Tuesday, 26 January 2021

లౌకిక వాదము (Secularism)

 లౌకిక వాదము (Secularism)

https://cherukuramamohan.blogspot.com/2021/01/secularism-httpcherukuramamohan.html

లౌకికము అంటే లోకమునకు సంబంధించినది అని నాకు తెలిసిన అర్థము. మన 

వేదశాస్త్రపురాణేతిహాసాల ప్రకారము మనకు భూలోకముతో కలిపి  14 

లోకములున్నాయి. అందులో 7 అధోలోకములు. మనమున్న భూలోకమునకు పైన 

భువర్లోకముసువర్లోకముమహర్లోకముజనోలోకముతపోలోకము మరియు 

సత్యలోకములుభూలోకముతో చేర్చి సప్త (7) లోకములౌతాయి. అదేవిధముగా 

భూలోకమునకు క్రింద అతలలోకమువితలలోకముసుతలలోకమురసాతల

లోకముతలాతలలోకముమహాతలలోకముపాతాళములని సప్త (7) అధో 

లోకములు వున్నాయి. ఇవి కాక లోకము యొక్క దక్షిణ దిశలో మృత్యు (యమ) 

లోకముప్రేతలోకమునరకలోకముపిత్రులోకములనే 4 భాగములు వున్నాయని 

శాస్త్ర వచనము.

అసలు ఈ మాట ఎందుకు చెప్ప వలసి వచ్చినదంటే ఇవి కూడా లోకములే కాబట్టి. మన 

పురాణాలలో మన పూర్వులు ఇక్కడకు గూడా పోయి వచ్చిన దాఖలాలున్నాయి కాబట్టి. 

ఇప్పుడిప్పుడే ఈ విషయములను మనము నమ్ముతున్నాము కూడా కాబట్టి. ఇప్పుడు, 

విషయానికొస్తే మన భూలోకమున తప్పించి, ఈ లౌకిక వాదము వేరు లోకాలలో 

వున్నట్లు మన పురాణాలలో చదువము. మన భూలోకమున వున్న ఈ వాదము దేశాలను 

బట్టి మారుతూ వుంటుంది, 'పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి' అన్నట్లు.

ప్రపంచములో అతి పెద్దవయిన రెండు మతములున్నాయి. ఒక్కొక్క మతమునకు 

ఒక్కొక్క సృష్టికర్త ఉన్నారు. ఇటు మన ధర్మము నందు గానీ అటు వారి మతములందు 

గానీ ఈ లౌకిక వాదము యొక్క ప్రస్తాపన రాలేదు. మనది ధర్మము వారిది మతము. 

పైపెచ్చు ఇది ఎంతో పురాతనమైనది కావున మన పూర్వులు లోకహితమును 

ఆదర్శముగా గొని ఏ పనినైనా ఏ నియమమునైనా తలపెట్టే వారు. ఈ ధర్మమునందు 

వెలసిన నీతి మార్గములను తెలిపే ఇన్ని శాస్త్రములు వేరు ఏ దేశములోనూ 20౦౦ 

సంవత్సరముల క్రితము నుండి ఏర్పడిన మతములలోనూ లేవు. వారి మత గ్రంధమే 

వారి సర్వస్వము. అందులోని ఏ విషయమును కూడా ఎవరూ ఎదిరించరాదు. మనది 

ధర్మము అని చెప్పుకొన్నాము కదా!  మరి ధర్మము అంటే ఏమిటిధర్మము అన్న 

మాటకు ఈ సందర్భమున ఆచరించు విధానము అన్న అర్థమును తీసుకొనవచ్చును. ఈ 

ఆచరణ ఒక వ్యక్తి దర్శకత్వములో నడుపబడుతూ లేదు. మిగత రెండు మతములలో 

ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవక్త వున్నాడు. వారి నిర్దేశమే వీరికి ఆదేశము. మరి మన 

ధర్మములో దేవుడే భూమి పైకి దిగి వచ్చి  చెప్పిన భగవద్గీతలో ఈ లౌకిక వాదము లేదు. 

ఆ రెండు మతములలోనూ వారివారి ప్రవక్తలు చెప్పలేదు. వారి ఉపదేశ సారము ఒకటే. 

దయతో నైనాధనముతో దానముతో నైనా సాధ్యము కాకుంటే  ఏలాగున 

నిర్దాక్షిణ్యముగా వారిని నిర్మూలించు. ఏది ఎట్లయితేనేమి ఈ లౌకిక వాదమును గూర్చి 

మాత్రము వారు చెప్పలేదు. మరి ఎవరు చెప్పినట్లు?

పై ప్రశ్నకు జవాబు చెప్పుటకు ముందు అసలు SECULAR అంటే అర్థమేమిటో 

తెలుసుకొందాము. ఈ పదము SAECULUM అన్న LATIN పద జన్యము. ఈ లాటిన్ 

మాటకు అర్థము ఏమిటంటే ‘ ఒక నిర్ణీత లేక నిర్దేశిత సమయము’ అని అర్థము. 

కాలాంతరమున దీనిని పారమార్థిక మరియు ప్రాపంచిక తారతమ్యముగా ఒక నూతన 

నిర్వచనమును ఇచ్చినారు అప్రాచ్యులు. అంటే చర్చికి సంబంధించిన విధివిధానముల 

నుండి ప్రజా కార్యకలాపములను వేరుపరచిఈ ప్రజలు కొనసాగించే ప్రవృత్తి పరమైన 

విధులను SECULAR అన్నారు. 19 వ శతాబ్దములో ఈ శబ్దము యొక్క అర్థమును

పాశ్చాత్య విజ్ఞులు మార్చి ధనిక శ్రామిక వర్గ సమన్వయముగా ఒక క్రొత్త భాష్యమును 

చెప్పినారు. రానురాను ఈ పదము యొక్క అర్థము దేశమును బట్టిదేశ నాయకుల 

నిర్దేశమును బట్టి  మారిపోతూ వచ్చింది. ఆ విధముగా మన దేశపు ప్రప్రధమ ప్రధాన 

మంత్రి యగు మన ప్రియతమ జవాహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు అల్ప సంఖ్యాకులకు అందులోనూ ముఖ్యముగా క్రైస్తవ ముస్లిం వర్గీయులకు అతిథి సత్కారముల చేయుట అన్న అంతర్లీనమైన భావన మన మనసులలో పాదుకొనునట్లు 

ఒక నిర్వచనమునిచ్చిఒక క్రొత్త అర్థమును ఏర్పరచితాను మనకు చేసిన మేలును కలకాలమూ గుర్తుంచుకొను  లాగున చేసి పోయినారు. బహుశా వారిలో వైదిక రక్తము లేదేమో! నిజము దేవునికి ఎరుక. పైన తెలిపిన పదమునకు  మన ప్రియతమ ప్రధాని నెహ్రూ గారు ఆచరణలో చూపించిన అన్వయమునకు ‘అబ్దుల్ ఖాదరు కు అమావాస్య కు’ మరియు ‘తాతాచార్లకు పీర్ల పండుగకు’ ఉన్న సంబంధము వంటిదే!. అంటే సంబంధము లేదు అని అంతరార్థము.

నెహ్రూ గారు ప్రధానిగా వున్నా కాలములో వారిది అంతరంగిక లౌకికము అంటే అది 

అపారదర్శకము అంటే పారదర్శకము కానిది.  అంటే లౌకికము అన్న ముసుగులోపల 

వారికున్న ఆలోచనలు. అప్పటి దేశ ఉపప్రధాని గృహ మంత్రి అయిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ గారిది బహిరంగ లౌకికము అంటే పారదర్శక లౌకికము. అందుకే 

జమ్మూ కాశ్మీరుకు Article 370 పటేలుగారు ఎంత ప్రతిఘటించినా నెహ్రు గారు అమలు 

పరిపించటము. ఆ Article 370 ని దులుపుకొనుటకు కొత్త ప్రభుత్వపు పట్టుదల వల్లనే 

2019 August 5 న సాధ్యమైనది.  

అసలు విషయమునకొస్తే, 1950 లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పటేల్ పురుషోత్తం దాస్ 

టాండన్ గారిని నిలబెడితే నెహ్రూ గారు వారికి పోటీగా ఆచార్య కృపలానీ గారిని నిలబెట్టినారు. నెహ్రూ గారు విశ్వ ప్రయత్నము చేసినా టాండన్ గారే గెలిచినారు. భారతీయ సంస్కారము కలిగిన వారు కావున వారు కార్యవర్గములో నెహ్రూ గారికి కమిటీ సభ్యునిగా స్థానమిచ్చినారు.  అటు పిదప ౩ సంవత్సరములకే పటేలుగారు మరణించుటతో నెహ్రూ గారు తమ మానసిక మంత్రం దండము త్రిప్పి టాండన్ వర్గము చేత తమతమ పదవులకు రాజీనామా ఇప్పించ గలిగినారు.

ఆంగ్లములోని ఈ వ్యాఖ్యను గమనించండి.

Nehru was considered by the international media as a person who, to quote 

the words of the Gettysburg Times, “suffered from a monumental inferiority 

complex.” This resulted in Nehru claiming he was an Englishman, and he 

displayed the same kind of disdain towards Indian people and culture that 

the English rulers had displayed.

‘ఏకమేవాద్వితీయంబ్రహ్మ’  అన్న సిద్ధాంతమునకు కట్టుబడి ఇటలీ లోనే సచ్చితానంద 

మిషన్ స్థాపించిన   Father Anthony Elenjimittam గారు1951లో Libertarian అన్న 

పత్రికకు   editor గా పని చేస్తూ వుండిన వారు తాము 1951లో తాము వ్రాసిన 

పుస్తకములో ఏమి వ్రాసినారో చూడండి.

Elenjimittam also decried the hypocrisy of Nehru when he wrote that “the 

veteran Congress leaders, with Pandit Nehru at the top, continue to shout 

from the housetops in and out of time about their new fad of pseudo-

secularism.” This was possibly the first usage of the term ‘pseudo-secularism’ 

in the context of Indian politics.

