Wednesday, 17 July 2019

కొనకుండా నవ్వుకొనండి - 2

కొనకుండా నవ్వుకొనండి - 2

SPINSTER SISTER
A man suffered a serious heart attack and had an open-heart bypass surgery. He awakened from the

surgery to find himself in the care of nurses who are also nuns at a Catholic hospital. As he was

recovering, a nun asked him questions regarding how he would like to pay for his treatment.
She asked if he had health insurance. He replied, in a raspy voice, "No health insurance."
The nun asked if he had money in the bank. He replied, "No money in the bank."
The nun asked, "Do you have a relative who could help you?" He said, "I only have a spinster sister,

who is a nun."
The nun became agitated, annoyed and announced loudly, "Nuns are not spinsters! Nuns are married

to God."

The patient replied, "Well, then send the bill to my brother-in-law."

***************************************************************

భార్య- గడియారము

గడియారము 24గం. కదులుతూనే ఉంటుంది

 భార్య 24 గం. వదురుతూనే ఉంటుంది.

గడియారము తిరిగితిరిగీ తాను మొదలు పెట్టిన పాయింటు వద్దకే వస్తుంది. పాయింటు పై భార్యాభర్తల మధ్య ఎంత రచ్చజరిగినా భార్య అదే పాయింటుకే వస్తుంది..

12 కొడితే మూడు ముళ్ళు ఒకటిగా కనిపిస్తాయి. భార్య 12గం. లూ  కొడితే తానే ముగ్గురిగా కనిపిస్తుంది.

అలారం కొట్టడానికి గడియారానికి Fixed Time ఉంటుంది. భార్య అలారం ఎప్పుడయినా మ్రోగించవచ్చు.

గడియారము అలిగితే నిలిచిపోతుంది. భార్య అలిగితే మొదలౌతుంది.

గడియారము అలిగితే Mechanic వద్దకు పోతుంది. భార్య అలిగితే పుట్టినింటికి పోతుంది.

గడియారము పనిచేయాలంటే Cell అవసరము. భార్యపనిచేయాలంటే Salary అవసరము.

గడియారము పనిచేయకుంటే మార్చుకోవచ్చు. భార్య విషయములో అది అంత సులభము కాదు.

భార్య మారదు కానీ భర్త మారితే సంసారము సాగుతుంది. మారకపోతే తప్పక సంసారం ఆగుతుంది.

*********************************************

కీర్తి శేషుడు

ఇది సాధారణముగా దివంగతులైన వారి పేరుకు ముందర ఉంచుతూ వుంటారు. నిజానికి పెళ్ళయిన ప్రతి మగవాడూ దివంగతుడే! ఎందుకంటే

కీర్తిః పఙ్కే యశ స్యపి” అని యాదవ ప్రకాశుల వారి వైజయంతీ కోశం. "కీర్తి" అంటే పంకము అంటే బురద. "శేషు"డంటే పాము అన్నది ఇక్కడ అన్వర్థము.

అంటే పెళ్ళయిన తరువాత ఎంత ఆదిశేషుని వంటివారయినా  బురదపాములతో సమానమే! కనుక పెళ్ళయిన ప్రతి మగవాడూ కీర్తిశేషుడే!

                        **********************************************

హలో హలో నే కిడ్నాపర్
ఉన్నదిలే నాదొక ఆఫర్
చెప్పిందంతా విన్నావంటే
విన్న విధముగా చేసితివంటే
సుఖము మొత్తమూ నీకే నీకే
లక్షపదుల మరి ఇస్తే నాకే
      ఇవ్వనంటె నేనివ్వగబోను
      నీకేపుడూ నే బాకీలేను
సరే సరే నేవదిలేస్తా
నీ శ్రీమతినిక విడిచేస్తా
     సతిని బంపితే సతికిలబడుతా
     నీ సలహా నేనాచరించుతా
     అడిగినదంతా నీకిచ్చేస్తా
     సుఖాల ఊయల నేనూగేస్తా
టీచరు : మొదటి తెలుగు మూకీ సినిమా ఏదో చెప్పగలవా శేషు ?
శేషు : సినిమా మూకీ అయితే, అది
తెలుగుదా కాదా అనేది ఎట్లు తెలుస్తుంది మాస్టారూ !
సత్తి పండు ఒకసారి గడ్డము గీయించుకొనుటకు
క్షౌరశాలకు వెళ్లి ఆసనము అలంకరించినాడు.
బట్ట కప్పి మంగలి గడ్డము గీయుటకు ఉపక్రమించ
బోతుండగా నీవద్ద ఇంకొక కత్తి వున్నదా
అని అడిగినాడు. అతను ఉన్నదండీ,
 ఎందుకు అన్నాడు.
పండు వెంటనే జవాబు చెప్పినాడు "ఆత్మరక్షణకు".
ఈవింత లోకం లో
కొందరు సుఖానికి లొంగుతారు
కొందరు దుఃఖాన్ని మింగుతారు
కానీ అందరూ  మోహనా
మందు గ్లాసుకై వంగుతారు
వింత ప్రశ్నలు విచిత్రమైన జవాబులు
 క్షౌరశాలలో క్షురకుడు: వెంట్రుకలు పొట్టి చేయమంటారా!
క్షౌరశాలకు వచ్చిన వ్యక్తి : పొడుగు కూడా చేయగలుగుతావా!
********************
అగుంతకుడు శవ వాహకునితో : స్మశానానికి తీసుకుపోతున్నారా?
శవవాహకుడు: లేదు బట్టలు లేవంటే బట్టలకొట్టుకు తీసుకుపోతున్నాము. 
*************************
'ఈ రోడ్డు హైదరాబాద్ పోతుందా అండీ.'
'30 ఏండ్ల నుండి చూస్తున్నాను. కానీ ఇది ఎప్పుడూ కదిలినట్లు కనిపించలేదు.'
**************
ఒక రైలు ప్రయాణీకుడు మరోకనితో : ఎందుకో రైల్వే స్టేషన్ ఊరికి చాలా దూరంగా కట్టించినారు
రెండవవాడు తటపటాయింపే లేకుండా: 'పట్టాలకు దగ్గరగా ఉండాలని కట్టించినారు.'
**************************************
Railway Station లో అడుగుపెట్టబోతూ ఒక ప్రయాణీకుడు Railway Station బయటకు
వస్తున్న వానితో "ఏమండీ 'Sarkar Express' Platform పైకి వచ్చిందా!"
బయటకు వస్తున్న ప్రయాణీకుడు: "లేదండీ ఇంకా పట్టాలపైనే ఉంది."
************************
"ఈ ఊరిలో మురికి కాలువలు ఎక్కువగా ఉన్నాయండీ!"

ఏం మీరు శుభ్రం చేయబోతున్నారా!”


కొనకుండా నవ్వుకొనండి - ఒక ఆపిల్ కథ
https://cherukuramamohan.blogspot.com/2019/09/blog-post.html

ఒక వార్దుషి(Bank) ఉద్యోగమునకు ఒక యువకుడు Interview కు పోయినాడు. Tuck చేసి Tie కట్టి Suit తో నిగనిగలాడుతున్న Interviewing Officer తానడుగాబోయే చమత్కారమైన  ప్రశ్నకు ఆ ఉద్యోగార్థి ఏమి జవాబిస్తాడో చూద్దామనుకొంటూ ప్రశ్నించినాడు: “ఒక కిలో Apples 50 రూపాయలు. నీవు 100 గ్రాముల Apples కొన దలచితే దాని విలువ ఎంతవుటుంది?”
అభ్యర్థి జవాబు: “ఆ శక్తి లేకనే ఉదోగం వెదుక్కొంటూ మీ వద్దకు వచ్చినాను Sir.”
Interviewing Officer : సరే ఒక వేళ నేను కొనుటకు పోతే?
అభ్యర్థి: ఎవరంటే వారివద్ద మీరెందుకు కొంటారు సార్? మీరు Loan ఇచ్చిన కొట్టుకే పోతారు. మీరు రెండడిగినా, వాడు పంపుతాను మీరు వెళ్ళండి అని ఒక బుట్ట Apples పంపుతాడు.
Interviewing Officerఒకవేళ నీ శ్రీమతి పోతే?
అభ్యర్థి: తాను చాలా పొదుపు మనిషి. 100 గ్రాముల Apples ధరే అడిగి, అంతే తెస్తుంది.
Interviewing Officer: ఒకవేళ మీ అన్న బజారుకు పోయినాడని అనుకొందాము.
అభ్యర్థి: మా అన్న బజారు వెళ్ళేది నేను ఎన్నిమార్లో చూసినాను. ఎప్పుడుపోయినా జరదా పాన్ మాత్రమే కొంటాడు.
Interviewing Officer: పోనీ మీ చెల్లెలు పోతే?
అభ్యర్థి: నాకున్న ఒక్కగానొక్క చెల్లెలు పెళ్ళిచేసుకొని ముంబాయి వెళ్ళిపోయింది.
పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్నాడు ఆ Interviewing Officer.
అతను అభ్యర్థిని : మీ నాన్న పోయి కొని తేవచ్చుకదా!
అభ్యర్థి: “లేదు లేదు. ఆయనకు పళ్ళే లేవు. కాబట్టితాను తినడు మేము తింటే చీదరించుకొంటాడు.
తన మొండితనము వదలలేదు Interviewing Officer.
ఆయన: “పోనీ నీ స్నేహితుడు ఎవడోఒకడన్నా ఉంటాడు కదా! అతను Apple తింటాడా!
అభ్యర్థి: “తింటాడండీ. నేను కొనిపెడితే! అసలు Apple పండు ప్రశ్నే మీరు పదేపదే అడుగుతున్నారంటే అసలు మీకు Apple తోట ఉందా అని నాకు అనుమానమొస్తూవుంది. నా స్నేహితుని గూర్చి అడిగినారు కాబట్టి చెబుతూవున్నాను. నేనే వానికి 5 రూపాయలిచ్చి Apples తెమ్మంటే, వాడు కొట్టుకు పోయి ఆ 5 note ఇచ్చి వచ్చినన్ని Apples ఇవ్వమంటాడు.
Interviewing Officer: సరే. ఇదంతా వదిలిపెట్టు. ఒక సాధారణ వ్యక్తి Apples కొనటానికి పోయినాడనుకో? అప్పుడు చెప్పు అతను ఎవిధంగా కొంటాడు?
అభ్యర్థి: Sir, అంతా మీ భ్రమ కానీ సాధారణ వ్యక్తి కొనే విధంగానా Apple ధరలు ఉన్నాయి? అతనికి ఆ Apples క్రింద పరచిన గడ్డి మాత్రమే తినగలిగిన యోగ్యత ఉంటుంది. అసలు ఇంకొక ముఖ్యమైన విషయము తెలుపుకొంటాను. ఆరోజు అసలు ఆదాము, హవ్వ ఆపిల్ తినకుండా వుండివుంటే ఈ రోజు మీరూ లేరు, నేనూ లేను ఈ ప్రశ్న లేదు. ఏమంటారు?
ప్రశ్న అడిగినందుకు తన తల అందుబాటులోనున్న Paper Weight తో కొట్టుకొని Hospital లో Admit అయినాడు. పోతూ పోతూ  ఆ అభ్యర్థిని Field Officer గా వేసి పోయినాడు.
*******************
కొనకుండా నవ్వుకొనండి ఎవరి భార్య గొప్ప
ఇద్దరు విద్యార్థులు సంస్కృత విద్యాపీఠములో చదువుకొన్నారు. రాను రానూ వారిరువురూ మంచి మిత్రులైనారు. విద్య ముగిసిన తరువాత ఇద్దరికీ వేరు వేరు ఊర్లలో ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగము వచ్చింది. మనుషులు దూరమైనా మానసికంగా ఎంతో దగ్గరగా ఉండినారు. ఒకసారి ఇద్దరిలోని ఒకనికి రెండవ వాడు ఉన్న కలాశాలకే బదిలీ అయ్యింది. చేరడానికి ముందు ఆ మిత్రుడు ఒంటరిగా ముందు వచ్చినాడు, భార్యను పాత చోటే వదలి పెట్టి. మిత్రుని చాలాకాలము తరువాత చూచుతచే ఆప్యాయముగా పలుకరించి, భోజనమునకు తన ఇంటికి ఆహ్వానించినాడు, తన భార్య యొక్క అసలు గుణము మరచి.
మిత్రుడు భోజనానికి సంతోషముగా వచ్చినాడు. భోజనానికి కూర్చునే లోపలనే ‘మొదలే తానొక పిచ్చి కోతియట, నిప్పున్ ద్రొక్కే, కల్ద్రావె’
అన్న రీత్జిలో ఆతని భార్య ప్రవర్తించేది చూసి, భోజనమైతే చేసినాడు కానీ, ఎంతో పరితాపముతో ఆతనిని అనునయించి ఎంత్య్హో బరువైన గుండెతో సర్దుకు పొమ్మని చెప్పి, తన యొక్క భార్య సహనము, సహవాసము, సౌశీల్యము, సహకారము, సాదు వర్తనమును గూర్చి ఎంతో గొప్పగా చెప్పి, బదిలీ అయిన మిత్రుడు సంసారమును కొనితెచ్చుకొన్న తరువాత ఇంటికి తన మిత్రుని భోజనమునకు పిలచినాడు. మిత్రుడు, బయట జేరిన తన భార్యను ఇంటివద్దే వదలిపెట్టి,  తాను ఆనందముగా పోయినాడు.
ఇంటికి పోయినది మొదలు తన మిత్రుడు భార్య పైని ఎక్కడలేని ఆధిపత్యమును చలాయించుట చూసి తానూ ఎంతో శిగ్గుపడినాడు. భోజన సమయములో ఎదో పరాకు లోనో చిరాకు లోనో, భార్య “ఏమండీ! చారు తేనా” అన్నది. దూర్వాసుడు ఆవహించిన ఆ భర్త “నీకసలు బుద్ధి ఉందాలేదా? రోజూ కడుపుకు అన్నమే తింటున్నావా? పచ్చడి కూర తిన్న తరువాత పులుసు తేకుండా చారు తెస్తానంటావా ” అని తోక త్రొక్కిన త్రాచు వలె బుసకొట్టినాడు.  అంతవరకు, తన కాళ్ళు పట్టుకొని ప్రార్థించిన భర్తకు ఒక అవకాశమిచ్చిన ఆ ఇల్లాలు, సహనము యొక్క పరిధి దాటుకొనుటచే పోయి పై ఉన్న ఆ వేడి పులుసు కుండ గుడ్డతో పట్టి తెచ్చి ఆతని నెత్తిపై పగులకొట్టింది. అంతటితో ఆగక ఈ కుండ నా పుట్టినింటివారిచ్చిన 10 రూపాయలతోకొన్నాను. ఆ డబ్బు ముందు కక్కి ఆ తరువాత తిను” అన్నది. మిత్రులకిద్దరికీ నోటమాట రాలేదు. ఆ తరువాత భోజనము అయినది అనిపించి చేయి కడుగుకొని లేచినారు. మిత్రుని సాగనంపుటకు ఆ గృహస్తు వెలుపలికి వచ్చి మౌనముగా నిలచినాడు. అప్పుడు, భోజనమునకు వచ్చిన మిత్రుడు ఈ విధముగా శ్లోకము చెప్పినాడు.
అనేక శత భాండాని భిన్నాని మామ మస్తకే l
అహో భాగ్యవతీ నారీ భాండమూల్యం నయాచతే ll
మిత్రమా “నీవు నొప్పిపడనవసరము లేదు. నానెత్తి మీద కూడా ఎన్నో కుండలు పగిలినాయి. కానీ ఏరోజూ ఆని మూల్యము నాభార్య నన్నడగలేదు. ఆవిధంగా నీకన్నా నేను మేలు” అని తన ఘనత చాటుకొన్నాడట. ఈ మాట చెబుతూ వుంటే ఒక విషయము గుర్తుకు వస్తూ వుంది. తెలుగు  వ్యాకరణములో కారక పరిచ్ఛేదములో ‘కర్మంబున ద్వితీయము...’ అన్న ఒక సూత్రము ఉంది.’అతడు ఇడ్లీ తినెను’ లో ఇడ్లీ ‘ని’ టినేను అన్న ప్రత్యయము అంతర్హితముగా అందులో ఉంది. ద్వితీయా వ్భక్తి లోని ‘ని, ను, ల, కూర్చి, గురించి అన్న ఈ ప్రత్యయములు ద్వితీయా విభక్తికి చెందినవి. మనము ఉదాహరణమునకు తీసుకొన్న వాక్యములో ‘ని’ ప్రత్యయమును తీసుకొన్నాము. తినుట అన్నది కర్మ. కాబట్టి కర్మ వాచకమునకు ద్వితీయా విభక్తి ప్రత్యయములు అనుసంధానము చేస్తాయి అన్నది అసలు అర్థము.  ‘ద్విత్వీయ’ అన్న మాటకు భార్య అన్నది ఒక అర్థము. పై సూత్రమును ఈ మాటకు అన్వయించుకొంటే ‘తమ తమ కర్మల కొద్దీ భార్యలు దొరుకుతారు’ అని అర్థము.
ఎంతటి చమత్కారమో చూడండి.

