మనము అధికముగా
ఆలపించే జాతీయ గీతము
https://cherukuramamohan.blogspot.com/2021/01/america-amerigo-vespucci-v-spu-t-i-1.html
ఈ
వ్యాసమును నాలుగు భాహాగాములుగా విభాజించినాను.
ఒక్కొక్క భాగము ఇంచుమించుగా ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. వరుసగా
మనాలుగు రోజులు ప్రకటించి 10వ తేదీకి ముగిస్తాను. ఈ శ్రమ అంతా మన యువత మన గతమును
అర్థము చేసుకొనుటకే! తప్పక క్రమము తప్పక చదివేది.
America
అన్న పేరు ‘అమెరికా’కు ఎట్లు వచ్చింది అంటే:
Amerigo
Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9,
1454
– February 22, 1512) was an Italian explorer,
financier, navigator, and cartographer from the Republic of Florence. Sailing
for Portugal around 1501–1502, Vespucci demonstrated that
Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially
conjectured from Columbus' voyages) but a separate continent described as the
"New World". (Courtesy Google)
పైన, మనము నెత్తిన
పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.
దీనినిబట్టి
మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు
అత్యంత
ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,
అర్థవంతముగా
ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ
తమ
సంస్కృతిని చాటునటువంటి ఒక పేరును, ఆ పేరును ప్రతిబింబంపజేసే
జాతీయగీతమును
వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు
మనదేశమునకుండగా,దేశ మాతను అచంచలమైన
భక్తితో ప్రార్థించే 'వందేమాతరం'
గీతముండగా
నిర్దుష్టముగా వానిని మనవి అని అవి
మాత్రమె ఎందుకు
ఉపయోగించము
అని నా మనవి.
మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి
ఏనాడైనా
ఆలోచించినామా!
మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము
చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమును, మన ఉదాసీనత వల్ల,
ఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామో, ఈనాటికీ
బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును
చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.
మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము
నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం)
అంటే ఇంచుమించు 5౦౦
రూపాయలు
అనే ఈ రోజుల్లో,
1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో
బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం'
గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్
ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు
వ్యతిరేకముగా నినదించిన ఈ
సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు
పుట్టించిందని నేటి యువతకు తెలిసే
అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్
సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర
గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి
చేసుకొన్న దురదృష్టము వలన ఈ
గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక
పోవుచున్నది.
ముస్లింలు, క్రైస్తవులు, అందరూ
దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు
కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే
ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది
ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర
బోస్ కు వ్రాసిన లేఖయే
సాక్ష్యము .
In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of
Vande Mataram is a hymn to goddess Durga: this
is so plain that there can
be no debate about it. Of course Bankimchandra
does show Durga to be
inseparably united with Bengal in the end, but
no Mussulman [Muslim] can
be expected patriotically to worship the ten-handed
deity as 'Swadesh' [The
Nation].
మే
10, 2013
లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో
కూడి
ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు
నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరం' ఆలపించరాదని ఉద్ఘాటించినది
రవీంద్రులవారే! అందులోని, ఆయన చెప్పిన
కొన్ని చరణములు తీసివేసిన తరువాత
1896
కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!
మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర
ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ
గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య
సమరములో
సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ
స్థాయిని దక్కనివ్వలేక
పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో
చైతన్యమెదీ. మనలో
ప్రతిఘటన ఏదీ!
ఇక 'జనగణమన' నేటి మన జాతీయ
గీతిక ఠాకూరు వారిచే 1911సం.లో వ్రాయబడినది.
ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్
థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు
జిల్లా)
లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య
సంగీత
విదుషీమణి
కావడం వల్ల, సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగిది .
ఆ
పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక
మొదలగు
పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ
జాతుల
,పర్వతముల,
నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్
గారు
నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో
వారు
వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది.
ఈ
గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V
గారికి
1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు
కదా
!
ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని
తప్పించుకో
జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు
ఆయన
చొప్పించిన అబిప్రాయము.
ఆ
గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా
వ్రాసినారు.
అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని
తప్పు
పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు అన్నారు. కానీ ఇక్కడ
రాణి
గారిని అందరూ ఆరాధించండి అని చెబుతూ
వున్నారు. వారి మనసుకు ఈ క్రింది
వార్తా
పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .
"The Bengali poet Rabindranath
Tagore sang a song composed by him
especially
to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911)"The
proceedings
began with the singing by Rabindranath Tagore of a song
specially
composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28,
1911)
"When the
proceedings of the Indian National Congress began on
Wednesday
27th December 1911, a Bengali song in
welcome of the
Emperor
was sung. A resolution welcoming the Emperor and Empress was alsoadopted
unanimously." (Indian, Dec. 29, 1911)
ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో,
కింగ్
జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్'
సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే,
తన
ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ
సహకార
సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం
జరిగింది.
