భర్తృహరి సుభాషితము (క్షీర నీర న్యాయము )
https://cherukuramamohan.blogspot.com/2014/03/blog-post_20.html
క్షీరేణాత్మ
గతోదకాయహి గుణా దత్తాః పురాతేఖిలాః
క్షీరోత్తాప
మపెక్ష్యతేన పయసా స్వాత్మా కృశానౌహుతః
గన్తుం
పావక మున్మనస్తదభ వద్దృష్ట్వాతు మిత్రాపదం
యుక్తం
తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ
ఏనుగు
లక్ష్మణ కవి తెలుగు సేత
క్షీరము
మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్
క్షీరము
తప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వార
సుహృద్విపత్తి గని వహ్ని జొరంజనె దుగ్ధ ,మంతలో
నీరము
గూడ శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్
భావము
: పాలు,మొదట తనను కలియుటచే, నీటికి తనగుణములన్నీ ఇచ్చినది.
పాలు నిప్పుచే కాగి పోవుటచూచి, నాకెందుకులే యని ఊరుకోక నీరు
నిప్పుపై దూకినది . తనకై తను త్యాగామునకే సిద్ధపడిన ఆ నీటికి బాసటగా పాలు
నిప్పులోకి దూకబోతే నీరు తిరిగి తనను చేరిన తోడనే పాలు శాంతించి తిరిగీ నీటితో
సఖ్యతగా ఉండిపొయినది .
మనము
రోజూ కాచే నీరు గలిసిన పాలను భావానుగతులమై గమనించితే ఎంత నేర్వ దగిన గుణపాఠము ఉందో
గమనించండి . 'పయస్సు' అన్న పదానికి పాలు, నీరు
అన్న రెండు అర్థాలూ వున్నాయి. అంటే వాని మనసులు ఒకటి యగుట వలన బహుశ పేర్లు కూడా
ఒకటైనాయేమో. లేక ఒకే పేరు ఉన్నందువల్ల ఒకే రకమైన గుణములు కలిగియున్నాయేమో.
పాలూ
నీరు మాదిరి మనము కూడా అంతా మంచియే కలిగియుంటే ఎంత బాగుంటుందో !
స్వస్తి.
No comments:
Post a Comment