Saturday, 24 August 2019

సార సంగ్రహ గణితము-పావులూరి మల్లన.

ఇది 11 వ శాతాబ్దములోనే తెలుగులో రచింపడిన మొట్టమొదటి గణిత శాస్త్రము. ఇందులో 10 విధములగు గణితములైన,

పరికర్మ గణితము, భిన్న గణితము, ప్రకీర్ణ  గణితము, త్రైరాశిక గణితము, మిశ్ర గణితము, సూత్ర గణితము, క్షేత్ర గణితము, సువర్ణ గణితము, ఖాత గణితము మరియు గణితము అన్న 10 విభాగములు కలవు. ఇందు లభ్యమైన రెండింటికి మాత్రమే శ్రీయుతులు గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు లఘు వ్యాఖ్యానము వ్రాసినారు. 3 వ ప్రకరణము లభ్యము అని పెద్దలద్వారా విన్నాను. మిగతా 7 భాగములు మన నిర్లకష్యమునకు గురియైనవి.అని చెప్పుటకు సిగ్గుపడుచున్నాను.
సార సంగ్రహ గణితము-పావులూరి మల్లన.
https://cherukuramamohan.blogspot.com/2019/08/blog-post_27.html
పై శీర్షికను గూర్చి తెలుపుట ప్రారంభించుటకు ముందు ఇద్దరు ముఖ్యమయయిన వ్యక్తులను గూర్చి తెలుపుట నా బాధ్యత లేక కర్తవ్యము. అందులో ఒకరు నాకు అనుజ సమానుడు చప్పిడి నీలకంఠా రెడ్డి గారు. రెండవ వ్యక్తి నేను నా జ్యేష్ట భ్రాతగా పరిగణించే గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు.
ముందు నీలకంఠా రెడ్డిని గూర్చి నాలుగు మాటలు చెబుతాను. నేను ఎప్పుడూ, నేను నమ్మిన నీలకంఠుడే, నీలకంఠా రెడ్డి రూపములో నాకు అండదండగా ఉంటున్నాడని మనసారా నమ్ముతాను. నేను కష్టములో ఉన్న ప్రతిసారీ తన సహాయమును అందిస్తాడు. బహుశ తన సహాయము లేకుండా నేను దాటినా కష్టము లేదేమో! బాగా తెలిసినవాడై ఉండి కూడా తెలియనట్లే మసలుతాడు.అవసరమున్నపుడు తప్ప అసలు మాట్లాడడు. ఆతని మంచితనమును గూర్చి పై శీర్షిక సంబంధముగా ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను.
పావులూరి మల్లన గణిత సార సంగ్రహము అన్న గణిత గ్రంధమును వ్రాసినట్లు చరవాణిలో మేము మాట్లాడుకొను సమయములో చెప్పియుండినాను. ఆ మాట ఆయన మనస్సులో చేరగకుండా వుండినదని, ఆ విషయమై ఆయన, దూరభాషణమున తానూ తెలిపే వరకూ నాకుతెలియదు. ఒకరోజు చరవాణిలో తానూ గ్రంధాలయమునకు వెళితే పై పుస్తకము లభించగా తాను సభ్యుడు కాబట్టి ఇంటికి తెచ్చినట్లు చెప్పి దాని నకలును నాకు పంపుతానని చెబుతూ ఆగ్రంధమునకు వ్యాఖ్యానమును వ్రాసిన సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అనుమతి తీసుకొంటే బాగుంటుందేమోనని తెలియజేసినాడు. ఎంతటి సంస్కారమో గమనించండి. తెలుపకుండా నకళ్ళు తీసుకొనుటవల్ల పొందే నష్టము లేకున్నా ఎపనయినా సాప్రదాయబద్ధముగా ఉండవలెనను ఆయనయొక్క సుమసుకుమార సౌమనస్యత తెలుపుతూవుంది. నేను శాస్త్రి గారి అనుమతి గైకొని తెలియబరచుటయే ఆలస్యము పుస్తకము రెండు రోజులలో నా తలుపు తట్టినది. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే నాకు తెలుపకనే తాను చదివి వాపసు చేయవచ్చు. కానీ అట్లుచేయక దాని ప్రతిని, నాకు చేరే వరకూ తానే ఖర్చు భరించి పంపిన ఆయన మనస్తత్వము నెమరు వేసుకొన్నపుడు నా కనులు నిజముగా చెమర్చినవి.
ఇక గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని గూర్చి నాలుగు మాటలు. ఆయన నంద్యాల ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ఉన్నతాంధ్ర ఉపాధ్యాయుడేగానీ 6 భాషలలో అనర్గళమైన పండితుడు. ఆయన ఏ పాఠశాలలో చదివినాడో పదవీవిరమణ చేసే వరకూ ఆ పాఠశాలకే అంకితమైపోయినాడు, అటు విద్యార్థిగా ఇటు ఉపాధ్యాయునిగా. ప్రధానోపాధ్యాయుడు మొదలుకొని ప్రతి విద్యార్థీ ఆయనను గౌరవించేవారేగానీ ఆయన కేవలము ఆంధ్రోపాధ్యాయుడే కదా అన్న నేటి తరహా హీనమైన ఆలోచన వారి దరిదాపులకు రాలేదు, ఆయన ఇవ్వనూలేదు. శాస్త్రిగారి సహకారములేకుండా ఆంధ్రభాషలో Doctorate పొందినవారు ఆప్రాంతములో బహు అరుదు. అంతటి ప్రజ్ఞాపాటవాలు కలిగియుండికూడా ఏనాడు ఈషణ్మాత్రము కూడా అహంకారము చూపని అత్యుత్తముడు. మరొక ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే వారు నాకు పరిచయమై ఐదు సంవత్సరములైనా ఇంతవరకు నేను ఆయనను చూసిందిలేదు. సంభాషణ అంతా చరవాణిలోనే! అయినా