చెరుకు రసాలు
శ్రీ గణపతి
అక్షరమతి
నీ బహుమతి
ఈపదగతి
తొండమయ్య
దండమయ్య
మంచినియ్య
కొలుతునయ్య
ఏకినట్టి దూది కన్న
కరిగిపోవు వెన్నకన్న
మెత్తనైన మనసువున్న
వెంకన్నే మా నాన్న
అనురాగపు అమ్మమ్మా
మా అమ్మను కన్నమ్మా
విధి యొసగిన పైడిబొమ్మ
నిను తలచిన కంట చెమ్మ
నీదు దీవెనలను చల్లి
అస్తు అనుము కల్పవల్లి
నింగి నిలువ ఓతల్లీ
నా పదాల పాలవెల్లి
పలుకులమ్మ
నలువ కొమ్మ
రసన చెమ్మ
నెలవు కమ్మ
లేదు ఖ్యాతి
కాదు నీతి
చెప్పబోతి
లోకరీతి
రచయిత కలము
కృషికుడుహలము
ఎలుకలు బిలము
కలిగిన బలము
ఇంటికి దూలము
ఇంతికి చేలము
మనిషికి శీలము
గాంచని కాలము
చేయుట కష్టము
చేయక నష్టము
అందనిదిష్టము
నిజమిది స్పష్టము
ఎగురని పటము
పగిలిన ఘటము
మానని హఠము
గన సంకటము
కుదరని నెయ్యము
పండని వియ్యము
కోరని కయ్యము
తెలిసిన చెయ్యము
నేతల భోజ్యము
కల్లల వ్యాజ్యము
స్వార్థపు ప్రాజ్యము*
ఎలేను రాజ్యము
(ప్రాజ్యము= అధికము)
ఆడని ఆట
పాడనిపాట
చెప్పనిమాట
చిల్లులమూట
చిక్కని మాట
తియ్యని పాట
చక్కని యాట
కమ్మనియూట
పేదల సొమ్ము
చేయుట వమ్ము
మానరు లెమ్ము
నిజమిది సుమ్ము
పండని పంట
మ్రోగని గంట
కలియని జంట
ఎందుకనంట
వెలదుల వాడ
దుష్టుల జాడ
పట్టిన చీడ
వదలని పీడ
చిరిగిన జొల్ల
తిరుగని నల్ల
పాశినదెల్ల
వాడుట కల్ల
వాడని నిలువ
వాడిన కలువ
మాసిన వలువ
ఎందుకు తలువ
గాలి లోని ఇల్లు
మత్తులేని కల్లు
పోద్దుబోని సొల్లు
చెప్పు ఎటుల చెల్లు
ఆరిన కొలిమి
జారిన కలిమి
ధూర్తుల చెలిమి
కలుగవు బలిమి
మోవి హాసము
దొంగ వేసము
చేయు మోసము
డబ్బు కోసము
ఆరని మొహం
తీరని దాహం
పారని వ్యూహం
ఎందుకు స్నేహం
ఆరిన కాడీ
నలిగిన బీడీ
అలసిన బాడీ
కలుగవు వేడి
పగిలిన జాడీ
కదలని గాడీ
కూలిన మాడీ
కుదరని జోడీ
కరిచే చెప్పులు
నిలిచే అప్పులు
తెలిసిన తప్పులు
తెచ్చును ముప్పులు
***
పెరటికి చెట్టు
పడతికి జుట్టు
మాటకు విట్టు
తలవగ జట్టు
మమతల నిలుపు
మాయని వలపు
మనసున తెలుపు
మనుషుల కలుపు
సాంగ్సు మిక్సు
సచ్చు జోక్సు
సీను సెక్సు
సిన్మాజంక్సు
రాలిన పూత
రాల్చని దాత
పేరుకు నేత
పుడమికి మోత
ఆరని గాయం
అందని సాయం
బరువగు కాయం
బాధల నిలయం
మేనికి లక్సు
సెక్సీ లుక్సు
లోయర్ నెక్సు
యువతకు కిక్సు
అబ్బబ్బా టీనేజి
తలవ హైఓల్టేజీ
చదవబడితె కాలేజీ
చెదబడితే గారేజీ
రాలిన బొచ్చు
ఊడిన గచ్చు
కాయన పుచ్చు
ఎటు పనికొచ్చు
*****
36
ఉమ్మిన కిళ్ళీ
విరిగిన పాళీ
వివరపు స్తాళీ* (బొక్క పడిన లోటా)
వాడరు మళ్ళీ
మెతుకుల తట్ట
నిండని పొట్ట
అతుకుల బట్ట
బ్రతుకునదెట్ట
తోటకు మాలి
పాపకు లాలి
మనిషికి జాలి
మరి వుండాలి
ముందు క్యారేజి
