తపస్సు చే శంకరుని మెప్పించి, మయుని చే తయారు చేయబడి సాళ్వునిచే పొందబడినది.  ఇది కొన్నిసార్లు అనేక విమానాలు గానూ కొన్ని సమయములసలేమీ లేనత్లుగానూ  ఆకాశంలో కనిపిస్తుంది. కాబట్టి ఇది అత్యంత అసాధారణ మైనది.  కొన్నిసార్లుభూమిపై, కొన్నిసార్లు నీటి మీద తేలుతూ కొన్నిసార్లు ఆకాశంలోఎగురుతూ,కొన్నిసార్లు ఒక కొండ శిఖరం మీద విడిది చేసినట్లు యాదవులు చూసి భయభ్రాంతులైనారట. అద్భుతమైన ఈ విమానం ఆకాశము నుండి ఉల్కా పాతములను సృష్టించగలదట. అత్యంత చంచలమైన ఈ విమానము యాదవులలో అలజడి సృష్టించినదట." ( భక్తివేదాంత , 1986)

పుష్పక విమానము:
దీనిని గూర్చి మనము రామాయణములో వింటాము. ఇది సుదూర ప్రయాణములు చేయగలిగినది. పుష్పకము అంటే పూలవలె బహు తేలికైనది అని అర్థము.అంటే దీనిని బహు తేలికైన లోహమును, వివిధ నిష్పత్తులలో మూల లోహముల కలిపి,తో తయారు చేసినారెమో! బహుశ దీనికి విస్తరించే స్వభావము వుడేదేమో!అంటే ఇది స్థితిస్థాపకత (Elasticity) కలిగియుంతుందన్నమ్మాట. అందుకే ఈ విమానమునెందరు అదిరోహించినా ఇంకా ఒక్కరికి స్థలము వుంటుందని రామాయణమున చెప్పబడినది.

నాకు తెలిసిన, తెలుసుకొన్న మేరకు తెలియబరచినాను. మన పూర్వుల గొప్పదనము గుర్తించండి. మీరు తెలుసుకొంటే మీ పిల్లలకు చెప్పగలరు. వారిలోనుండి ఏ శాస్త్రజ్ఞుడో బయల్వెడల వచ్చు.దీనిని వ్రాయుటకు నాకు దాదాపు 10 రోజులు పట్టింది. పది నిముసములు వెచ్చించి మన పూర్వ చరిత్రను తెలుసుకొండి. మన అపూర్వ సంపదను గుర్తించండి.
ముక్తాయింపుగా ఎ  వాక్యములను చదవండి. ప్రతి దేవాలయములోనూ దేవతా విగ్రహము వుంటుబ్ది. ఆప్రదేశమును గర్భగుడి అంటారు. ఆ గభ గుడి గోపురమును విమాన గోపురము అంటారు. మీరు గమనించితే తిరుమల విమానగోపురముపఈ ఎందరో దేవతల విగ్రహములను చూడవచ్చు. ముఖ్యముగా విమాన వెంకటేశ్వర స్వామిని గుర్తించుటకు వీలుగా బాణపు గుర్తును గూడా వేసియుంటారు. పైన తెలియ బరచిన విమానములలో ముఖ్యముగా 'రుక్మమూ ఈ గోపురాకృతిలోనె వుంటుంది. దీనివల్ల మనకు దేవతా విమానములుండేవని మనకు ఒక ఊహ కలుగుట లేదా!
లేవండి- మేలుకోండి- అపూర్వ ఘంతగల మన పూర్వులను గుర్తించి దేశానికి పునర్వైభవము గొనిరండి.

కొన్నిరోజుల తరువాత మనపూర్వుల యొక్క వేరొక ఆవిష్కరణను గూర్చి తెలుసుకొందాము.