ఎప్పటినుండియో పరిచయము ఉన్నట్లు వారి మాటలలో ఆప్యాయత నిండియుంటుంది. ఎమీరాని నేను ఏ సందేహమడిగినా అప్పటికప్పుడే అక్కడికక్కడే సమాధానము నిచ్చే ప్రజ్ఞాశాలి ఆయుయన. నీలకంఠా రెడ్డి సలహామేరకు, నేను శాస్త్రిగారిని అడిగిన వెంటనే ‘ధారాళంగా నకలు చేయించి ఆ పుస్తకమును వాడుకోండి. దానివల్ల నాకు ఒక మంచిపని చేసినానన్న తృప్తి మిగులుతుంది’ అన్న ఉదాత్తుడు ఆయన. గణితముతో ఎటువంటి సంబంధము లేకుండానే, అందునా వేదగణితముతో సంపర్కమే లేకుండా వ్యాఖ్యానము ఏ విధముగా వీరు వ్రాసినారన్నది అమితాశ్చర్యము. దీనికి పీఠిక వ్రాసిన వక్తి ఆధునిక కాలములో దిగ్దంతిగా చెప్పుకోదగిన, కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయమునకు ఆది ఉపకులపతి (Vice Chancellor) అయిన శ్రీ P.V. అరుణాచలంగారు. శాస్త్రిగారి గణితజ్ఞతకు ఇది రాజముద్ర.
ఇటువంటి వ్యక్తుల సహాయ, సహకార, సౌజన్యములతో నేను నాకు తోచిన నాలుగు మాటలను వ్రాయగలుగుచున్నాను. వారిరువురికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకొంటూ అసలు విషయమునకు వస్తాను.
సార సంగ్రహ గణితమును వ్రాసిన పావులూరి మల్లన గారు 11వ శతాబ్దికి చెందినవాడగుటయే గా ఆదికవిగా మనము సంభావించే నన్నయ సమకాలీనుడు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన విద్వాంసుడు. అంతేకాక ఆయనతో పీఠాపుర సమీపములోని నవఖండవాడ అన్న అగ్రహారమును బహుమతిగా పొందిన ఈ మహానుభావుడు కమ్మనాడు యందలి బాపట్ల సమీపమున ఉన్న పావులూరు\ ప్రకాశం జిల్లా లోని పావులూరు స్వస్థలముగా కలిగినవాడు.  
దాదాపు 8, లేక 9 శతాబ్దము వాడయిన జైనుడు, గణిత శాస్త్రవేత్త, పండితుడు కవియైన మహావీరాచార్యుయుడు సంస్కృతమున వ్రాసిన ‘గణిత సార సంగ్రహము’ మల్లన గారి రచనకు మాతృక గా చెబుతారు. అసలు మల్లనగారి ఈ గ్రంధము వెలుగులోనికి వచ్చుటకు కారణము అఖండ మేధా సంపన్నులు విమర్శకాగ్రేసరులు అయిన మాన్యవరులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఎంతయో కృషి చేసినారు. కొంత తిమ్మా్ఝ్ఝల కోదండరామయ్య గారి కృషి కూడా ఇందున్నది. వారి యోగదానమునకు మనమెంతో ఋణపడియున్నాము.
నిజానికి ఈ గణిత గ్రంధము 10 అధ్యాయములు కలిగిన గ్రంధము. మన అశ్రద్ధ, అలసత్వము, పాశ్చాత్య అనుకరణము, వల్ల నేడు 3 శాఖలు మాత్రమే లభ్యమగుచుండగా, శాస్త్రిగారికి రెండు మాత్రమే లభ్యమైనాయో ఏమో వాటికి వ్యాఖ్యానము సులభాగ్రాహ్యమగు రీతిలో, తన పాండిత్యమునకు గణితముతో సంబంధము లేకున్నా అవలీలగా వ్రాయగలిగిన పుష్కల వాణీవర సంపన్నుడు.
  మల్లన గారు వ్రాసిన ఈగ్రంధమును పరిశీలించినవారికి నన్నయ కాలమునకే ఛందోవ్యాకరణములు వున్నట్లు నాకనిపించిది. అదియును గాక మల్లన మహాశయుడు తన రచనను, ద్రాక్షా, కదళీ పాకముల లోనే వ్రాసినాడు. నన్నయ భారతము యొక్క ప్రౌఢ ఛాయలు ఇందు కనిపించవు. దీనిని బట్టి నన్నయ కాలమునకు ముందు ఒకవేళ కావ్యము లేకపోయినా అట్లుకాక కాయములు ఉండీ అలభ్యమైనా, లేక కావ్యము ఉండికూడా పండిత శ్రేష్ఠుల అభిప్రాయముల వల్ల భారతముకన్నా ముందుది అయి వుండి కూడా మరుగున పడియుండినా, ఛందోవ్యాకరణములు తప్పక ఉండియుండేవని తెలియవచ్చుచున్నది.
ఇక అభిమానముతో నీలకంఠా రెడ్డి పంపిన పొత్తమును చదివిన తరువాత సంకలన వ్యవకలన భాగహార అంశములను, వేదగణిత విధానము ద్వారా మల్లన గారు అందించిన వివరములు వదలి, ఒక పూర్ణ ఘనమూలము అనగా దశాంశములు లేని సంఖ్యను తీసుకొని దశాంశములు రాని దాని ఘన మూలమును  మల్లన్న గారు చెప్పిన రీతిగా నేను మనము చదువుకొనుచున్న విధానమును కలబోసి (In Modern Notation) ఫలితమును తెచ్చిన విధమును మీముందు ఉంచుచున్నాను. అంకిత భావముతో చదివినవారెవరైనా అతిసులభముగా అర్థము చేసుకొనగలరు.
పావులూరి వారి సార సంగ్రహ గణితము లో ఇచ్చిన సమస్య : 77 308 776 కు ఘన మూలమెంత?
ఈ సమస్యను పరిష్కరించుటకు ముందు కొన్ని సూత్రములను తెలుసుకొనవలసి యున్నది. అవి గమనిందాము.
రేపు మొత్తము గమనించుదాము......
పావులూరి వారి సార సంగ్రహ గణితము లో ఇచ్చిన సమస్య : 77 308 776 కు ఘన మూలమెంత?
