సఖీ ఈ రేయి వెలిసెను
https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post_27.html
సఖీ ఈ రేయి వెలిసెను
నీ జాడే
తెలియదాయె
నిశీధే నెలవు మారెనూ
నీ జాడే తెలియదాయె
తరంగాలై నీతలపులు
పదే పదే ఎద తాకెనె
నిరాశా నీరసాలతో
చెమర్చెను నాకన్నులే
జలదమే జార వానగా
నీ జాడే తెలియదాయె
మనోనభ సీమయె నీవై
సదా సదా వ్యాపించగ
విహంగాలై ఎగురసాగెలే
చెలీ నీ తీపి గురుతులు
ప్రళయ మారుతపు తెరలలో
నీ జాడే తెలియదాయె
తమిస్రపథముల
పాంథునై
చెలీ
నినే జపించితి
విషాదమే
మిగిల్చెనే
విధాతయే
విరోధియై
అమాసే
ఆవరించగా
నీ
జాడే తెలియదాయె
సఖీ
ఈ రేయి వెలిసెను
నీ జాడే తెలియదాయె
Very nice sor
ReplyDelete