Wednesday, 13 January 2021

కొనకుండా నవ్వుకొనండి – బావా కర్ణా

 

కొనకుండా నవ్వుకొనండి – బావా కర్ణా

https://cherukuramamohan.blogspot.com/2021/01/blog-post_13.html

ఇది దాదాపు 60 సంవత్సరముల క్రితము జరిగిన కథ. కడప జిల్లా పులివెందులకు 

దగ్గరగా వేంపల్లి పులివేన్స్డులకు నడుమన వేముల అనే ఓక గ్రామము ఉన్నది. 

సంక్రాంతికి పంటలు చేతికి వస్తాయి కాబట్టి డబ్బులు జేబుల్లో గలగలాలాడుతూ 

ఉంటాయి. తాగుడుకు కొదవే ఉండదు. ఆరోజుల్లో ఖాళీ అయిన కళ్ళాలలో సంక్రాంతి 

రోజు ఏ ‘కృష్ణ రాయభార’మో లేక ‘రామాంజనేయ యుద్ధమో’ ‘గయోపాఖ్యాన’మో 

నాటకము వేసేవారు. ఆ సంవత్సరము  ‘శ్రీకృష్ణ రాయభారము’ వేయదలచి ఒక 

నెలరోజుల ముందునుండి హార్మోనియము పద్యములు రాగయుక్తముగా ఆడే 

గురువును ఏర్పాటుచేసుకోని సాధన మొదల్కుపెట్టినారు.

ఆ రోజు రానే వచ్చింది. కల్లములో Set వేసినారు. వివిధ రంగులు విద్యుద్దీప కాంతులతో 

వెలిగిపోతూ వుంది ఆ కళ్లము. ఊర్పిళ్ళు అప్పుడే అయిన సమయము కాబట్టి 

సముద్రములోని అలల వలె గాలిలో పురుగులు తేలియాడుతూ ఉన్నాయి. నాటు 

సారాయి నీటుగా నటులంతా పీకల వరకు దట్టించినారు. గంట రాత్రి 10 కావస్తూ 

ఉండగా నాటకము మొదలైనది. ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో జనమునకు ‘థూ 

నీయమ్మ’ అనుట ఊతపదము.

  రాయభారము ఫలించా లేదు. ఆ అంకము బాగా రక్తి కట్టించినారు.

కృష్ణుడు కర్ణుని అతని భవనంలో కలువదలచి వెళ్ళినాడు. కర్ణుని చూచినాడు. సంభాషణ 

ప్రారంభించాబోతూ ‘బావా! కర్ణా!’ అన్నాడు. బావా అని నోరు తెరువగానే కొన్ని 

పురుగులో నోటిలోనికి పోయినాయి. వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా తాగిన 

మైకము తలకెక్కగా, నోట దూరిన పురుగులను ఉమ్మివేస్తూ అలోకగా తన సహజమైన 

రీతిలో ‘థూ నీయమ్మ’ అన్నాడు. అంతటితో కర్ణ కృష్ణ యుద్ధము మొదలై నాటకము 

నడివీధికెక్కింది.

ఈ ఉదంతమును పద్య రూపములో ఈ విధముగా ఉంచినాను.

రాయ భారమందు రాజీని బడయక

అంగరాజు జేరి అచ్యుతుండు           

వాయి తెరచి తాను బావా యనంగానె

‘థూ నీయమ్మ’ యనెను దూర ఈగ

స్వస్తి.

No comments:

Post a Comment