1962 చైనా యుద్ధములో భయంకర ఓటమిని మన దేశము చవిజూచుటకు వారువారి 

అనుచరుడుఅంతేవాసి  మరియు నాటి రక్షణ శాఖ మంత్రి కృష్ణమీనన్ గారలు 

కాదా!      

ఈనాటికీ దేశము దరిద్ర రేఖ వద్ద కొట్టుమిట్టాడుట వారి ఆంతరంగిక అ+పారదర్శక 

(అపార+దర్శక అని విడదీయవద్దు,) విధానములవల్ల కాదా!

(ఈ విషయములను అరవింద కుమార్ గారి రచనల నుండి సేకరించినాను.)

స్వతంత్రము వచ్చి 70 సంవత్సరములు కావచ్చినవి. 1947 నాటి నుండి నేటి వరకు ఈ 

సనాతన ధర్మావలంబుల జననములు ఎంత శాతము తగ్గినవి అల్పసంఖ్యాకుల 

జననములు ఎంత శాతము పెరిగినవి ఒకసారి గణనాంకములను పరిశీలించితే 

అర్థమౌతుంది. మరి అల్పసంఖ్యాకులకు ఇచ్చే వసతులు వారి జనాభా పెరుగుదల 

కోసమా! మరి పేదరికము కోసము అనుకొంటే ఈ దేశమునుఈదేశ ధర్మమునుఈ 

దేశపు మహనీయులను వారి ఆవిష్కరణలను నమ్ముకొని  యున్న వారిలో పేదలు లేరా! 

మరి ఈ వివక్ష లౌకికమా లేక మాయాలౌకికమా?

తమ పుణ్య క్షేత్రములకు ఆ మతస్తులు పోవుటకుఇప్పటి వరకు ముస్లీములకు మాత్రమె 

వుంది, ఇపుడు కిరస్తానీలకు కూడా వచ్చింది. మరి వీరికి రాయితీలున్నాయి కదా, 

అత్యంత నిరుపేదలైన మన వారికి ఏ కేదారనాథ్ ,బదరీనాథ్ యాత్రలకు అటువంటి 

రాయితీలివ్వవచ్చు కదా! ఈ మధ్యన మన వాళ్లకు కూడా ఎదో రాయితీలు, బలవంతపు 

మాఘస్నానముగా, పెంచినట్లు ఇన్నాను. నిజము దేవుడెరుగు,.

క్రైస్తవులకు వాటికన్ముస్లీములకు మక్కా వున్నవి కదా! మరి ఆ స్థలములకు 

హిందువుల ప్రవేశమును అనుమతిస్తారా! అటువంటప్పుడు తిరుమల కొండపై 

అన్యమతస్థులు ఏ విధముగా ప్రవేశించ గలుగుతూ వున్నారుకారణము నేను 

చెప్పగలను. ఆ పోయే వారి పూర్వులు ఈ భూమి పై జన్మించిన వారే! ఈ వైదిక 

మతమును అవలంబించిన వారే! అందువల్ల  వారి సంతతిని  పరమతస్తులు అని 

గుర్తించుట కష్టము. అబద్ధములు చెప్పి నమ్మించివారు సులభముగా తిరుమల 

చేరనూవచ్చును. తలచినది చేయనూ వచ్చును.

ఇక ఈ దేశము SECULAR దేశము అని అంటారు. అది ఆవిధముగా ఒకరి చేత ఏదో 

విధముగా చేయబడినది కానీ ప్రజల అభిమతముతో కాదు. సహనానికి ప్రతీకలైన ఈ 

సనాతన ధర్మపరులు పోనీ పాపమని అనుకొన్నారు కానీతమ చాప క్రిందికే నీళ్ళు 

వస్తాయని ఊహించనే లేదు.

-మిగిలినది రేపు......

లౌకిక వాదము-2వ భాగము

‘కులము’ అన్న మాట ఉపయోగించుట నేటి కాలమున వేదికలెక్కి మాట్లాడే 

పెద్దలకుపెద్ద నేరమైపోయింది. అది ‘అలౌకికమైన’ మాట అయిపోయినది. దీనికన్నా 

ముందు ఈ విషయముక్రైస్తవఇస్లాం మతములందు అసలు వున్నదా లేదా 

చూద్దాము. నేను Google search లో చదివి తెలుసుకొన్న మేరకు  క్రైస్తవములో 

30,000 కు మించిన వర్గములున్నవి. నిర్దారిత సంఖ్య మనకవసరము లేదు కానీ 

వారిలోని విభాగములు మాత్రము ఇంతకన్నా కొంచెము ఎక్కువే వుంటాయి. వీరిలో 

చాలా వర్గములుఒక వర్గము వేరొక వర్గములో వారిని పెళ్లి చేసుకొనరు. ఒక క్యాథలిక్ 

అమ్మాయి  ( Syro Malabar Church Kerala, India ) ఒక Malankara orthodox చర్చి 

అబ్బాయిని ప్రేమించింది. రెండు కుటుంబముల మధ్య చర్చల తరువాత ఇరు వర్గాలూ 

పెళ్ళికి ఒప్పుకొనుట జరిగింది. ఇక్కడ అమ్మాయికి సంబంధించిన క్యాథలిక్ చర్చ్ వారు 

దీనికి ఒప్పుకోలేదు. వారు ఏమన్నారు అన్నది ఆ అమ్మాయి మాటలలోనే చదవండి:  

The catholic church (my parish) intervenes and says 'we will not allow this" 

as in they can’t allow their sheep to be stolen by other churches.” మరి 

మిగతా 30,000 పై చిలుకు చర్చిల మాటేమిటిమరి వీరిలో ‘Sheep Stealing’ కు 

ఒప్పుకొనేవెన్నిఒప్పుకొననివెన్ని?

ఇక ఇస్లాం విషయానికి వస్తే అక్కడి పరిస్థితి ఒక్క సారి చూడండి : (గూగుల్ సౌజన్యము)

The fact that the Ashraf belonged to the dominant political elites, while the 

bulk of the Ajlaf remained associated with ancestral professions as artisans and peasants who were looked down upon as inferior and demeaning.

 మరి ఈ మతాలలో లౌకికత ఎంత మాత్రము వుంది. వీరి చర్చిలకు మసీదులకు డబ్బు 

వరద లాగా ప్రవహించుతూ వుంటుంది. మరి ప్రభుత్వమునకు ఈ నిధుల పై నియంత్రణ 

వున్నదా! మరి మన ధర్మము పైనే ఎందుకుఇది ఏ విధమైన లౌకిక వాదము.

జన బాహుళ్యములో విరివిగా ‘కుల ప్రస్తాపన’ ఎక్కువగా వస్తుంది. సనాతన 

ధర్మావలంబులగు వారు ఎవరైనా శ్రీకృష్ణుని పరమాత్మ గానూ జగద్గురువుగాను, 

ఆయన చెప్పిన గీతను శిరౌదార్యముగానూ ఎంచుకొంటాము. మన గుణ కర్మలనుబట్టి, మన తరువాతి జన్మను ఆ పరమాత్ముడే నిర్ణయించుతూ వున్నాడు. మనము దానిని కాదని కొత్త పోకడలపోతే ఆకర్మ యొక్క పర్యవసానమును మనము తిరిగీ అనుభవించవలసి వస్తుంది కదా మరుజన్మలో! పరమాత్ముడే గీతలో ఈ విధముగా చెప్పుచున్నాడు:

చాతుర్వర్ణ్యం  మయా  సృష్టం  గుణకర్మవిభాగశః  తస్య  కర్తారం  అపి 

 మాం  విద్ధి  అకర్తారం  అవ్యయం

భగవాన్ ఉవాచ: బ్రాహ్మణ’,‘క్షత్రియ’,‘వైశ్య’,‘శూద్రులు’  అనే నాలుగు వర్ణాల 

సముదాయము గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘నా చేత’ సృష్టించబడింది. ఈ 

విధమైన సృష్టి రచనకు కర్తను ‘నేనే’ అయినప్పటికీ ,నాశరహితమైన ‘నన్ను’‘ అకర్త ’ 

గానే నువ్వు తెలుసుకో.

ఇక్కడ గుణ కర్మల చేతనే పై నాలుగు వర్ణములలోని ఎదో ఒక వర్ణములో మానవుడు 

పుట్టుట జరుగుతూ వుంది. మరి ఇది దేనిననుసరించి జరుగుతూ వుంది. ‘గుణ కర్మ 

విభాగశః’ వారివారి గుణ కర్మల ననుసరించి ఈ విభాగము జరుగుతూ వుందని 

పరమాత్ముడే చేబుతున్నాడు. చాలామంది పుట్టినంత మాత్రాన ఎవడూ 

బ్రాహ్మణుడైపోడు అంటూ వుంటారు. ఇది ఎట్లు సమంజసముఒక వ్యక్తి యొక్క 

పుట్టుక పూర్వజన్మ కర్మఫలానుసారముగా జరుగుతూవుంది అని పరమాత్మనే 

చెప్పినాడు. మరి ఏ వర్ణములో పుట్టినవారు ఆ వర్ణస్తులు ఎట్లు కాకుండా పోతారు. కానీ 

వారు ఈ జన్మలో తమ కర్మ విధి విధాన రహితముగా చేస్తే మరు జన్మలో ఏ పేడ పురుగు 

నైనా కూడా పుట్టవచ్చు. ఈ జన్మలో శూద్రునిగా పుట్టిన వ్యక్తి తన విధి విధానమును 

పాటించుతూ పరమేశ్వరారాధన చేస్తే ఈ జన్మ లోనే బ్రహ్మత్వమును పొందవచ్చు.  

నామదేవభక్త కుంభార్భక్త నందనార్, భక్త  కనకదాస్, మాతా అమృతానందమయి

షిర్దీ సాయిబాబా, త్యసాయిబాబా మొదలగు వారంతా బ్రహ్మత్వమును పొంది 

బ్రాహ్మణుల చేత పూజింప బడినవారే!  బ్రాహ్మణత్వమును పొందుటఏ గాక, వీరిలో 

పెక్కురు, ప్రపంచముచేత ఆరాధింప బడలేదా!

