'ఇది నేను వ్రాసిన పద్యము' అని ప్రతిసారీ వ్రాసుకోనుటకు మనసంగీకరించనందున ఇకపై నాది కాని
పద్యమైనపుడు, ఎవరిదీ అని తెలుపుటకు వ్రాసినవారి పేరు ఉటంకించుతాను.
పద్యమైనపుడు, ఎవరిదీ అని తెలుపుటకు వ్రాసినవారి పేరు ఉటంకించుతాను.
ఐదు నోటు ఒకటి అగుపడ లేదని
పది దినాలు పడితి బాధ నేను
ఆరు పదుల వయసు అగుపించకనె పోవ
అపుడు లేని ఏడ్పు ఇప్పు డొచ్చె
మొదలే తానొక పిచ్చికోతి యగుటన్ ముల్ ద్రొక్కె, మైమర్వగా
మదిరాపానము జేసి చిందిడెను పెన్ మంటల్ పైన కాళ్ళూనుచున్
కదిలెన్,కందుక రీతిలో,నభమునన్ కన్పింప నాట్యాంగనల్
తుదకో తాళ ఫలమ్ము పై బడుట చే దోచెన్ చంద్ర తారావళుల్
అన్వయము మనసుకా మనిషికా అన్నది మీకే వదలిపెడుతూ, ఈ పద్యానికి భావము ఈ దిగువ
తెలియజేయుచున్నాను .
'మొదలే అది ఒక కోతి దానికి తోడూ పిచ్చిది ఆపై ముళ్ళు త్రోక్కింది ,ఆబాద బాపుకొనుటకు సారాయి త్రాగింది
తాగిన మైకములో చిందులు త్రొక్కుచూ నిప్పు లో కాళ్ళు వేసింది,ఆ బాధ భరించలేక ఆకాశము కనిపించేసరికి
దానిని అంటుదామని బంతి లాగా పైకి ఎగిరింది. అక్కడే వున్న తాటిచెట్టు పైననుండి క్రిందికి జారిపడే తాటి
పండును గమనించకుండా!అంతే ,కోతికి భూమి పై గల చుక్కలు కనిపించినాయి. ఇది నిజమే కదా !
త్రాగనివాడు నిత్య ధన దాహము చెందనివాడు సర్వదా
వాగనివాడు పార్శ్వ జన వంచన చేయనివాడు సంతతో
ద్వేగము లేనివా డొరుల దెప్పర కోరక యుండు వాడెదో
రోగము లేనివా డెపుడు రూఢముగా ధర లేడు శంకరా
ఈ ప్రపంచములో త్రాగుబోతు కానివాడు,ధన దాహము లేనివాడు,అవసరమున్నా వాగనివాడు , ఇరుగుపోరుగుకు
మోసము చేయనివాడు భావావేశము (emotion) లేనివాడు, ఇతరులకు కీడు తలపెట్టనివాడు, ఏదో ఒక రోగము
లేనివాడు తప్పక కనిపించడు.
No comments:
Post a Comment