గాలి ఎటువైపుకు వీచితే అటువైపే!”
రేలంగి -రమణారెడ్డి-2
రేలంగి -రమణారెడ్డి-3
రేలంగి-రమణారెడ్డి-8
"ఒరే! రమణా Post Office పోయి ఒక Post Card పట్టుకొని రాపో'
రేలంగి-రమణారెడ్డి-12
(వ్రాసిన ఉదంతము స్వకపోల కల్పితము)
కొనకుండా నవ్వుకొనండి-రేలంగి-రమణారెడ్డి-13
(స్వకపోల కల్పితము)
ఒకసారి మహా మేధావి యగు రమణారెడ్డి అనేకానేక
సార్వజనీన సంస్థలలో (Public Limited Companies)
లో పని చేసిన అనుభవముతో Microsoft Corporation, USA కు ఉద్యోగమ కొరకు తన ప్రవర(Bio Data)తో దరఖాస్తు
పెట్టుకొన్నాడు. కొన్ని రోజులతరువాత అతనికి ఈ విధమైన జవాబు వచ్చింది ఆంగ్లములో:
Dear Mr. Maha Pandit
You do not meet our requirements. Please do not send any further
correspondence. No phone call shall be entertained.
Thanks
Bill Gates.
రమణారెడ్డి ఆనందముతో అరిచి, తెలుగువాడు
కాబట్టి. ప్రెస్ రిపోర్టరు అయిన తన అల్లుదు రేలంగిని పిలిచి అతనికి తెలిసిన తెలుగు
పత్రికా విలేఖరులను అందరినీ పిలిపించమన్నాడు. అందరూ సమావేశమైన తరువాత ఆయన తన అల్లునితో
“నేను ఈ ఉత్తరాములోని ఆంగ్లమును చదువుతాను, నీవు తర్జుమాచేసేది’ అన్నాడు. ‘ఓహ్! అదెంతపని”
అన్నాడు రేలంగి. రెడ్డిగారు ఉపన్యాసాన్ని ఈ విధముగా ప్రారంభించినారు.
“Dear Scribes I have received letter from Microsoft
USA. I shall let you know the contents of it”. My Son-in-Law Relangi will
translate the contents of the letter into Telugu, as I read out the same in
English.”
రేలంగి, ఫిరంగిగా మారి తెలుగు గుండ్లను
ఈవిధముగా ప్రేల్చనారంభించినాడు.
"విలే ఖరులారా (విలేఖరులారా అనుటకు బదులు) నా
కాకి మెత్త (My Crow Soft) నీవౌనొక (you yes a) నుండి నాకు లేఖ అందినది. అందులోని సారాంశమును మీకు తెలుపుతాను. మీరందరూ తెలుగు
విలేఖరులు కాబట్టి నేను వారు పంపిన ఉత్తరమును, ఆంగ్లములో, యథాతథముగా చదువుతాను. నా
ఉభయభాషా ప్రవీణుడైన అల్లుడు రేలంగి (అంటే నేను అం గుండె చరిచి చెప్పినాడు)
ఆంగ్లమును, తర్జుమా చేసిన తెలుగులో మీకు
వినిపిస్తాడు. మీరు వ్రాసుకోండి."
అని తర్జుమా చేసినాడు ‘ఉభయ భాషా ప్రవీణ’ రేలంగి గారు.
ఆ ఆంగ్ల పఠనము, తెలుగు అనుసరణ ఈ విధముగా
సాగినాయి.
Dear Mr. Ramana Reddy >>ప్రియమైన శ్రీ ‘రామన్నా సిద్ధం’ (Ramana Reddy కి తెలుగు తర్జుమా, Ramana అన్న
మాటను రామన్నా గానూ, రేలంగి గారు, Reddy అన్నమాటను Ready గా తీసుకొన్నారు) మహాశయా
You do not meet >>మీరు కలువనే కలువరు
Our requirement >>మాకు అవసరము అంటే మీ
కలయిక మాకు అవసరము అని అర్థము.
Please do not send any further correspondence >> మీరు తిరిగి జవాబు తెలిపే ప్రయత్నమూ చేయవద్దు
No phone call >>ఫోన్ లో మాట్లాడే పని
కూడా చేయ వద్దు
Shall be entertained >> తప్పక రంజింపచేస్తాము
అంటే మీరు వచ్చినారంటే మిమ్ము సంతోషపరుస్తాము.