స్వస్తి.


ఇదీ పెళ్ళంటే

పిలుచుచుంటిమి చూడ పెళ్ళి మాయింట

ఇంత చక్కని జంట చూడలేరంట

పళ్ళు జుట్టూలేని పండంటి వరునికి

కర్ర ఉన్నా కదలగాలేని వధువుకు

నత్తి బ్రాహ్మణు నోటి నత్త మంత్రాలతో

తాటి పీకలు తడి తప్పెటల ధ్వనితో

వంట పొయ్యిన పిల్లి  వనరుగా నిద్రించ

కాపీలు టిపినీలు కడుపార మీయింట

చేసివచ్చిన తిరిగి చేరేట్లు బువ్వకు

వచ్చిపోదురు వధువు వరుల తిలకించి

ప్రేమగా వచ్చి మిము పిల్చువారలు లేరు

పత్రికను పంపితే చేరగా నేరదు
అందుకే అవి అచ్చునకు నోచలేదు.
మాటకన్నా ఘనము మరియేమి కలదు.
సెల్లు మాటలతోనే ఆహ్వానములు చెల్లు

ఘనముగా కళ్యాణ గరిమ చూతురు రండి

బహుదివ్యమతులైన మీరు బహుమతులు
వికసింపగాజేయు మా పెదవి విరులు
చూడ దొరకని పెళ్లి చూసి,పోదురు వెళ్లి
ఇటువంటి అవకాశామికరాదు మళ్ళీ
నర్తకియగు ఒక వారాంగన, మహారాజు ఏకాంత వాసములో,
కురూపియైన మహారాజును ఈ విధంగా అడిగింది:
" మహారాజా భగవంతుని వద్ద భూమి మీదికి రాబోయే ప్రతిప్రాణీ,
ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకకోరిక కోరవచ్చునని అంటారు కదా !
మీరెందుకు అందాన్ని కోరుకోలేదు."
రాజు ఆ మాటకు ఏమాత్రము కోపగించుకోకుండా తనదైన శైలిలో
ఈ విధంగా జవాబు చెప్పినాడు "నీ లాంటి వాళ్ళంతా వరుస కట్టి
అందాన్ని అడుక్కొనే సమయములో నేను 'అదృష్టము' వరుసలో
నిలిచి అందులోని అత్యంత సుందర రూపము దాల్చబోవు అందగత్తెలను
అందరిని పొందే భాగ్యము ప్రసాదించమని దేవుని కోరుకొన్నాను"
నర్తకి : ???
***************
జడ్జ్: నీవు, అసలు, ఇంటి ఓనరు ఓనరు భార్య లైట్లు రాత్రి వేసుకొని మాటలాడుతున్నప్పుడు దొంగతనము ఎట్లు చేయగలిగినావు?
దొంగ: జడ్జ్ గారూ మీకు మంచి జీతము, సంఘములో గౌరవము, కావలసినంత ఉంచుకొని, ఇంకా నా వృత్తి కూడా నేర్చుకొని నా కడుపు కొట్టాలనుకొంటున్నారా?
******************
తండ్రి: బాబూ చక్కగా ముస్తాబవ్వు. మనమిపుడు పెళ్ళికుమార్తెను చూడను పోతున్నాము.
అబ్బాయి: నాన్నా మీకా నాకా!
తండ్రి: నాకెందుకురా! నాకోసమైతే నిన్ను పిలుస్తానా! పెళ్ళిమాట నీ చెవిలో వేస్తానా! ఈ తంతంతా నీకోసమే!
అబ్బాయి: నాకోసమయితే నేను రానక్కరలేదు. మీకెట్లు తోచితే అట్లు చేయండి.
తండ్రి: అదేమిట్రా అమ్మాయిని చూడకుండానే పెళ్ళిచేసుకొంటావా?
అబ్బాయి: కొండ అంచున నిలచిన వాడు దూకబోయే సముద్రము లోతు చూస్తాడా నాన్నా!
సైన్సు టీచర్ : ఎడిసన్ మీద గౌరవముతో అమెరికన్లు ఆయన జన్మదినమున 2 నిముసములు విద్యుత్తు నిలిపి తమ గౌరవము ప్రకటించుకొంటారు తెలుసా!
శేషు : అందులో గొప్పదనమేముంది టీచర్. మనము 5,6 గంటలు విద్యుత్తు కోతతో ప్రతి రోజూ, సంవత్సరము పొడవునా, ఆయన జన్మించినందుకు గౌరవము ప్రకటించుకొంటూనే వున్నాము కదా! మనకంటే వారు గొప్పా!

భక్తుడు : ప్రపంచములో, ఊహలలొ వుంది కూడా జరగని విషయాలు ఎన్నో వున్నాయి అని అన్నారే ఒక్కటి వెంటనే చెప్పగలరా స్వామీ !
బాబా : చాలా సులభము నాయనా. ఒక చెల్లెలు ఇంకొక చెల్లెలు తో సావాసము చేస్తుంది. ఒక అక్క ఇంకొక అక్క తో సహవాసము చేస్తుంది. కానీ భార్య మాత్రము ఇంకో భార్యతో సహవాసము చేయదు.

ఆటోవాడు టిప్పు టాపుగా నున్నప్రయాణీకుని చేర్చ వలసిన చోట చేర్చిన తరువాత 'అయ్యో సార్ ! మీటరు వేయుట మరచిపోయినాను."
ప్రయాణీకుడు : "ఫరవాలేదు నేనూ పర్సు తెచ్చుట మరచిపోయినాను."

సుకవికి కుకవికి కల తేడా
ఈ సంస్కృత చాటువులో కవి ఎలా వివరించాడో గమనించండి.
సమలం కరోతి కావ్యం సుకవిః కుకవిశ్చ తదుభయం కావ్యం
అనలం తనోతి చిత్తే సహృదయ హృదయ ప్రవిష్ట మాత్రంచేత్
సుకవి :
కావ్యం సమలం కరోతి = సం+అలంకరోతి
అంటే సుకవి రసవర్ణనాలంకారాలతో కావ్యాన్ని మెరుగు పెడతాడు.
చిత్తే అనలం తనోతి = న+అలం= ఇక చాలు అనకుండా వుండే భావాన్ని మనసులో కలిగి యుంటాడు
కుకవి :
కావ్యం సమలం కరోతి = కావ్యాన్ని మలమయం చేస్తాడు

చిత్తే అనలం తనోతి = మనసులో మంటలు (అనలం) పుట్టిస్తాడు
రామ మోహన్ గారు మీ పుస్తకము 'AN IDEA THAT CAN CHANGE YOUR WIFE'
రెండు రోజుల్లో లక్ష ప్రతులెట్లు అమ్ముడైనాయో నాకు అర్థమగుటలేదు.

పుస్తకము యొక్క శీర్షికలోని చివరి పదములో 'L' కు బదులుగా 'W' పడింది. అంతే వేరేమీ లేదు.
తనది తప్పని తెలిసిన వెంటనే క్షమాపణ కోరేవాడు నిజాయితీపరుడు
తనది తప్పా కాదా అన్న అనుమానమున్నపుడు తప్పుగా ఒప్పెసుకోనేవాడు కార్యవాది
తనది ఒప్పని తెలిసినా తప్పే అని తలవూపేవాడు భర్త

అందుకేనెమో తల ఊపి ఊపి నా తలవెంట్రుకలు పూర్తిగా రాలిపోయినాయి.
టీచరు : శేషూ నీవు మీ నాన్నకు పెద్ద కొడుకువా ?
శేషు : అవును టీచర్.
టీచరు : శేషూ మీ నాన్న వయసెంత ?
శేషు : నాయంతే టీచర్

