Saturday, 16 August 2014

సుతి మెత్త నడకల శృతిబద్ధ లయలతో

శ్రీ కృష్ణు కు నా చిరు కానుక ( జన్మాష్టమి సందర్భముగా)

సుతి మెత్త నడకల శృతిబద్ధ లయలతో
కాళింది కడురమ్య గతుల  కదల
ఘమ్మని కమ్మని కమల సౌరభములు
మలయానిలమ్ముతో మసలుచుండ
ఝుమ్మను తుమ్మెదల్ సోంపు సన్నాయిలు
మేళవింపగ  రాగ మేళమమర
గజ వధూగుణము గోగణము నౌదల దాల్చి
తలలూపుచూ మందతరము నడువ*


మదన తాపమ్ము గోపికా మతుల నిండ
ముని జనాళికి భక్తిని ముక్తి గూర్చ
ప్రకృతి పులకించగా తాను ప్రమదమందు
మురళి నూదె విహారి దా మోవి చేర్చి


అర్థము సులభ గ్రాహ్యమని వివరించ లేదు.

No comments:

Post a Comment