News Feed
మన బృంద సభులు, గురుతుల్యులు చెరుకు రామమోహనరావు గారి జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు అందిస్తూ .. అచ్చంగా తెలుగు సవినయంగా సమర్పించుకొంటున్న అక్షరాభిషేకం .
// హే ఈశ్వరా..! //
చెదరని చెంగల్వ పూదండ నీకు, చిందేసి ఆడు
రుద్ర,నమక,చమకాలు నీకు, పరవశించి ఆడు
కురిసేటి అక్షర వేద ఘోష నీకు, ఆనందంతో ఆడు
రావణబ్రహ్మ తాండవస్తోత్రాలు నీకు, తాండవమే ఆడు
మరు మల్లె, మారేడు అభిషేకాలు నీకు, తరియించి ఆడు
మోమున బోలెడు భస్మం నీకు..అఘోరావై ఆడు
హఠయోగ పూజలు నీకు వికృత నృత్యమే ఆడు
నడి నెత్తిన గంగా జలాభిషేకం నీకు, శాంతమూర్తివై ఆడు
రాణి పార్వతి సేవలు నీకు..ప్రేమలో మునిగి చూడు
వున్నావు కొలువై మామదిలోనే,కరుణించి చూడు.! హే ఈశ్వరా..!

త్రిగుణ హాస్యచలోక్తుల రేడు మీరు
త్రిభాషా పాండిత్య పదకోశం మీరు
త్రినేత్రుని తాండవ స్తోత్రం మీరు
త్రిలింగ అచ్చంగా తెలుగు బృంద గురువు మీరు
త్రిభాషా పాండిత్య పదకోశం మీరు
త్రినేత్రుని తాండవ స్తోత్రం మీరు
త్రిలింగ అచ్చంగా తెలుగు బృంద గురువు మీరు
అందుకొనుము గురువర్యా..!
అక్షర శుభాకాంక్షల అభిషేకం
మీ అరవై ఏడవ జన్మదినం
అచ్చంగా తెలుగు కు ఆనందనందనం,
మీకు అందరి వందనం
అక్షర శుభాకాంక్షల అభిషేకం
మీ అరవై ఏడవ జన్మదినం
అచ్చంగా తెలుగు కు ఆనందనందనం,
మీకు అందరి వందనం
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
12.08.2014
12.08.2014
(గురువులు తప్పులున్న మన్నించమని వేడుకుంటూ అభిమానంతో సమర్పించుకున్న చిరు కవితా హారం)
No comments:
Post a Comment