టీచర్:అదెట్లా రా ?
శేషు : నేను పుట్టడము ఆయన తండ్రి కావటము ఒకసారే జరిగినాయి టీచర్.
బ్రదర్ ఇన్ లా
ఒక మిషనరీ ఆస్పత్రిలో ప్రాణఘాతక హృద్రోగముతో ఒక వ్యక్తి 'Bypass Heart Surgery' కొరకు చేరినాడు. అక్కడ 'నన్స్నర్సులుగా వుంటారు. అతనికి ఆపరేషను జరిగింది. ఆపరేషను సఫలమైంది. నర్స్ వచ్చి దేవుని కృప వల్ల మీకు రోగము కుదిరింది (అంటే బాగైంది). మరి బిల్లు కట్టవలె కదా మీవద్ద cash వుంటే అదే కట్టండి అంది. ఆతను లేదు అని ఉరకున్నాడు. అయితే credit card వాడండి అంది. 'Card' expire అయిందన్నాడు. అయితే Cheque ఇవ్వండి అన్నది ఆవిడ. Bank Account లో balance లేదన్నాడు అమాయకంగా ముఖము పెట్టి. ఆమె కూడా తక్కువ తినలేదు . మీకు ముఖ్యమైన బంధువులుంటే చెప్పండి అంది. ఎవరూ లేరన్నాడతగాడు. ఆమె తిరిగి మీకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు లేరా అంది. ఒక చెల్లెలు వుంది కానీ ఆమె 'spinster (బ్రహ్మచారిణి)అన్నాడతడు. మరి ఆమెకు బిల్లు పంప మంటారా అంది ఆమె.  'ఆమె nun' అన్నాడు అతను. ఈ నర్సు గా వుండే nun కు విపరీతముగా కోపము వచ్చి 'Nuns ఎప్పుడూ Spinsters కాదని తెలియదాఅంది. 'నాకు తెలియదుఅంటూ 'అయినా వారెవరిని పెళ్లి చేసుకొంటారుఅని అమాయకంగా అడిగినాడు. ఆమె కోపము తగ్గి ఎంతో శాంత గంభీర స్వరముతో వారు దేవుని పెళ్లి యాడెదరుఅంది.
ఆతను వెంటనే అయితే bill నా Brother-in-Law కు పంపండిఅన్నాడు.
అంతే ఆమెకు heart attack వచ్చింది .
మునిసిపాలిటి ఎన్నికలు
అనగా అనగా ఒక అభ్యర్థి
అతనికి ఉన్నాడొక ప్రత్యర్థి
మన అభ్యర్థికి కలదు మహాసతి
పతియనురాగములో అతి, అతి
కనబడు దైవము సతికి ఆ పతి
అతనే ఆమెకు స్వర్గాధిపతి
ఓట్ల రోజు వచ్చేసింది
వేలు వేలు ఇప్పిచ్చింది
బూతును చేరుచు ఓటు వేయగా
పతివ్రతాసతి కదిలింది
అలంకరించుకు వెళ్ళింది
ఓటు వేసి వచ్చేసింది
ప్రత్యర్థికి ఆ ఓటు పడింది
అని ఆ భర్తకు తెలిసింది
ప్రేమ చీమ దోమ అంటూ
ఓటు అతనికా నాతో ఉంటూ
కోపము చూపెను ఆమాటంటూ
సాధ్వి అతనితో నేనిది వింటూ
బతుకలేను నా ముద్దుల గంటూ
ఓటు నీకు నే వేసితినంటే  
ఐదేడాదులు నిను విడినట్టే
అట్లు జరిగితే నే లేనట్టే
అందుకోసమే చేసితి స్వామీ
భరింప జాలను నే, నీ లేమి
 శాసన సభ
ప్రతిపక్ష MLA తూగుతున్న మంత్రి గారిని చూసి '"మంత్రిగారూ  సమావేశ సమయములో, శిగ్గు లేదా తూగడానికి"
మంత్రిగారు "శిగ్గు పడవలసినది నేను కాదు, మీరు, ఎందుకంటే భావి భరత భవ్యిష్యత్తును ఏయే ప్రణాలికలతో నందనవనము చేయగలను అన్న తీయని కలగనే సమయములో అర్ధాంతరముగా లేపి దేశభవిష్యత్తును పాడుజేసినారు."
శేషు : టీచర్ ring అంటే ఏమిటి ?
టీచరు : అదికూడా తెలియదా శేషు , ring అంటే ఉంగరము లేక వలయాకారము
శేషు : మరి చతురస్రముగా వుండే బాక్సింగ్ గోదా (స్థలము) ను boxing ring అంటారు ఎందుకు టీచర్
pine tree Imageటీచరు :???
Image result for apple  tree meaning in telugu

శేషు : టీచర్ pineapple లో pine  మరియు apple   రెండూ ఉంటాయా టీచర్
టీచరు : ఉండవు రా
శేషు : మరి దానికాపేరు ఎందుకు టీచర్
టీచరు :???

టీచరు ఒక మొక్క వైపు చూపించి 'దీనిని egg plant అంటారు' అన్నది
శేషు వెంటనే "దానికి కాయలకు బదులు eggs కాస్తాయా టీచర్:
టీచరు : ???
ఒక మైలు రాయి దగ్గర కూర్చొని ఒక భక్తుడు పసుపు కుంకుమలతో పూజ చేసి టెంకాయ కొడుతూ ఉన్నాడు. అది చూసిన మేధావి అతనితో "అది దేవతా విగ్రహము కాదు, మైలురాయి" అన్నాడు. "బస్సెక్కుటకు డబ్బులేక నడచి హైదరాబాదు వెళ్ళుతూన్న నేను కళ్ళుమూసుకొని పైకి జూచి ఇంకా ఎంత దూరం నడవాలి దేవుడా " అంటూ కళ్ళు తెరిచి అటుఇటు తిప్పి చూడగా ఈ విగ్రహము నుదుటి పై 15km అని కనిపించింది. మరి ఇది దైవము కాక వేరేమిటి" అన్నాడు. మేధావికి నోరు పెగలలేదు.
చదువురాని హెల్త్ మినిస్టర్

ఒక చదువురాని హెల్త్ మినిస్టర్ ఒక పేరు మోసిన హాస్పిటల్ కు తనిఖీకి వెళ్ళినాడు.
మంత్రిగారి విద్యయోగ్యత తెలిసిన ఆస్పత్రి డైరెక్టరు వెంటనే మంత్రిని చేరుకొని అతనితోబాటూ రౌండ్స్ కు బయలుదేరినాడు.
మంత్రి ముగ్గురు పేషంట్లు వరుసగా పడుకోనియున్న మూడు పడకల వద్దకు చేరినాడుడైరెక్టర్ మరియు తదితర సిబ్బందితో!
ఆ రోగగ్రస్థులలో ఇరువురికి మాత్రమే ఆక్సిజన్ సిలెండర్లు  పెట్టి ఉన్నారు. Director కు తన వైద్య విద్యాప్రతిభాతో కూడిన అహంకారమును మంత్రిగా చూపదలచుకొన్నాడు. వెంటనే" CNG సిలెండర్లు ఇద్దరికే పెట్టినారే మరి మూడవ వాడు బ్రతుకనవసరము లేదని  పెట్టలేదా!" అని గద్దించి అడిగినాడు డైరెక్టర్ ను. డైరెక్టరు కూడా ఎంతో వినయమూపదతో నెమ్మదిగా "అతనికి పెట్రోల్ ట్రీట్మెంట్ ఇస్తాము సార్" అన్నాడు.
మినిస్టరు తప్ప పేషంటు తో కూడా అందరూ నవ్విన వారే!
కర దీపిక (Torch Light)
ఒకసారి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొన్న భార్య భర్త రెండవ సినిమాకు పోయివచ్చినారు.భర్త చేతిలోని  కర దీపిక (Torch Light) చూపించుతూ వుంటే భార్య తాళము తీయుటకు ఎంతో ప్రయత్నించింది. తాళము తెరుచుకోలేదు. Torch Light తానూ తీసుకొని తాలముచేవి భర్తకు ఇచ్చి తెరువమంది. భర్త తక్షణమే తాళము తెరచినాడు. భార్య వెంటనే అధికారస్వరముతో భర్తకు ఈ విధముగా చీవాట్లు పెట్టింది "ఇప్పటికైనా తెలిసిందా Torch Light  ఏవిధముగా పట్టుకోవలేనను విషయము".

భర్త: ???😓
బెనిఫిటేమిటి
 కొన్ని దశాబ్దాల క్రితం నేను SBI తిరుపతి ప్రాంతీయ కార్యాలయములో officer గా పనిచేసే రోజులలో 'భావన' అన్న ఒక సాంస్కృతిక శాఖ నేర్పరచి నెలకు 2 కార్యక్రమాలు సంగీత సాహిత్యాలలో నిర్వహించే వాడిని, నా మిత్రుల సహాయం తో. దీనికి ముఖ్యంగా మా DGM సహకారమెంతగానో వుండేది.
ఎ రోజు కార్యక్రమముంటే ఆ రోజు సాహోద్యోగులవద్ద రూ . 10 వసూలు చేసి ఆ రోజు కార్యక్రమము జరిపి ఖర్చులు పోగా మిగిలిన డబ్బు కవరులో పెట్టి అతిథికి సమర్పించే వాళ్ళము. మళ్ళీ programmme అంటే మళ్ళి 10 రూపాయలు.
పెళ్ళైన ఒక తెలుగు మాట్లాడే తమిళ యువతి ప్రక్క బ్రాంచి నుండి transfer అయి ప్రాంతీయ కార్యాలయానికి వచ్చింది . నేను యథాలాపంగా ఆమె వద్దకు వెళ్లి 'programme' కు గానూ 10 రూపాయలు అడిగినాను. ఆమె ఇస్తాను గానీ నాకు 'benefit' ఏమిటి అని అడిగింది. నేను ఎంతో నిబ్బరముతో మనము వారు చెప్పే మంచి మాటో పాటో వింటాము కదా అన్నాను. అయితే నాకు 'benefit' ఏమిటి అని తిరిగీ అడిగింది. మన మనసుకు సంతోషము కలిగిస్తుంది కదా అమ్మా అని చెప్పినాను.అయితే నాకు 'benefit' ఏమిటి అన్నది. గొప్పవారిని గౌరవించితే మనలను మనము గౌరవించుకొన్నట్లు కదా అన్నాను. అయితే నాకు 'benefit' ఏమిటి అన్నది.
దేవుడు నాకు సమకూర్చిన సహనమంతా నశించింది. ఆమెకు ' అమ్మా జరిగే ప్రతి పనికీ నీవు benefit ఆశించితే మీ ఇంటినిండా పిల్లలుంటారు' అన్నాను. మారు మాట్లాడకుండా 10 రూపాయలు ఇచ్చి పంపించివేసింది .

ఇది చదివినందువల్ల 'benefit' ఏమిటని దయవుంచి అడుగ వద్దు. మీకు నవ్వు వస్తే నవ్వుకోవడమే !

ఒక సారి ఒక అతిధి మా ఇంటికి వచ్చినాడు. మా అబ్బాయి చూడ ముచ్చటగా వుంటే మాట కలిపినాడు.కొన్ని క్షణాలు గడిచిన తరువాత 'భూమి గుండ్రముగా ఉన్నదని చెప్పిన మన దేశ వాసి ఎవరు అని అడిగినాడు
అబ్బాయి చురుకైనవాడు కాబట్టి వెంటనే జవాబు చెప్పినాడు : "ఆలియ భట్ "
విస్తుపోయి అతిధి " ఎవరు నీకు చెప్పింది" అన్నాడు.
అబ్బాయి వెంటనే " మా సాలే " అన్నాడు
bath room నుండి బయటకు వచ్చే నేను ఈ మాటవిని మా వానికి '' పలుకుటకు బదులు '' పలుకుకుతాడని చెప్పి అతనిని దిగ్భ్రాంతి నుండి దూరము చేసినాను.
ఇంగ్లీషు టీచరు బోర్డు పైన ఈ విధం,ఉగా వ్రాసి విద్యార్తులను punctuate చేయమనింది.
"Woman without her man is nothing".
అబ్బాయిలు ఈ విధంగా చేసినారు: "Woman, without her man, is nothing."

అమ్మాయిలు ఈ విధంగా చేసినారు: "Woman! Without her, man is nothing."
'MAXIMUM' 'MINIMUM'
పూర్వపు రోజులో తల్లిని అమ్మా అని పిలచేవారు. ఆమె అక్కయ్యను పెద్దమ్మ అని చేల్లెమ్మను పిన్నమ్మ  అని పిలిచేవారు. కాలాంతరములో పిన్నమ్మ పిన్ని అయ్యింది కానీ  పెద్దమ్మ 'పెద్ది' కాలేదు.  ఆమాట అటుంచితే అమ్మ తరువాతి కాలములో  Mummy అయ్యింది. తరువాతి కాలానికి MOM అయ్యింది. Latest గా MUM అయ్యింది. ఈ విషయమే ఒకవ్యక్తి నాతో చెబుతూ మరి పెద్దమ్మ పిన్నమ్మలను ఏమనాలని అడిగినాడు. వెంటనే నేను 'MAXIMUM' 'MINIMUM' అని జవాబు చెప్పినాను.
మాల్ లో ఒక రోజు
ఈ పద్యానికి కారణము ఒక జరిగిన కథ. నేను మద్రాసులో ఉద్యోగము చేసే రోజులలో పెళ్ళికి గాను బట్టలు తీసుకొనుటకు ఎగ్మోర్ లో వుండే 'పట్టు మాళిగై' అన్న 'Coop Tex' అన్న తమిళనాడు ప్రభుత్వ మలిగె (Big Shop or Maal) కు రిబేటు ఎక్కువగా ఉండుటవల్ల వెళ్లినాము. అది దీపావళి నెల.
మేము బట్టలన్నీ కొన్న తరువాత, ఏదో పాపమని తలచి ఉంటుంది బహుశా, ఒక సేల్స్ గర్లు నా వద్దకు వచ్చి రిబేటు చాలా ఎక్కువగా ఉంది ఇంకా శారీస్ కొనండి సార్ అని అరవములో అన్నది . నేను చాలమ్మా కావలసినవన్నీ కొన్నాను అన్నాను. లేదుసార్ కొని మీకిష్టమైన వాళ్లకు gift చేయండి అనింది. ఆమె ఆ మాట అనుట అవసరము లేదేమో అనిపించింది నాకు. వెంటనే నేను "ఏమమ్మా ఇటువంటి మాటలు నా భార్య ప్రక్కనే ఉన్నపుడు చేబుతావే" అన్నాను . అంతే చుట్టూ ప్రక్కల ఉన్న కష్టమర్లతో కలిపి అందరూ పగలబడి నవ్వవలసి వచ్చింది.
ఆ ఉదంతమునకు గుర్తుగా ఈ పద్యము వ్రాసినాను.
'ఈ రిబేటు దొడ్డ దిందెన్నియో కొని
ఇష్టమైనవారికివ్వవచ్చు'
'మాటలట్టివనకుమా! భార్య ముందర
చెప్పుచుంటి నీకు సేల్సుగర్లు'
చాలా దశాబ్దాల క్రితం ఒక SBI శాఖలో
'Drafts issue' చేయుట Banks కు పెద్ద 'Business'ఆ రోజుల్లో. నేను Accounts Manager గా వున్న branch లో మిత్రుడు వెంకట్రామన్ drafts clerk గా ఉండేవాడు . అతను SBI AWARD STAFF UNION secretary కూడా . SBI లో యూనియన్ సెక్రెటరీ అంటే Branch Manager తో సమానము. ఆచీ తూచి అతనితో Officers మాట్లాడకుంటే వాళ్ళ పని అంతే సంగతులు . అంటే మానేజర్లకు అది కత్తి మీద సామే! నెత్తిమీద పామే! ఆ రోజులు అట్లా ఉండేవి . ఒక Branch లో Officers ఇద్దరు ముగ్గురుంటే Award Staff 16,17 మందిదాకా వుండేవాళ్ళు . కావున Officers అత్యంత జాగరూకతతో మసలితీరవలసినదే!
ఒకనాటి,ఈ క్రింది, ఉదంతము జరిగిన తరువాత అతను నాకు ఆప్తమిత్రుడైపోయినాడు .
Banks లో ఆఫీసర్ల signatures ప్రపంచములోని ఆయా Bank's అన్ని శాఖలకు పంపబడి వుంటాయి కావున ఏదైనా సందేహము వస్తే వారు వెంటనే ఆ సంతకము రికార్డు లో పరిశీలించుతారు.

