Wednesday, 13 August 2014

స్నేహం, స్నేహితము

స్నేహం

ఉద్వేగముతో నిడిన మనసు తో, పుట్టిన రోజుకు ప్రాధాన్యత ఇవ్వని నాకు, నేనెంత చెప్పినా వినకుండా,  శుభాకాంక్షలు తెలుపిన ఇంతమందికి  ప్రతిగా ఏమి చేయవలెనో నాకు తోచక స్నేహితమును గూర్చి అంకిత భావముతో వ్రాసిన ఈ నాలుగు మాటలు మిత్రులందరికీ పేరు పేరున అంకితము చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను.
అనుబంధాలను ఉంచేది - అనురాగాలను పంచేది
ఆత్మీయతతో అలరించేది ఆత్మానందము నందించేది
మరుపు రానిది, మరువ లేనిది- మాసి పోనిది మారబోనిది
తియ్యనైనది , తిరుగులేనిది - నిత్యమైనది, సత్యమైనది
కపటమన్నదే కానరానిది - కలహమన్నదే కలుగలేనిది
మేని అందమును చూడబోనిది - మేలిమి మనసుల కలయికైనది
అపార్ధమన్నది అర్థం కానిది - అనుమానానికి తావివ్వనిది
ఆత్మానందము కలిగించేది అభిమానానికి అద్దమన్నది
సృష్టిలోనె తా పుట్టు చున్నది - సృష్టి తోడుతే లయమౌచున్నది  
తియ్యనైనది కమ్మనైనది తినుటకు హద్దును తెలుపరానిది
ఎంత పెంచినా విరిగి పోనిది - ఎంత పంచినా తరిగి పోనిది
నిత్య వసంతము కలిగించేది నింగినంటుచూ నిలిచేది
ఎగిరి పోనిది ఇగిరి పోనిది - అనురాగానికి అమ్మ వంటిది

అలుపెరుగనిది సొలుపెరుగనిది - అసలు స్నేహమది అన్నది నామది
LikeLike ·  · 

No comments:

Post a Comment