తన జ్ఞానానికే కంచె ను ఏర్పరచుకొన్న ఒక  ఆచార్యుడు(Professor), తాను ప్రసంగించే  

వేదికలపై ముఖ్యముగా బ్రాహ్మణుల పైన ఈ ప్రశ్నను ఎక్కువగా సంధిస్తుంటారు.

‘ఈ బ్రాహ్మలు’ హరిజనుల ఇండ్లలో భోంచేస్తారా!’ అని. నేటి కాలానుగుణముగా 

బ్రాహ్మణులు హోటళ్ళలో  భోజనము చేస్తూ వున్నారు. అది కూడా శాఖాహార 

మాంసాహార సంయుక్త భోజన శాలలలో! అసలు శాఖాహారపు హోటలులోనే ఒక బ్రాహ్మణుడు ఒకవేళ భోజనము చేసినాడు అనుకొన్నా ఆ వడ్డించినవాడు హరిజనుడు కాదు అని చెప్పగలరా! 

భోజనము చేయ ఆ హోటలుకు పోయిన బ్రాహ్మణుడు ఇటువంటి అనుమానములు 

తనకు కలిగినా, పోవుట లేదా! ఇక్కడతినుటకు వెళ్ళేవాడు శుభ్రత చూస్తున్నాడు కానీ 

కులము కాదు. అసలు చేసేవాడు హరిజనుడైనా తినబోయే వాడు అభ్యంతరముగా 

భావించుట లేదు. నేను చూసిన ఒక వాస్తవమును తెలుపుకుంటున్నాను. 

        ఇది చాలా కాలము క్రిందటి మాట. తన కర్మను నమ్మిన ఒక చర్మకారుడు శ్రమకోర్చి, చెమటోడ్చి, తన కొడుకును B.Tech, చదివించినాడు. భార్యతో గూడా 

తానుండేది ఒక గుడిశె లో !

కొడుకు US   వెళ్లి ఒక విదేశీ యువతినేతల్లిదండ్రులను పిలువకనే, అసలు తలువకనే,  

కట్టుకొని అక్కడే వుండిపోయినాడు. భార్య బలవంతము పై ఒక సారి తల్లిదండ్రుల చూడ, తన వూరికి వచ్చినాడు.  అమ్మ, రాక రాక వచ్చినారు, వంట చేస్తాను, అన్నము తినండి అని ఆప్యాయముగా అడిగితే వద్దు మేము హోటల్లో తింటామని కర్కశముగా

 చెప్పినాడట. ఇది ఆ తండ్రి నాతో చెప్పిన మాట. ఛత్రపతి శివాజీ కుమారునితో బాటూఆ బాలుని ఎంగిలి తిని ఔరంగజేబు బారినుండి ఆ బాలుని ప్రాణములు రక్షించినాడు ఒక నైష్ఠికాచార పరాయనుడగు బ్రాహ్మణుడు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవము. కానీ ఇటువంటి వాస్తవ  ఉదంతములు పాఠ్యాంశములుగా మన కుహనా లౌకిక వాద ప్రభుత్వములు ఉంచవు. మరి ఈ ఉదాహరణలు ఏవిధమైన లౌకిక వాదమును బలపరుస్తున్నాయి

లోక రక్షణకు కావలసినది ఆప్యాయత అనురాగము ఐకమత్యముఅంతేకానీ అన్నము 

తినుట కాదు. ఇక అన్య వర్ణస్థులను పౌరోహితులుగా మార్చుట. ఆంగ్లేయుల ఆగమనముతో అన్నీ తలక్రిందులైనాయి గానీ అంతకు మునుపు బ్రాహ్మణులు తమ వృత్తిని నియమ నిష్ఠలతో చేసేవారు. వేదాధ్యయనమునియమ నిష్ఠల పాలనముమంత్రోచ్ఛారణ సులభమైన పనులు కావు. వారికి నియమము ఎంత ముఖ్యమో సంఘ శ్రేయస్సు అంతకన్నా ముఖ్యము. ఇక ఖ్యాతికి కులముతో సంబంధము లేదు. నిజానికి బాబాసాహేబ్ భీమ్ రావు  అంబేవాడేకర్ అన్నది అంబేద్కర్ అసలు పేరు. ఆయనను చేరదీసి తన ఇంటి పేరిచ్చిన వాడు ఉపాధ్యాయుడగు  మహదేవ్ అంబేద్కర్ అన్న బ్రాహ్మణుడు. ఆయన చదువుకు సాయపడినది అప్పటి బరోడా మహారాజయిన సాయాజీ రావు గైక్వాడ్. మన మాజే అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారిని విద్యార్థి దశలో రామనాథపురములొని ఒక బ్రాహ్మణ దంపతుల జంట చేరదీసి చదివిన్చినారని వినియుండినాను. తెలిసిన వారెవరైనా నిజానిజములను తెలుపగలరు. ఈ విషయముల ప్రస్తాపన ఈ కుహనా లౌకిక వాదులు ఎప్పుడూ తెలియజేయరు కదా! ఇక Reservations ను గూర్చి ఒక్క మాట:

మిగిలినది రేపు....

లౌకిక వాదము-3వ భాగము

Reservations ను గూర్చి ఒక్క మాట:

When the constitution was first introduced on 26th November 1949, article 

334 titled “Reservation of seats and special representation to cease after 

twenty years” stated

“Notwithstanding anything in the foregoing provisions of this Part, the provisions of this Constitution relating to

(a) The reservation of seats for the Scheduled Castes and the Scheduled 

Tribes in the House of the People and in the Legislative Assemblies of the 

States.

This meant that, reservation of SC/STs in House of the People and in 

Legislative 

Assemblies of the states should not be in effect post 1970.

ఇవి కొనసాగునట్లు సంవిధానమును మారుస్తూ వస్తూనే వున్నారు. ఇప్పటికి 2020 

వరకు ఈ విధానము కొనసాగుతుంది. అంటే సంవిధాన కర్త గా చెప్పబడే అంబేద్కర్ 

గారు  నిజానికి Drafting Committee Chairman మాత్రమే!

Committee on the Rules of               Rajendra Prasad

Procedure

Steering Committee                           Rajendra Prasad

Finance and Staff Committee             Rajendra Prasad

Credential Committee                    Alladi Krishnaswami Aiyar

House Committee                         B. Pattabhi Sitaramayya

Order of Business Committee             K.M. Munshi

Ad hoc Committee on the                 Rajendra Prasad

National Flag

Committee on the Functions of           G.V. Mavalankar

The Constituent Assembly

States Committee                        Jawaharlal Nehru

Advisory Committee on                   Vallabhbhai Patel

Fundamental Rights, Minorities

And Tribal and Excluded Areas

Minorities Sub-Committee                H.C. Mukherjee

Fundamental Rights                      J.B. Kripalani

Sub-Committee

North-East Frontier Tribal Areas        Gopinath Bardoloi

And Assam Excluded & Partially

Excluded Areas Sub-Committee

Excluded and Partially Excluded         A.V. Thakkar

Areas (Other than those in Assam)

Sub-Committee

Union Powers Committee                  Jawaharlal Nehru

Union Constitution Committee            Jawaharlal Nehru

Drafting Committee                      B.R. Ambedkar

 Sir Benegal Narsing Rau was appointed as the constitutional advisor. He later 

became First Indian Judge in International Court of Justice in 1950.

In Ambedkar’s own words

The Draft Constitution as prepared by the Constitutional Adviser as a text for 

the Drafting Committee to work upon, consisted of 243 articles and 13 

Schedules. The first Draft Constitution as presented by the Drafting 

Committee to the Constituent Assembly contained 315 articles and 8 Schedules.

మరి నల్ల సూట్ తో నల్ల రాజ్యాంగ పొత్తమును బట్టి నిలచిన అంబేద్కర్ గారి 

విగ్రహములకు అర్థమేమి?

The Assembly then appointed the Drafting Committee which worked on the 

original draft prepared by Mr. B. N. Rau and produced the Draft Constitution 

which was considered by the Assembly at great length at the second 

reading stage.”

http://parliamentofindia.nic.in/ls/debates/vol11p12.html

Gandhiji never believed in superficial measures Reservations being one of them. Some of his views are:

“So far, as the Reservation in Government Departments is concerned, I think, 

it will be fatal to a good Government, if we introduce there the communal 

spirit. For administration to be efficient, it must be always in the hands of the 

fittest. There should certainly be no favoritism. If we want five engineers, 

we must not take one from each community, but we must take the fittest of five, even if they were all Muslims or all Parsis. The lowest poor must, if need be, filled by examination by an impartial board consisting of men belonging to different communities.” (Google Search)

నిజానికి ఇప్పుడు ఏ వెసలుబాటు ఉన్నదో అది కొన్ని రూపాంతరములు చెందిన బెనెగళ్ళ 

నరసింగ్ రావు గారి చిత్తజము(Brain Child) గానీ అంబేద్కర్ గారిది కాదు.  గాంధీజీ 

గారితో బాటూ ఈ సూత్రమును అంబేద్కర్ గారు కూడా వ్యతిరేకించినారు. ఈ 

విషయమై గాంధీ గారు నిరాహార దీక్ష కూడా చేసినారు.

           ఇంకొక విషయమేమిటంటే దళిత వర్గముల నాయికునిగా ఎవరిని చేస్తే 

బాగుంటుందన్న మీమాంస వచ్చినపుడు దేశ నేతల మదిన మెదలిన రెండు పేర్లు 

అంబేద్కర్ మరియు జగ్ జీవన్ రాం. జగ్ జీవన్ రాం గారు, ఆదాయపు పన్ను ఎందు 

కట్టలేదంటే మరచిపోయినానని కొంత అపఖ్యాతి మూట కట్టుకొనుటవల్ల అంబేద్కర్ 

గారికివ్వటము జరిగింది. ఇదంతా నేతలాడిన నాటకము ప్రజకు జూపిన బూటకము. 