ఆయన drafts వ్రాయడములో తప్పులు ఎక్కువగా దొరలేవి. నాపరిస్థితి ఏమంటే నేరుగా అతనికి చెప్పాలేను drafts తీసుకొని నేను వ్రాయాలేను . ఒక రోజు ఇట్లే తప్పుల తతంగం జరుగుతూవుంటే నేను అతన్ని " వెంకట్రామన్ నీవు drafts వ్రాస్తే return కానేకావు" అన్నాను . ఆతను ఎంతో సంతోషంతో " ఏమి Sir అంత బాగా వ్రాస్తానా" అన్నాడు . నేను వెంటనే " నా ఉద్దేశ్యము అది కాదు ,నీవు drafts వ్రాస్తే కనీసం 5,6 తప్పులైనా వుంటాయి అందువల్ల నేను కూడా ప్రతి తప్పుకు ఒక్కొక్క 'signature' పెడతానుకదా! అందువల్ల నా సంతకాలలో ఒకటి కాకుంటే ఇంకొకటైనా నా 'circulated signature' తో సరిగ్గా 'tally' అవుతుంది కాబట్టి ఏ draft కూడా 'pay' అవుతుంది కానీ వెనక్కు రాదన్నాను . 'ఎంత దెబ్బ కొట్టినారు సార్' అన్నాడు. యుద్ధము జరుగలేదు . తప్పులు తగ్గి పోయినాయి . ఆతను నేను మంచి స్నెహితులమైనాము .
గుండెగాయము - మాన్పు విధము 
చెలి మోసము చేసె నిట్టు గుండె గాయమాయె నొట్టు  
చెలిచింతను వదిలిపెట్టు గాయమును మాన్పు  ఫస్టు 
సీసా డెట్టాలులోన ఆయింట్మెంట్ బాగ కలుపు 
నీ బాధలకవి చూపును చక్కనైన ఒక మలుపు 
గాయమొకటి క్లీను జేయు వేఱొక్కటి పూత పూయు 
రెండూ తాముమ్మడిగా గాయమ్మును మానజేయు 
తాగిన మరు క్షణములోన కష్టాలను అవి నిలుపు 
ఆ తదుపరి నీకెప్పుడు రాదు బాధ అన్న తలుపు 
కొనకుండా నవ్వుకొనండి-బ్రహ్మానందం-Single Bar Exercise
బ్రహ్మానందం గారి కుమారుడు"నాన్న గారూ! ఏమిచేస్తూ వుండినారు?"
బ్రహ్మానందం గారు "పొడుగు పెరగడానికి Single Bar Exercise చేస్తూ వుండినాను"
బ్ర.కు. "మీరు already పొడవైనారు నాన్నగారూ! ఇక చేయకండి."
బ్ర. "ఎట్లు చెప్పగలవు?"

బ్ర.కు. "మీ తల, జుట్టును దాటి, పైకి వచ్చింది గమనించండి".
ఆదం అండ్ ఈవ్
ఆదం అండ్ ఈవ్ జననము, పాము రూపములో సాతాన్ రావడము,
ఆపిల్ పండును ఆదం మరియు ఈవ్ తినడము మనకందరకూ
బైబిల్ ద్వారా తెలిసిన విషయమే!
ఇక్కడ ఒక చిన్న ట్విస్టు.
వారిరువురూ చైనీస్ అయ్యి ఉంటే ఆపిల్ కు బదులు

పామును తినేవారు. మనకు కరోనా బాధ తప్పియుండేది.

ఛోడో తూ కైకు రోనా
 ఒకటి నీకు కొదవయినా
ఇంకొకటికి కొదవేదీ
తిండి నీకు కొదవయినా
తిట్లకెపుడు కొదవేదీ
పాంటు షర్టు కొనకున్నా
పారలర్ కు కొదవేదీ
పిల్లి పొయిలో వున్నా
పిజ్జాలకు కొదవేదీ
మందు కొనుట కరువైనా
ఇంట విందు కొదవేదీ
సినిమాలకు పోకున్నా
సీరియలుకు కొదవేదీ
బయటికసలు పోకున్నా
ఇంటి పనుల కొదవేదీ
నిలిపె ఇంట కరోనా

చోడో తూ కైకు రోనా

నా మాటలు నిజమసమానం అన్నీ గీతావాక్య సమానం
ఒక ప్రముఖ వ్యక్తి యొక్క సంతాప సభకు ఒక రాజకేయనాయకుడు వచ్చి ఈ విధముగా ఉపన్యాసమివ్వదొడగినాడు.
చెంగయ్యకు చావంటే మరి చెప్పగఎంతో అభిమానం
నా మాటలు నిజమసమానం అన్నీ గీతావాక్య సమానం
విద్యార్ధిగనే విమలా మేడం అంటూ తా చెడదిరిగేవాడు
ఆమె కోసమే ఎప్పుడుకూడా స్కూలుకు సరిగా  వచ్చేవాడు
క్లాసురూములో ఫస్టు బెంచిలో కూర్చుని వెకిలిగ నవ్వేవాడు
పట్టుపట్టుచూ పాఠాల్ చదువక ఫెయిలై ఫెయిలై చచ్చేవాడు
హోటల్ అంటే ఇదిగోవస్తిని అంటూ వెంబడి వచ్చేవాడు
ఇడ్లీ సాంబార్ తెమ్మంటూ తెగ గట్టి గట్టిగా అరచేవాడు
ఇడ్లీ సాబారున swim చేస్తే ఘటోత్కచుండై పాడేవాడు
సాంబారంటే అంతగ పడి పడి తాగితాగి తా చచ్చేవాడు
ఎన్నికలంటే ఎంతో ప్రేమ బూతుకు తప్పక వచ్చేవాడు
ఎందరి ఓట్లో వేసేవాడు ఇంకు మార్కు చేరిపెసేవాడు
ఎన్నికలంటే పెన్నిధియంటూ ఎంతగానొ పడి చచ్చేవాడు
గుండెకు గండి పడిందిక నాకు దిగెను గుండెలో పిడిబాకు
ఆయన స్మృత్యర్థముగా నేను  ఓటరులిస్టున పేరు చెరుపను
కొనకుండా నవ్వుకొనండి-బస్ కర్ అలీ
అన్నా నా కొడుల పేర్లు నీకు తెలుసు కదా! అయినా ఒకసారి చెబుతాను . పెద్దవాని పేరు మురాద్ అలీ, రెండవవ వానిపేరు రహమత్ అలీ, మూడవవాని పేరు బర్కత్ అలీ, మరి నాల్గవ వాడు పుట్టబోతున్నాడు వాని పేరు ఏమి పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నీకేమైనా తెలిస్తే చెప్పవా ?' అన్నాడు తండ్రి కాబోతున్న అలీ..
నేను : 'ఇప్పటికే ఎక్కువ. ఇక చాలు, బస్కర్ అలీ అనే పేరు పెట్టు. అంతటితో మానుకో!

ఒక పశువుల మంద, తమ దూడలతో, రహదారి పై పోతూ ఒక గోడకు కొన్ని ఒకే సినిమా పోస్టర్లు తగిలించి దూడలను దూరముంచి అవి మాత్రమె తినసాగినాయి. నాకు ఆశర్యము వేసి పశువుల భాషలో 'పిల్లలకు పెట్టకుండా తింటున్నారు, ఇంతకూ పశువులనిపించుకొన్నారు' అన్నాను. అందుకు ఆపశువుల ప్రతినిధి ఈ విధముగా జవాబు చెప్పుట జరిగింది. ఒక్కసారి ఆ పోస్టరు చదువు. AUDULTS ONLY అని కనిపించలేదా! మీరయితే ఆ సినిమాలకు మీ పిల్లలను కూడా పిలుచుకొని పోయి చూపించుతారు. మేము పశువులము కదా! ‘మేము Statutary Warnings ను యథాతథముగా పాటించుతాము.’అని చెప్పుటతో నా నోరు మూత పడింది.
ఒ      ఒక రోజు మాస్టారు తెలుగు పాఠము 'సూరత్ ను గూర్చి చెబుతూ ఉండినాడు.సూరత్ జలతారుకు ప్రసిద్ధి అని చదివి 'జలతారు' అంటే ఏమిటో చెప్పగలరా?అన్నాడు. లేచినాడు శేషమే లేకుండా అన్నీ తెలిసిన శేషు. శేషు విషయము తెలిసిన మాస్టారు విధి లేక చెప్పు అన్నాడు., వాడి లోని 'వాడి' 'వేడి' తెలుసు కాబట్టి. వెంటనే మగధీరుడైన ఆ 'బాహుబలి' లేచి "వాన వరదయై ప్రవహించునపుడు ఆజలము తనతో బాటూ తీసుకుపోయే రోడ్డుపై గల 'తారు' ను 'జలతారు' అంటారు అన్నాడు. టీచరు, నిన్ను శిష్యునిగా పొందుటకు ఎన్ని జన్మల పుణ్యము చేసుకోన్నానో ' 

అని అప్రయత్నముగానే అరచినాడు.(అసలు ఆ పదమును ౙలతారు అని పలుక వలెను. ౙలతారు అంటే  ౙరి, సరిగె. ౙ అన్న అక్షరము లుప్తమై పోవుటచే ఏర్పడిన కష్టము.)

    అది రాత్రి ఒంటిగంట సమయము. ఉన్నవాళ్ళు AC పడక గదుల్లో మధ్యస్తులు Fan క్రింద, లేనివాళ్ళు  విసనకర్ర సాయంతో నిద్రించే సమయం. ఆ సమయం లో ఎవరో అగంతకుడు MLA స్వాహామూర్తి గారికి Phone చేసినాడు. "హలో స్వాహా మూర్తిగారా అండి". స్వాహా: "అవును". అపరిచితుడు: "ఇప్పుడెక్కడున్నారు?"   స్వాహా: "నీకెందుకు? ఫోన్ పెట్టేయ్" తరువాతి రోజు అదేసమయానికి అదే వ్యక్తితో అదే   ప్రశ్న. స్వాహా: "నోర్ ముయ్, ఫోన్ పెట్టేయ్"

తరువాతి రోజు అదేసమయానికి అదే వ్యక్తితో అదే ప్రశ్న. స్వాహా కోపంతో ఊగి పోతూ " నరకం లో ఉన్నా! నీకెందుకు"  అగంతకుడు " ఏమీ లేదు పొరబాటున నిన్ను దేవదూతలు స్వర్గానికి తీసుకు పోలేదుకదా! అని తెలుసుకొందామని"

ఒక  వారానికే   స్వాహా మనో వ్యధతో  మంచమెక్కి పైలోకం చేరినాడని వార్తా పత్రికలో వార్త.

జిన్

     ఒకసారి ఒక వివాహిత దేవుని గూర్చి తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆమె దేవుని ఈ విధముగా అడిగింది. 'స్వామీ! అల్లాఉద్దీన్ కు దొరికిన అద్భుత           దీపములో ఒక 'జిన్' ఉంటాడు కదా! అలాంటి అద్భుత దీపము మగవారికి  మాత్రమే దొరుకుతుందే! ఆడువారికి ఎందుకు దొరుకదు?'. దేవుడు ఆమెతో ‘అమ్మా పెళ్ళయిన ప్రతి స్త్రీకి నా కానుకగా ఒక 'జిన్' ను ఇస్తూనే ఉన్నాను కదా!' అని చెప్పి అంతర్దానమైనాడు.