మళ్ళి మ్యారేజి
పిదప బ్రేకేజి
వెరసి స్టోనేజి
వాడిన వనము
భీరుని గొనము
పలుకని జనము
పాశినశనము
జనహిత కాముడు
ఆరిజన భీముడు
రఘుకుల సోముడు
జగదభిరాముడు
మాటలుకల్ల
చేతలు డొల్ల
మనసొమ్మెల్ల
చేతురు గుల్ల
వింటికి గుణము
రాజుకు గణము
మనిషికి పణము
ఇది లక్షణము
దినమున సద్దు
ఖర్చుకు పద్దు
నారికి హద్దు
ఉండుట కద్దు
పడవకు తెడ్డు
కారుకు షెడ్డు
తప్పుకు సొడ్డు
వుండిన గుడ్డు
కట్టని చీర
మెట్టని దార
పాచిన కూర
ఎందుకులేర
హవేలీ నవాబు
కవేలూ గరీబు
కలిగితే షబాబు
కలుపులే షరాబు
చల్లటి గాలి
సరసపు ఆలి
పోయిన వాలి
పోదుము తేలి
కాయని కొమ్మ
పూయని రెమ్మ
పగిలిన బొమ్మ
ఎందుకు లెమ్మ
కైపు లేని రమ్ము
టైరు లేని రిమ్ము
పనికిరాని సిమ్ము
ఎందుకంట లెమ్ము
చదువులొ సున్న
స్టైలులో మిన్న
ఏమి లేకున్న
తపన ఎందుకన్న
శాంతి లేని ఇల్లు
సరుకులేని మిల్లు
పనికిరాని విల్లు
ఉన్న ఎట్లు చెల్లు
రష్షు లేని బారు
రుచి లేని సాంబారు
నడవలేని కారు
ఉందికూడా బోరు
చెల్లని చెక్కు
వాడని హక్కు
మారని లక్కు
తీరని చిక్కు
ఉండదు జెండా
ఉండదజెండా
కనబడకుండా
స్వార్థమె నిండా
జడగల జుట్టు
నుదుటిన బొట్టు
చీరల కట్టు
మగువకు మట్టు
వాడని డబ్బు
రాలని మబ్బు
అరిగిన సబ్బు
ఎందుకు సుబ్బు
వలదుర క్లబ్బు
వదలర పబ్బు
దుష్టుల హబ్బు
వద్దవి గబ్బు
తగలని తూటా
నడవని బాటా
పేలని మాటా
ఎందుకు బేటా
ఇతరుల బుద్ధి
పాసిన సద్ది
వదిలిన గద్ది
ఎందులకద్ది
టాపు లేని టేబులు
మితిమీరే డాబులు
తెగిపోయినకేబులు
ఎందుకొరకు బాబులు
కదలని క్యాబు
పంక్చరు ట్యూబు
చిల్లుల జేబు
ఎందుకు బాబు
పళ్ళూడే డెంటిస్ట్రీ
పసనెరుగని పోయాట్రి
పనికిరాని ఆర్టిస్ట్రీ
పండ్లనివ్వలేని ట్రీ
ముగిసిన జన్నం
కడుపుకు అన్నం
గడచిన బన్నం
బాధకు భిన్నం
చిరిగిన బుక్కు
వదులగు హుక్కు
వాడని హక్కు
వీడని చిక్కు
వుంచక నిక్కు
వీడుచు టెక్కు
దేవుని మొక్కు
కలుగును లక్కు
పేదకు టెక్కు
కారెడు ముక్కు
లూజగు టక్కు
ఉండిన చిక్కు
మూతికి మీసము
పెదవికి హాసము
వంటికి కూసము
సరిసహవాసము
ఇంటి ముందు ముద్దబంతి
ఇంతి జడన చేమంతి
మోవిపైన హాస కాంతి
అదేకదా సంక్రాంతి
మాటకు పట్టు
ఇంటికి చెట్టు
మేడకు మెట్టు
వుంటే ఫిట్టు
పశువుకు గడ్డి
బిడ్డకు చెడ్డి
అప్పుకు వడ్డి
ముఖ్యము రెడ్డి
జాబెందుకు బోడి
సిక్సుపెకు బాడి
నైసు ఫ్రెంచి దాడి
ఉన్న చాలు డాడి
ఫోర్వీలరు గాడి
డూప్లేక్సు మాడి
సాధించే వేడి
ఉంటే నాజోడి
మానని జిద్దు
చదవని మొద్దు
తెమలని పద్దు
వద్దనె వద్దు
అరిగిన బూటు
విరిగిన బ్యాటు
పగిలిన పాటు
ఉండియు లోటు
తెరవని గుడి
కుదరని మడి
జరగని బడి
