ఋగ్వేదంలోని అరణ్య దేవతను గూర్చిన శ్లోకము
“ఆంజన గంధీమ్ సురభీమ్ బహ్వన్నమ్ ఆకృషి ఫలామ్
ప్రా అహమ్ మృగానామ్ మాతరమ్ అరణ్యానీమ్ ఆశంశిషామ్”
భావం: సుగంధము వెదజల్లే కాటుకకు ఉపయోగించే అంజనగంధి, సౌరభము
నలుదిశలా వ్యాపింపజేసేది, పుష్కలముగా పలువిధముల ఆహారమును ప్రసాదించేది, కృషిచేయకనే
ఫలమిచ్చే శక్తిగలిగినది, మృగాలకు తల్లి అయిన అరణ్యమాతకు మ్రొక్కుచున్నాను.
ఎంత గొప్ప భావనాయో చూడండి. ప్రకృతిలోని ప్రతి వస్తువు మనకు దైవ
సమానము, నమస్కార యోగ్యము, కృతజ్ఞతా భాజనము అని నొక్కి వక్కాణించుచున్నది మన ధర్మము.
No comments:
Post a Comment