ఇదియంతా కుటిల లౌకిక వాదమే! ఈ నిమ్న జాతి అన్న పేరుతో చేయుచున్న 

ఆరక్షణవల్ల మనలో ఒకరి మధ్య నొకరికి  అగాథము పెరుగుటయే తప్ప తరిగినది 

తరుగునది లేదు. మానసిక యోగ్యత ను బట్టి విద్యాఉద్యోగావకాశములు వుంటే దేశము 

ప్రగతి సాధించగలదు కానీ అన్యథా కాదు.

ఇక వర్ణము, కులము ను గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.

రేపు మాట్లాడుకొందాము.......

లౌకిక వాదము-చివరి భాగము

 ఇక వర్ణము, కులము ను గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.

 కులము అన్న మాటకు అర్థము కొరకు నేను  3 భాషా నిఘంటువు లను  పరిశీలించితే 

మూడింటి లోనూ ఈ విధమైన అన్వయము చూచుట జరిగినది .

 [తెలుఁగు]వంశము, జాతి, తెగ, ఇల్లు, శరీరము, అంతఃపురము

 [తమిళము]కులమ్‌, వంశమ్‌, జాతి, ఇనం, ఉడల్‌, వీడు, అరమనై, కుడి.

 [కన్నడము]వంశము, మనె, తెగె, వంగడ, శరీర.

 

ఈ మూడింటి లోనూ వంశము జాతి తెగ అని చెప్పినారే గానీ వేరేమీ తెలుపలేదు. 

ఇప్పుడు కులము అన్నది చెడ్డ మాట అనుకొందాము,అప్పుడు వంశము ,తెగ , జాతి అన్న 

మాటలు కూడా తప్పే కదా! కులము సంస్కృత పదమే అయినా వర్ణం అన్న పదాన్ని 

నాకు తెలిసినంత వరకూ ఆ భాషా సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించినారు. గీతాచార్యులు కూడా 'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః

 తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' అని చెప్పినారు. అంటే వారి, వారి గుణాలు 

కర్మల ననుసరించి తగిన విధంగా నేనే ఈ నాల్గు వర్ణములను సృజించినాను అని 

అన్నారు. వర్ణము అన్న మాటకు బంగారు అన్న అర్థము కూడా వుంది. మరి నాల్గు 

వర్ణములలో ఏది మేలిమి బంగారము, ఏది కాదు అని మనము నిర్ణయించ గలమా ! ఈ 

విషయమై సమగ్రముగా చదువ వలెనంటే ఈ దిగువ లంకె లో చదువవచ్చు.

 http://cherukurammohan.blogspot.in/

 'క్యాస్ట్' అనేది ఆంగ్ల పదము కాదు అది 'పుర్తగల్లు' పదము. (From Portuguese Casta 

meaning race, breed, ancestry). Breed అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ’

group of organisms having common ancestors and certain distinguishable 

characteristics, especially a group within a species developed by artificial 

selection and maintained by controlled propagation.' అని యున్నది. అదే 

విధముగా Race అంటే 'A local geographic or global human population 

distinguished as a more or less distinct group by genetically transmitted 

physical characteristics.' అని వుంది. మరి మన 'వర్ణం' 'కులం' అన్న మాటలకివి 

సమానార్థకాలౌతాయా? ఇక 'ancestry' అన్న పదాన్ని మన 'కులము' నకు జత 

కలుపలేము. కమ్మరి,కుమ్మరి,చాకలి,మంగలి (మంగళకరమైన ప్రతి పనికీ 

ముందుండేవాడు) అని వాడితే తప్పా.

 క్రైస్తవములో ఈ విచక్షణ లేదా. వాళ్ళూ 'బ్లాక్ స్మిత్' 'పోట్టరర్' 'వీవెర్' మొదలగు 

పదాలను వాడుతారు కదా. అదేవిధంగా అరబ్బీ,ఫార్సీ, గ్రీకు, లాటిన్లలో కూడా ఆయా 

పనులకు సంబంధించిన పేర్లు ఆయా పనులు చేసే వారికున్నాయి. ఈ నాటికీ బ్రిటీషు 

పార్లమెంటు లోని విభాగాలను 'హౌస్ ఆఫ్ లార్డ్స్' హౌస్ ఆఫ్ కామన్స్' అంటారు. 'లార్డు

'కామన్' అన్న అంతరాలు వాళ్ళలో ఈ నాటికీ లేవా! మనమెంత కాదనుకొన్నా ఇవి 

ప్రకృతి జన్యములు. ఇది భగవత్ సృష్టి. మనము లేదనుకొన్నంత మాత్రాన అవి లేకుండా 

పోవు. కులాన్ని గురించి మాట్లాడే గుణవంతుని ఇంట్లో పని మనుషు లెందుకు. అంతా 

సమమే అయితే ఎవరి పని వారే చేసుకోవచ్చు కదా.

 స్థావరముల విషయానికొస్తే వెంపలి మఱ్ఱి రెండూ చెట్లే. ఏ జాతి చెట్టును ఆ పేరు తోనే 

పిలుస్తాము. కానీ దేని విలువ దానిదే. భగవంతుని సృష్టి లో ఏదీ ఎక్కువ కాదు ఏదీ 

తక్కువ కాదు. రెండూ పండ్లే యని 'మామిడి పండుకు' బదులు 'ఊస్తిపండు' ను 

తినగల్గుతామా! అట్లని అమిత చేదైన ఊస్తిని వాడనే వాడమా! మధు మేహమునకది 

అత్త్యుత్తమ ఔషధము. ఆకాశములో ఎగిరేవి అన్నీ పక్షులే. గండభేరుండాలు గ్రద్దలు 

కాకులు పిచ్చుకలు రామ చిలుకలు, దేని ప్రత్యేకత దానిదే. అట్లే జలచరాలలో గూడా. 

భగవంతుని సృష్టి అంతా 'భిన్నత్వములో ఏకత్వమే. '

ఇది మరి లౌకిక వాదమా లేక కుహనా లౌకిక వాదమా! పూర్వులు చెప్పినది అనుసరించి 

ఆచరించే వారు కొందరైతే అవమాన పరచి  అగౌరవ పరచే వారు కొందఱు. 

మహమ్మదీయ దండయాత్రలకు పూర్వము  వరకు సుఖ సంతోషాలతో శాంతి 

సౌఖ్యాలతో భాసించిన ఈ దేశమునకు హీనత దీనత నాపాదించిన వారు ముస్లిములు 

క్రైస్తవులు కాదా! మరి వారిని ద్వేషించుటకు బదులు మనలను మనమే ఎందుకు 

ద్వేషించుకొంటున్నాము. ఆధునికుడు మహనీయుడైన వివేకానందులవారు తమ 

భాషణలలో ఎప్పుడూ కుల దూషణ చేసియుండుట నేను వారి రచనలలో చదువుట 

తటస్థించలేదు.

వర్ణ వ్యవస్థను పాటించని వారి వలె పాటించే వారు కూడా వుంటారు. ఈ వాస్తవాన్ని 

గమనించండి.  హిందు ముస్లిం సిఖ్ ఈసాయి అంటే అందరూ భాయీ, భాయీ 

అనేవారే!  మరి అదే విధముగా కుల వ్యవస్థను పాటించే వారు పాటించని వారూ 

విద్వేషములు లేకుండా ఎవరి దారి వారిది గా వుంచుకొంటూ కూడా కలిసి మెలిసి 

ఉండవచ్చు కదా! తమ పంథా మాత్రమే సరియైనదనుట పిడి వాదము కాదా!

దేశమంతా కొనియాడిన సింధు అనబడు పూసర్ల వెంకట సింధు బాడ్మింటన్ రజతము 

Olimpics లో గెలిస్తే వైశ్య వర్గము తమ వర్గపు ఆడపడచు అన్న మాటలో తప్పేమిటో 

నాకు తెలిసి రాలేదు. వేరొక వర్గము వారు కూడా తమ ఆడుబిడ్డ అన్నారు. బహుశ అది 

అంత ప్రాచుర్యమునకు వచ్చినట్లు లేదు. అసలు వైదిక వ్యవస్థకు పట్టుగొమ్మలు వైశ్యులు. 

భగవంతునిచే ఆర్ధిక శక్తి వారికి నిర్దేశింపబడినది. నిజమైన వైశ్యధర్మావలంబి తన 

వ్యాపారములోని, ఆదాయమునందు కొంత శాతము ప్రజా ప్రయోజనములకే ఖర్చు 

పెడతాడు. ఇది కూడా శాస్త్ర నిర్ణయము. తమ వర్ణము కాని వాడినైన నా చదువుకు ధన 

సహాయము వారు చేసియుండి యుండకపోతే నేను ఈ మాత్రము చదువగలిగే వాడినే 

కాదు. అంతటి వదాన్యులు, ఏ రోజూ తమ గొప్ప తాము ప్రకటించుకొననివారు 

ప్రపంచమునకు తమ వర్గమునుండి వచ్చిన ఒక ఆడుబిడ్డ దేశమునకు ఇంత ఎనలేని 

ఖ్యాతి తెస్తే మా బిడ్డ అనుట అంత తప్పయిన విషయమా! తమ బిడ్డ అని వారు 

చెప్పుకొన్నంత మాత్రాన ఆమె ఈ దేశపు బిడ్డ, మన అందరి బిడ్డ కాకపోతుందా! ఎక్కడో 

అక్కగారి ఆడుబిడ్డ కొడుకు కు 1st. Class వస్తే ఫోటోలు పెట్టి అటు వార్తాపత్రికలలో 

ఇటు గ్రంధముఖి లేక ఆస్య గ్రంధి లో (Facebook) ప్రచారము చేసుకొనుట లేదా! ఎవరి 

సంతోషము వారిది. పైగా అది అభ్యంతరకరమైనది కాదు. మరి ఎందుకీ విద్వేషము.

ఆనోభద్రాః క్రతవో యత్ను విశ్వతో వి దభ్దాసో అపరితాస ఉద్బితఃl

దేవానో యథా సదమిధృతే అసన్నప్రాయువో రిక్షితారో దివేదివేll  ఋగ్వేదము25-14.

