అందము
నిండిన డెందము
https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post.html
హరియౌ నీ ముఖ బింబము
హరి నుడులై జెలగు బహుళ ఆకర్షకమై
హరి జడయు నడుము జూడగ
హరి హరి నిను బొగడ తరమె హరిణీ తరుణీ
ముఖ బింబము హరి అంటే చంద్రునితో సమానము. మాటలా ఆకర్షణీయమైన
హరి అనగా చిలుక పలుకులు. హరిని అనగా
నాగును బోలిన జడ, హరి అనగా సింహము యొక్క నడుము, ఇన్ని విధముల హరిని కల్గిన నిన్ను హరి హరీ పొగడ సాధ్యమా లేడి తో సమానమగు యువతీ!
చెరుకు రామ మోహన్ రావు
Excellent sir. Thanks for posting the meaning also.
ReplyDeleteహరి అను పదమునకు గల బహువిధ అర్ధములను ఆధారముగా గొప్ప శబ్ద చమత్కృతులతో
ReplyDeleteమీరు చేసిన రమణీయమైన స్త్రీ వర్ణన చాలా చాలా మనోహరమైనదండీ రామ మోహన రావు గారూ... మీకు అనేకానేక అభినందనలండీ 🌹🌹🙏