ఎందుకు సుడి
కాళ్ళకు జోడు
కన్నెకు తోడు
షేవుకు బ్లేడు
ముఖ్యము చూడు
పెరుగని షేరు
కదలని కారు
తెలియని ఊరు
బహు బేజారు
మూసిన మండి
నచ్చని తిండి
పగిలిన కుండి
ఎందులకండి
లేని జాలి
పడని గాలి
వినని ఆలి
వద్దు జోలి
అత్త మాటు
భర్త చాటు
ఉన్నచోటు
లేదు లోటు
బీరు చుక్క
చికెను ముక్క
ఫోము పక్క
సుఖము దక్క
అంబలి చట్టి
నోటికి పెట్టి
లాగిన పట్టి
స్వర్గము చిట్టి
వదులు భ్రాంతి
వలదు క్రాంతి
వలయు దాంతి
అపుడే శాంతి
పనులు చేయు దిట్ట
మాటల వస పిట్ట
జ్ఞాపకాల పుట్ట
తీపి పళ్ళ బుట్ట
స్పీడుగ కారు
మార్చక గేరు
పోయెడు జోరు
చూడర సారు
పులిసియున్న తైరు
నీరు లేని పైరు
గాలిలేని టైరు
బండి లేని షైరు
భూమికి పలుగు
చేలకు అలుగు
కుదిరిన కలుగు
పంటల జిలుగు
ఉండలేని ఇల్లు
కట్టలేని బిల్లు
పెదవి దాటు పల్లు
చూడ వళ్ళు ఝల్లు
తెలియని తోవ
మునిగే నావ
తీరని యావ
వదులుము జీవ
గుడ్డికి చూపు
కుబ్జకు రూపు
నటునికి డూపు
దొరికిన ఊపు
మల్లె పువ్వు
బోసి నవ్వు
మొదటిలవ్వు
మనసు జివ్వు
అన్నానికి పళ్ళెము
గుఱ్ఱానికి కళ్ళెము
వాకిళ్ళకు గొళ్ళెము
లేకుండా వెళ్ళము
చల్లని పలుకు
చక్కని కులుకు
తేనెలు చిలుకు
ముచ్చటలొలుకు
*
క్రేడిటు కార్డు అరువు
తీర్చకున్న బరువు
వీపు పైన దరువు
గుండె యౌను చెరువు
మరుగు పడిన చట్టము
పొగ పోవని గొట్టము
కూడెట్టని పట్టము
పనికి రాని చుట్టము
ఫారిన్ కల్చరు క్రేజు
నేకెడ్ పిక్చరు మోజు
జీన్స్ పాంట్ రివాజు
యువతకు పట్టిన బూజు
దడ దడ దడ దడ మ్యూజిక్కు
దరియనీయదు లాజిక్కు
యువత భవిత కది చిక్కు
మంచి ఎట్లు తలకెక్కు
తినుటకు పన్ను
చూపుకు కన్ను
ఠీవికి వెన్ను
మనిషికి దన్ను
కాలి యందియల ఘల్లు
బీరు బాటిలు ఛిల్లు
జేబులో ఘలుఘల్లు
కలుగ వళ్ళు ఝల్లు
బ్యాటు సిక్సర్లు కొట్టు
స్పిన్నుపేసుల కనికట్టు
చూడ చూడ కిరికెట్టు
యువతనేమో చెడకొట్టు
జంట కలుపు
ప్రేమ తెలుపు
సంతు గొలుపు
పెళ్లి మలుపు
చేసిన తప్పు
తప్పక చెప్పు
దాచిన నిప్పు
కాల్చును కప్పు
లేని బెట్టు
లోని గుట్టు
తెలియనట్టు
అణచి పెట్టు
నీటిలో బురద
ఇచ్చు లేని దురద
నోటిలోని జరద
చెడుగు చేయు సరద
ఘాటులేని చారు
చల్లారిన సాంబారు
అన్నములో నీరు
వున్న తినుట బేజారు
అన్నమెట్టని తల్లి
గోడపట్టని బల్లి
మంచమెక్కని నల్లి
చూడలేమే చెల్లి
చెప్పలేని గురువు
చేవలేని తరువు
వేయలేని దరువు
మోయలేని బరువు
కూత లేని పిల్లి
కుట్ట లేని నల్లి
క్రికెటు లేని గల్లి
ఉండవమ్మ తల్లి
ఎండ లేని దుబాయి
సాకి లేని రుబాయి
గన్నులేని కౌబాయి
చూడలేములే భాయి
మనసు చెడుచు కామము
మరచినట్టి నీమము
చేరగినట్టి నామము