ఈ సమస్యను పరిష్కరించుటకు ముందు కొన్ని సూత్రములను తెలుసుకొనవలసియున్నది. అవి గమనించుదాము.
Following are the points to remember for speedy calculation of cube roots (of perfect cubes).
The lowest cubes (i.e. the cubes of the first nine natural numbers) are 1, 8, 27, 64, 125, 216, 343, 512 and 729.
The last digit of the cube root of an exact cube is obvious:
1³ = 1  -> If the last digit of the perfect cube = 1, the last digit of the cube root = 1
2³ = 8 -> If the last digit of the perfect cube = 8, the last digit of the cube root = 2
3³ = 27-> If the last digit of the perfect cube = 7, the last digit of the cube root = 3
4³ = 64->If the last digit of the perfect cube = 4, the last digit of the cube root = 4
5³=125 ->If the last digit of the perfect cube = 5, the last digit of the cube root = 5
6³=216 ->If the last digit of the perfect cube = 6, the last digit of the cube root = 6
7³=343 ->If the last digit of the perfect cube = 3, the last digit of the cube root = 7
8³=512 ->If the last digit of the perfect cube = 2, the last digit of the cube root = 8
9³=729 ->If the last digit of the perfect cube = 9, the last digit of the cube root = 9
In other words,
1, 4, 5, 6, 9 and 0 repeat themselves as last digit of cube.
Cube of 2, 3, 7 and 8 have complements from 10 (e.g. 10's complement of 3 is 7 i.e. 3+7=10) as last digit.
Also consider, that
8's cube ends with 2 and 2's cube ends with 8
7's cube ends with 3 and 3's cube ends with 7
If we observe the properties of numbers, Mathematics becomes very interesting subject and fun to learn. Following same, let’s now see how we can actually find the cube roots of perfect cubes very fast.
గణితమును ఆంగ్లములోనే చదువుతారుకాబట్టి విషయమును ఆంగ్లములోనే ఉంచినాను. అయినా తెలుగులో కూడా తెలియజేస్తాను. 1 నుండి 9 వరకు గల వరుస సంఖ్యల ఘనములు ఈ దిగువ తెల్పిన విధముగా ఉంటాయి:
1³ = 1 
2³ = 8
3³ = 27
4³ = 64
5³=125
6³=216
7³=343 
8³=512
9³=729
ఈ వివరమును ఏవిధముగానైనా మరవకుండా మనసులో మరుగుపరచవలసిందే!
ఇప్పుడు ఒక గుడ్డి గురుతును జ్ఞాపకము ఉంచుకోవాలి.1,4,5,6,9 ని గమనించితే ‘=’ గురుతుకు రెండువైపులా ఉన్న చివరి అంకె మారదు. అంటే ఉదాహరణకు 4ను తీసుకొందాము. 4 యొక్క ఘనము 64. అంటే 4 విషయములో ఘనమూలము చివరి అంకె 4ఏ(నాలుగే) అవుతుంది. దాని ఘనములోని చివరి అంకె కూడా 4ఏ(నాలుగే) అవుతుంది. ఇదే సూత్రము 1,5,6,9 కి కూడా వర్తించుతుంది. ఇక మిగిలిన అంకెలు 2,3,7,8 మాత్రమే. 10 ని base అనుకొంటే 2 కు 8, 3 కు 7 అవుతాయి. అంటే ఘన మూలములో చివరి అంకె 2 అయితే ఘనములో చివరి అంకె 8 అవుతుంది, అంటే ఈ రెండూ  పరిపూరకములౌతాయి (Complementary). అదే ఘన మూలములో చివరి అంకె 8 అయితే ఘనములో చివరి అంకె 2 అవుతుంది, పరిపూరకములు(Complementaries) కాబట్టి. 3,7  విషయములో కూడా ఇదే నీతి వర్తిస్తుంది.
ఇక తరువాతి విషయమునకు వద్దాము.
ముందు ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము.
16
³ ను మనసులో వుంచుకొందాము. దాని ఘనము 4096. ఈ 4096 యొక్క ఘనము మనకు తెలియదు అనుకొని ఈ సంఖ్య యొక్క ఘనమూలమును సాధించుదాము.
4096 లో చివరి అంకె 6. కాబట్టి వర్గమూలము లో చివరి అంకె 6 అని నిర్దారించుకొనవచ్చును.
ఇప్పుడు 4096 లో మొదటి అంకెను తీసుకోవాలి. ఈ పద్ధతి ప్రతి నాలుగు అంకెల సంఖ్యకూ వర్తిస్తుంది. చివరి అంకె ఏదయితే అది తీసుకోవాలి (2,3 విషయములో 8,7ను తీసుకొనవలసి ఉంటుంది.) . ఇక్కడ మొదటి అంకె 4.