దశ దిశలనుండి ఉదాత్త భావములే ప్రసరించు గాక అన్న ఇంతటి ఉదాత్తములగు 

ఆలోచనములు వేదములు, ఉపనిషత్తులు, భారత సాహిత్యముకాక వేరు ఏ 

సాహిత్యమున కూడా ఆలోచనకే అందని విషయము.

ఇక మన దేవాలయములు మాత్రమే ప్రభుత్వపు అదుపాజ్ఞలలో పనిచేస్తాయి. పైగా 

దేవాలయముల నుండి వారి రాబడి రెండు విధములు. 1. దేవాదాయము 2. 

ధర్మాదాయము. ఈ రెండు సమాసములకూ విగ్రహము దేవుని వలన ఆదాయము

ధర్మము వలన ఆదాయము అని చెప్పుకోవలసి వస్తుంది. అంటే పంచమీ తత్పురుష  

సమామౌతుంది. వెనకటి కొక ఇల్లాలు చనిపోయిన తన సవతి పిల్లలతో ‘ప్రేమ 

మీయమ్మ వలె, పెట్టుబడి పిన్నమ్మవలె చూపిస్తాను’ అన్నదట. అది నేటి పరిస్థితి. ఈ 

కుహనా లౌకిక వాదులు మనలను దైవసమానులను చేసి ‘చూపు మనది, మేపు వారిది’ 

చేసినారు. ఈ విధముగా దాదాపు 70 సంవత్సరములు మనలనేలిన పార్టీ ఈ 

విషయములో దైవ సమానులుగా చేసి, ఇంతకాలము మనలను వెర్రిపుచ్చకాయలను 

చేసినారు. మసీదులను చర్చిలను ఈ ఆదాయపు పరిధి లోనికి ఎందుకు తెచ్చుట లేదు. 

మరి వేలాంగణ్ణి గుడి కదా! అసలు వేలాంగణ్ణి మన  అమ్మవారి దేవాలయము. వేలాంగణ్ణి 

అంటే శూలపు మొన వంటి వెడల్పయిన చురుకైన కన్నులు కలిగినది అని అర్థము. ఇది 

పోర్చుగీసు వారి దౌష్ట్యమునకు ఎరయై కిరస్తానీయుల దేవాలయమైపోయినది. నిజానికి 

వారికి విగ్రహారాధన నిషిద్ధము కదా! వారేదానిని గుడి అని అనేతపుడు,  అక్కడి 

ఆదాయమునకు ఎందుకు ప్రభుత్వ పరిధిని పెంచ లేదు. నాగూర్ దర్గా వంటి 

పేరుపొందిన దర్గాలు ఎందుకు ప్రభుత్వపు పరిధి లోనికి వచ్చుట లేదు.

ఈ నాడు ముద్రణా మాధ్యమము (Print Media), ప్రసార మాధ్యమములు (Broadcast 

and Telecast Media) హిందువుల చేయి దాటినాయన్నది ఒక కనిపించని 

యథార్థము. Steering చేతిలో వున్నవాడు తన ఇష్ట ప్రకారమే కదా బండి నడుపుతాడు. 

అందుకే తప్పు ఉన్నదా లేదా  అన్నది పూర్తిగా తెలుసుకోకనే   హిందూ గురువులను 

దుయ్యబడతారు బాబాలను మాటల తూటాలతో చిత్రహింస చేస్తారు. నా ఉద్దేశ్యము 

బాబాలలో చెడ్డ వాళ్ళు లేరని కాదు. మరి మిగతా రెండు మతాలలో మాట పెద్దలు లేక 

కుహనా బాబాలు, లేక Holistic Healings పేర్లతో ఎంత విపరీతముగా 

మభ్యపెడుతున్నారో? మరి అటువంటి వారిని వలసిన మేరకు ఎండగడుతూ వున్నారా! 

మరి దీనిని లౌకిక వాదము అనగలుగుతామా!

ఈ విధముగా చెప్పుకొంటూ పోతే ఎంతయినా చెప్పవచ్చు. నేను ఎంతో విధేయతతో 

మీకు విన్నవించుకొనేది ఏమిటంటే దయతో సనాతన ధర్మ పారాయణులైన మీరు 

సక్రమమైన రీతిలో ఆలోచించి ఈ Secularism పేరుతో జరుగుతూ వుండే వాస్తవాలను 

ఎండగట్టి, మన దేశములోనే మనము రెండవ తరగతి పౌరులుగా జీవించే ఈ 

దౌర్భాగ్యము నుండి విముక్తి పొందె మార్గమును మనసారా యోచించి తగిన 

ప్రణాళికను అనుసరించి ఈ ధర్మమునకు ఈ ధర్మావలముబులకు  కుహనా లోకిక వాదము నుండి విముక్తి లభింపజేస్తారని ఆశిస్తూ శెలవు తీసుకొను చున్నాను.

స్వస్తి.

 


Thursday, 21 January 2021

మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

https://cherukuramamohan.blogspot.com/2021/01/america-amerigo-vespucci-v-spu-t-i-1.html

ఈ వ్యాసమును నాలుగు భాహాగాములుగా విభాజించినాను.  ఒక్కొక్క భాగము ఇంచుమించుగా ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. వరుసగా మనాలుగు రోజులు ప్రకటించి 10వ తేదీకి ముగిస్తాను. ఈ శ్రమ అంతా మన యువత మన గతమును అర్థము చేసుకొనుటకే! తప్పక క్రమము తప్పక చదివేది.

America అన్న పేరు ‘అమెరికా’కు ఎట్లు వచ్చింది అంటే:

Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9,

1454 – February 22, 1512) was an Italian explorer, financier, navigator, and cartographer from the Republic of Florence. Sailing for Portugal around 1501–1502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)

పైన, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.

దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు

అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,

అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ

తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరును, ఆ పేరును ప్రతిబింబంపజేసే

జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు

మనదేశమునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం'

గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు

ఉపయోగించము అని నా మనవి.

 మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా

ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమును, మన ఉదాసీనత వల్ల, ఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామో, ఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.

 మనము అధికముగా ఆలపించే  జాతీయ గీతము

 నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦

 రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో

 బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం' గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్

 ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ

 సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే

 అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర

 గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ

 గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది.

 ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు

 కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది

 ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే

 సాక్ష్యము .

 In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of

 Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can

 be no debate about it. Of course Bankimchandra does show Durga to be

 inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can

 be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [The

 Nation].

మే 10, 2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో

 కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు

 నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరం' ఆలపించరాదని ఉద్ఘాటించినది

 రవీంద్రులవారే! అందులోని, ఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత

1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

 మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ

 గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో

 సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక

 పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో

 ప్రతిఘటన ఏదీ!

 ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం.లో వ్రాయబడినది.

 ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు

జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత

విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగిది .

ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక

మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ

జాతుల ,పర్వతముల, నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్

గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో

వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది.

ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V

గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు

కదా !

 ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని

తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు

ఆయన చొప్పించిన అబిప్రాయము.

ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా

వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని

తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ

రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది

వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .

"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him

especially to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911)"The

proceedings began with the singing by Rabindranath Tagore of a song

specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28,

1911) "When the proceedings of the Indian National Congress began on

Wednesday 27th December 1911, a Bengali song in welcome of the

Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was alsoadopted unanimously." (Indian, Dec. 29, 1911)

 ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో,

కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే,

తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ

సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది.

 మన, అధికముగా ఆలపింపబడే జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.

 విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో

గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని 

పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము

చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!

జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)

 జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా

పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా

వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా

తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా

జన్ గణ్ మంగల్ దాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

అహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ

హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖ్రిస్తానీ

పూరబ్ పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా

జనగణ ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ

తుం చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ

దారుణ్ బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా

జనగణ పథ్ పరిచాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే

ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే

దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకే, స్నేహమయీ తుమీ మాతా

జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే

గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే

తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే

తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే

జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll

"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల

ఆధారములను ఒకపరి పరికించుదాము -

మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో

మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.

1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం

జరిగింది.

2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో

మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము.

మరివిధాత అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ

కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా! దేశమును స్త్రీ తో పోల్చియుంటే 'విధాత్రి' అనియుండవలసినది.

4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆస - తవ

సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు

చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది.

పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని

అనుకొనుటకు వీలు కాదు, అన్వయము కుదరదు కాబట్టి.

6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన

తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం

"రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే

మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై 

కదా వుండినారు.

7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్

పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునా? వాడ

తగునా?

8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన

దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!

పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా

లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న

రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును

"టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత

జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే

చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.

ఈ విషయమును గూర్చి  కొంత చర్చించుకొందాం........     


               మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము 2

 పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి

సింహాసనము  చేజిక్కించుకొని, దేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన

మీర్ జాఫర్ ను, అతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న

మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ

బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు.

ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూ, ముఖోపాధ్యాయ  ముఖర్జీగానూ,

బందోపాధ్యాయ బెనఖుదీరం బోస్, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ వంటి

మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీ,

ప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు

వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ

వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ

వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికి,

ఠీవికి, దర్జాకు, దర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు

కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత

ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ

గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.

ఇక  ఒక మారు రవీంద్రులవారు 'వందే మాతరము'ను దుర్గా స్తుతి  అన్నారు కదా

అందుచే ఆ గీతము యొక్క పూర్తి పాఠమును నేను దిగువన ప్రత్యేకముగా

'వందేమాతరం' అన్న శీర్షిక క్రింద ప్రచురించున్నాను. అది దుర్గాస్తుతి కాదు,

మాతృభూమికి సమర్పించిన కృతజ్ఞతా ప్రసూనము మరియు దేశభక్తి ఉద్దీపనము. ఆ

గీతము యొక్క పూర్తి పాఠమును దానికి నా స్వేచ్ఛానువాదమును నిన్న నే మీ

ముందుంచినాను. అందు చేత దానిని ఇపుడు ఉంచలేదు.

రేపు మరికొన్ని వివరములతో.................

