Friday, 14 March 2014

లీలా హేలా -బాల గోపాలా 
అందమౌ తలకట్టు
నెమలీక పెట్టు
ఒక చేత వేణువు
ఒక చేత ధేనువు
మోవి పై సుస్మితము
కనుగవన హితము
రూపు సమ్మోహనము
భక్తీ ఆవాహనము
ఆద్యన్తములు తాను
అందు చీమను నేను
మనసునాతని తలచి
మ్రొక్కుతా మైమరచి

గోపాలకృష్ణు తోడను 
గోపాలనవేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలురెంత ధన్యులో
గోపాలురకైన నిట్టి గురురుచి గలదే

No comments:

Post a Comment