మనవయికూడా
మననుండి విడిపడిన దేశములు
ఈ వ్యాసమును నేను వీలయినంతవరకూ క్లుప్తముగా వ్రాసినాను. చదవండి.
ఒకప్పుడు
బర్మా(మ్యాన్మార్) మనదేశాములోని భాగము. 8వ శతాబ్దము నుండి
అది అఖండ భారతమునకు దూరమైనది. అంతవరకూ ముస్లిం, క్రైస్తవ
పాలకులకు నేపాల్ భూటాన్ బర్మా టిబెట్ మొదలగు ప్రాంతాలు లోను కాలేదు. అఖండ భారతమంటే
కలియుగారంభమున జనమేజయుని కాలము వరకు ఇది అఖండమే. రూపతి అన్న ఒక కురు రాజ కుమారుడు
(ధృతరాష్ట్ర కుమారులలోనివాడు కాదు.) తపస్సు చేయనెంచి మానస సరోవర దిశగా వెళ్ళినా
అచటి గిరిసీమలకు ఆకర్షితుడై వనవాసులను కూడగట్టి ,ఆ ప్రాంతమునకు
త్రివిష్టపమను పేరుబెట్టి తానుమొదటి రాజై పరిపాలించినాడు.అది రాను రానూ టిబెట్
అయింది.వారు పాటించినది సనాతన ధర్మమే వారి రాజు ఒక కౌరవ రాజే. క్రీస్తు పూర్వము 15వ శతాబ్దములో మగధ
సామ్రాజ్యాని గిరివ్రజ పురమును రాజధానిగా చేసి మౌర్యులు పరిపాలించు కాలములో
టిబెట్టు వారి సామంత రాజ్యము. ఇప్పుడది చైనాలో భాగమని మనకు తెలిసినదే. మానస
సరోవరము, కైలాస శిఖరము
సంస్కృత నామములు కలిగినపుడు వానికి అనుబంధమైన త్రివిష్టపము మనరాజులచేత ఏలబడి మన
దేశములో భాగము కాదంటే అంతకన్నా హాస్యాస్పదము వేరేమి ఉంటుంది.
ఇది ఒక ఎత్తయితే బర్మా ఇప్పుడు కొన్ని దేశముల వారు మాత్రమే మియాన్మార్ గా గుర్తించినారు.
ఆంగ్లేయుల ఏలుబడిలో బర్మా 1824 నుండి 1937 వరకూ భారత దేశము యొక్క అభిన్న భాగమై ఉండినది. 1947 కు పది సంవత్సరముల పూర్వము అది 1937 లో విడిపడినది. 1931 నాటికి 7% భారతీయులను కలిగిన ఆ ప్రాంతమునకు వీరు కట్టుచుండిన పన్ను శాతము 55 అయితే బర్మీయులు కట్టుచుండిన పన్ను శాతము 11.
పైగా బర్మా ఆనాడు భారత దేశములోని అతి పెద్ద పరిధి గల్గిన భారతీయ అఖండ విభాగము. ఆప్రాంతమునకు ప్రక్కనున్న బంగాళ దేశ జనాభా750 లక్షలయితే బర్మా లో 90 లక్షలు ఉండేవారు. బర్మా విస్తీర్ణము 170 చదరు మైళ్ళు. బెంగాల్ యొక్క విస్తీర్ణము 151 చదరపు మైళ్ళు. విడిపోవుటచే ఎంత నష్టపోయినామో గమనించండి. (Imperial Gazetteer of India, v. 4, p. 46.)
భారత దేశము నుండి బర్మా 1937 లో విడిపడింది అని చెప్పుకొన్నాము. అప్పటికి బర్మా మనదేశాములోని భాగము. మేము విద్యార్థులుగా ఉన్న కాలములో దేశాపతములలో బర్మాను హరతదేశ భాగముగా చూసేవారము. సరి, ఆసమయమున మన దేశము బ్రిటీషు వారిచే పరిపాలిమ్పబడుతూ ఉండినది. మరి బర్మాను విడదీసినది వారే! అప్పటికే మనము పూజించే తెరమీదీ నేతలు ఈషణ్మాత్రమైనా ప్రతిఘటన చూపలేదు. అసలు 1932 లో బర్మాలో అభిప్రాయ సేకరణ నిమిత్తము జరిగిన ఎన్నికలలో Antiseperation league 47 స్థానాలు గెలిస్తే Seperation league దక్కిన్చుకోన్నది 29 స్థానాలు మాత్రమె!
అసలు బర్మాకు ఆంధ్రులకు అవినా భావసంబంధము ఉండేదని మనకు తెలియవస్తూవుంది. బర్మాను, బ్రహ్మదేశమనేవారనీ బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ 700 నాటికే ఆంధ్రులు ఈ దేశానికి వర్తకము నిమిత్తము వస్తూ పోతూ ఉండేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయము. సముద్రము మీద బర్మాకు వచ్చిన భారతీయులలో ఆంధ్రులే మొదటి వారని ప్రతీతి. బర్మా క్రీస్తు శకము 8వ శతాబ్ది నుండి రాజకీయంగా మనకు దూరమైనది. బర్మాతదితర ఈశాన్య ప్రాంతాలు స్వతంత్రముగా వుండుటవల్లనూ, ముస్లిం క్రైస్తవ మూకల వశము చాలా కాలము కాకుండుటవల్లనూ అవి మన దేశముతో విడిపడినాయి. క్రీస్తు శకము 1885 అనగా కలియుగము 4987 వ సంవత్సరము వరకు అది స్వతంత్ర దేశము. కాని విధి వికటించి తదుపరి ఆ ప్రాంతము వారికి లొంగి 1937 అనగా కలి సం. 5039 వారిచే బలవంతముగా విడగొట్ట బడినది.

