Tuesday, 28 February 2023

మంచి దారి ఎన్నుకో - మదగజమై నడు

 మంచి దారి ఎన్నుకో - మదగజమై నడు 

https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post_28.html

రంజన లేక కం ధి గొను రాబవ లంతయు మేఘ సృష్టి  కై

పంజరమందు నిల్చియును పల్కును చిల్కలు ముద్దు పల్కులన్

భంజన చెందియున్  తరువు ఇచ్చును మెచ్చగ సాలభంజికల్

కుంజరమౌచు సాగవలె కుంకక జంకక క్లేశమందునన్

కంధి = సముద్రము , రంజన = ఆనందము , రాబవలు = రాత్రింబవళ్ళు

భంజన చెందియున్ = విరచబడి కూడా ,

సాలాభంజికల్ =  స్తంభమునకు చెక్కిన బొమ్మలు , కుంజరము = ఏనుగు.

2 comments:

  1. అత్యద్భుతమైన మార్గ దర్శకమైన భావనలు గల పద్యము.
    సముద్రము, రామచిలుక, వృక్షము, ఏనుగు ల జీవన పథములను ‌సోదాహరణంగా వివరించి యెంత కష్టమైనా ఓర్చి విజయ పథములో పయనించాలని అనే భవ్యమౌ సందేశమునిచ్చేరు...
    సంద్రము రేయింబవళ్ళు నిరంతరంగా తన కెరటాలతో మధనం చెందుతూ నీటి మేఘాలను సృష్టిస్తుంది.
    రామచిలుక పంజరంలో చిక్కుకొనికూడా చింతించక...చక్కగా గానం చేస్తుంది...
    వృక్షము నేలకొరిగినా చెక్కబడిన అందమైన సాలభంజికగా రాణిస్తుంది.
    ఏనుగు...తనకు యెంతో బాధ కలిగినా కృంగి పోకుండా ఠీవిగా నడుస్తుంది.
    మానవుడు పై ఉదాహరణలననుసరించి విజయుడు కావాలి అనే గొప్ప సందేశమిచ్చే పద్యాన్ని రచించేరు.
    ఇది సమాజానికి గొప్ప మార్గదర్శనం చేసే పద్యం.
    మీ కవన,భావనల ప్రతిభా పాటవాలకు అనేకానేక అభినందనలండీ రామ మోహన రావు గారూ

    ReplyDelete
  2. Well written poem. Excellent rendition

    ReplyDelete