అందము
నిండిన డెందము
https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post.html
హరియౌ నీ ముఖ బింబము
హరి నుడులై జెలగు బహుళ ఆకర్షకమై
హరి జడయు నడుము జూడగ
హరి హరి నిను బొగడ తరమె హరిణీ తరుణీ
ముఖ బింబము హరి అంటే చంద్రునితో సమానము. మాటలా ఆకర్షణీయమైన
హరి అనగా చిలుక పలుకులు. హరిని అనగా
నాగును బోలిన జడ, హరి అనగా సింహము యొక్క నడుము, ఇన్ని విధముల హరిని కల్గిన నిన్ను హరి హరీ పొగడ సాధ్యమా లేడి తో సమానమగు యువతీ!
చెరుకు రామ మోహన్ రావు