మన, అధికముగా ఆలపింపబడే జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన
ఇవ్వబడినది.
విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము
ఎంతవరకూ ఉన్నదో
గమనింతురు
గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని
పొగిడే
ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము
చేసుకొనగలరు.
మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!
జనగణ
మన్ అధినాయాక్ జయహే (పూర్తి పాఠము)
జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా
పంజాబ్
సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా
వింధ్య
హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా
తవ్
శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా
జన్
గణ్ మంగల్ దాయాక్ జయహే,
భారత్ భాగ్య విధాతా
జయ్
హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే ll1ll
అహరః
తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ
హిందూ
బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖ్రిస్తానీ
పూరబ్
పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా
జనగణ
ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా
జయ్
హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే ll2ll
పతన్
అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ
తుం
చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ
దారుణ్
బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా
జనగణ
పథ్ పరిచాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్
హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే ll3ll
ఘోర్
తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే
ఙాగృత్
ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే
దుస్స్వప్నే
ఆతంకే రక్షా కరిలే అంకే,
స్నేహమయీ తుమీ మాతా
జనగణ్
దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా
జయ్
హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే ll4ll
రాత్ర
ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే
గాహే
విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే
తవ
కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే
తవ
చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే
జయ్
జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా ll5ll
"జనగణమన"
గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల
ఆధారములను
ఒకపరి పరికించుదాము -
మనము
జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో
మొదటిది
మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.
1.
1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం
జరిగింది.
2.
ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో
మగ్గుతున్న
భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.
3.
"భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము.
మరివిధాత
అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ
కాలానికి
బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క
బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హడు.
అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా! దేశమును స్త్రీ తో
పోల్చియుంటే 'విధాత్రి' అనియుండవలసినది.
4.
రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆస - తవ
సింహాసన్
పాసే". అనాటి కాలంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు
చక్రవర్తి
మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.
5.
ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది.
పుంలింగ
శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని
అనుకొనుటకు
వీలు కాదు, అన్వయము కుదరదు కాబట్టి.
6.
"తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన
తలలను
బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం
"రాజేశ్వర’
అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే
మరి
అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై
కదా
వుండినారు.
7.
మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్
పూర్తిగా
పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునా? వాడ
తగునా?
8.
"గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన
దేశమాత
విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!
పందొమ్మిదవ
శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా
లోనైనారు.
ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న
రవీంద్రనాథ
ఠాకూర్ గారు, బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన
పేరును
"టాగోర్"గా
మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!
మేధావులందరూ
ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత
జాతీయగీతంగా
ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే
చెప్పినాడు.
వాస్తవంలో అదే జరిగింది.
ఈ విషయమును గూర్చి కొంత చర్చించుకొందాం........
మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము – 2
పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి
సింహాసనము
చేజిక్కించుకొని, దేశమునే చేజార్చి
మనలను బానిసలు గా దిగజార్చిన
మీర్
జాఫర్ ను, అతనిని చంపించిన మీర్ కాశీమును
మట్టి కరిపించి వశం చేసుకున్న
మొట్టమొదటి
ప్రాంతము బ్రిటీషు పద్ధతులకు ప్రభావితులైన
చాలా మంది బెంగాలీ
బాబులు
తమ పేర్లను సైతము బ్రిటీషు వారికనుగుణమగు రీతికి మార్చుకొన్నారు.
ఆవిధంగా
చటోపాధ్యయ చటర్జీగానూ,
ముఖోపాధ్యాయ ముఖర్జీగానూ,
బందోపాధ్యాయ
బెనఖుదీరం బోస్, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ వంటి
మహానుభావులు
దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీ,
ప్రలోభానికీ గురియైన
వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు
వద్ద
వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ
వంశమునకే
చెందిన ప్రసిద్ధ హిందీ నటి మీనాకుమారి
తల్లి వైపు వారు కూడా ఆ
వంశీయులే!
ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికి,
ఠీవికి, దర్జాకు, దర్పానికీ అది నిదర్శనంగా భావించ
సాగినారు. వారిలో రవీద్రులవారు
కూడా
ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత
ఆప్తుడగు
నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ
గీతములోని
మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.
ఇక ఒక మారు రవీంద్రులవారు 'వందే మాతరము'ను దుర్గా స్తుతి అన్నారు కదా
అందుచే
ఆ గీతము యొక్క పూర్తి పాఠమును నేను దిగువన ప్రత్యేకముగా
'వందేమాతరం' అన్న శీర్షిక క్రింద ప్రచురించున్నాను.