 


మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ 'వందేమాతరం' గీతమును పార్లమెంటులో

సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు

విరుద్ధమని బయటకు నడచినాడు అని పైన తెలిపినాను. నేటి కేరళ రాష్ట్ర గవర్నరు

మరియు ఉర్దూహిందీ,సంస్కృతము, ఫార్సీ, అరబ్బీ పండితుడగు ఆరీఫ్ మొహమ్మద్

ఖాన్ గారు, బుర్క్ గారి తీరుకు ఎంతో నొచ్చుకొన్నవాడై 'వందేమాతరం' గీతము యొక్క

పల్లవి , ప్రథమ చరణములను ఉర్దూ లోనికి తర్జుమా చేసి ఆ గీతములో ముస్లీములు 

ఆలపించకూడని అంశము ఏదీ లేదని నొక్కివక్కాణించినారు. ఆయన వ్రాసిన ఆ

గీతమును తెలుగు లిపిలో మీ ముందుంచుచున్నాను. మాతృక యొక్క భావార్థమును

నిన్ననే వేరుగా ప్రచురించినాను కాబట్టి ఇపుడు తిరిగీ వ్రాయలేదు. తస్లీమాత్ అంటే

వందనములు అని అర్థము.

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తూ భరీ హై మీఠే పానీ సే

ఫల్ ఫూలోంకి శాదబీ సే

దక్ఖిన్ కీ ఠండీ హవావోఁ సే

ఫసలోఁ కీ సుహానీ ఫిజావోఁ సే

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తేరీ రాతేఁ రోషన్ చాఁద్ సే

తేరీ రౌనక్ సబ్జ్-ఏ-ఫాం సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ సే

తేరీ మీఠీ భరీ జుబాన్ సే

తేరీ బాహోఁ మె మేరీ రాహత్ హై

తేరీ ఖద్మోఁ మె మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

వారువ్రాసిన పై గీతముతో కూడా తెలుగు స్వేచ్ఛానువాదముతో  మీముందుంచుచున్నాను.

ఎక్కడయినా మారు వందనము తప్ప దుర్గావందనము కలదా అన్నది గమనించగలరు.

వందనమమ్మా వందనము

తీయని నీరు తేనెలువూరు

పూలు ఫలమ్ముల పచ్చదనాలు

దక్షిణ ప్రాంతపు చల్లగాలులు

పచ్చని పంటల సౌందర నందము

వందనమమ్మా వందనము

చల్లని చంద్రుని వెలుగుల రాత్రులు

అందములీనెడు సుందర ఆకృతి

ప్రేమను పంచే నీ దరహాసము

తీయని కమ్మని నీ వాగ్మయము

మాశ్రమ మరచే నీ కర స్పర్శలు

నీ పదతలమే మాదగు స్వర్గము

వందనమమ్మా వందనము

మిగిలినది మరొకమారు ........   


       మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము-౩

ఇక రవీంద్రుల వారికి నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి

చూద్దాము :

ఇక రవీంద్రుల వారికి నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి చూద్దాము :

1. 18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్

కిశోరము ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు.

ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష

విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా పాత్రులు కారని ఎంచి, విధించినారు.  ఇది

1908,మే 21న జరిగిన ఉదంతము. అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర

లేకుండా చేసిన బెంగాలు పులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో !

2. రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.

3. ఆయనకు బంగ్లావాసిగా కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది.

4. బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన

భాషణము ఇవ్వలేదు .

5. ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు.

6. బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు అంద జేసినారు.

7. ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ

బహుమతినిచ్చినారని కూడా అంటారు.

ఇక్కడ, ఖుదీరాం బోస్ నేటి తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు,

చదివిన/చదివే చరిత్ర లో కనిపించడు. ఈ మహనీయుని గూర్చి ఈ తరం యువతరం

తప్పక తెలుసుకోవలసి యున్నది .

1889 డిసెంబరు 3 న జన్మించిన ఈయన 18 సంవత్సరాలా 8 నెలలా 8 రోజులకే

ఆంగ్లేయుల పైశాచికత్వమునకు బలియయిన బెంగాల్ బాలవీరుడు.  బెంగాలులోని

మిడ్నపూరుకు చెందిన వాడు. ఆయన, అరబిందో గారు పూర్వాశ్రమములో రాజకీయ

నాయకునిగా దేశమును జాగృతము చేయుచున్న కాలములో వారి ప్రభావమునకు

గురియైనవాడు. 16 సంవత్సరాల నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే

మిడ్నపూరు పోలీసు స్టేషను వద్ద బాంబుల నమర్చినవాడు. ఆ తరువాత మూడు

సంవత్సరములకు ఆంగ్లేయులచే అరెస్టు కాబడి వారిచే విధింపబడిన ఉరిశిక్షకు 11

ఆగస్టు 1908 లో గురియయినవాడు. ఆయనపై వరుస బాబులనమర్చినాడన్న అబద్ధపు

అభియోగమును  మోపి  ఆయనకు ఉరిశిక్ష విధింపజేయుట జరిగినది. కింగ్స్ ఫోర్డ్

అన్న ముజఫ్ఫర్ పూర్ బీహారు కు చెందిన అతి కౄరుడైన  మేజిస్ట్రేటును బాంబు ఒక

చేతితో రైఫిల్ ఒక చేతితో పట్టుకొని బాంబును బగ్గీ పై వేసినాడు కానీ ఫోర్డు కు

బదులుగా కెన్నెడీ అన్న బారిస్టరు యొక్క భార్య బిడ్డ అందులో వుండినారు.

ఎట్లయితేనేమి ఖుదీ రామును బంధించినారు 1908 మే 1 న. ఆయనను గూర్చి

STATESMAN అన్న ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక  ఈ విధముగా వ్రాసినది.

The English daily, The Statesman, wrote on the following day, May 2, 1908:

The Railway station was crowded to see the boy. A mere boy of 18 or 19

Years old, who looked quite determined? He came out of a first-class

compartment and walked all the way to the phaeton, kept for him outside, like a cheerful boy who knows no anxiety.....on taking his seat the boy lustily cried 'Vande Mataram'...

ఇక్కడ ఇంకొక విషయము ఏమిటంటే అభియోగము మొత్తమును తనపై వేసుకొని తన

సహచర వర్గమును, విప్లవ సంఘమును కాపాడిన మహానీయుడాయన.

The Amrita Bazar Patrika, one of the prominent dailies of that era published

about him with the headlines   "Khudiram's End: Died cheerful and smiling"

The newspaper wrote: "Khudiram's execution took place at 6 a.m. this morning.

He walked to the gallows firmly and cheerfully and even smiled when the cap was drawn over his head." An established British newspaper,

The Empire, wrote: "Khudiram Bose was executed this morning...It is alleged

that he mounted the scaffold with his body erect. He was cheerful and

smiling." The Bengali poet Kazi Nazrul Islam wrote a poem to honor him.

నేను ఆ నిస్వార్థ జాతీయ వీరుని గూర్చి చాలా క్లుప్తముగా తెలిపినాను. గాంధిజీ కి

‘మహాత్మా’ అన్న బిరుదునిచ్చినది ఠాగూర్ గారా కాదా అంటే అది వివాదాంశము. మరణ

సమయమున ‘హేరాం’ అన్నాడా లేదా అంటే దానికీ వివాదము విభేదము ఉన్నదీ కానీ

ఖుదీరాం గారు ‘వందేమాతరం’ అన్నారా లేదా మోముపై చిరునవ్వుతో అసువులు

బాసినారా లేదా అన్నది మాత్రము నిర్వివాదాంశము. ఖుదీరాం ధృవతారలో

ఐక్యమైనాడు.  ధృవతారలో ఐక్యమైతే అయినాడు గానీ  అయినట్లు ఆ తారలో మనకు

కనిపించడు. మరి ఇటువంటి మహనీయులను గూర్చి పాఠ్యాంశములలో చేర్చ

నవసరము లేదా! మన పిల్లలకు దేశభక్తి అవసరము లేదా! బయటి దేశాలలో చదివే

భారతీయ విద్యార్థులకు ఈ పుణ్యభూమిని గూర్చి ఎంత తెలుసు.

నేడు బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో నేడు

మధ్యందినమార్తాండు.

 చాలా దూరము వచ్చినాము.

మళ్ళీ కలుసుకొందాము మరి కొన్ని ఆసక్తికరమైన విషయములతో........    

  మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము - 4(చివరి భాగము)

మొహమ్మద్ ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము

మన చరిత్రను గురించి తెలుసుకొనుట మన తక్షణ కర్తవ్యము. మన గతము మన   వారసత్వము, మన సంస్కృతిని గూర్చి మనసారా  తెలుసుకొనుట మన బాధ్యత. మన దేశమును మన కళ్ళతో చూసుకొనుట అత్యంత ఆవశ్యకము. సద్గురు శివానంద మూర్తి గారు.

ఆ భవిష్యద్దార్శనికుని మాటలను మనసారా విశ్వసిస్తూ ‘సారే జహాఁసె అచ్చా’ అన్న జాతీయ హోదా గలిగిన గీతమును గూర్చి దానిని వ్రాసిన మొహమ్మద్ ఇక్బాల్ గారిని గూర్చి నేను విన్నది, చదివినది, పెద్దలచే తెలుసుకొన్నది  అతి క్లుప్తముగా తెలియజేస్తాను. వీరిని పాకిస్తాన్ దేశపు ఆధ్యాత్మిక పితగా గుర్తించుతారు. వీరికి అల్లామా ఇక్బాల్ అని గౌరవముగా పాకిస్తానీయులు పిలుచుకొంటారు. 'అల్లామా' అన్నది ముస్లీములు ఘనమైన విద్వాంసులకు ఇచ్చే బిరుదము.