4 అన్న ఈ అంకె  1³ = 1  మరియు 2³ = 8 మధ్యన వస్తుంది. మనపెపుడూ మనవద్దనున్న అంకె కన్నా చిన్న ఘనమునే తీసుకోవాలి. కాబట్టి మనము తీసుకొవలసినది 1. కాబట్టి ఒకట్ల స్థానములో వున్న 6 ప్రక్కన అనగా పదుల స్థానములో 1ని ఉంచవలె. అపుడు ఆ సంఖ్య 16అవుతుంది. కాబట్టి 4096 కు ఘనమూలము 16. అంతే అదే జవాబు.
మొదట నేను విషయమును విశదముగా చెప్పవలెను కావున విస్తారముగా చెప్పవలసి వచ్చినది. ఒక్కసారి మీరు అర్థము చేసుకోన్నారంటే జవాబును మీరు 5,6 సెకనులలో చెప్పగలరు.
పాఠకులు అలవాటు పడుటకుమరియొక ఉదాహరణ తీసుకొని అసలు సమస్యను చేరుదాము.
నికర ఘనము (perfect cube) ను తీసుకొందాము.
804 357. మూడు మూడు అంకెలను ఒక బేరిగా ఉంచుకొనవలెను. అంటే 804 357 గా పేర్చితే మన కుడి నుండి ఎడమకు ఎంచినపుడు ముందువచ్చే  357 లో వుండే 7 ను మనము మొదట తీసుకోవాలి. 10ని, పైన చెప్పినట్లు Base గా తీసుకొంటే 7 కు 3, 3, కు 7 Complements అవుతాయి. మనము తీసుకొన్న సంఖ్యలో ఒకట్ల స్థానములో ఉండే 7 కు 3 Complement. కాబట్టి ఘనమూలములోని ఒకట్ల స్థానములో 3 ఉండితీరుతుంది. ఇక రెండవ బేరియైన  804 తీసుకొందాము. మనము గమనించితే ఈ సంఖ్య 9³=729<10³=1000 కి మధ్యన ఉన్నది. కాబట్టి చిన్నదయిన 9³ తీసుకోవలెను. దీని ఘనమూలము 9. ఇక ఈ 9ని 3 ప్రక్కన మన ఎడమవైపు వ్రాస్తే అదే జవాబు. అంటే 93 జవాబు. కావున 93³= 8,04,357. మీరిపుడు సాధారణ హెచ్చింపుతో జవాబు సరిచూసుకోవచ్చు.
ఇప్పుడు మల్లనగారు ఇచ్చిన సమస్యను  తీసుకొందాము. ‘అంకానాం వామతో గతిః’ అన్నది వేద గణిత సూత్రము. అంటే మల్లనగారిచ్చిన సంఖ్య 77308776ను వరుసగా 6,7,7,8,0,3,7,7,అని లెక్కించవలెను. కావున అంకెలను 3,3 ఒక్కొక్క బెరిగా ఏర్పాటు చేసుకొందాము. అంటే మనకిచ్చిన సంఖ్యను ఈ విధముగా వ్రాసుకొంటూ ఉన్నాము.
సమస్య : 77308776 కు ఘన మూలమెంత?
ఇప్పుడు ఇచ్చిన సంఖ్యను 77 308 776 గా వ్రాసుకొన్నాము. చివరిదైన 77కు తోడు మూడవ అంకె లేదు. వదిలేద్దాము. 77 మాత్రామే మూడవ బేరిగా తీసుకొందాము.
77 308 776 -> మొదటి 3 అయిన 776 లో 6 కు 6 Complement అవుతుంది. కావున మనము ఘన మూలములో ఒకట్ల స్థానమును సాధించినాము. ఇక చివరి సంఖ్య అంటే 77 కు పోతాము.
 4³ = 64 < 77 < 5³=125. కాబట్టి ఘన మూలములోని చివరి సంఖ్య 4(పైన రెండు ఉదాహరణలు సాధించినాము). అంటే ఘన మూలము  4 _ 6 మొదటి చివరి అంకెలుగా కలిగి యుంటుంది. ఇప్పుడు మన బాధ్యత మధ్య అంకె కనుగొనుట.
ఇచ్చిన సంఖ్యను 3 భాగములుగా విభాజించినాము కదా! మొదటిది F (First) అనుకొందాము. రెండవది S (Second) అనుకొందాము. మూడవది T (Third) అనుకొందాము.
అప్పుడు 77308776 ను
F    S      T
77  308   776 గా వ్రాసుకొనవచ్చును. T³= 6³ (చివరి అంకె మాత్రమే) = 216. ఇప్పుడు T-T³ = 776- 216= 560 (0 ను గ్రహించ రాదు.) 56 లో కూడా మనకు కుడివైపున వుండే 6 ను తీసుకోవాలి.
ఇప్పుడు 3T²S (ఈ సూత్రమును ఎల్లపుడూ  గుర్తుంచుకోవాలి)= 3 x 6² x S -> 6 (ఈ 6, 56 లోని 6)
అంటే 108 S లో చివరి అంకె 8. ఇప్పుడు 8 వ ఎక్కమును ఏకరువు పెడితే 8x2=16 మరియు 8x7=56
రెంటిలోనూ చివరి సంఖ్య 6 వస్తుంది.కాబట్టి 77308776 యొక్క ఘనమూలములో మొదటి అంకె 4 మరియు చివరి అంకె 6 మరియు నడుమ అంకె 2 లేక 7 అయి ఉండాలి.
ఇపుడు 2,7 లలో సరియైనది ఏది అన్నది కనుగొందాము.
ఇచ్చిన సంఖ్య యగు 77308776 లోని అన్ని అంకెలనూ కూడుదాము. +7+3+0+8+7+7+6=45=9*
F    S     T
4  (2,7)   6
ఇప్పుడు మొదట 2ను తరువాత 7ను తీసుకొని సరియైన జవాబుకు ప్రయత్నిద్దాము.
 426  4+2+6= 12=1+2=3, ఇపుడు 3³ = 27= 2+7=9*
ఇక 476 ప్రయత్నిద్దాము. 4+7+6=17=1+7=8; 8³=512 , 5+1+2= 8 9
కాబట్టి మల్లనగారిచ్చిన సంఖ్యకు ఘన మూలము 426. ఇపుడు కావాలనుకొంటే Calculator ద్వారా సరిచూసుకోవచ్చు.  
426³= 77308776
ఈవిధానమంతా పావులూరి మల్లనగారు చెప్పినదే! నేను ఆయన తెలిపిన పేర్లను నేటి చదువరుల సౌలభ్యము కొరకు Modern Notation వాడినాను.
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నది పెద్దల మాట.  అర్థమయితే అంతా చేయుటకు అర నిముసము కూడా పట్టదు.