Thanks >> కృతజ్ఞతలు
Bill Gates. >> చీటీ గేట్లు
తరువాత రోజు దిన పత్రికలలో వచ్చిన ఈ వార్త
చదివి నవ్వి నవ్వి Treatment కు Dr.Prabhakar Reddy వద్దకు పోయినారట.
రేలంగి రమణారెడ్డి-14
రమణారెడ్డి
కుమారుడు రేలంగితో: నీకంటే పనికిరానివాడు ప్రపంచములో లేనే లేడు. ఈ సారి కూడా నీవు
మళ్ళీ 10th fail అయినావు.
నీవు ఇప్పటకి రెండేళ్లుగా fail
అవుతూనే ఉన్నావు. పక్కింటి రోజాను, ఎదురింటి మల్లికను జూడు. ఒకరు 98% మరొకరు 97% తో pass అయినారు.
రేలంగి: నేను ఈ
రెండేళ్ళు వాళ్ళను చూసిచూసే
fail అవుతూ
వస్తున్నాను నాన్నా.
రేలంగి రమణారెడ్డి-15
ఒకసారి స్వర్గవాసులైన రేలంగి రమణారెడ్డి, ప్రతిరోజూ ఇంద్రసభలో అందరినీ నవ్వించేవారు. ఇంద్రుని వద్ద ఒకరోజు శెలవుతీసుకొని అట్లా భూలోకము అందులో భారదేశము అందులో ఉమ్మడి ఆంధ్ర ప్రాంతమునకు వచ్చినారు. హైదరాబాదులో ఎదో పెద్ద Election Meeting జరుగుతున్నట్లు తెలిసిపోయింది ఇద్దరికీ. వేదికపైన ఉన్న 5 మందిలో ఇరువురిని అమ్మ కొడుకులుగా గుర్తించినారు. పోలికలను బట్టి. అబ్బాయి అందముగా ఉన్నాడు పేరేమి అని అడిగినాడు రేలంగి రమణారెడ్డిని. అబ్బాయి పేరు ‘రాగులు’ ఆతని అమ్మ పేరు ‘సేమియా’ అని చెప్పినాడు రమణారెడ్డి. ఆ ఫోటోలు ఏవో అమ్మకు చూపుతున్నట్లున్నదే అని అడిగినాడు రేలంగి. అంత రమణారెడ్డి ‘అవి ఆసభకు తమ తండ్రులతో వచ్చిన పెళ్ళికాని ఆడపిల్లలవి. గొప్పవాడు కాబట్టి తన CAMARA MEN లతో చెప్పి వారి ఫోటోలు తీయించి అమ్మకు చూపించి ఏ అమ్మాయి బాగుంటుంది అని అడుగుతున్నట్లు ఉన్నాడు. అంతలో ఆమె మాట్లాడవలసిన సమయము వచ్చినట్లుంది. అమె గొప్పగా, విదేశస్తురాలయినా, ఆమె యాసలో హిందీలో అనర్గళముగా మాట్లాడి బిగ్గరగా “హమే బహు ‘మత్’ చాహియే” అని 5,6 మార్లు అనింది ‘బహుమత్’ అన్న మాటను విరిచి. తమపిల్లలకు ‘రాగులు’ తో పెళ్ళిపెత్తనము నెరుపుదామని వచ్చిన తల్లిదండ్రులు నిరాశతో వెళ్ళిపోయినారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది’. ఈ విధముగా రమణారెడ్డి వ్రతకథ చెప్పిన రీతిలో రేలంగికి విశధపరచినాడు.
స్వస్తి.
రమణారెడ్డి
రేలంగి - 16
రేలంగి : రమణారెడ్డి గారు మీరు లావు
కావటానికి
ఏ వైద్యమును అనుసరిస్తారు.?
రమణారెడ్డి:
హోమియోపతి నేచురోపతి
వాడినాను.
ఫలితము లేదు.
రేలంగి: ఆలోపతి వాడలేదా!
రమణారెడ్డి : అందులో మందులే Expire ఔతాయి
మనషులు
కారని నమ్మకమేమి?