అది దుర్గాస్తుతి కాదు,
మాతృభూమికి
సమర్పించిన కృతజ్ఞతా ప్రసూనము మరియు దేశభక్తి ఉద్దీపనము. ఆ
గీతము
యొక్క పూర్తి పాఠమును దానికి నా స్వేచ్ఛానువాదమును నిన్న నే మీ
ముందుంచినాను.
అందు చేత దానిని ఇపుడు ఉంచలేదు.
రేపు
మరికొన్ని వివరములతో.................
మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ 'వందేమాతరం' గీతమును పార్లమెంటులో
సాటి
సభ్యులతో కూడి ఆలపించక పోగా పాడేటపుడు
వినుట కూడా ఇస్లాముకు
విరుద్ధమని
బయటకు నడచినాడు అని పైన తెలిపినాను. నేటి కేరళ రాష్ట్ర గవర్నరు
మరియు
ఉర్దూ, హిందీ,సంస్కృతము,
ఫార్సీ, అరబ్బీ పండితుడగు ఆరీఫ్ మొహమ్మద్
ఖాన్
గారు, బుర్క్
గారి తీరుకు ఎంతో నొచ్చుకొన్నవాడై 'వందేమాతరం' గీతము యొక్క
పల్లవి
, ప్రథమ
చరణములను ఉర్దూ లోనికి తర్జుమా చేసి ఆ గీతములో ముస్లీములు
ఆలపించకూడని
అంశము ఏదీ లేదని నొక్కివక్కాణించినారు. ఆయన వ్రాసిన ఆ
గీతమును
తెలుగు లిపిలో మీ ముందుంచుచున్నాను. మాతృక యొక్క భావార్థమును
నిన్ననే
వేరుగా ప్రచురించినాను కాబట్టి ఇపుడు తిరిగీ వ్రాయలేదు. తస్లీమాత్ అంటే
వందనములు
అని అర్థము.
తస్లీమాత్
మాఁ తస్లీమాత్
తూ
భరీ హై మీఠే పానీ సే
ఫల్
ఫూలోంకి శాదబీ సే
దక్ఖిన్
కీ ఠండీ హవావోఁ సే
ఫసలోఁ
కీ సుహానీ ఫిజావోఁ సే
తస్లీమాత్
మాఁ తస్లీమాత్
తేరీ
రాతేఁ రోషన్ చాఁద్ సే
తేరీ
రౌనక్ సబ్జ్-ఏ-ఫాం సే
తేరీ
ప్యార్ భరీ ముస్కాన్ సే
తేరీ
మీఠీ భరీ జుబాన్ సే
తేరీ
బాహోఁ మె మేరీ రాహత్ హై
తేరీ
ఖద్మోఁ మె మేరీ జన్నత్ హై
తస్లీమాత్
మాఁ తస్లీమాత్
వారువ్రాసిన
పై గీతముతో కూడా తెలుగు స్వేచ్ఛానువాదముతో
మీముందుంచుచున్నాను.
ఎక్కడయినా
మారు వందనము తప్ప దుర్గావందనము కలదా అన్నది గమనించగలరు.
వందనమమ్మా
వందనము
తీయని
నీరు తేనెలువూరు
పూలు
ఫలమ్ముల పచ్చదనాలు
దక్షిణ
ప్రాంతపు చల్లగాలులు
పచ్చని
పంటల సౌందర నందము
వందనమమ్మా
వందనము
చల్లని
చంద్రుని వెలుగుల రాత్రులు
అందములీనెడు
సుందర ఆకృతి
ప్రేమను
పంచే నీ దరహాసము
తీయని
కమ్మని నీ వాగ్మయము
మాశ్రమ
మరచే నీ కర స్పర్శలు
నీ
పదతలమే మాదగు స్వర్గము
వందనమమ్మా వందనము
మిగిలినది మరొకమారు ........
మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము-౩
ఇక
రవీంద్రుల వారికి నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి
చూద్దాము
:
ఇక
రవీంద్రుల వారికి నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి చూద్దాము :
1.
18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్
కిశోరము
ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు.
ఎందుకంటే
ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష
విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా
పాత్రులు కారని ఎంచి, విధించినారు. ఇది
1908,మే 21న జరిగిన
ఉదంతము. అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర
లేకుండా
చేసిన బెంగాలు పులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో !
2.
రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.
3.
ఆయనకు బంగ్లావాసిగా కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది.
4.
బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన
భాషణము
ఇవ్వలేదు .
5.
ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు.
6.
బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు అంద జేసినారు.
7.
ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ
బహుమతినిచ్చినారని
కూడా అంటారు.
ఇక్కడ, ఖుదీరాం బోస్ నేటి
తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు,
చదివిన/చదివే
చరిత్ర లో కనిపించడు. ఈ మహనీయుని గూర్చి ఈ తరం యువతరం
తప్పక
తెలుసుకోవలసి యున్నది .
