Tuesday, 20 January 2015

అలహాబాద్ కథ

అలహాబాద్ కథ 

అలహాబాద్ భారతదేశంలో ప్రసిద్ధ తీర్థస్థానం. త్రివేణి సంగమస్థానం. మనందరికీ అది కాశీ, గయ, ప్రయాగలలో ఒకటి. అనుకోకుండా ఒక మకరసంక్రాంతి పర్వదినంనాడు ఆ తీర్థం లో స్నానంచేసే అవకాశం లభించింది. తరువాత ఇంకా ఇతర పేర్లు ఉండేవి. కౌశాంబి, ప్రతిష్ఠానపురం ముఖ్యమైనవి. ఈ అలహాబాద్ అన్న పేరు ఎవరు పెట్టారు? 1583 లో అక్బర్ పాదుషా ఆపేరు పెట్టాడు. ఆయనపెట్టినపేరు ఇలాహాబాద్. అది అలహాబాద్ గా పరిణామం చెందినది. అల్లా యొక్క తోట అన్న అర్థమని చెబుతారు. అంటే బాద్ అన్నా బాగ్ అన్నా ఒకటే కావచ్చును. . ఇది అల్లా స్థానమైతే బ్రాహ్మణాబాద్ అని ఒకఊరు ఉన్నది తెలుసా. అది పాకిస్తాన్ లోని సింధురాష్ట్రం లో ఉంది. అక్కడి హైదరాబాదు కు 86కిమీ దూరంలో. ఒక బ్రాహ్మణచక్రవర్తి సింధుదేశానికి రాజధానిగా కట్టించుకున్నాడు.

No comments:

Post a Comment