రేలంగి
:😂
రేలంగి-రమణారెడ్డి-17
ఒక తెలుగు సినిమా shooting జరుగుతూ ఉంది. ఒక
రైలుపెట్టె లో రేలంగి రమణారెడ్డి ఎక్కినారు. వారు ఒకరికొకరు అపరిచితులు. రైలు పోతూవుంటే ఇరువురూ మాటలు కలిపినారు.
రమణారెడ్డి గారు తమ ఆంగ్ల భాషా చాతుర్యమును చూపదలచి ఆంగ్లములో రేలంగి గారిని అడిగినారు
"Where
did you born" అని.
రేలంగి ముక్తసరిగా 'Hyderabad' అన్నారు. రమణారెడ్డిగారు వెంటనే "Which part"
అన్నారు మరి రేలంగి గారు తక్కువ తిన్నవారా! వెంటనే ఆయన కూడా
ఆంగ్లములో "All parts" అన్నారు.
రమణారెడ్డి రేలంగి - 18
రేలంగి గారు MLA గా నిలిచి ఓడిపొయినారు. పోతేపోయినారు కానీ District Collector రమణారెడ్డి
గారివద్దకు వెంటనే పోయి తనకు తక్షణం Z-Category Security కావాలన్నారు తక్షణం Election కు సంబంధించిన Secretary ని రమ్మని ఎన్ని
ఓట్లు ఆయనకు వచ్చినదీ తెలుపమంటే అవి 3 అని తేలినది. వెంటనే రమణారెడ్డి రేలంగితో ' మీకు వచ్చింది
బోడి మూడు ఓట్లు. మీకెందుకండీ Security' అన్నాడు
అందు రేలంగి సమాధానము 'మీరు చెప్పింది
నిజమే! నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా! ఆ మూడూ కూడా మా కుటుంబ సభ్యులవే! నేను
పెట్టుకొన్న Party కొత్తదయినందువల్ల
నాఓటు పాత పార్టీ గుర్తుకే వేసుకొన్నాను. దీనివలా ఏమి అర్థమవుచున్నది మీకు? మొత్తము Constituency నాకు విరోధులేకదా!
మరి నేను ఒంటరిగా ఊరిలో తిరుగావలేనంటే
Z-Category Security కావలసినదే కదా!' అన్నారు.
రమణారెడ్డి గారు వేసుకొన్న బట్టలు చించుకొని దగ్గరగా ఉన్న Bus-Stand వైపు పిచ్చి
పిచ్చిగా అరుచుకొంటూ పరుగెత్తినారు.
రమణారెడ్డి రేలంగి - 19
రమణారెడ్డి
పల్లెటూరివాడు. చెరుకు నములుతూ Train
ఎక్కబోతున్నాడు.
రేలంగి Ticket
Examiner.
రేలంగి:
మీరు
తినే ఆ చెరుకు గణుపు పారవేసి ఎక్కండి. Compartment
లో
చెరుకు నమల కూడదు.
రమణారెడ్డి
చెరుకు నములుతూనే : ఏం అక్కడ నమిలితే రసము రాదా!
రేలంగి:
???
కొనకుండా
నవ్వుకొనండి – రేలంగి రమణారెడ్డి – 20
రేలంగి : రమణారెడ్డి గారూ నాకొక సలహా చెప్పండి. ఈ
రోజు నేను ఒక అతి ముఖ్యమైన Party కి పోయేదుంది. అందరూ ఆశ్చర్యముగా నావైపే చూసే
విధముగా ఒక కోటు పేంటు చెప్పండి.
రమణారెడ్డి:
అట్లయితే Petty Coat వేసుకు పొండి. Pant అవసరము కూడా ఉండదు.
అందరూ కన్నార్పకుండా మిమ్మే చూస్తారు.
కొనకుండా నవ్వుకొనండి –
రేలంగి-రమణారెడ్డి -21
(ఇది స్వీయ కల్పన)
ఒకసారి, మద్రాసు వాసియగు రమణారెడ్డి
ఎదో పనిమీద హైదరాబాదు రావటము జరిగింది. ఆయన దిల్షుక్ నగర్ నుండి గాచ్బౌలీ
వెళ్ళుటకు దిల్షుక్ నగర్ లో బస్సు ఎక్కినాడు. కాసేపు తరువాత రేలంగి కూడా అందులోనే
ఎక్కి, సీటు ఖాళీగా ఉండుటచే రమణారెడ్డి గారి ప్రక్కనే కూర్చున్నాడు. అక్కడ
బస్సుకదిలింది, ఇక్కడ మాటామంతి మొదలయ్యింది. పరిచయములయినాక ఇరువురూ వేదాంతమునుగూర్చి
మాట్లాడదొడగినారు.