1889
డిసెంబరు 3 న జన్మించిన ఈయన 18 సంవత్సరాలా 8 నెలలా 8 రోజులకే
ఆంగ్లేయుల
పైశాచికత్వమునకు బలియయిన బెంగాల్ బాలవీరుడు.
బెంగాలులోని
మిడ్నపూరుకు
చెందిన వాడు. ఆయన, అరబిందో గారు పూర్వాశ్రమములో రాజకీయ
నాయకునిగా
దేశమును జాగృతము చేయుచున్న కాలములో వారి ప్రభావమునకు
గురియైనవాడు.
16 సంవత్సరాల నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే
మిడ్నపూరు
పోలీసు స్టేషను వద్ద బాంబుల నమర్చినవాడు. ఆ తరువాత మూడు
సంవత్సరములకు
ఆంగ్లేయులచే అరెస్టు కాబడి వారిచే విధింపబడిన ఉరిశిక్షకు 11
ఆగస్టు
1908 లో గురియయినవాడు. ఆయనపై వరుస బాబులనమర్చినాడన్న అబద్ధపు
అభియోగమును మోపి
ఆయనకు ఉరిశిక్ష విధింపజేయుట జరిగినది. కింగ్స్ ఫోర్డ్
అన్న
ముజఫ్ఫర్ పూర్ బీహారు కు చెందిన అతి కౄరుడైన
మేజిస్ట్రేటును బాంబు ఒక
చేతితో
రైఫిల్ ఒక చేతితో పట్టుకొని బాంబును బగ్గీ పై వేసినాడు కానీ ఫోర్డు కు
బదులుగా
కెన్నెడీ అన్న బారిస్టరు యొక్క భార్య బిడ్డ అందులో వుండినారు.
ఎట్లయితేనేమి
ఖుదీ రామును బంధించినారు 1908 మే 1 న. ఆయనను గూర్చి
STATESMAN
అన్న ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక
ఈ విధముగా వ్రాసినది.
The
English daily, The Statesman, wrote on the following day, May 2,
1908:
The
Railway station was crowded to see the boy. A mere boy of 18
or 19
Years
old, who looked quite determined? He came out of a first-class
compartment
and walked all the way to the phaeton, kept for him outside, like a cheerful
boy who knows no anxiety.....on taking his seat the boy lustily cried 'Vande
Mataram'...
ఇక్కడ
ఇంకొక విషయము ఏమిటంటే అభియోగము మొత్తమును తనపై వేసుకొని తన
సహచర
వర్గమును, విప్లవ సంఘమును కాపాడిన మహానీయుడాయన.
The
Amrita Bazar Patrika, one of the prominent dailies of that era published
about
him with the headlines "Khudiram's
End: Died cheerful and smiling"
The newspaper wrote:
"Khudiram's execution took place at 6 a.m. this
morning.
He
walked to the gallows firmly and cheerfully and even smiled when the cap was
drawn over his head." An established British newspaper,
The
Empire, wrote: "Khudiram Bose was executed this morning...It is alleged
that
he mounted the scaffold with his body erect. He was cheerful and
smiling."
The Bengali poet Kazi Nazrul Islam wrote a poem to honor him.
నేను
ఆ నిస్వార్థ జాతీయ వీరుని గూర్చి చాలా క్లుప్తముగా తెలిపినాను. గాంధిజీ కి
‘మహాత్మా’
అన్న బిరుదునిచ్చినది ఠాగూర్ గారా కాదా అంటే అది వివాదాంశము. మరణ
సమయమున
‘హేరాం’ అన్నాడా లేదా అంటే దానికీ వివాదము విభేదము ఉన్నదీ కానీ
ఖుదీరాం
గారు ‘వందేమాతరం’ అన్నారా లేదా మోముపై చిరునవ్వుతో అసువులు
బాసినారా
లేదా అన్నది మాత్రము నిర్వివాదాంశము. ఖుదీరాం ధృవతారలో
ఐక్యమైనాడు. ధృవతారలో ఐక్యమైతే అయినాడు గానీ అయినట్లు ఆ తారలో మనకు
కనిపించడు.
మరి ఇటువంటి మహనీయులను గూర్చి పాఠ్యాంశములలో చేర్చ
నవసరము
లేదా! మన పిల్లలకు దేశభక్తి అవసరము లేదా! బయటి దేశాలలో చదివే
భారతీయ
విద్యార్థులకు ఈ పుణ్యభూమిని గూర్చి ఎంత తెలుసు.
నేడు
బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో నేడు
మధ్యందినమార్తాండు.
చాలా దూరము వచ్చినాము.
మళ్ళీ కలుసుకొందాము మరి కొన్ని ఆసక్తికరమైన విషయములతో........
మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము - 4(చివరి భాగము)
మొహమ్మద్
ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము
మన
చరిత్రను గురించి తెలుసుకొనుట మన తక్షణ కర్తవ్యము. మన గతము మన వారసత్వము, మన సంస్కృతిని గూర్చి మనసారా తెలుసుకొనుట మన బాధ్యత. మన దేశమును మన కళ్ళతో
చూసుకొనుట అత్యంత ఆవశ్యకము. సద్గురు శివానంద మూర్తి గారు.
ఆ
భవిష్యద్దార్శనికుని మాటలను మనసారా విశ్వసిస్తూ ‘సారే జహాఁసె అచ్చా’ అన్న జాతీయ
హోదా గలిగిన గీతమును గూర్చి దానిని వ్రాసిన మొహమ్మద్ ఇక్బాల్ గారిని గూర్చి నేను
విన్నది, చదివినది, పెద్దలచే తెలుసుకొన్నది అతి క్లుప్తముగా తెలియజేస్తాను. వీరిని
పాకిస్తాన్ దేశపు ఆధ్యాత్మిక పితగా గుర్తించుతారు. వీరికి అల్లామా ఇక్బాల్ అని
గౌరవముగా పాకిస్తానీయులు పిలుచుకొంటారు. 'అల్లామా' అన్నది ముస్లీములు ఘనమైన విద్వాంసులకు ఇచ్చే బిరుదము.
ఈ
విషయమును గురించి వ్రాయుటకు కారణము కొంత కాలము క్రితము ఈ విషయమై నేను చూచుట తటస్థించిన
ఆస్య గ్రంధి లోని ఒక ప్రచురణ. అది ఇక్బాల్ గారిని గూర్చిన కొన్ని కల్పనలు
కలిగియుండుట చేత నేను వాస్తవమును నా చేతనయినంత మేరకు మీ ముందుకు తేవలసి వచ్చినది.
నేను ఎక్కువ మందికి చేరుతుందను ఉద్దేశ్యముతో ఆంగ్లములో వ్రాసినాను కానీ దానిపై
ఎక్కువమంది దృష్టి సారించలేదు. కారణమును పాఠకుల మనస్సాక్షికే వదలివేస్తున్నాను. ఈ
తెలుగు వ్యాసమునైనా చదివి వాస్తవాలు తెలుసుకొందురని నా ఆశ. ఈ ఆశను దేశ ప్రేమకు కొలమానముగా భావించుతూ
వున్నాను.
ఇక్బాల్
గారు ఈ గీతమును తమ 27 సంవత్సరముల వయసులో వ్రాసియుండవచ్చునని చదివినాను. వారపుడు
లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగా ఉద్యోగము చేసే వారు. దీనిని తరానా అంటారు. ఇది ఘజల్ శైలిలో
వ్రాయబడింది. 16 ఆగస్టు 19౦4 లో లాలా హరి దయాళ్ అన్న విద్యార్థి అభ్యర్ధన మేరకు
ఆయన ఏర్పాటుచేసిన సభకు ఉపన్యాసకునిగా వచ్చినా ఇక్బాల్ గారు ఈ పాటను ఆక్కడి
శ్రోతలకు ఆవిధముగా లోకానికీ మొదటిసారిగా వినిపించినారట. ఈ గీతమునకు ‘తరానా-ఏ-హింద్
అన్న నామకరణమును వారు చేసినారు. తరువాత కొంత కాలమునకు వారు భవిష్యద్ ఇస్లాం సమాజ
స్థాపన కొరకు, ఇస్లాం వేదాంతమును చదువనెంచి ఐరోపా వెళ్ళుట తటస్తించినది.
ఇక
గీతము యొక్క విషయమునకు వస్తే అది 9 చరణములను కలిగి వుంది. అందులోని 5 వ చరణము ఈ
విధముగా కనిపిస్తుంది.
అయ్
అబ్ ఎ రుద్ ఎ గంగా! వహ దిన్ హై యాద్ తుఝ్ కొ
ఉతరా
తెరే కినారే జబ్ కారవాఁ హమారా
మా
బిడారు నీ ఒడ్డున విడిది చేసిన ఆరోజు నీకు జ్ఞాపకము ఉన్నదా! అని
ప్రశ్నించుతున్నాడు కవి. మరి మహమ్మదీయులు మనము కలిసి బిడారును గంగ ఒడ్డున
ఏర్పరచియుండినామా? చరిత్ర లో ఎక్కడయినా ఉటంకించ బడినదా!
బహుశ
వారు తమ మతస్థులను గూర్చి చెప్పియుండవచ్చు. అప్పుడు, సనాతన ధర్మావలంబులమైన మనకు
అన్వయించదు కదా! మరి అన్వయించనపుడు జాతీయ గీతము యొక్క హోదాకు తగుతుందా!
