నా మనోగతము
ఒక విషయమును
క్షుణ్ణముగా పరిశీలించి సాటి సహజాతులకు తెలుపుట నాలాంటివానికి సామాన్యమైన పని
కాదు. తెలిసినది తెలుపక పోవుట కూడా పాపమే! అసలు 'పాపము' అన్న మాటను ప్రక్కన
పెట్టినా విజ్ఞానము అన్నది వీధి దీపము వంటిది. వెలిగించిన వానికి ఆ వీధితోను దీపము
తోనూ పని ఉండదు. అయినా వెలిగించి తన బాధ్యత నిర్వర్తించుతాడు. ఆ వెలుతురును సాటి
మనుషులు ఉపయోగించుకొంటే అతడు సంతోషించుతాడు. నిజానికి వారిద్వారా అతనికి ఏమీ
ఒరగదు.
స్థూలముగా నేటి సమాజ
తత్వమును నేను వ్రాసిన ఈ రెండు పద్యములలో మీ ముందుంచుచున్నాను.
ఊరక ఏది వచ్చినను
ఒక్కరు కూడను లేక్కచేయరా
కారణ మేమిటన్న తమ
కైనటువంటిది సొమ్ము సుంతయున్
చేరదు ఇచ్చువానికిని
చింతన చేయరు అందుచేతనే
తేరగ డబ్బునివ్వమరి
తాలిమి జూపగ నేర్తురే గనన్
విత్తమెవ్విధి తనదైన
విలువ మార్చు
విద్య అటుగాక వ్యక్తికి
విలువ పెంచు
నేరమిని వీడి నేర్మితో
నిపుణ మతులు (నేరమి=అజ్ఞానము) (నేర్మి=నేరిమి= నేర్పు, సామర్థ్యము)
నిజము నరయంగ గలరులే
నిక్కముగను
ఇదీ నా మనోగతం
నేను సత్యముగా లైకులు కామెంట్ల కొరకు వ్రాయను .
ఇన్ని యేళ్ళుగా ఆ మాట నేను వ్రాయక పోవుటే ఇందుకు నిదర్శనము.అంత పరిపక్వత
లేనివాడిని కూడా కాదు. నా బాధల్లా ఏమిటంటే బాగుంది అన్న ఒకట వ్రాసినా మిగత వారి
కళ్ళలో పడుతుంది. వారుకూడా చదివే అవకాశము ఏర్పడుతుంది. కామెంట్ అనేది హనుమంతుని
తోక లాంటిది. రామాయణములో వానరులేంతమంది ఉన్నా పాఠకులు శ్రోతలు వీక్షకులు హనుమంతుని
తోకకే ప్రాధాన్యమిస్తారు. ఇది కూడా అంతే. దీనిని మంచి విషయాలు వ్రాసే ఎంతో మందికి, యువతీ యువకులు, జిజ్ఞాసువులు అన్వయిస్తే అంటే ఒక మంచిమాట కామెంటు గా వ్రాస్తే,విషయము ఎక్కువమందికి చేరుతుంది. అసలు దీనిని యువత ఒక సాంప్రదాయముగా గ్రంధ
ముఖి( Face Book)లో ఎర్పరచితే ఈ సంస్కృతికి ఈ ధర్మానికీ,
ఈ విజ్ఞానానికి ,ఎంతో మేలుచేసినవారవుతారు
అన్నది నా అభిప్రాయము.
No comments:
Post a Comment