కాళిదాస మహాకవి - (అనామిక సార్తవతీ బభూవ)

 

కాళిదాస మహాకవి

https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_53.html

దండి భవభూతి కాళీదాసులు భోజరాజు ఆస్తానములోని మూడు పండిత మేరువులంటారు. ఒకసారి వారి మధ్య ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తింది. వారిలో ఎవరు గొప్ప అన్నది నిర్ణయించటము సామాన్య మైన పండితునికే కాదుకదా అసామాన్యు పండితునకైనా సాధ్యము కాని విషయము. ఇప్పుడు ఆ స్పర్ధ వారిమధ్యనే కలిగినది. తీర్చగలిగినది కాళికామాత మాత్రమే అని వారు అర్థము చేసుకొన్నారు.. ఉండేదిధారా నగరమైనా ఉజ్జయిని అక్కడికి దాదాపు 60 మైళ్ళే. వెంటనే ప్రయాణమై ముగ్గురూ ఉజ్జయిని చేరి కాళికాలయానికి వెళ్లి అమ్మవారిని 'ఎవరు గొప్ప' అని అడిగినారట. అమ్మ ఈ విధంగా జవాబు చెప్పింది:

కవిర్దండి కవిర్దండి భవభూతిస్తు పండితః'కోహంరండే' '

'త్వమేవాహం 'త్వమేవాహం'త్వమేవాహం' నసంశయః

కవులలో ఉత్తముడు దండి పండితులలో భవభూతి అని చెప్పిందట అమ్మ. కాళీ వర ప్రసాదుడైన కాళిదాసుకు హడ్డులేని ఆగ్రహమొచ్చి మరినేనెవరు 'రండా' అన్నాడట. అమ్మ 'త్వమేవాహం' అని అన్నదట. అంటే 'నీవే నేను ' 'నీవే నేను' ' 'నీవే నేను' అని అనీంటూ ఇందులో సంశయమే పెట్టుకోనవసరము లేదని అన్నడట. అంతటి గొప్పవాడు ఆ మహనీయుడు. ఆయనను కొందరు మొన్నటి షేక్సుపియరుతో పోలుస్తారు. ఇది చాలా బాధాకరము. కాళిదాసు వంటి మహాకవి అప్పటి కవులలోనే కాదు, ఆతరువాత కూడా పుట్టలేదని చెపుతారు.దానికి ఒక చమత్కారమైన శ్లోకం ఉంది.

ఆ శ్లోకము ఇది--

‘పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠి కాధిష్ఠిత కాళిదాసః

అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ.’

అర్ధము-

పురా=పూర్వము

కవీనాం-గణనా-ప్రసంగే= మహా కవులను లెక్కించుటకు (మొదట)

కనిష్ఠిక+అధిష్ఠిత=చిటికెన వ్రేలు తెరచి

కాళిదాసః= కాళిదాసుని లెక్క పెట్టారుట

అద్యాపి=అప్పటినుండి,

తత్తుల్య=ఆయన తో సమానమైన

కవే:+అభావాత్=కవులెవరూ లేకపోవడం చేత

అనామికా= చిటికెన వ్రేలు పక్కన ఉన్న ఉంగరపు వ్రేలును సంస్కృతం లో ‘అనామిక’ మంటారు. ‘అనామిక’ అనే పదానికి ‘పేరు లేనిది’ అనే మరొక అర్ధం కూడా ఉంది.

సార్ధవతీ-బభూవ = ఉంగరపు వేలుకి 'పేరులేనిది ’ అనే పేరు సార్ధకమై పోయిందట.

డినాం పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాఃll

ఈ శ్లోకముతో ఈ వ్యాసమును ముగిస్తాను.

ఉపమా కాళిదాసస్య బారవే రర్థ గౌరవం l

దండినాం పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాఃll

మాఘకవి ‘శిశుపాలవధం’ మాత్రమె వ్రాసినా అది సంస్కృత భాషామతల్లికి అలంకార ప్రాయము. విమర్శనాగ్రేసర చక్రవర్తియగు మల్లినాతసూరి గారు ఈ విధముగా అన్నారు,

‘మాఘే మేఘే గతః వయః’ - మాఘానికీ (అనగా, శిశుపాల వధకీ) మేఘసందేశానికీ(కాళిదాస కృతి) వ్యాఖ్యానం చేసేసరికి బడలిపోయాను. అంటే కాళీదాసు మాఘుని యంత ల్కేక మాఘుడు కాళీదాసంత గొప్పవాడు అని అన్వయము.

ఇక్కడ తెలిపిన కాళిదాసు విక్రమార్కుని నవరత్నములలో ఒకడు. బహుశ కాళీదాసు పేరే అంత గోప్పదేమో!

స్వస్తి.

 

 

 

 అనే పేరు సార్ధకమై పోయిందట.