రమణారెడ్డి: అసలు
పాడుపనులు చేసేవారు ఎక్కడికి పోతారని మీ అభిప్రాయము?
రేలంగి : మీ వూరిలో
ఎక్కడికి పోతారో తెలియదు కానీ
మా హైదరాబాదులో అటువంటివారు అందరూ Necklace Road కే పోతారు.
రమణారెడ్డి గారు మళ్ళీ
నోరు తెరువలేదు.
MAXI ‘MUM’ MINI ‘MUM’ (కల్పితం) -22
ఆ పాఠశాలలో రమణారెడ్డి గారు ఉపాధ్యాయుడు.
రేలంగి గారు విద్యార్థి.
రమణారెడ్డి గారు పాఠము చెబుతున్నారు. సందర్భవశమున ‘అమ్మ’ ను గూర్చి చెప్పవలసి
వచ్చింది. వారు ఇలా చెప్పడము ప్రారంభించినారు. “పూర్వపు రోజులలో తల్లిని అమ్మా అని
పిలచేవారు. ఆమె అక్కయ్యను పెద్దమ్మ అని చెల్లెమ్మను
పిన్నమ్మ అని పిలిచేవారు. కాలాంతరములో
పిన్నమ్మ పిన్ని అయ్యింది కానీ పెద్దమ్మ 'పెద్ది' కాలేదు. ఆమాట
అటుంచితే అమ్మ తరువాతి కాలములో Mummy అయ్యింది. తరువాతి కాలానికి MOM అయ్యింది. Latest గా MUM అయ్యింది. అంతా ఆంగ్లమహిమయే కదా! మరి పెద్దమ్మ పిన్నమ్మలను
ఏమనాలో” చేబుట్టావా రేలంగీ అని అడిగినాడు.
క్షణము కూడా ఆలస్యము లేకుండా వెంటనే రేలంగి 'MAXI ‘MUM'
MINI ‘MUM' అని జవాబు చెప్పినాడు.
చెరుకు రామ మోహన్ రావు
23
రమణారెడ్డి : ‘ఏకాంతములో ఉన్నపుడు
గాడిద ఏమాలోచిస్తుందో
చెప్పగలవా'
రేలంగి: “చెప్పగలను”
రమణారెడ్డి: “అయితే
చెప్పు”
రేలంగి: “కాస్త టైం
పడుతుంది”
రమణారెడ్డి: “అయితే
ఏకాంతంలో ఉన్నపుడు ఆలోచించి చెప్పు”
24
రేలంగిని దారిలో
రమణారెడ్డి కలిసినాడు.
ర.రె.:బాగున్నారా?
అడిగీ
అడక్కముందే ఆయన రేలంగి గారి పెదవులవైపు జూసి
'ఏమిటి, మీ పెదవులు నిప్పుకణికెల వలె అంత ఎర్రగా
ఉన్నాయే!'
అన్నాడు.
రేలంగి
'అవి
కాలినాయి' అన్నాడు.
ర.రె.
' 'అంత
వేడి పెదవులు ఏ యువతీ కలిగియున్నది?'
రేలంగి
'యువతీ
కాదు రైలింజను'
ర.రె.
'రైలింజనును
ఎందుకు ముద్దు పెట్టుకొన్నారు?'
రేలంగి
"నా భార్యను ఎక్కించిన ఆరైలు తనను పుట్టినింటికి తీసుకు పోతూ ఉందికదా, నాకు స్వతంత్రము
లభింపజేసింధి కదా! అని అని కృతజ్ఞతా పూర్వకముగా
తన్మయత్వముతో ఇంజనును ముద్దుపెట్టుకోన్నాను.'
ర.రె.
???
*********************************
దాయాదులు
True Love is Like Pillow
You could HUG it when you are in trouble
You could CRY on it when you are in pain
You could EMBRACE it when you are happy
You could KISS it when you get sweet memory