భాగవతము (దశమస్కందము)
కడుపులోపల నున్న పాపడు గాల దన్నిన గిన్కతో
నడువబోలునే క్రాగి తల్లికి? నాధ! సన్నము దొడ్డు నై
యడగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ
కడుపులోనిది గాదె? పాపడ గాక నే మరి ఎవ్వడన్ ?
భావం:
స్థూలముఅయి, కారణ రూపము, కార్యరూపము అయిన ఈ సృష్టి అంతా నీ కడుపులోనిది కదా ! మరి నేను నీ
పాపడను గాక మరెవ్వడను? నేనేమయినా పాపకర్మములు చేసినా తల్లివలె కడుపులో పెట్టుకుని క్షమించలేవా?
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నీచజన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాహి విప్రాః
No comments:
Post a Comment