ఈ విషయమును గురించి వ్రాయుటకు కారణము కొంత కాలము క్రితము ఈ విషయమై నేను చూచుట  తటస్థించిన  ఆస్య గ్రంధి లోని ఒక ప్రచురణ. అది ఇక్బాల్ గారిని గూర్చిన కొన్ని కల్పనలు కలిగియుండుట చేత నేను వాస్తవమును నా చేతనయినంత మేరకు మీ ముందుకు తేవలసి వచ్చినది. నేను ఎక్కువ మందికి చేరుతుందను ఉద్దేశ్యముతో ఆంగ్లములో వ్రాసినాను కానీ దానిపై ఎక్కువమంది దృష్టి సారించలేదు. కారణమును పాఠకుల మనస్సాక్షికే వదలివేస్తున్నాను. ఈ తెలుగు వ్యాసమునైనా చదివి వాస్తవాలు తెలుసుకొందురని నా ఆశ. ఈ  ఆశను దేశ ప్రేమకు కొలమానముగా భావించుతూ వున్నాను.

ఇక్బాల్ గారు ఈ గీతమును తమ 27 సంవత్సరముల వయసులో వ్రాసియుండవచ్చునని చదివినాను. వారపుడు లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగా ఉద్యోగము చేసే వారు.  దీనిని తరానా అంటారు. ఇది ఘజల్ శైలిలో వ్రాయబడింది. 16 ఆగస్టు 19౦4 లో లాలా హరి దయాళ్ అన్న విద్యార్థి అభ్యర్ధన మేరకు ఆయన ఏర్పాటుచేసిన సభకు ఉపన్యాసకునిగా వచ్చినా ఇక్బాల్ గారు ఈ పాటను ఆక్కడి శ్రోతలకు ఆవిధముగా లోకానికీ మొదటిసారిగా వినిపించినారట. ఈ గీతమునకు ‘తరానా-ఏ-హింద్ అన్న నామకరణమును వారు చేసినారు. తరువాత కొంత కాలమునకు వారు భవిష్యద్ ఇస్లాం సమాజ స్థాపన కొరకు, ఇస్లాం వేదాంతమును చదువనెంచి ఐరోపా వెళ్ళుట తటస్తించినది.

ఇక గీతము యొక్క విషయమునకు వస్తే అది 9 చరణములను కలిగి వుంది. అందులోని 5 వ చరణము ఈ విధముగా కనిపిస్తుంది.

అయ్ అబ్ ఎ రుద్ ఎ గంగా! వహ దిన్ హై యాద్ తుఝ్ కొ

ఉతరా తెరే కినారే జబ్ కారవాఁ హమారా

మా బిడారు నీ ఒడ్డున విడిది చేసిన ఆరోజు నీకు జ్ఞాపకము ఉన్నదా! అని ప్రశ్నించుతున్నాడు కవి. మరి మహమ్మదీయులు మనము కలిసి బిడారును గంగ ఒడ్డున ఏర్పరచియుండినామా? చరిత్ర లో ఎక్కడయినా ఉటంకించ బడినదా!

బహుశ వారు తమ మతస్థులను గూర్చి చెప్పియుండవచ్చు. అప్పుడు, సనాతన ధర్మావలంబులమైన మనకు అన్వయించదు కదా! మరి అన్వయించనపుడు జాతీయ గీతము యొక్క హోదాకు తగుతుందా!

మనము వినే ఆ పాటలోని 3వచరణములో, అనగా అది పూర్తి పాఠము లోని 6వ చరణమౌతుంది, హిందీ, హిందుసితాఁ అన్న పదాలు వస్తాయి. బెంగాల్ బెంగాలీ గుజరాత్ గుజరాతీ, నేపాల్ నేపాలీ పాకిస్తాన్ పాకిస్తానీ అన్న విధముగా  హిందూస్తాన్ లో వున్న వారిని హిందీ అన్నారు. మరి హిందూస్తాన్ అన్నది మనము పెట్టుకొన్న పేరు కాదు కదా! ఇండియా హిందూస్తాన్ మనము పెట్టుకొన్న పేర్లు కాదు. ఎవరో నోరు తిరగని వారు పెట్టినవి. మనది భారత దేశము.

ఎందుకు మనము ఈ దేశమునకు భారత్ అన్న అధికారిక నామమును ఉంచుకొన కూడదు. ‘భ’ అన్న అక్షరానికి నిఘంటువు కొన్ని అర్థములను తెలిపింది, కానీ ఒక మహనీయుడు, మహా పండితుడు ‘భ’ అన్న అక్షరానికి అభివృద్ధి అన్న అర్థము లేక అన్వయము కూడా ఉన్నదని నాకు తెలియజేసినాడు. ‘నభము’ అభివృద్ధి లేనిది ఆకాశము, ‘భగము’ అన్న మాటకు వృద్ధి ప్రగతి కలిగించునది. 'అభము' అభివృద్ధి లేమి, ఎంత గొప్ప అర్థమో గమనించండి.

ఇక  హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు అన్న ఒక క్రొత్త అర్థమును ఎవరో ప్రతిపాదించినారు. ఆధారము కానరాదు. అంత అర్థవంతమూ కాదు. హిమాలయములకు ఆవలనున్న అరబ్బు దేశీయులు ‘స’ ను ‘హ’ గా పలుకుటచే ‘సింధు’ నది కలిగిన దేశము ‘హిందు’ దేశమైనది.

ఉత్తర భారతమున ‘స’ ను ‘హ’ గా పలుకుతారని ఒక వ్యక్తి ఆస్య గ్రంధిలో వ్రాయగా చదివినాను. హిందీ భాషలో శ, , స మూడు అక్షరాలూ ఉండుటయే గాక వారి పేర్లలో సందీప్, శారద, కృషి--- ఈ విధముగా మూడు అక్షరములనూ ఉపయోగించుతారు. అరేబియా దేశాల వారు నేటికినీ గణితమును ‘హింద్స’ అనే పిలుస్తారు. ఉత్తర భారత దేశమున ‘గణిత్’ అంటారు ‘హింద్స’ అన్నది ఔత్తరాహిక  సామాన్యులకు తెలియని పదము.

తిరిగీ అసలు విషమునకు వస్తే, ఇక్కడ మనము అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే మనమంతా హిందూ దేశమునకు చెందినవారము కావున హిందీలమైనాము అని మాట వరుసకు సమర్థించుకొందాము.  మీ దేశమేది అని ఒక విదేశీయుడడిగితే హిందూ దేశము’ అంటామా లేదా? హిందీ దేశము అని మాత్రము అనము కదా! అసలు మన ధర్మమును పాటించనివారు ‘హిందూస్తాన్’ అని అంటారనుకొందాము. అప్పుడు కూడా ‘స్తాన్’ అన్నది సంస్కృత పదమే. ‘హిందు’ శబ్దోచ్ఛారణ యే వారి మత రీత్యా ఉచ్చరించుట దోషము కదా! దంత్యములు, కంఠ్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనునాసికములు  ఇత్యాదిగా వర్గీకరింపబడిన మన సంస్కృతము భాషలకు ఆది పునాది. మిగతా ఏ ప్రపంచ భాషకు కూడా ఈ వర్గీకరణ లేదు. అది వారు తెలుసుకొన ప్రయతించరు. ‘హింది’ ‘హిందు’ రెండూ ఒకటే కానీ వారు మొదటిది మాత్రమె ఉచ్చరించుతారు. అసలు అక్షరము అంటేనే బాహిరముగా ’అ’ నుండి ‘క్ష’ వరకు అని ధ్వనిస్తున్నా ‘క్షరము’ అనగా ‘నాశము’ కానిది అక్షరము. ఇంతటి గొప్ప విషయములను మనకందించిన మహనీయులు  మన పూర్వులు.

ఇక తిరిగీ ఇక్బాల్ గారి విషయమునకు వస్తే ఆయన ఇస్లాం వేదాంతమును పుణికి పుచ్చుకున్న తరువాత ‘తరానా-ఏ-మిలి’ అన్న గేయమును ‘సారే జహాఁ సె అచ్ఛా’ ఛందస్సులోనే వ్రాసినారు. ‘తరానా-ఏ-మిలి’ అంటే ‘మతానుగత గీతము’ అని మనము అనువదించుకొనవచ్చు. ఇక్బాల్ గారి లౌకిక తత్వమునకు సాధారణముగా ‘సారే జహాఁసె అచ్చా’ లోని ఈ చరణమును ఉటంకించుతారు.

మజహబ్ నహీఁ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా

హిందీ హైఁ హం వతన్ హై హిందూసితాఁ హమారా

మతము అన్నది వైరమును బోధించదు. మనము హిందువులము మనది హిందూస్థానము అని నుడివినారు.

1910 లో ఆయన వ్రాసిన ‘తరానా-ఏ-మిలి’ లో ఏమి వక్కాణించినారో చూడండి.

సైన్-ఓ-అరబ్ హమారా, హిందూసితాఁ హమారా

ముస్లిం హైఁ హం వతన్ హై సారా జహాఁ హమారా

మధ్య ఆసియా మనది, అరేబియా మనది, హిందూస్తాన్ మనది. మనము ముస్లిములము  ఈ ప్రపంచమే మనది. దీనితో వారి హిందూదేశ భక్తి ఏమయి పోయిందో గమనించండి. రెండు దశాబ్దముల పిమ్మట 1930 లో ఇక్బాల్ గారు అలహాబాదులో ముస్లిం లీగ్ వార్షిక సమావేశములోని తమ అధ్యక్షోపన్యాసములో ఏఏ ప్రాంతములలోనైతే ముస్లిం జనాభా ఎక్కువగా వుందో ఆయా ప్రాంతాలను అన్నింటినీ ముస్లిం దేశాలుగా మార్చవలెనని ఉద్ఘాటించిన మహనీయుడు ఆయన. ఈ దేశానికి, మన ధర్మమును పాటించే వారిలో దేశభక్తి గీతము వ్రాయ గలిగే మహా కవియే లేడా! అసలు పాకిస్తాను బీజమును నాటిన మహానీయుడాయనే!  ఆయన 1887 నవంబరు 8 న సియాల్కోట్(ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతము) (1938 ఏప్రిల్ 21 న లాహోర్ (బ్రిటీష్ ఇండియా) లో మరణించినారు.