మనము
వినే ఆ పాటలోని 3వచరణములో,
అనగా అది పూర్తి పాఠము లోని 6వ చరణమౌతుంది, హిందీ,
హిందుసితాఁ అన్న పదాలు వస్తాయి. బెంగాల్ బెంగాలీ గుజరాత్ గుజరాతీ,
నేపాల్ నేపాలీ పాకిస్తాన్ పాకిస్తానీ అన్న విధముగా హిందూస్తాన్ లో వున్న వారిని హిందీ అన్నారు.
మరి హిందూస్తాన్ అన్నది మనము పెట్టుకొన్న పేరు కాదు కదా! ఇండియా హిందూస్తాన్ మనము
పెట్టుకొన్న పేర్లు కాదు. ఎవరో నోరు తిరగని వారు పెట్టినవి. మనది భారత దేశము.
ఎందుకు
మనము ఈ దేశమునకు భారత్ అన్న అధికారిక నామమును ఉంచుకొన కూడదు. ‘భ’ అన్న అక్షరానికి
నిఘంటువు కొన్ని అర్థములను తెలిపింది, కానీ ఒక మహనీయుడు, మహా
పండితుడు ‘భ’ అన్న అక్షరానికి అభివృద్ధి అన్న అర్థము లేక అన్వయము కూడా ఉన్నదని నాకు
తెలియజేసినాడు. ‘నభము’ అభివృద్ధి లేనిది ఆకాశము, ‘భగము’ అన్న
మాటకు వృద్ధి ప్రగతి కలిగించునది. 'అభము' అభివృద్ధి లేమి, ఎంత గొప్ప అర్థమో గమనించండి.
ఇక హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి
హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు
అన్న ఒక క్రొత్త అర్థమును ఎవరో ప్రతిపాదించినారు. ఆధారము కానరాదు. అంత అర్థవంతమూ
కాదు. హిమాలయములకు ఆవలనున్న అరబ్బు దేశీయులు ‘స’ ను ‘హ’ గా పలుకుటచే ‘సింధు’ నది
కలిగిన దేశము ‘హిందు’ దేశమైనది.
ఉత్తర
భారతమున ‘స’ ను ‘హ’ గా పలుకుతారని ఒక వ్యక్తి ఆస్య గ్రంధిలో వ్రాయగా చదివినాను.
హిందీ భాషలో శ, ష, స మూడు అక్షరాలూ ఉండుటయే గాక వారి పేర్లలో సందీప్,
శారద, కృషి--- ఈ విధముగా మూడు అక్షరములనూ
ఉపయోగించుతారు. అరేబియా దేశాల వారు నేటికినీ గణితమును ‘హింద్స’ అనే పిలుస్తారు.
ఉత్తర భారత దేశమున ‘గణిత్’ అంటారు ‘హింద్స’ అన్నది ఔత్తరాహిక సామాన్యులకు తెలియని పదము.
తిరిగీ
అసలు విషమునకు వస్తే,
ఇక్కడ మనము అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే మనమంతా హిందూ దేశమునకు
చెందినవారము కావున హిందీలమైనాము అని మాట వరుసకు సమర్థించుకొందాము. మీ దేశమేది అని ఒక విదేశీయుడడిగితే హిందూ
దేశము’ అంటామా లేదా? హిందీ దేశము అని మాత్రము అనము కదా! అసలు
మన ధర్మమును పాటించనివారు ‘హిందూస్తాన్’ అని అంటారనుకొందాము. అప్పుడు కూడా
‘స్తాన్’ అన్నది సంస్కృత పదమే. ‘హిందు’ శబ్దోచ్ఛారణ యే వారి మత రీత్యా ఉచ్చరించుట
దోషము కదా! దంత్యములు, కంఠ్యములు, తాలవ్యములు,
ఓష్ఠ్యములు అనునాసికములు
ఇత్యాదిగా వర్గీకరింపబడిన మన సంస్కృతము భాషలకు ఆది పునాది. మిగతా ఏ ప్రపంచ
భాషకు కూడా ఈ వర్గీకరణ లేదు. అది వారు తెలుసుకొన ప్రయతించరు. ‘హింది’ ‘హిందు’
రెండూ ఒకటే కానీ వారు మొదటిది మాత్రమె ఉచ్చరించుతారు. అసలు అక్షరము అంటేనే
బాహిరముగా ’అ’ నుండి ‘క్ష’ వరకు అని ధ్వనిస్తున్నా ‘క్షరము’ అనగా ‘నాశము’ కానిది
అక్షరము. ఇంతటి గొప్ప విషయములను మనకందించిన మహనీయులు మన పూర్వులు.