               (2014, జూన్ 7 న చేసిన నా ప్రచురణ నకలు)

      2014 లో మోదీ గారు మొదటి సారి ప్రధానమంత్రి అయినపుడు నాటి  పాకిస్తాన్         ప్రధాని నవాజ్ షరీఫ్ ను తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించినారు.       అటుపిమ్మట ఈ స్వకపోల కల్పన చదవండి.  ఆయనను గౌరవంగా శ్రీయుతులు       మన్మోహన్ సింగ్ ప్రక్కన కూర్చుండ జేసినారు.

రిపోర్టర్, మోదీ గారితో: పాకిస్తాన్ ప్రధాని శ్రీ నవాజ్ షరీఫ్ గారిని మీ ప్రమాణ స్వీకారానికి పిలుచుటలో మీ ఉద్దేశ్యమేమి .

మోదీ గారు : ఎందరో విజ్ఞులు శాస్త్రజ్ఞులు వున్న ఆ సభపై ఉగ్రవాదుల దాడి జరగకుండా . రిపోర్టర్ : మరి వారిని మన్మోహన్ సింగ్ గారి ప్రక్కన కూర్చోబెట్టినారెందుకు    మోదీ గారు : వారిని ఉంచటానికి మాట్లాడనీయకుండా!

Formalities అన్నీ పూర్తి చేసి Special Ward లోని Private Room లో చేర్చినారు అతని బంధువులు. అన్నీ అమరినాయి అతనికి  అన్నీ బాగున్నాయి.  నర్సులు వస్తున్నారు పోతున్నారు. ప్రతిరోజూ ఒక Apple పండును అతని Cupboard పై పెట్టేవారు. ఒకవేళ అతను తింటే వేరొకటి ఉంచేవారు. మూడు దినములు గడిచిపొయినాయిDoctor రాకపోవుటతో ఆత్రము పెరిగింది Patient కుఅత  ను అప్పుడే వచ్చిన Nurse ను అడిగినాడు ‘ఏమి Doctor’ వచ్చుటలేదే’ అని. ఆమె నింపాదిగా ‘అందుకేగా రోజూ Cupboard పై Apple ఉంచేది’ అని చెప్పిందిPatient అర్థముకాలేదని అన్నాడు. ఆమె  An Apple a Day Keeps the Doctor Away’ అని తెలిపిందిPatient అర్థము కాలేదన్నాడు. అం

Very Simple.             

                      






కాఫీ

క్షీర సాగరమధనమును గూర్చి అందరికీ తెలిసినదే! అందు మంధర పర్వతము కవ్వము గానూ వాసుకియను సర్ప రాజును కవ్వపుతాడుగానూ ఉపయోగించినది అందరికీ తెలిసిన విషయమే! సముద్ర మదనము చేయు సమయమున మహా బుద్ధికుశలుడైన శ్రీ మహావిష్ణువు రాక్షసులను వాసుకి తలవైపు దేవతలను వాసుకి తోకవైపు పట్టుకొనునట్లు చెప్పి ఒప్పించి పట్టించినాడు. అందువల్ల చిలుకుసమయమున వాసుకి వెడలగ్రక్కు విషము రాక్షసులకు, చిలుకుటచే వచ్చిన అమృతము దేవతలకు లభించినది.

నా మిత్రుడు మరి మానవులకు ఆ సమయమున లభించినది ఏమీ లేదా అని నన్ను ప్రశ్నించినాడు. అందుకు నేను 'అది దేవ రహస్యము. అయినా నీకు చెబుతున్నాను.' అని ఈ విధముగా చెప్పినాను.

మానవులు ఇదే ప్రశ్నను శ్రీమహావిష్ణువునకు సంధించితే ఆయన' కాలకూటము యొక్క తలతో పీయూషము యొక్క తలను సంధించి కాపీ పేరుతో ఆరెంటి రుచి కలుగుతూ అనుదినమూ సేవించే అదృష్టమునకు మిమ్ము నోచుకోనిచ్చుచునాను’ అని సమాధానమిచ్చినాడు. ఆయన అనుగ్రహముచే మనకు కాఫీ నిత్యామృతమైనది.

చంద్రగోళపు  తలతో  ఎంతో   రద్దీబజారులో

నడుస్తున్నాడొక ముదుసలి ఎదో బేజారులో

ఒకలలనకు మోచేయి తగిలింది పారాకులో

విసుగుపడుచు అంది పడుచు ఆపలేని చిరాకులో

Asian Business Woman Holding A Mobile Phone. Royalty Free Cliparts,  Vectors, And Stock Illustration. Image 79644478.మొబైల్  లో  క్రికెట్  ఆమెకు  అయ్యింది  మిస్సని

నో  బాలువే, చేసితివెందులకీ   పనికిరాని  పని

అంది కోపాన్నిదిగమిగుకొని క్రికెట్ పరిభాషలో

ఫ్రీ హిట్ ఇది తెలియదా అన్నాడా తాత శ్లేషలో 

అగ్గిపెట్టె - 02\04\2021

వర్షాకాలములో ఒక సాయంకాలము వేళ ఒక ఇల్లాలు పచ్చారి కొట్టులో ఒక అగ్గిపెట్టె కొని తీసుకుపోయింది. చిత్తడి, అందులోనూ రాత్రిపూట అవడముతో ఎంత ప్రయత్నించినా అగ్గిపుల్ల ఆమెకు వెలుగలేదు. తెల్లవారి కొట్టు తెరచిన తరువాత కొట్టుకు పోయి నీ అగ్గిపెట్టె  నాకు వద్దు, అదితీసుకొని డబ్బు వెనక్కు ఇచ్చేది అనింది. కొట్టువాడు అగ్గిపెట్టె తీసుకొని ఒక అగ్గిపుల్లను బయటికి తీసి పుల్లకు మందు ఉన్నవైపు 5,6 మార్లు బాగా గడ్డానికి రాచి వెలింగించినాడు. పుల్ల వెలిగింది. వెలిగింది కదా అమ్మా అన్నాడు ఆమెతో! వెలిగితే వెలిగింది నాకు నీ అగ్గిపెట్టె వద్దు అని కచ్చితముగా చెప్పింది. ఉండబట్టలేక అడిగినాడు కొట్టువాడు ‘ఎందుకు’ అని. నేను కుంపటి వెలిగించుకోవలెనంటే సారిసారికీ నీ గడ్డానికి రాచి నీవిచ్చిన పుల్ల తీసుకుపోయి వెలిగించుకొనే ఓపిక నాకు లేదు. పైగా నేను ఇంటికిపోయేలోపల ఆపుల్ల చల్లబడి వెలుగకనూ పోవచ్చు.

వ్యాపారికి నోట మాట రాలేదు.


    😟                                                 

అనగా అనగా ఒక bank. bank లో మన కథకు కావలసిన ఒక

Counter - clerk మరియు ఆ bank యొక్క branch - manager

మరియు ఒక customer.

తెర లేచింది. Counter కు ఒక దడి న clerk మరియు వేరొక దడిన customer.

Customer చాలా గట్టిగా కేకలు వేస్తున్నాడు. Customer మన కథానాయకుడైన clerk వద్ద కేకలు వేస్తున్నందువల్ల clerk ను లోనికి పిలిచినాడు Manager.

Manager: " ఏమయ్యా అతను ఎందుకు నీ వద్ద నిలిచి కేకలు వేస్తున్నాడు? ‘Customer is always right’ అని తెలియదా నీకు”

Clerk: అవును, తెలుసును సార్. నేను Bank లో చేరిన మొదటి రోజు చెప్పిన మొదటి పాఠమదే కదా Sir. అందుకే ఆయన మొదట చెప్పిన మాటకే ‘you are right sir’ అన్నాను , ఆ తరువాత నన్ను మాట్లాడనివ్వకుండా తానె అరుస్తూ వున్నాడు"

Manager:"ఆయన అన్న మొదటి మాట ఏమిటి?"

Clerk: మీరు stupid మరియు muff అని. మీరు చెప్పిన మొదటి పాఠము గుర్తొచ్చి you are right sir. అన్నాను. ఆపైన నన్ను మాట్లాడనివ్వకుండా మీపై తిట్లకు లంఘించు కొన్నాడు".                   

Manager:              😕 

కొనకుండా నవ్వుకొనండి

ఒక అందమైన యౌవనాంగి ఒక ముదుసలిని పెళ్లి చేసుకొనింది. మనసు 

ఉండబట్టలేక

ఎందుకమ్మా పండు ముసలిని కట్టుకోన్నావు అని అడిగినాను.

ఆమె తెలుగు, ఇంగ్లీషు హిందీ కలిపి 4 పంక్తులలో ఈ జవాబు చెప్పి

నానోరు టప్పుమని మూయించింది.

నేను గాంచినది ఆయన Income

వేరోకటేమో ఆయన 'दिन कम'

ముగిసిన వెంటనె మా బంధం

మిగిలేదంతా ఆనందం 

ఎవరో ఒక పుణ్యాత్ముడు తనవద్ద నున్న 3 గుర్రములను చర్చి

గేటువద్ద కట్టి ఫాదరుతో ' ఫాదర్ వీటిని మీరు అమ్మి ఆ

డబ్బును చర్చి నిధిలో జమ వేసుకొండి ' అన్నాడు . ఆ మూడు

గుర్రములలో ఒక దానికి 'Thank god' అంటే పరుగెత్తాలని

 'Amen ' అంటే ఆగాలని చక్కగా నేర్పించినాడు.

ఒక పొగరుమోతు, ఫాదర్ వద్ద నుండి అదే గుర్రాన్ని కొని పరిగిడుటకు

అగుటకు ఏమనవలసింది ఫాదర్ వద్ద నేర్చుకొన్నాడు.

నేర్చుకొన్న తక్షణం గుర్రాన్ని దౌడు తీయించినాడు. ఎందుకో గుఱ్ఱము పరిగేడుతూవుంటే అతనికి నిదుర పట్టింది . మెలుకువ వచ్చే సమయానికి ఒక కొండ అంచును చేరుతున్నట్లు తెలుసుకొన్నాడు. వెంటనే amen అన్నాడు . గుఱ్ఱము చివరి అంచు వద్ద నిలిచింది . లేకుంటే లోయలోపడి  చచ్చేవాడే .

తనను రక్షించినందుకు వెంటనే దేవునికి కృతజ్ఞత చెప్పే ఉద్దేశ్యముతో 'thank God' అన్నాడు .

ఆతరువాత  అతను అతని గుఱ్ఱము కనిపించలేదు .















Wednesday, 10 July 2019

కాళిదాసు కవన కమనీయత (ఒక చాటుకథ)

కాళిదాసు కవన కమనీయత (ఒక చాటుకథ)
ఒకమారు ధారా నగరాదీశుడగు భోజరాజు వ్యాహ్యళికై వెళ్ళగా
భోగపు వీథిలో ఒక పడుచుపిల్ల  ఒకతె చెవిలో
నల్లకలువ పువ్వును కలిగి  చెండాట ఆడుతూఉండే సమయములో
ఆ కలువ పూవు జారి క్రింద పడింది. ఆడుతున్న బంతిని నేలపడిన కలువను
అన్వయించుకొన్న భోజుడు, తరువాతి దినము సభచేసిన భోజుడు  తన ఆస్థాన కవిశేఖరులను అందమైన అతివ ఆడే భూమిని తాకి పైకగసే  కందుకక్రీడను  వర్ణించమని కోరినాడు. అప్పుడు భవభూతి ఈ విధంగా వర్ణించినాడు:
విదితం నను కందుక! తే హృదయం
ప్రమదాధర సంగమలుబ్ద ఇవాl
వనితాకరతామరసాభిహత:
పతిత: పతిత: పునరుత్పతసిll
ఓ కందుకమా! నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది. యువతీమణి తనచేతితో
మాటిమాటికి కొట్టుచున్నా కిందపడి కూడ నీవు మరల మరల పైకెగురుచున్నావు.
ఆవిడ కెమ్మోవి రసాస్వాదనకే కదా నీవు విరామము లేకుండా ఎగిరేది!
ఆ తరువాత వరరుచి లేచి ఈ విధముగా వర్ణించినాడు.
ఏకోపి త్రయ ఇవభాతి కందుకోయం,
కాన్తాయాః కరతల రాగ రక్త రక్తః
భూమౌ తచ్చరణ నఖాంశు గౌర గౌరః
ఖస్థః సన్ నయన మరీచి నీల నీలః
ఈ బంతి నిజమునకు ఒక్కటే అయినా ఆ కాంత మూడు బంతులతో ఆడుచున్నట్లున్నది. ఆ కాంత అరచేతి యెర్రని కాంతుల వల్ల ఎర్రబడి బంతి ఎర్రగానూ, బంతి భూమి మీద పడి ఆమె కాలిగోళ్ళ తెల్లని కాంతి ప్రతిఫలించగా తెల్లగానూ, అదే బంతి లేచినప్పుడు ఆమె కన్నుల నీలికాంతులలో స్నానము చేయునపుడు  నల్లటి బంతిగానూ కనిపిస్తున్నది.
ఇపుడు కాళీదాసు శ్లోకము చెప్పనుంకించి లేచి నిలుచుని ఈ విధముగా చెప్పసాగినాడు.    పయోధరాకార ధరో హి కందుకః
కరేణ రోషాదభిహన్యతే ముహు:
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియః ప్రసాదాయ పపాత పాదయో:
ఆ ఇంతి బంతి ఆట చూస్తే, ఆమె చెవిలో వున్న కలువమొగ్గకు భయం వేసిందట. ఎందుకు అన్నది ఈ విధముగా వివరించినాడు.
"తన పయోధరాలను ఆ బంతి అనుక్షణమూ అందుకోజూచుతున్నదన్న కోపంతో ఆ జవరాలు పదే పదే దానిని చేతులతో కొట్టి దండిస్తున్నది. మరి కలువపూవునైన నేను ఆమె కన్నులను అనుకరిస్తున్నాను కదా! తాను నన్ను కూడా అదే విధముగా దండిస్తుందేమో" నని భయపడి ఆమె పాదాలపై పడిపోయిందట భయపడి.
మొదటి రెండు శ్లోకాలలో కలువకు అన్వయము లేదు. మూడవడిగా చెప్పబడిన తన శ్లోకములోనే ఆ అన్వయమును సాధించినాడు.
అదే కాళిదాసు గొప్పదనమంటే!
స్వస్తి...

