కొనకుండా నవ్వుకొనండి
https://cherukuramamohan.blogspot.com/2024/09/blog-post.html
మంచి నిద్రలో మంచి కల వచ్చింది.కలలో ఒకే వ్యక్తీ మూడు వేరు వేరు దశలలో కలలోకి
వచ్చినాడు.నామనోఫలకము పై తాజ్మహల్ నిలిచి వుంది. మొదట వచ్చినపుడు దానిని చూసి చూసి
అతను దాని గోడపై ఈ విధముగా వ్రాసినాడు.
ఎచటెచటో వెదకినా
వెదకి వెదకి అలసినా
నా ముంతాజ్ కనిపిస్తే
తాజ్ మహల్ కట్టిస్తా
కొన్ని సంవత్సరాలు , కలలో కాబట్టి, కదలిపోయినాయి.అదే వ్యక్తీ
మళ్ళీ అక్కడికే వచ్చి
కాసేపు చూసి మళ్ళీ ఈ విధంగా వ్రాసినాడు.
వెదకి అలసినా, అయినా
ముంతాజ్ అగుపించింది
తాను సరే, అనియంటే
తాజ్ మహల్ కట్టిస్తా
ఈసారి కొంత ఎక్కువకాలమే గడిచింది. అతడు మళ్ళీ అక్కడికి వచ్చినాడు. వెంటనే ఇలా
వ్రాసినాడు.
విధి మేరకు నేనైతిని
ముంతాజుకు నాథునిగా
తాను కన్ను మూస్తే సరి
తాజ్ మహలు కట్టిస్తా
నా కల చెదిరి పోయింది. తరువాత ఏమి జరిగిందీ తెలియదు.
No comments:
Post a Comment