ఇక
తిరిగీ ఇక్బాల్ గారి విషయమునకు వస్తే ఆయన ఇస్లాం వేదాంతమును పుణికి పుచ్చుకున్న
తరువాత ‘తరానా-ఏ-మిలి’ అన్న గేయమును ‘సారే జహాఁ సె అచ్ఛా’ ఛందస్సులోనే వ్రాసినారు.
‘తరానా-ఏ-మిలి’ అంటే ‘మతానుగత గీతము’ అని మనము అనువదించుకొనవచ్చు. ఇక్బాల్ గారి
లౌకిక తత్వమునకు సాధారణముగా ‘సారే జహాఁసె అచ్చా’ లోని ఈ చరణమును ఉటంకించుతారు.
మజహబ్
నహీఁ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా
హిందీ
హైఁ హం వతన్ హై హిందూసితాఁ హమారా
మతము
అన్నది వైరమును బోధించదు. మనము హిందువులము మనది హిందూస్థానము అని నుడివినారు.
1910
లో ఆయన వ్రాసిన ‘తరానా-ఏ-మిలి’ లో ఏమి వక్కాణించినారో చూడండి.
సైన్-ఓ-అరబ్
హమారా, హిందూసితాఁ హమారా
ముస్లిం
హైఁ హం వతన్ హై సారా జహాఁ హమారా
మధ్య
ఆసియా మనది, అరేబియా మనది, హిందూస్తాన్ మనది. మనము ముస్లిములము ఈ ప్రపంచమే మనది. దీనితో వారి హిందూదేశ భక్తి
ఏమయి పోయిందో గమనించండి. రెండు దశాబ్దముల పిమ్మట 1930 లో ఇక్బాల్ గారు అలహాబాదులో
ముస్లిం లీగ్ వార్షిక సమావేశములోని తమ అధ్యక్షోపన్యాసములో ఏఏ ప్రాంతములలోనైతే
ముస్లిం జనాభా ఎక్కువగా వుందో ఆయా ప్రాంతాలను అన్నింటినీ ముస్లిం దేశాలుగా
మార్చవలెనని ఉద్ఘాటించిన మహనీయుడు ఆయన. ఈ దేశానికి, మన
ధర్మమును పాటించే వారిలో దేశభక్తి గీతము వ్రాయ గలిగే మహా కవియే లేడా! అసలు
పాకిస్తాను బీజమును నాటిన మహానీయుడాయనే!
ఆయన 1887 నవంబరు 8 న సియాల్కోట్(ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతము)
(1938 ఏప్రిల్ 21 న లాహోర్ (బ్రిటీష్ ఇండియా) లో మరణించినారు.
పాకిస్తానులో
నేటికినీ ఆయన పుట్టిన దినమును ‘ఇక్బాల్ డే’ గా పిలుస్తూ ఆ రోజును సెలవు రోజుగా
ప్రకటించుకొంటారు.
చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆయన
పూర్వీకులు ‘సప్రూ’ అన్న ఇంటిపేరు గలిగిన
బ్రాహ్మణులు. వారు ఇస్లాం లోకి బలవంతముగా మార్చబడినవారే! ఆతరువాత కాలములో వారు
పంజాబ్ నకు వలస వచ్చినారు. అదే కాశ్మీరుకు చెందిన పండితులు ముస్లిముల చెర
తప్పించుకొని జమ్మూ చేరి తమ తిప్పలు తాము పడుతూ వుండగా తగుమమ్మా అంటూ వచ్చి మీకు
సహాయము చేస్తాము మా మతములోనికి మారండి అన్న విదేశీ క్రైస్తవులను త్రిప్పి పంపిన ఆ
గొప్పవారిని గూర్చి తలచినవారున్నారా!
తెలిసినది
క్లుప్తముగా తెలిపినాను. మంచి చెడుల నిర్ణేతలు మీరే! ఇక వారి అభిప్రాయము
హిందువులపై ఏవిధముగా ఉండినది అన్నది తెలిపి నేను విరమించుతాను.
Iqbal
expressed fears that not only would secularism weaken the spiritual foundations
of Islam and Muslim society, but that India's Hindu-majority population would
crowd out Muslim heritage, culture and political influence. (Muhammad Iqbal
(From Wikipedia)
మరి
స్వాతంత్ర్యమునకు మునుపు ఈయన వ్రాసిన 'సారే జహాఁ సే అచ్ఛా' మనకు
జాతీయ గీతము ఎట్లు కాగలుగుతుంది.
స్వస్తి.
Parvateesam
Vepa
💯👏👏👏ఈ పోస్టులో రవీంద్ర నాథ్
ఠాగూర్ జనగణమన రచనలో బ్రిటిష్ ప్రభుత్వం రాజు ఎడ్వర్డ్ 5 ను పొగడుటకై వ్రాసిన
జాతీయ గీతం జనగణమన అర్ధం,వివరణలు,వందేమాతరం గీతానికి జాతీయగీతం స్థాయి రాకుండా
కుయుక్తులను పన్ని, తన జనగణమన గీతం ద్వారా తాను జాతీయ గీతం
రచయితగా పేరు సంపాదించుకోవడానికి,తన గీతాంజలి కి నోబెల్
బహుమతి పొందడానికి చేసిన కుట్రలను బాగా వివరించారు. జనగణమన గీతం అన్ని చరణాలు
అందించి వాటి అర్ధాలను వివరించి రవీంద్రుని రచనలలో గల మాయను వివరించేరు.