Monday, 1 July 2019

విద్యా వ్యవస్థ నాడు నేడు


విద్యా వ్యవస్థ నాడు నేడు
https://ajaraamarasukthi.blogspot.com/2025/07/blog-post.htmlpot.com/2019/07/blog-post.html

నేటి విద్యావ్యవస్థను గూర్చి తెలుసుకొనుటకు ముందు ఒకానొకనాడు ఈ దేశములోని విద్యావ్యవస్థ ఏవిధముగా వుండినది అన్నది గమనించుట ఎంతో అవసరము. అందుకుగానూ కాళీదాసు రచించిన ‘రఘువంశము’ నుండి ఈ ఈ శ్లోకమును ఉటంకించున్నాను. మరి రఘువంశమే ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు. ‘ఉపమా కాళిదాసస్య’ అన్న నానుడి ఉండనే వుంది. రఘువంశము సూర్యవంశజులు, సూర్య అంశజులు అయిన రఘువు మరియు ఆతని తండ్రి దిలీపుని గూర్చి ఎంతో సవిస్తారముగా తెలియజేస్తాడు మహాకవి. అటువంటి మహనీయుల చరితము వ్రాసే కావ్యములో తప్పక తన రాజు విక్రమార్కుని దేశకాల పరిస్థితులను కూడా దిలీపుని కాలమునకు అన్వయించి తెలుపుట అతిశయోక్తి కాదు. ఆ శ్లోకమును చూడండి.
ఆకార సదృశః ప్రజ్ఞా ప్రజ్ఞయా సద్రుశాగమః    l
ఆగమైః సదృశారంభః ఆరంభస్సదృశోదయః ll
దిలీపుని కాలములో ఆకారమునకు తగిన తెలివితేటలు, తెలివితేటలకు తగిన విద్య, విద్యకు తగిన ఉద్యోగమూ, ఉద్యోగమునకు తగిన ఫలితము, ఇవి తగిన విధముగా వంక పెట్టుటకు వీలులేనంత పొంకముగా ఉండేవి. అంటే అర్థము చేసుకోండి, ఒకనాటి మన విద్యావ్యవస్థ ఏవిధముగా ఉండేదో! మరి ఇంతటి మహార్దశకు కారణము ఏమిటి అన్నది మనము ఈ శ్లోకము ద్వారా తెలుసుకొనవచ్చును.
మాతా శత్రుః పితా వైరీ ఏన బాలో నపాఠితః l
న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకోయథాll
తల్లి, తండ్రి తమ పిల్లలకు తమ విద్యుక్త ధర్మముగా నెంచి తగిన విద్య నేర్పకపోతే ఆ శిశువు భవితకు వారే శత్రువులు. అట్టి మూర్ఖులు సభలో కూర్చున్నా హంసలనడుమ కూర్చున్న కొంగలాగా అవమానితుదౌతాడు. అందువల్ల ఎవరి బాధ్యత వారు నాడు విస్మరించక నిర్వర్తించేవారు. తల్లిదండ్రుల తరువాత గురువు యొక్క పాత్ర రంగములోనికి వచ్చేది. నేడు గురువులు లేరు. కేవలము శిక్షకులే వుండేది. ఈ శిక్షకులకు తాము చదివిన చదువులో తగిన విజ్ఞానము, సంస్కృతిపై అవగాహన, పిల్లల మనస్తత్వమును గూర్చిన పరిశోధన ఏమీ ఉండదు. ‘ఆడవాళ్ళ పెళ్ళో మగవాళ్ళ పెళ్ళో గాటి కాడ ఇంతేస్తే గతికొచ్చినాము’అన్నట్లు ఉంటుంది వారి బోధన. వారికి Fee ముఖ్యము, విద్యార్థి వికాసము కాదు. గురువునకు శిష్యుని మనోవికాసము ముఖ్యము. విద్యతో బాటు తన శిష్యుని ప్రయోజకుని జేసే బాధ్యత వుంటుంది. కానీ నేటికాలములో కూడా కొందరు, అందునా ప్రభుత్వోన్నత పాఠశాలలలో, నామీద గురుత్వము కలిగిన రమేష్, మహేష్ దంపతులు అనగా నలుగురూ విద్యార్థుల సర్వ విదొంనతికై పాటు పాడుచున్నారు. మరి నా ఎరుకలో లేనివారాలలో కూడా ఈ విధమైన బాధ్యతాయుత ఉపాధ్యాయులు ఉండవచ్చును. నాడు మహా మహా చక్రవర్తులు కూడా గురువు వద్దకు వస్తే తమ కిరీటము పాదరక్షలు ఆశ్రమము బయటవదిలి అణుకువను అందిపుచ్చుకొని అడుగు లోనికి వెయ్యవలసిందే! శ్రీరాముడు, బలరామ కృష్ణులు గురువుల ఆశ్రమములకుపోయి చదువుకొన్న వారే! వారి తండ్రులు Home Tuitions పెట్టించలేదు. అది గురువుయొక్క స్థానము.

కళలు, సంస్కృతి, విద్య ఈ మూడూ నిర్వహణ కోరుకొంటాయి, నియంత్రణ కాదు. నిర్వహణ నియంత్రణల మధ్య సురాసుర తారతమ్యమును గమనింపవచ్చును. నిర్వహణ తల్లివలె లాలించి బుజ్జగించి, లోతుపాతులను తలూపుతూ ముందుకు సాగుతుంది. ఒకవేళ తానూ చెప్పుటలో తప్పులున్నా సరిదిద్దుకొంతుంది. కానీ నియంత్రణ అట్లు కాదు. అంతా కర్ర పెత్తనమే! తాను పలికింది వేదము తాను కులికింది నాట్యము. ఇందులో తప్పులు మాత్రమే వుంటే పరవాలేదు, స్వార్థము ఉంటే ఆ కళలు, సంస్కృతి, విద్య అంతా నాశనమే! అందుకే విద్యా ప్రణాలికను ఒక విద్వద్వరేణ్య సంఘమును (connoisseurs of the faculty) ఏర్పాటుచేసి వారి కార్యాచరణను సూత్రబద్ధము చేయగల ఒక విజ్ఞుడైన అధికారి ఉంటే (Executive) అప్పుడు సక్రమమగు  నిర్వహణకు ఆస్కారముంటుంది. భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టుటకు నాడు చెన్నై లో శ్రీమతి రుక్మిణి అరండేల్ కళాక్షేత్రను ఏర్పాటు చేస్తే నేడు దానిని లీల శాంసన్ అన్న వ్యక్తి ఎంత నిస్తేజము చేసిందో గమనించండి.
 లీలా శాంసన్ సోనియా గాంధీ గారి అంతేవాసి మరియు ప్రియాంకా గారి పెళ్లి కాక మునుపు, ప్రియాంక వాద్రా గారి నాట్యాచారిణి. వారి అండదండలతో 2005 లో కళాక్షేత్ర అధ్యక్షురాలయిన తరువాత మన భరత నాట్యమునే క్రీస్తు నాట్యముగా మార్చిన వ్యక్తి. అవినీతి ఆరోపణలు,  అక్రమ నియామకాలు మరియు విచక్షణారహిత ఒప్పందాలు, ఏకపక్ష అవార్డులు,ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలతో కళాక్షేత్ర, సంగీత నాటక అకాడమీ మరియు సెన్సార్ బోర్డ్ లలో శామ్సన్  ఎన్నో అభియోగములను ఎదుర్కొన్నది. PK అన్న వివాదాస్పద మరియు హిందూమతమును కించపరచే చిత్రమునకు ఎటువంటి కత్తెరింపులు లేకుండా Clean Certificate ఇచ్చినది ఆమెయే! ఆమె చేసిన దారుణములకు, ఆమె ఆయా పదవులకు రాజీనామా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినది.

2006 లో, ఆమె భరత నాట్యము యొక్క ఆధ్యాత్మిక మూలాల తొలగింపును సమర్థించడం ద్వారా ప్రసార మాధ్యమాలను రెచ్చగొట్టింది.  శ్రీ శ్రీ రవి శంకర్ గారు దీనిని ఖండించడముతో ఆమె చేసిన సనాతన ధర్మ విరుద్ధమార్గములు దేశానికి తెలిసినాయి. ఈమె మన కళాసంస్కృతులకు చేసిన అన్యాయములను ఏకరువు పెట్టుట నా ఉద్దేశ్యము కాదు. ఇటువంటి నిరంకుశులకు మన కళలు, సంస్కృతి, విద్య లు ఆలవాలములైతే  మన భవితకు అంటే పిల్లలకు మనమందివ్వగలిగినది ఏమీ ఉండదు.
మిగిలినది మరొకసారి......
విద్యా వ్యవస్థ నాడు నేడు - 2

నాడు గర్గి మైత్రేయి మొదలగు వేదపండితులు, భర్తలకే సమయోచిత సలహాలనోసగిన, సీత, తార, ద్రౌపది మొదలైన విదుషీమణులు, ఆధునిక యుగమందున ఝాన్సీ లక్ష్మి, నీచముగా మీనా బజారులో ప్రవర్తించ బోయిన అక్బరును పడవేసి కంఠముపై కత్తి నిలిపిన రాజపుత్ర యువరాణి కిరణ్ దేవి, రాణీ రుద్రమ దేవి వంటి వీర వనితలు, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల ముద్దుఫళని, రంగాజమ్మ  వంటి విదుషీమణులు, MS సుబ్బలక్ష్మి, DK పట్టమ్మాళ్, వసంత కోకిలం, ML వసంత కుమారి వంటి సంగీత విద్వన్ మణులు కలిగిన ఈ దేశములో స్త్రీ స్వాతంత్ర్యము లేదా, స్త్రీలు విద్యావంతులు కాదా! ఒక నాటి సినిమాలలో లలిత పద్మిని రాగిణి అన్న తిరువాన్కూర్ సిస్టర్స్, వైజయంతి మాల, కమలా లక్ష్మణ్, మొదలగువారంతా శాస్త్రీయ నృత్యములో నిష్ణాతులు. మరి మన స్త్రీలను ఉద్ధరిస్తున్నట్లు కుహనా సంస్కరణ వాదుల ప్రేలాపనలు నిజముగా అర్థవంతమైనవేనా! మధ్య తరగతి కుటుంబీకులలో కూడా ఎందఱో అమ్మ గారు, అవ్వ గారు B.A, M.A. లు చదువక పోయినా ఎన్నో నీతికథలు, నియమ నిబంధనలు పిల్లలకు నేర్పించేవారు. నేదవి కనుమరుగై పోయినాయి.***************

విద్యా శిక్షణ నాడు: చదువుకు వర్ణ విచక్షణ లేదు. స్త్రీ పురుష భేదము గురుకులములలో లేదు. విద్యతో బాటు ఋజు ప్రవర్తన, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కట్టుబాట్లు బాధ్యత, సహనము సొశీల్యము, తమ తమ వృత్తులకు సంబంధించిన మెళకువలు నేర్పే వారు. విద్యలో  గణితము అందరూ నేర్చుకోనవాల్సిందే! ఖగోళము,  గ్రహ చారము, నక్షత్ర గమనము, జంతు వృక్ష భౌతిక శాస్త్రములు వారి వారి పరిమితులకు అనుగుణముగా నేర్పించేవారు. విద్యార్థుల మధ్య సహవాసమునకు వర్ణములు ఏనాడూ ఆటంకములు కాలేదు. బలరామ కృష్ణ సుధాముల మైత్రియే ఇందుకు తార్కాణము. ఇక పరిక్షలు, పిండి రుబ్బినట్లు విషయమును కంఠస్తము చేసి కాగితములపై కక్కే విధానము నాడు లేదు. ఆయా విభాగములకు సంబంధించిన ముఖ్య విషయములను చీటీలవంటి  కాగితములలో వ్రాసి చుట్ట చుట్టి ఘటిక (చిన్న మట్టి పాత్ర) లో ఉంచి ఆయా విద్యార్థులను అందునుండి ఒక చుట్ట తీసి అందు తెలిపిన విషయమును గూర్చి వివరణాత్మకముగా అడిగేవారు. అన్ని విభాగాములకు అదే పద్ధతి. 