స్వస్తి.


Wednesday, 7 August 2019

మన జాతీయ గీతము (ఒక విమర్శన)


మన జాతీయ గీతము
https://cherukuramamohan.blogspot.com/2019/08/blog-post.html

ఈ వ్యాసమును నేను 16\19\13 లో వ్రాయటము జరిగినది. అప్పుడు విశేష పాఠక ఆదరణ పొందుట చేతనూ ఇప్పుడు సందర్భోచితము అయినందువల్లనూ పునర్ముద్రణ జరిగినది.
నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦ రూపాయలు  అనే ఈ రోజుల్లో
, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం' గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్ ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర్ గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది. ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే సాక్ష్యము .

In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can be no debate about it. Of course Bankimchandra does show Durga to be inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [the nation].

మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు నడచినాడు.

మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో ప్రతిఘటన ఏదీ!

ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం. లో వ్రాయబడినది . ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగింది .

ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ జాతుల ,పర్వతముల, నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్ గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది. ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు కదా !

ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు ఆయన చొప్పించిన అబిప్రాయము.

ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .

"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him specially to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911)"The proceedings began with the singing by Rabindranath Tagore of a song specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28, 1911) "When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was also adopted unanimously." (Indian, Dec. 29, 1911)
ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో, కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే, తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది.
మన జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.
అది రేపు చదువుదాం.............