లేకయున్న సేమము
తిరుగలేని ఫ్యాను (fan)
కదలలేని వ్యాను (van)
మోయలేని క్యాను(can)
చెప్పనేల మ్యాను (man)
తీర్చలేనిఅప్పు
మానానికి ముప్పు (మానము ముఖ్యమనుకొన్నవారి ప్రాణానికి ముప్పు)
తెలిసి తెలిసి తప్పు
చేయనేల చెప్పు
అదిగదిగో కాశి
గంగా వారాశి
పాపతాప వినాశి
వేదబోధ ప్రకాశి
ఓడినచో తప్పు
గెలిచినచో ముప్పు
దొరల చెలిమి ఉప్పు
ఎక్కువైన ముప్పు
దైవ భక్తి
ఆత్మ శక్తి
బుద్ధి యుక్తి
యున్న వ్యక్తి
కరుకు లేని బాణము
కవి లేని దివాణము
ఘృతము లేని ద్రోణము (దొప్ప )
కట్టె విడిన ప్రాణము
షిట్టు లేని నోరు
కోకు లేని వూరు
జోషు లేని టూరు
లేనివారు లేరు
హాలాహలమాహారము,
మెడలోనా ఫణిహారము,
మరుభూములవిహారము,
నీ తలపే ఉపహారము.
చీరకట్టు
పంచకట్టు
మూట కట్టు
దాచిపెట్టు
దేవుని
మించిన తోడు
రాముని
మించిన ఱేడు
భర్తను
మించు పనోడు
వెదక
దొరకరే నాడు
జ్వాలాభీలము
పెళ్లను
జాలము
పరచెను
కాలము
మెడకది
దూలము
ఓట్ల
భిక్షుకాదక్షులు
వ్రేలిముద్ర
అధ్యక్షులు
పరధనాపహర
దక్షులు
మన రక్షక ప్రత్యక్షులు
మన రక్షక ప్రత్యక్షులు
తిరిగిందితానెన్నొ
గుళ్ళు
వేయించుకొనె
మూడు ముళ్ళు
ఆరోజు
నుండి నా ఒళ్ళు
ఎటుజూచినా
పగుళ్ళు
కాంత
చేతనే చెడెను ఇంద్రుడు
కాంత
చేతనే చెడెను చంద్రుడు
కానల
కేగెను రామ చంద్రుడు
కడకు
చచ్చె ఘనకౌరవెంద్రుడు
పెళ్ళాం
పట్టిన పంతము
తీర్చితివా
కథ సుఖాంతము
లేదా
దుఃఖమె జీవితాంతమూ
తెలియుము
జీవిత వేదాంతము
అడుసు
తొక్కనేల కాలు కడుగనేల
కల్లు
తన్ననేల కట్టు కట్టనేల
నిప్పు
తాకనేల చేయి కాల్చనేల
స్త్రీని
పొంది ఇస్త్రి చేయించుకోనేల
సహనము
మీలో సహజము
చేయను
మీతో వ్యాజ్యెము (తగవు)
మీదే
మాపై రాజ్యము
అమ్మలార
ఇది నిజము
Tumuluri
Sarma జగము గజము మనము కణము... పూరించుడు
శర్మ
గారూ, నేను
అవధానిని కాదు. నిదానిని. అంటే నెమ్మదిగా నాకు తోచినది వ్రాసుకొనేవాడిని. పోనీ
పండితుడనా అంటే, ఆ హోదా సాధించుటకు నాకు జీవితములో వెసలుబాటు
కలుగలేదు.
అయినా
మీ మాట కాదనలేక నా అల్పబుద్ధికి తోచినట్లు మీరిచ్చిన పదములతో పూరించినాను.
పండితులైన మీపరీక్షకు నిలచినానో లేదో తెలియదు. దోషములుంటే మన్నింప ప్రార్థన
విశాల
జగము
అందున
గజము
దేశము
నిజము
మనమా
బీజము
డబ్బును
మనము
వదలము
కణము
నిలువని
మనము
నిజముగ
మనము
విశాల
జగము
మది
మద గజము
నమ్మిన
మనము
అగుదుము
కణము
Murali
Thotapalle Venkata: Mee spurti aganamu (గణింప శక్యము కానిది.)
Savithri
Bachimanchi: 👌
Tumuluri
Sarma: స్వామీ నేను పండిత పుత్రుడను.క్షమించండి ఏదో flow లో అడిగాను.anyway బాగానే రాసారు thank you
sir 😊