ఇంకొక అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే ఈ గురుకులాలలో 300 మొదలుకొని 30,000 వేళా మంది విద్యార్థులు కూడా వుండేవారట. వెంటనే మనకు గుర్తుకొచ్చేది Section కు 20 మంది ఉండే Class Room. ఆవెంటనే మనము అనబోయేది ఇదంతా Trash అని.
కానీ నాడు ఇంత మందిని ఏవిధముగా నియంత్రించి చదువు చెప్పేవారో తెలుసుకోన్నారంటే మీరు నిర్ఘాంతపోక తప్పదు. 30 వేల విద్యార్థులున్న గురుకులములో 10 విభాగాలున్నాయనుకొందాము. అప్పుడు తరగతికి 300 మంది అవుతారు. ఆకా లములో రాజులు, ప్రముఖులైన ధనవంతులు ఎంతో వితరణతో భూదానము చేసేవారు ఆ విధముగా ఆ గురుకులమునకు ఒక 100 ఎకరముల స్థలము ఉండినదని అనుకొందాము. దానిని చాయా ఫల పుష్పములొసగు  మనోహర వనముగా తీర్చిదిద్దుట, అచ్చటి అధ్యాపక ఆచార్య గురు బృందముల పర్యవేక్షణలో, విద్యార్థుల  పని. కాబట్టి ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులు చదివేవారో గమనించండి. అసలు ఆచార్యుడు అధ్యాపకుడు గురువు అన్న మాటలకు వ్యుత్పత్తి అర్థములను ఒకసారి చూద్దాము.
నిరుక్తమునకు భాష్యకారుడగు యాస్కాచార్యులవారు 'ఆచార్య' అన్న పదమునకు అర్థమును ఈ విధముగా తెలియజేసినారు.
1. ఆచరతి ఇతి ఆచార్యః అంటే తసను ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు.
2. ఆచారం గ్రాహయతి ఇతి ఆచార్యః అంటే ఆచరించ వలసిన విధివిధానమును ఆచరింపజేయించేవాడు.
3. అచినోతి అర్ధాన్ ఇతి ఆచార్యః అంటే నిరంతరమూ తన శిష్యులకు తగు విషయ వివరములను సేకరించి     వారికి అందించేవాడు.
ఇక అధ్యాపకుడు అన్న మాటకు అర్థమేమిటో చూద్దాము. 'ఆపక' అన్న మాటకు అర్థము తీసుకు పోవువాడు అని. 'అధి' అంటే విశిష్ఠ స్థానము అని అర్థము. కావున అధ్యాపకుడు అంటే తన శిష్యులను ఒక విశిష్ఠ స్థానమునకు తీసుకుపోవువాడు అని అర్థము. అంటే నిర్ధారిత లక్ష్యమునకు తన చాత్రులను చేర్చువాడు అని అర్థము. ఆంగ్ల పదములలో ఇటువంటి వ్యుత్పత్తులకు తావు లేదు.
ఇక గురువు అన్న శబ్దమునకు అర్థమును ఒకసారి విశ్లేషించుకొందాము. గురుత్వము అన్నమాటకు సాంద్రత (Gravity) అన్న ఒక అర్థము వున్నది. సులభమయిన ఉదాహరణ ఏమిటంటే ఒక బియ్యపుగింజ సాంద్రత ఎక్కువగా కలిగి ఉంటుంది కానీ దానినుండి తయారయిన పేలము  చాలా తేలికగా ఉంటుంది. అంటే బియ్యపుగింజ లోని అణువులు ఎంతో దగ్గరగా చిక్కగా వుంటాయి అదే పెలము లో చాలా వదులుగా అవి ఉంటాయి. కావున గురువు అంటే అనేక విషయములను తనయందు కలిగిన ఒక సముద్రము వంటివాడు. విద్యార్థికి కలుగు ఏవిధమగు కష్టమును కూడా ఆతడు తీర్చే బాధ్యతను తీసుకొంటాడు. అందువల్ల ఆతను అసలు విద్యార్థికి గరిమనాభి(Centre of Gravity) అవుతాడు. శాస్త్రము గురువును ఈ క్రింది విధముగా నిర్వచించుతూ వున్నది.
గుకారస్త్వంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకః
అంధకార వినాశిత్యాత్ గురురిత్య భిదీయతే
గు’ అనగా అంధకారము, ‘ఋ’ అనగా దానిని నిలువరించేది అంటే ప్రకాశము. అంటే అజ్ఞానమును తొలగించి జ్ఞానభిక్ష నొసగేవాడు గురువు. ఆయనకు పాఠ్యాంశములతో నిమిత్తము లేదు. శిష్యునికి చేయూతనిచ్చుటకు ఎల్లవేళలా సిద్ధముగా ఉంటాడు. ఇంత అంతరార్థము కలిగిన ‘గురు’ శబ్దమునకు సమాన శబ్దమును మనము ఆంగ్లములో చూడగలమా!
పై మువ్వురికీ పురోదృష్టి పూర్వదృష్టి , అంతర్ దృష్టి (fore sight, far sight, in sight) నేటి Teachers లో కేవలము sight మాత్రము ఉంటుంది. వీరు చాత్రునియోక్క తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనముల గూర్చి యోచించుటయేగాక వానిని సాధించుటకు  తగిన వనరులపై తమ అంతః దృష్టినుంచుతారు.

ఇక తిరిగీ అసలు విషయమునకొస్తే ఆ 300 మంది విద్యార్థులున్న తరగతిలో  ఒక 15 మంది చురుకైన విద్యార్థులను ఎంచుకొనేవారు. వారి స్తోమతను బట్టి 1 నుండి 15 వరకు ఒక అనుక్రమణికను ఏర్పరచుకొనేవారు. అదేవిధముగా ఆ మిమిగిలిన 285 మందిని చదువులో వారి స్థాయిని బట్టి 15 విభాగాలు చేసేవారు. అప్పుడు ఒక్కొక్క విభాగానికి 19 విద్యార్థులు వుంటారు. అంటే ఈ కాలములో లక్షలు కట్టి చదివించే Corporate Schools లాగానే! అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థికి విలోమము (Inverse) గా, చదువులో  పూర్తి  వెనుకబడిన గుంపును (సమూహమును) ఒప్పజేప్పేవారు. అప్పుడు 15 వ వ్యక్తి మరియు ఆ 15 వ సమూహము మధ్యన ఆంతర్యము తక్కువగా వుంటుంది. అంటే మొదటివాడు తన సమూహమునకు అధ్యాపకుదౌతాడు 15వ వాడు తన గుంపునకు విమర్శకుడౌతాడు. వారు ఎక్కువగా చర్చలలో పాల్గొంటారు. వారి నాయకునికి కూడా సందిగ్ధత ఏర్పడితే తమ అధ్యాపకులు లేక ఆచార్యులవద్ద నివృత్తి చేసుకొంటారు. ఇంత సుగమమైన విధానము నేటి విద్యావిధానములో  చూడగలమా! 
మిగిలినది వేరొకసారి ........
విద్యా వ్యవస్థ నాడు నేడు -3
కాంగ్రెస్ మరియు జనతాదళ్ మంత్రివర్గములో ఉన్న ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ మన సంస్కృతిని, మన శాస్త్ర విజ్ఞానమును ఎంతగానో ప్రశంశిచుతారు. ఆయన గొప్ప వక్త. ముస్లిం అయి ఉంది కూడా మన ఇతిహాస పురాణములు చదువుట ఆయన జిజ్ఞాస. మనలో ఎంతమందికి ఆ పట్టుదల వుంది. ఆస్య గ్రంధిలో వ్రాసే అంశములనే చదివే అలవాటులేని మనము పురాణేతిహాసాలను ఏమి చదువుతాము. మనము జీవితమును Enjoyment కు అంకితము చేసిన వారము. విజ్ఞాన సముపార్జనాను Enjoyment గా తీసుకొన్నవారి విజ్ఞతకు నమస్కారము. ఈ విషయము అప్రస్తుతమేమో అన్న అనుమానము మీకు ఈపాటికే కలిగియుండవచ్చు. ఎందుకు చెప్పినానంటే మీరు కూడా శ్రీయుతులు ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ గారి లాగా అన్య మత గ్రంధములు, మన పురానేతిహాస శాస్త్రములు చదివితే మన సంస్కృతి విద్యావిధానము, సకల శాస్త్ర ప్రజ్ఞ తెలుసుకోన్నవారవుతారు. Gosip Columns చదివితే మనసు అల్లకల్లోలము చేసుకొనుట తప్ప ఆవగింజంత కూడా అవసరమైన విషయమును గ్రహించలేము. అందుకే ఈ విషయము తెలిపినాను.
తిరిగీ అసలు విషయానికి వస్తే మన పూర్వులను విద్యాపరముగా సంస్కృతి పరముగా నిర్వీర్యులను  జేసి మనలను వాజమ్మలా జేసినా మెకాలే ను గూర్చి చెప్పవలసియుంటుంది.  థామస్ బాబింగ్టన్ మెకాలే (25 అక్టోబర్ 1800 28 డిసెంబరు 1859) (లార్డ్ మెకాలేగా ప్రఖ్యాతుడు). బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనకాలంలో భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెట్టడం వెనుక అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన తన  Minute on Education (1835) లో ఈవిధముగా చెప్పినాడు:
మనకు(బ్రిటీషర్లకు)న్న పరిమిత వనరులతో, మొత్తం ప్రజాసమూహాన్ని(భారతీయులు) విద్యావంతులను చేయడం అసాధ్యం. మనం ప్రస్తుతం, మనకు మనం పరిపాలించే లక్షలాది మంది ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పనిచేసే సమూహాన్ని, రంగులోనూ, రక్తంలోనూ భారతీయులైనా అభిరుచులు, ఆలోనలు, నీతి, మేధస్సులో ఆంగ్లేయులు అయిన సమూహాన్ని తయారుచేయడంలో అత్యుత్తమ స్థాయిలో కృషి చేయాలి.
మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ (1835).
ఆయన తన రిపోర్టులో ఇంకా ఏమి చెప్పినాడో ఆంగ్లములోనే యథాతథముగా ఉంచుతాను.
I have never found one among them who could deny that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia. The intrinsic superiority of the Western literature is indeed fully admitted by those members of the committee who support the oriental plan of education.
When we pass from works of imagination to works in which facts are recorded and general principles investigated, the superiority of the Europeans becomes absolutely immeasurable. It is, I believe, no exaggeration to say that all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the paltriest abridgments used at preparatory schools in England.
I doubt whether the Sanskrit literature be as valuable as that of our Saxon and Norman progenitors. In some departments-- in history for example-- I am certain that it is much less so.
ఈయన మనోభావమును ఆయనే చెప్పిన ఈ మాట వివరముగా తెలియజేస్తుంది.
"I am very much pleased that the nation seems to take such interest in the introduction of Christianity into India."
Thomas Babington Macaulay (1800-1859) whose life and work were interwoven with India.
భారత దేశము భారతీయులు అన్న విషయములపై ఆయన అభిప్రసయము 'Life and Letters of Lord Macaulay' అన్న పుస్తకము చదివితే అవగతము కాగలదు.
నిజానికి మెకాలే కంటే 12 సంవత్సరములకు పూర్వమే రాజా రామమోహన్ రాయ్ బ్రిటీషు ప్రభుత్వానికి, అప్పటి వరకూ వస్తూవచ్చిన సంస్కృత విద్యామాధ్యమానికి బదులుగా ఆంగ్లమాధ్యమాన్ని ప్రత్యామ్నాయ విదానముగా సూచించినాడు. ‘ఇంట్లోవాడు పెట్టేరా కంట్లో పుల్ల’ అన్న సామెతను రుజువు చేసిన మహానుభావుడు ఆయన. కాలానుక్రమముగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు  సంస్కృత గ్రంధాలను మన దేశము నుండి తరలించివారి  విద్యా విజ్ఞానములను సుసంపన్నము చేసుకొని మనకు ఆంగ్లమును అంటించినారు. ఇపుడు మన నుండి సంస్కృతము ద్వారా గ్రహించిన విజ్ఞానమును తిరిగీ ఆంగ్లమునకనువదించి వారి అద్భుత మేధా సంపత్తిగా మనకు అందించినారు. మరి రామమోహన్ రాయ్ మనకు ఆరాధ్యుడెటులైనాడు. ఆయన సతీసహగమనమును మాన్పించినట్లు చదువుతాము మన పాఠ్యాంశములలో . ఇందులోని నిజానిజాలు ఎంతో విస్తారముగా నేను వ్రాసిన ‘సరసరస’ అన్న వ్యాస సంపుటిలో తెలియజేసినాను.