2వ భాగము
విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని  పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!
జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)
జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా
పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా
వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా
తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా
జన్ గణ్ మంగల్ దాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll
ఆహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ
హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖిస్తానీ
పూరబ్ పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా
జనగణ ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll
పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ
తుం చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ
దారుణ్ బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా
జనగణ పథ్ పరిచాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll
ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే
ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకే, స్నేహమయీ తుమీ మాతా
జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll
రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే
గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే
తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే
తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే
జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll
"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల ఆధారములను ఒకపరి పరికించుదాము -
మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.
1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం జరిగింది.
2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.
3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము. మరివిధాత అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హుడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా!
4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆసే - తవ సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.
5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది. పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని అనుకొనుటకు వీలు కాదు, అన్వయము కుదరదు కాబట్టి.
6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం "రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై  కదా వుండినారు.
7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్ పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునా? వాడ తగునా?
8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!
పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న రవీంద్రనాథ ఠాకూర్ గారుబ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును "టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.
పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి సింహాసనము  చేజిక్కించుకొని, దేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన మీర్ జాఫర్ ను, అతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు. ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూ, ముఖోపాధ్యాయ  ముఖర్జీగానూ, బందోపాధ్యాయ బెనర్జీగానూ మారిపోయినాయి. అయితే శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఖుదీరాం బోస్, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీ, ప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికి, ఠీవికి, దర్జాకు, దర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.
ఇక ఈ నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి చూద్దాము :

మిగిలినది రేపు.....
మన జాతీయ గీతము -3
1. 18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్ కిశోరము ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా పాత్రులు కారని ఎంచి, విధించినారు.  ఇది 1908,మే 21న జరిగిన ఉదంతము. అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర లేకుండా చేసిన బెంగాలు పులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో !
2. రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.
3. ఆయనకు బంగ్లావాసిగా కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది.
4. బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన భాషణము ఇవ్వలేదు .
5. ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు.
6. బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు అంద జేసినారు.
7. ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ బహుమతినిచ్చినారని కూడా అంటారు.
ఇక్కడ, ఖుదీరాం బోస్ నేటి తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు, చదివిన/చదివే చరిత్ర లో కనిపించడు. ఈమహనీయుని గూర్చి ఈ తరం యువతరం తప్పక తెలుసుకోవలసి యున్నది. 1889 డిసెంబరు 3 న జన్మించిన ఈయన 18 సంవత్సరాలా 8 నెలలా 8 రోజులకే ఆంగ్లేయుల పైశాచికత్వమునకు బలియయిన బెంగాల్ బాలవీరుడు.  బెంగాలులోని మిడ్నపూరుకు చెందిన వాడు. ఆయన, అరబిందో గారు పూర్వాశ్రమములో రాజకీయ నాయకునిగా దేశమును జాగృతము చేయుచున్న కాలములో వారి ప్రభావమునకు గురియైనవాడు. 16 సంవత్సరాల నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే మిడ్నపూరు పోలీసు స్టేషను వద్ద బాబుల నమర్చినవాడు. ఆ తరువాత మూడు సంవత్సరములకు ఆంగ్లేయులచే అరెస్టు కాబడి వారిచే విధింపబడిన ఉరిశిక్షకు 11 ఆగస్టు 1908 లో గురియయినవాడు. ఆయనపై వరుస బాబులనమర్చినాడన్న అబద్ధపు అభియోగమును  మోపి  ఆయనకు ఉరిశిక్ష విధింపజేయుట జరిగినది. కింగ్స్ ఫోర్డ్ అన్న ముజఫ్ఫర్ పూర్ బీహారు కు చెందిన అతి కౄరుడైన  మేజిస్ట్రేటును బాంబు ఒక చేతితో రైఫిల్ ఒక చేతితో పట్టుకొని బాంబును బగ్గీ పై వేసినాడు కానీ ఫోర్డు కు బదులుగా కెన్నెడీ అన్న బారిస్టరు యొక్క భార్య బిడ్డ అందులో వుండినారు. ఎట్లయితేనేమి ఖుదీ రామును బంధించినారు 1908 మే 1 న. ఆయనను గూర్చి STATESMAN అన్న ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక  ఈ విధముగా వ్రాసినది.
The English daily, The Statesman, wrote on the following day, May 2, 1908:

The Railway station was crowded to see the boy. A mere boy of 18 or 19 years old, who looked quite determined. He came out of a first-class compartment and walked all the way to the phaeton, kept for him outside, like a cheerful boy who knows no anxiety.....on taking his seat the boy lustily cried 'Vande Mataram'...
ఇక్కడ ఇంకొక విషయము ఏమిటంటే అభియోగము మొత్తమును తనపై వేసుకొని తన సహచర వర్గమును, విప్లవ సంఘమును కాపాడిన మహానీయుడాయన.
The Amrita Bazar Patrika, one of the prominent dailies of that era published about him with the headlines   "Khudiram's End: Died cheerful and smiling" the newspaper wrote: "Khudiram's execution took place at 6 a.m. this morning. He walked to the gallows firmly and cheerfully and even smiled when the cap was drawn over his head." An established British newspaper, The Empire, wrote: "Khudiram Bose was executed this morning...It is alleged that he mounted the scaffold with his body erect. He was cheerful and smiling." The Bengali poet Kazi Nazrul Islam wrote a poem to honor him.
నేను ఆ నిస్వార్థ జాతీయ వీరుని గూర్చి చాలా క్లుప్తముగా తెలిపినాను. గాంధిజీ కి ‘మహాత్మా’ అన్న బిరుదునిచ్చినది ఠాగూర్ గారా కాదా అంటే అది వివాదాంశము. మరణ సమయమున ‘హేరాం’ అన్నాడా లేదా అంటే దానికీ వివాదము విభేదము ఉన్నదీ కానీ ఖుదీరాం గారు ‘వందేమాతరం’ అన్నారా లేదా మోముపై చిరునవ్వుతో అసువులు బాసినారా లేదా అన్నది మాత్రము నిర్వివాదాంశము. ఖుదీరాం ధృవతారలో ఐక్యమైనాడు.  ధృవతారలో ఐక్యమైతే అయినాడు గానీ  అయినట్లు ఆ తారలో మనకు కనిపించడు. మరి ఇటువంటి మహనీయులను గూర్చి పాఠ్యాంశములలో చేర్చ నవసరము లేదా! మన పిల్లలకు దేశభక్తి అవసరము లేదా! బయటి దేశాలలో చదివే భారతీయ విద్యార్థులకు ఈ పుణ్యభూమిని గూర్చి ఎంత తెలుసు.
నేడు బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో నేడు మధ్యందినమార్తాండు.
చాలా దూరం వచ్చినాము. మళ్ళీ కలుసుకొందాము.

స్వస్తి

Friday, 2 August 2019


అనిల్ గొచ్చికర్    
    https://cherukuramamohan.blogspot.com/2019/07/blog-post_26.html                       పూరీ జగన్నాథ్ ఆలయ పూజారి స్వగతము
Sharing an article posted by Mr. Anand Mohan in Facebook as it is
18 hrs d. 2\8\19

బ్రాహ్మణుడివి , పూజలు చేసుకొని , దక్షిణతో బతకక , ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్స్ నీకెందుకు ? అనే అవహేళనలతోనే నా ,అన్న దామోదర్ గొచ్చికర్ ,కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది . మా అన్న , నేషనల్ లెవెల్ ఛాంపియన్ , all rounder ఇన్ బాడీ బిల్డింగ్ . మానాన్న గారు , పూరి జగన్నాధ్ టెంపుల్ లో బ్రాహ్మణ పూజారిగా ఉన్నారు .మా అన్న కెరీర్ మీదఎన్నో ఆశలు పెట్టుకున్నారు . సెలెక్టర్ లు , మా మీద చూపిన వివక్ష వలన మా అన్న జీవితం నాశనం అవ్వడం తో బాటు , మా నాన్నగారి గుండె కూడా ఆగిపోయింది . వాటితో బాటు , బాడీ బిల్డింగ్ లక్ష్య సాధన లో ఉన్న వారికి ,జిమ్ లు , సరిపడా ఆహారం సమకూర్చాలనే నా తండ్రి ,అన్నల జీవిత ఆశయాలు చనిపోయాయి . ఇవన్నీ , కలసి నా 30 ఏళ్ల వయస్సులో నేను మొదటి సారిగా
జిమ్ మెట్లు ఎక్కేలా చేసాయి .

నామీద కూడా మళ్ళీ అదే వివక్ష , పూజారివి నీకెందుకు బాడీ బిల్డింగ్ ...!! అప్పటికే , మా కుటుంబానికి జరిగిన అన్యాయం , మా అన్న వేధనలు చూసి నా గుండె రాయి అయ్యింది . మరింత కసిగా కృషి చేశాను .
Mr. Odisha 50th Senior State Body Building లో గోల్డ్ మెడల్ సాధించాను .2012 లో అలా మొదలైన నా ప్రస్థానం, మళ్ళీ అవే వివక్ష లతో ముగింపు దశకు వచ్చింది.
Mr. International Indian గా 2016 లో గోల్డ్ మెడల్ సాధించాను.
World Bodybuilding & Physique Federation లో bronze మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 లో జరిగిన ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ కోసం, దుబాయ్ కి వెళ్లాను. అప్పులు చేసుకొని సొంత ప్రయాణ ఖర్చులతో దుబాయ్ చేరిన నాకు , అక్కడ పట్టించుకునే వారే కరువయ్యారు . బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనే ముందు సరి ఆయన ఆహారం ఒక్క రోజు తీసుకోక పోయినా , పూర్తిస్థాయి ప్రదర్శనకు బాడీ సహకరించదు . అకామిడేషన్ లేదు . అథారిటీ ని ప్రాధేయపడ్డాను , మీరు నాకు తిండి పెట్టకపోయినా బాధ లేదు , నేను నిద్ర పోవాలి , మార్నింగ్ 5:30 కల్లా జిమ్ లో ఉండేలా చేయమని . అవేవి జరగలేదు . ఒకానొక సమయం లో నాకే అనుమానం వచ్చింది " అసలు నేను దేశం తరపున ఆడేందుకే వచ్చానా అని "...