హిందూ సామ్రాజ్య
భాగమైన సింహళము(ఇప్పటి శ్రీ లంక) బుడుతకీచులు (ఫోర్చుగీసులు) క్రీస్తు శకము 1505 లో
వశపరచుకోనబడినది. అసలు ఇప్పటికి అక్కడ తెలుగువారు వారి మూలములు అధికమని చారిత్రికులు
నిరూపించియున్నారు. అసలు మొదటి తెలుగు వ్యాకరణము వ్రాసినది రావణుడనే ఒక ప్రచారము
ఇప్పటికీ వున్నది. మన భాష మాన సంస్కృతి కలిగిన భూభాగముమనది కాకుండా వేరు
ఏమవుతుంది. సిరిమవో భండారునాయకే, విక్రమ
సింఘే మొదలగువారలు తెలుగువారలే
వినియున్నాను. తెలుగు కవులు ఎక్కువగా 'మలయానిలము' అన్న శబ్దమును తమ
కవితలలో వాడుతారు. మలయా అంటే నేటి మలేషియా. ఆనాడు అక్కడ శ్రీగంధము చెట్లు ఎక్కువగా
ఉండేవట. గాలికి ఆ చెట్ల కదలికవల్ల వచ్చే సుగంధభరితమౌ ఆ గాలినే మలయానిలము అంటారు.
శ్రీలంకకు పడమరగా
ఉన్నమాల్ దీవ్స్ ఒకప్పటి మాలా ద్వీపములు. అవి చిన్న చిన్న భూభాగాములై
ఒకదానినొకటియానుకొని మాలగా ఉన్నందువల్ల ఆ పేరు వచ్చిందంటారు. సామాన్య శకము 12 వ శతాబ్దములో
బౌద్ధ ధర్మావలంబనమైన ఈ దేశాము ముస్లీము ముష్కరుల హస్తగతమైనది. సా.శ.1796 లో దీనిని
బ్రిటీషు వారు ఆక్రమించి 1965లో
స్వాతంత్ర్యమును ఇచ్చినారు.
ఇవికాక మనవియైకూడా మనవి కాకుండా పోయిన భూభాగాలు
ఈ దిగువన ఇవ్వబడినవి.
నాటి అఖండ భారతము
: 27,48,115 చ.మై.
దేశము
బంగ్లాదేశ్
...................................: 57,000 చ.మై (1మైలు= 1.61కి.మీ.
ఇంచుమించు)
మయన్మార్
...............................:2, 61,000 చ.మై
శ్రీ లంక
......................................:25,000 చ.మై.
మాల్ దీవ్స్ (
మాలా ద్వీపములు) : 115 చ.మై.
పాకిస్తాన్
....................................: 3, 07,000 చ.మై. (బాంగ్లా
కలిపి)
ఆఫ్ఘనిస్తాన్...................................: 2, 51,000చ.మై.
నేపాల్.........................................:
57,000 చ.మై.
భూటాన్
......................................: 18,000 చ.మై.
త్రివిష్టుప్.......................................:
4, 72,000చ.మై.
నేటి
భారతము(గొరగంగా మిగిలిన జుట్టు ):13,00,000చ.మై
______________
27, 48,115చ.మై
_______________
ఇంత భూభాగము
కలిగి యుండినవారమై యుండి కూడా, అవి విడిపోయినా
నోరుమూసుకొనే ఉన్నాము. మన జాతిని పరమతములలోనికి మార్చుకొంటూ పోతున్నా పల్లెత్తు
మాట మాటలాడని సహనశీలురము. ఆదికవి వాల్మీకి పేరును ఒక చలనచిత్ర దుష్టపాత్రధారికి
పెట్టినా, అది ఆ మహర్షిని
కించపరచినట్లుగా భావించము. పొరుగున ఉన్న తమిళనాడులో, ఆర్య ద్రావిడ
వాదమును అమలులోకి తెచ్చి దేశమును, ఒకవిధముగా రెండు
చేసిన ఒక ద్రావిడ ఉద్యమ నేతకు సంబంధించిన
ఒక వాస్తవాన్ని చెప్పినందుకు ఒక చిత్రకథానాయకుని బెదిరించుచున్నారు, కానీ మనము
మాత్రము ఏమాత్రమూ స్పందన లేకుండా పట్టనట్టు ఉండిపోతాము. వాల్మీకికి బదులు ఏ శకుని
అనో వాలి అనో పెట్టియుండవచ్చుకదా! నేను ఎవరినీ తప్పుపట్టుటలేదు కానీ ఆలోచించమని
చెబుతున్నాను.
ఇవన్నీ ఎందుకు
చెబుతున్నాను అంటే 'నేను' అన్న మాటను
విడిచిపెట్టి 'మనము' అన్న మాటను
పట్టుకొంటే ఎంతో ప్రగతిని సాధించగలము.
స్వస్తి.
Very good information provided by you sir which we can't reach out
ReplyDelete