బంకించంద్ర
ఛటర్జీ గారి వందేమాతరం గీతం మును అద్భుతమైన రీతిలో వివరించేరు. అది మూస్లింలు పాడ
లేరని అది దుర్గా దేవిని పూజించే పాటని రవీంద్రుడు చేసిన వ్యాఖ్యలను బాగా
వెలుగులోకి తెచ్చేరు.
ఇక్బాల్
గారి సారే జహాఁ సే అఛ్ఛాలో గల వివరాలను, పాకిస్థాన్ భక్తుడైన, పాకిస్థాన్ వారికి ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్ గా ప్రసిద్ధుడైన ఇక్బాల్
అంతరంగాన్ని బాగా తెలిపేరు. సుదీర్ఘమైన మీ పోస్టును యెంతో ప్రస్తుతించినా చాలదు.
అమోఘము, మహాద్భుతమైన
రీతిలో చిత్రించారండీ సత్యాలను.
మీ
దేశభక్తి కి జోహార్లండీ రామ మోహనరావు గారూ...
అనేకానేక
అభినందనలండీ.వందనములు.
YOU
DID A GREAT JOB
Pemmaraju Purnachandra Rao
ఆర్యా శ్రీ మోహనరావు గారు మీరు వ్రాసిన విషయాలు కొన్ని నేను చదివిన విన్న విషయాలు ఇప్పుడు ఎవరికీ అసలు సంగతులే పట్టవు ఇంక అంతరార్ధం ఎవరికి పడుతుంది.ముఖ్యంగా శ్రీ వాకాటి పాండురంగారావు ఆంధ్రప్రభ సంపాదకులు ఇక్బాల్ కవితల అసలు పాఠం గుట్టు విప్పారు ఓ ప్రసంగంలో. మనలో కొందరు ఆహా ఇక్బాల్ దేశభక్తి మా గురించే ఈ కవిత అని మురిసిపోవడం గురించి చెబుతుండగా విన్నాను. కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానుల. మాటలు గుర్తుకు వచ్చాయి. భాషా భేదం కానీ మన ముక్కలే వాళ్ళవి అని,. మొగలు దర్బారు కుట్రలు అని ఓ ధారావాహిక యువ మాసపత్రికలో వచ్చేది అలాగే నెహ్రూ దర్బారు అంతఃపురం దారుణాలు తెలిసినా మన కాంగ్రేసు దశాబ్దాల పాలనలో బుర్రలను సామాజికంగా సామూహికంగా ప్రభావితం చేసేసాయి, మన స్వభావం లోనే రాజాశ్రయవిధేయత ఓ భాగమయ్యింది.టాగోర్ కవితా ప్రతిభ గురించి శ్రీ శ్రీ గారు తన సహజ ధిక్కార. ధోరణిలో. టాగూర్ కన్నా మన చింతా దీక్షితులు మిన్న అన్నారు.కానీ ఎవరికి కావాలి నిజం. ప్రసార మాధ్యమాలు చేసే హడావుడి తమ సంకుచిత పరిమిత భావజాలం ప్రజాభిప్రాయం అని ఢంకాలు 24\7 బజాయించడంవల్ల బ్రాహ్మణుడు నల్లమేక కధలా తయారయ్యింది నిజం నిర్ధారణ. ఇది కాలమహిమా అవకాశవాదమా వెన్నెముక సత్తా లేని భజనబ్రృందాల సామూహిక స్వార్ధ గీతాలాపనా. సర్కారీ కవుల కొలువుల గిట్టుబాటు వ్వవహారమా\. ఏమై నా మీ పరిశోధన ఆసక్తి నిజనిరూపణాసక్తి అభినందనీయం ఎంత మందికి ఎక్కుతుంది.ఈ ఘోష. Citation లో ప్రాక్పశ్చిమ సంయోగానికి చేసిన కృషికి ఇస్తున్నట్లు అన్నారు. సాహిత్యప్రతిభ కి కాదా ఆ నోబెల్ బహుమతి కూడా కమిటి నిర్ణయం లేకుండానే. ఇవ్వ డం అయ్యిందంటే ఇంతకు మించి ఆశ్చర్యం ఏముంటుందీ
🌹👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹
Yes Sir, you are correct. Ragore scripted 'Janaganamana' to praise King George-V. Rogue Nehru did all the damage.
ReplyDelete