గోల్డ్ మెడల్ తో నా తల్లి భరత మాత ,ఋణం తీర్చుకోవాలి అనుకున్నాను . Bronze మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆటగాడు , కోట్లు , పెద్ద ఉద్యోగాలు ఆశించడు . సాధించిన తర్వాత ఒక్క ప్రశంస .చాలు జీవితం ధన్యమైనట్లే . దుబాయ్ లో , మెడల్ సాధించాక , అథారిటీ నుంచి ఒక్క ప్రశంస లేదు , తిరిగి వచ్చాక ,ర్యాలీ గా తీసుకెళ్తారేమో అనుకున్నాను ,అదీ జరగలేదు . నా జిమ్ లో , నాషనల్స్ కోసం శ్రమిస్తున్న , నా శిష్యులు 120 మంది , నాకోసం ఎయిర్పోర్ట్ దగ్గర ఎదురు చూసి , నన్ను ర్యాలీ గా తీసుకెళ్లారు . అప్పుడు అర్ధమైనది నా ఆస్థి నా శిష్యులు అని . ప్రస్తుతం గొచ్చికర్ పేరుతో జిమ్ నడుపుతున్నాను . అత్యున్నత బాడీ బిల్డర్స్ ని భారత దేశానికి కానుకగా ఇవ్వడం నా లక్ష్యం మరియు next year వరల్డ్ ఛాంపియన్ షిప్ కు సన్నద్ధమవుతున్నాను ...
------ అనిల్ గొచ్చికర్, బాడీ బిల్డర్, పూరి జగన్నాధ్ ఆలయ పూజారి.
-- Prasad Pattaswamy

Friday, 26 July 2019

నా మనోగతము


నా మనోగతము
ఒక విషయమును క్షుణ్ణముగా పరిశీలించి సాటి సహజాతులకు తెలుపుట నాలాంటివానికి సామాన్యమైన పని కాదు. తెలిసినది తెలుపక పోవుట కూడా పాపమే! అసలు 'పాపము' అన్న మాటను ప్రక్కన పెట్టినా విజ్ఞానము అన్నది వీధి దీపము వంటిది. వెలిగించిన వానికి ఆ వీధితోను దీపము తోనూ పని ఉండదు. అయినా వెలిగించి తన బాధ్యత నిర్వర్తించుతాడు. ఆ వెలుతురును సాటి మనుషులు ఉపయోగించుకొంటే అతడు సంతోషించుతాడు. నిజానికి వారిద్వారా అతనికి ఏమీ ఒరగదు.
స్థూలముగా నేటి సమాజ తత్వమును నేను వ్రాసిన ఈ రెండు పద్యములలో మీ ముందుంచుచున్నాను.

ఊరక ఏది వచ్చినను ఒక్కరు కూడను లేక్కచేయరా
కారణ మేమిటన్న తమ కైనటువంటిది సొమ్ము సుంతయున్
చేరదు ఇచ్చువానికిని చింతన చేయరు అందుచేతనే
తేరగ డబ్బునివ్వమరి తాలిమి జూపగ నేర్తురే గనన్

విత్తమెవ్విధి తనదైన విలువ మార్చు
విద్య అటుగాక వ్యక్తికి విలువ పెంచు
నేరమిని వీడి నేర్మితో నిపుణ మతులు (నేరమి=అజ్ఞానము) (నేర్మి=నేరిమి= నేర్పు, సామర్థ్యము)
నిజము నరయంగ గలరులే నిక్కముగను

Posted by me on July 27, 2015 at 12:50 PM · 
ఇదీ నా మనోగతం
నేను సత్యముగా లైకులు కామెంట్ల కొరకు వ్రాయను . ఇన్ని యేళ్ళుగా ఆ మాట నేను వ్రాయక పోవుటే ఇందుకు నిదర్శనము.అంత పరిపక్వత లేనివాడిని కూడా కాదు. నా బాధల్లా ఏమిటంటే బాగుంది అన్న ఒకట వ్రాసినా మిగత వారి కళ్ళలో పడుతుంది. వారుకూడా చదివే అవకాశము ఏర్పడుతుంది. కామెంట్ అనేది హనుమంతుని తోక లాంటిది. రామాయణములో వానరులేంతమంది ఉన్నా పాఠకులు శ్రోతలు వీక్షకులు హనుమంతుని తోకకే ప్రాధాన్యమిస్తారు. ఇది కూడా అంతే. దీనిని మంచి విషయాలు వ్రాసే ఎంతో మందికి, యువతీ యువకులు, జిజ్ఞాసువులు అన్వయిస్తే అంటే ఒక మంచిమాట కామెంటు గా వ్రాస్తే,విషయము ఎక్కువమందికి చేరుతుంది. అసలు దీనిని యువత ఒక సాంప్రదాయముగా గ్రంధ ముఖి( Face Book)లో ఎర్పరచితే ఈ సంస్కృతికి ఈ ధర్మానికీ, ఈ విజ్ఞానానికి ,ఎంతో మేలుచేసినవారవుతారు అన్నది నా అభిప్రాయము.
Top of Form