పాకిస్తానులో నేటికినీ ఆయన పుట్టిన దినమును ‘ఇక్బాల్ డే’ గా పిలుస్తూ ఆ రోజును సెలవు రోజుగా ప్రకటించుకొంటారు.

 చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆయన పూర్వీకులు  ‘సప్రూ’ అన్న ఇంటిపేరు గలిగిన బ్రాహ్మణులు. వారు ఇస్లాం లోకి బలవంతముగా మార్చబడినవారే! ఆతరువాత కాలములో వారు పంజాబ్ నకు వలస వచ్చినారు. అదే కాశ్మీరుకు చెందిన పండితులు ముస్లిముల చెర తప్పించుకొని జమ్మూ చేరి తమ తిప్పలు తాము పడుతూ వుండగా తగుమమ్మా అంటూ వచ్చి మీకు సహాయము చేస్తాము మా మతములోనికి మారండి అన్న విదేశీ క్రైస్తవులను త్రిప్పి పంపిన ఆ గొప్పవారిని గూర్చి తలచినవారున్నారా!

తెలిసినది క్లుప్తముగా తెలిపినాను. మంచి చెడుల నిర్ణేతలు మీరే! ఇక వారి అభిప్రాయము హిందువులపై ఏవిధముగా ఉండినది అన్నది తెలిపి నేను విరమించుతాను.

Iqbal expressed fears that not only would secularism weaken the spiritual foundations of Islam and Muslim society, but that India's Hindu-majority population would crowd out Muslim heritage, culture and political influence. (Muhammad Iqbal (From Wikipedia)

మరి స్వాతంత్ర్యమునకు మునుపు ఈయన వ్రాసిన 'సారే జహాఁ సే అచ్ఛా' మనకు జాతీయ గీతము ఎట్లు కాగలుగుతుంది.

 స్వస్తి.

Parvateesam Vepa

💯👏👏👏ఈ పోస్టులో రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమన రచనలో బ్రిటిష్ ప్రభుత్వం రాజు ఎడ్వర్డ్ 5 ను పొగడుటకై వ్రాసిన జాతీయ గీతం జనగణమన అర్ధం,వివరణలు,వందేమాతరం గీతానికి జాతీయగీతం స్థాయి రాకుండా కుయుక్తులను పన్ని, తన జనగణమన గీతం ద్వారా తాను జాతీయ గీతం రచయితగా పేరు సంపాదించుకోవడానికి,తన గీతాంజలి కి నోబెల్ బహుమతి పొందడానికి చేసిన కుట్రలను బాగా వివరించారు. జనగణమన గీతం అన్ని చరణాలు అందించి వాటి అర్ధాలను వివరించి రవీంద్రుని రచనలలో గల మాయను వివరించేరు.

బంకించంద్ర ఛటర్జీ గారి వందేమాతరం గీతం మును అద్భుతమైన రీతిలో వివరించేరు. అది మూస్లింలు పాడ లేరని అది దుర్గా దేవిని పూజించే పాటని రవీంద్రుడు చేసిన వ్యాఖ్యలను బాగా వెలుగులోకి తెచ్చేరు.

ఇక్బాల్ గారి సారే జహాఁ సే అఛ్ఛాలో గల వివరాలను, పాకిస్థాన్ భక్తుడైన, పాకిస్థాన్ వారికి ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్ గా ప్రసిద్ధుడైన ఇక్బాల్ అంతరంగాన్ని బాగా తెలిపేరు. సుదీర్ఘమైన మీ పోస్టును యెంతో ప్రస్తుతించినా చాలదు.

అమోఘము, మహాద్భుతమైన రీతిలో చిత్రించారండీ సత్యాలను.

మీ దేశభక్తి కి జోహార్లండీ రామ మోహనరావు గారూ...

అనేకానేక అభినందనలండీ.వందనములు.

YOU DID A GREAT JOB

Pemmaraju Purnachandra Rao

ఆర్యా శ్రీ మోహనరావు గారు మీరు వ్రాసిన విషయాలు కొన్ని నేను చదివిన విన్న విషయాలు ఇప్పుడు ఎవరికీ అసలు సంగతులే పట్టవు ఇంక అంతరార్ధం ఎవరికి పడుతుంది.ముఖ్యంగా శ్రీ వాకాటి పాండురంగారావు ఆంధ్రప్రభ సంపాదకులు ఇక్బాల్ కవితల అసలు పాఠం గుట్టు విప్పారు ఓ ప్రసంగంలో. మనలో కొందరు ఆహా ఇక్బాల్ దేశభక్తి మా గురించే ఈ కవిత అని మురిసిపోవడం గురించి చెబుతుండగా విన్నాను. కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానుల. మాటలు గుర్తుకు వచ్చాయి. భాషా భేదం కానీ మన ముక్కలే వాళ్ళవి అని,. మొగలు దర్బారు కుట్రలు అని ఓ ధారావాహిక యువ మాసపత్రికలో వచ్చేది అలాగే నెహ్రూ దర్బారు అంతఃపురం దారుణాలు తెలిసినా మన కాంగ్రేసు దశాబ్దాల పాలనలో బుర్రలను సామాజికంగా సామూహికంగా ప్రభావితం చేసేసాయి, మన స్వభావం లోనే రాజాశ్రయవిధేయత ఓ భాగమయ్యింది.టాగోర్ కవితా ప్రతిభ గురించి శ్రీ శ్రీ గారు తన సహజ ధిక్కార. ధోరణిలో. టాగూర్ కన్నా మన చింతా దీక్షితులు మిన్న అన్నారు.కానీ ఎవరికి కావాలి నిజం. ప్రసార మాధ్యమాలు చేసే హడావుడి తమ సంకుచిత పరిమిత భావజాలం ప్రజాభిప్రాయం అని ఢంకాలు 24\7 బజాయించడంవల్ల బ్రాహ్మణుడు నల్లమేక కధలా తయారయ్యింది నిజం నిర్ధారణ. ఇది కాలమహిమా అవకాశవాదమా వెన్నెముక సత్తా లేని భజనబ్రృందాల సామూహిక స్వార్ధ గీతాలాపనా. సర్కారీ కవుల కొలువుల గిట్టుబాటు వ్వవహారమా\. ఏమై నా మీ పరిశోధన ఆసక్తి నిజనిరూపణాసక్తి అభినందనీయం ఎంత మందికి ఎక్కుతుంది.ఈ ఘోష. Citation లో ప్రాక్పశ్చిమ సంయోగానికి చేసిన కృషికి ఇస్తున్నట్లు అన్నారు. సాహిత్యప్రతిభ కి కాదా ఆ నోబెల్ బహుమతి కూడా కమిటి నిర్ణయం లేకుండానే. ఇవ్వ డం అయ్యిందంటే ఇంతకు మించి ఆశ్చర్యం ఏముంటుందీ

🌹👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹

 

                                     


Wednesday, 13 January 2021

కొనకుండా నవ్వుకొనండి – బావా కర్ణా

 

కొనకుండా నవ్వుకొనండి – బావా కర్ణా

https://cherukuramamohan.blogspot.com/2021/01/blog-post_13.html

ఇది దాదాపు 60 సంవత్సరముల క్రితము జరిగిన కథ. కడప జిల్లా పులివెందులకు 

దగ్గరగా వేంపల్లి పులివేన్స్డులకు నడుమన వేముల అనే ఓక గ్రామము ఉన్నది. 

సంక్రాంతికి పంటలు చేతికి వస్తాయి కాబట్టి డబ్బులు జేబుల్లో గలగలాలాడుతూ 

ఉంటాయి. తాగుడుకు కొదవే ఉండదు. ఆరోజుల్లో ఖాళీ అయిన కళ్ళాలలో సంక్రాంతి 

రోజు ఏ ‘కృష్ణ రాయభార’మో లేక ‘రామాంజనేయ యుద్ధమో’ ‘గయోపాఖ్యాన’మో 

నాటకము వేసేవారు. ఆ సంవత్సరము  ‘శ్రీకృష్ణ రాయభారము’ వేయదలచి ఒక 

నెలరోజుల ముందునుండి హార్మోనియము పద్యములు రాగయుక్తముగా ఆడే 

గురువును ఏర్పాటుచేసుకోని సాధన మొదల్కుపెట్టినారు.

ఆ రోజు రానే వచ్చింది. కల్లములో Set వేసినారు. వివిధ రంగులు విద్యుద్దీప కాంతులతో 

వెలిగిపోతూ వుంది ఆ కళ్లము. ఊర్పిళ్ళు అప్పుడే అయిన సమయము కాబట్టి 

సముద్రములోని అలల వలె గాలిలో పురుగులు తేలియాడుతూ ఉన్నాయి. నాటు 

సారాయి నీటుగా నటులంతా పీకల వరకు దట్టించినారు. గంట రాత్రి 10 కావస్తూ 

ఉండగా నాటకము మొదలైనది. ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో జనమునకు ‘థూ 

నీయమ్మ’ అనుట ఊతపదము.

  రాయభారము ఫలించా లేదు. ఆ అంకము బాగా రక్తి కట్టించినారు.

కృష్ణుడు కర్ణుని అతని భవనంలో కలువదలచి వెళ్ళినాడు. కర్ణుని చూచినాడు. సంభాషణ 

ప్రారంభించాబోతూ ‘బావా! కర్ణా!’ అన్నాడు. బావా అని నోరు తెరువగానే కొన్ని 

పురుగులో నోటిలోనికి పోయినాయి. వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా తాగిన 

మైకము తలకెక్కగా, నోట దూరిన పురుగులను ఉమ్మివేస్తూ అలోకగా తన సహజమైన 

రీతిలో ‘థూ నీయమ్మ’ అన్నాడు. అంతటితో కర్ణ కృష్ణ యుద్ధము మొదలై నాటకము 

నడివీధికెక్కింది.

ఈ ఉదంతమును పద్య రూపములో ఈ విధముగా ఉంచినాను.

రాయ భారమందు రాజీని బడయక

అంగరాజు జేరి అచ్యుతుండు           

వాయి తెరచి తాను బావా యనంగానె

‘థూ నీయమ్మ’ యనెను దూర ఈగ

స్వస్తి.