ఇపుడు, అర్దాన్తరముగా అనుమానాస్పదస్థితిలో అసువులు బాసిన ఒక ఆదర్శప్రాయుడైన అమరపురుషుని గూర్చి అతి క్లుప్తముగా తెలుసుకొందాము.
రాజీవ్ దీక్షిత్ జన్మదినం 1967 నవంబర్ 30న  ఉత్తర్ ప్రదేశ్ లోని నాహ్ గ్రామము నందు  రాథేశ్యాం దీక్షిత్ , మిథిలేష్ కుమారి దంపతులకు జన్మించినాడు.
తల్లితండ్రుల సంరక్షణలో మాధ్యమిక విద్యను ముగించిన తరువాత 1994లో అలహాబాదుప్రయాగ లోని ఐ.ఐ.టి.ఇన్స్టిట్యూట్ లో బి.టెక్ చదివినారు. తరువాత ఐఐటీ కాన్పూర్ లో శాటిలైట్ కమ్యూనికేషన్‌లో యం.టెక్‌ చేసినారు. ఆపై  ఫ్రాన్స్‌లో టెలికమ్యూనికేషన్‌లో పిహెచ్‌.డి. చేసినారు. తరువాత ఒకప్పటి భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్‌తో కలిసి సి.ఎస్‌.ఐ.ఆర్‌.లో శాస్త్రవేత్తగా కూడా కలిసి పనిచేయటం జరిగింది.
స్వామి వివేకానంద భారతదేశానికి  నూతన శక్తిని ఇచ్చిన  విధంగా తన ప్రసంగాల ద్వారా యువతలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని, ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేసినారు. మాతృభాష పై మమకారముతో ఆంగ్లములో కాకుండా, విదేశాములలో కూడా హిందీలోనే మాట్లాడిన దేశాభిమాని. స్వదేశీ చికిత్స పేరుతో ‘చరకుడు’  'వాగ్భటుడు' మొదలైన మహర్షులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జన బహుళ్యంలో ప్రచారం చేసి, అల్లోపతిలో లక్షలు పోసినా నయం కానీ అనేక వ్యాధులకు సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు ఆయన.  రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పిణ వ్యక్తి. జీవితాంతమూ బ్రహ్మచార్యమునే అవలంబించిన శ్రేష్ఠుడు. ఆయన  జన్మించినది 30 నవంబరు అయితే, మరణించింది కూడా 30 నవంబరు కావడం విచిత్రము. 30-11-2010న ‘భారత స్వాభిమాన్‌’ ప్రచార యాత్రలో భాగముగా చత్తీస్‌ఘడ్‌ లోని బిలాయ్‌ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణించినారు.
ఈ విషయము ఈ వ్యాసములో అసంగతమని తలచేవారికి నా సమాధానము ఏమిటంటే అంత చదివి అంత హోదాలో ఉందికూడా వానిని తృణ ప్రాయముగా నెంచి దేశ యువత కోసం పాటుబడిన ఆ మహనీయుడు యువతకు ఆదర్శము కావలెనన్నది నా అభిమతము. అందుకే తేలిపినాను.


బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఏవిధముగా నాశనము చేసినారు అన్న విషయమును ఆయన భాషణమునకు తెనుగుసేత ఈ క్రింద పొందుపరచి ఈ వ్యాసమునకు భారత వాక్యము పలుకుతాను.
మిగిలినది వేరొక మారు.......
 విద్యా వ్యవస్థ నాడు నేడు - 4
ఈ విషయమై ఎంతో కృషిచేసి ఎంతగానో విషయసేకరణ గావించి అనుమానాస్పద స్థితిలో మరణించిన స్వర్గీయ రాజీవ్ దీక్షిత్(Social activist, Bharat Swabhiman Andolan) ఉపన్యాసము నుండి నాకు అవసరమైన  మేరకు అనువదించుకొని, నా అభిప్రాయములను జోడించి మీ ముందుంచుచున్నాను.
భారతీయ సంస్కృతిని నాశనము చేయుటకు థామస్ బాబింగ్టన్ మెకాలే అనే వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశానికి పంపించటము జరిగింది. మెకాలే భారతదేశమునకు వచ్చి దేశాముయోక్క పొడవెడల్పులు (బహుశ 18 సంవత్సరాలేమో!)  సంవత్సరములు తిరిగి survey చేసిన తరువాత ఒక Report తయారుచేసినాడు. దానిని British Parliament కు వినిపించినాడు. నేటికీ అది భద్రముగా వారి Records, దానిని Hansard అంటారు, లో ఉన్నది. దాని ముఖ్యమగు సారాంశము ఏమిటంటే భారతదేశ సంస్కృతి, విద్యా వ్యవస్థ ఇక్కడ ఉండే గురుకుల పాఠశాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశంలో ఉండే పాఠశాలలను అప్పుడు గురుకులములని పిలిచేవారు. 1835 లో మెకాలే ఆదేశముల మీదుగా 1500 మంది పరిశీలకులు మనదేశములోని లో విద్యా వ్యవస్థను గూర్చి క్షుణ్ణముగా తమ సర్వేక్షణమును నిర్వహించినారు. దానినుండి తెలిసినది ఏమిటంటే భారతదేశము యొక్క విద్యావిధానము గురుకులాశ్రమ పద్దతిలో నిర్వహింపబడుతూ వుంది. ఈ పాఠశాలల యందలి బోధనా విధానమును గూర్చి కూడా ఎంతో పరిశోధించినారు. ఆ మెకాలే Report లోని ఒక భాగము యొక్క సారాంశము ఈ దిగువన ఇవ్వబడినది.
Report ప్రకారము 1835 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక లక్ష 50 వేల కాలేజీలు/కళాశాలలు ఉండేవి. నేను అప్పటి British Land Revenue Records ను భారతీయ గ్రంధాలయ కార్యాలయము నుండి తీసుకుని 1853/1840 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో  మొత్తము ఎన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి అని తెలుసుకోవడానికి చూసినాను.  ఆ రికార్డుల ప్రకారము మొత్తం 1 లక్ష 57 వేల పల్లెటూళ్ళు మరియు ఒక లక్ష 50 వేల కాలేజీలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. అంటే సరాసరి చూసుకుంటే ప్రతీ ఊర్లో ఒక కాలేజీ ఉండేది. దాన్ని బ్రిటీషు పరిభాషలో చెప్పాలి అంటే Higher learning institutes అంటే చిన్న చిన్న పాఠశాలు కాదు. స్కూళ్ళ విషయానికి వస్తే ప్రతి ఊర్లో రెండు మూడు ఉండేవి. ఈ 1 లక్ష 50 వేల కాలేజీలలో (కాలేజీ అన్న పదము నేటి వ్యవహారములో ఉన్నది కాబట్టి పూర్వ నామములకు బదులుగా వాడుత జరిగినది.) ఏ ఏ విషయములను బోధిస్తున్నారు అన్న విషయమై వారు చేసిన సర్వే ప్రకారం 1500 శస్త్ర చికిత్స/సర్జరీ కాలేజీలు వుందినవట. ఇవి కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలోనివి మాత్రమే భారత దేశం మొత్తం కాదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీ కాలేజీలలో చదువుకునే వారు మంగల జాతి వారు. బ్రిటీషు వారి పుణ్యమా అంటు మన దేశంలో శూద్రులుగా వర్గీకరించిన కులాలవారలను చదువుకోనివ్వలేదు అన్న ఒక అపప్రథ మన దేశములో ఉన్నది. మరి మంగల జాతివారు  సర్జన్స్ అయినప్పుడు తక్కువ జాతి వారు చదువుకోలేదు, లేక చదువుకోనివ్వలేదు అన్నది అసంగతము కాదా! ! వారి సర్వే ప్రకారం ఆ కాలేజీలలో 70% శూద్రులు, 30% మంది బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విద్యను అభ్యసించేవారు. దీనినిబట్టి దేశములో విద్యావిధానములో ఎంత సామరస్యత ఉండినదో మనము అర్థము చేసుకొనవచ్చును.
ఇక్కడ రాజీవ్ దీక్షిత్ గారి మాటను పుష్టి చేస్తూ నేను ఒక చారిత్రిక వాస్తవమును తెలియజేస్తాను. హైదరాలీతో యుద్దముచేసి జనరల్ కూట్ పట్టుబడునపుడు అతనికి ఏమి శిక్ష విధించవలెను అన్న విషయమై సభలో, హైదరాలీ ప్రశ్నించగా చంపవలెనని సభాసదులు చెప్పగా ఆయన ముఖ్య మంత్రి ముక్కుకోయుట వధించుటకు సమానము, కావున ముక్కు కోసి పంపుదామని అంటే అట్లే చేసి పంపినారు. ఆ ఆంగ్లేయుడు తెగిన ముక్కును చేతబట్టుకొని గుర్రముపై నెమ్మదిగా వస్తూవుంటే, ఆతని స్థితిని చూసి ఒక నాగరికుడు, కూట్ చెప్పిన అవాస్తవ విషయమును నమ్మి అతనిని ఒక వైద్యుని వద్దకు పిలుచుకుపోతే ఆ శస్త్ర చికిత్సా నిపుణుడు ముక్కును యదాస్థానములో ఉంచి తెగిన నరములను సక్రమముగా అతికించి శ్వాస క్రియకు అంతరాయము లేకుండా చేసినాడట. ఆ వైద్యుడు మంగలివాడు. అసలు మగలము అంటేనే (సంస్కృతములో ‘ళ’ లేదు) శుభము అని అర్థము. ఆమాట నేడు ఉపయోగించకూడనిదైపోయింది.
ఇంకొక విషయము, మా అమ్మమ్మకు అమ్మమ్మ విధవరాలు. ఆ కాలములో మంగలివారిచె వారు గుండు గీయించుకొనేవారు. ఒకరోజు ఇంటికి మంగలి వచ్చిఉంటే ‘ఒరే! (వాత్సల్యముతో) నాకు శుక్లము వచ్చినది. నీకు తీరుబాటు ఉన్నపుడు వచ్చి తీసిపో!’ అన్నదట. అతను ఇంటికేవచ్చి ఆమె శుక్లము తీసివేస్తే ఆమె వద్ద ఆతను తీసుకొన్నది వక్క, ఆకు, ఒక పావులా(25 పైసలు). ఆ సామర్థ్యము ఆనాడు ఒక సాధారణ మంగలికి ఉండేది. ఈ రోజు అదేపనిని  Ophthalmic (Eye) Surgeon అన్న క్రొత్త నామకరణము చేసుకొని రూ.50 వేల చొప్పున ఒక్కొక్క కంటికి ఖర్చు చేయించుచున్నారు. శరీరముపై చర్మము తొలగించే శస్త్ర చికిత్స చర్మకారులు (మాదిగవారు) చేసేవారు. మనలను తప్పుదారి పట్టించి ఈ బ్రిటీషువారు ఎంతటి ద్రోహము చేసినారో గమనించండి. వర్ణములలో పెద్ద చిన్న లేదు. ఎవరి బాధ్యత వారిది. అంతే!
అసలు విషయానుకి వస్తే, రాజీవ్ దీక్షిత్ గారు ఈ విధముగా అంటూ ఉన్నారు. ‘ఆ సర్వేరిపోర్ట్ లోని ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలో ఉండే శూద్ర జాతి వారి చేతిలో గొప్ప టెక్నాలజీ/విజ్ఞానం ఉండేది. ఇది నా రిపోర్ట్ కాదు బ్రిటీషు వారి రిపోర్ట్. ఇప్పుడు కూడ మీరు మద్రాసు కు వెళ్ళి చూస్తే  "పెరియార్" అనే జాతివారు ఉంటారు. వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రిటీషు వారి సర్వే ప్రకారము మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే 2200/2300 Architect /భవన నిర్మాణ కాలేజీలలో  ఉపాధ్యాయులు/ఆచార్యులు ఆ పెరియార్ జాతి వారే. అక్కడ వాస్తు కళ, భవన నిర్మాణమును గురించి చదువుకున్నది పెరియార్ జాతి వారే. దక్షిణ భారతదేశము లో మనము చూసే ఆలయాలు  మీనాక్షిపురము, మదురై వంటివి అన్నీ పెరియార్లు కట్టించినవే. నిర్మాణ పరంగా చూసినా, డిజైన్ పరంగా చూసినా అటువంటి ఆలయాలను మనం ఉత్తర భారతదేశంలో చూడలేము. వాటన్నిటిని పెరియార్లు    కట్టించేవారు. పెరియార్లు అనబడే వారి పని మందిర నిర్మాణం. కాని 1890 తరువాత బ్రిటీషు వారు పెరియార్లను నాశనం చేయతం జరిగింది. ఎ. ఓ. హ్యూం అనే ఆఫిసర్ మద్రాస్ ప్రెసిడెన్సీ కి కలెక్టరుగా     ఉండేవాడు. ఆ అదికారంతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఒక చట్టాన్ని సృష్టించాడు. అప్పటిదాకా మందిర నిర్మాణం పెరియార్లు చేశారు కాని ఎ. ఓ. హ్యూం చట్టం ప్రకారం పెరియార్లు మందిర నిర్మాణం      చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. అలా పెరియార్లు మందిర నిర్మాణం చేయకుండా అపివేయటం జరిగింది. ఫలితంగా పెరియార్ జాతి వారు తక్కువ అవుతూ వచ్చినారు.      వృత్తి రీత్యా వర్ణ విభజన జరిగినది మనదేశములో! వృత్తి మెళుకువలు పారంపరీకముగా ఆ రోజులలో అందజేస్తూ పోయినారు. అందుకే బ్రిటీషు రానికి అగ్గిపెట్టెలో 9 గజముల చీరను ఉంచి ఇవ్వగాలిగినారు నాటి వస్త్ర శిల్పులు అనగా సాలేవారు. ఇది మనకు గర్వకారణము కాదా! నేడు అంతటి ప్రతిభ మన వారిలో వున్నదా! ఎవరు చూసినా చాతుర్వర్ణ విభజన మంచిది కాదు అనుట తప్ప ఇందులోని గొప్పదనమును గ్రహించినవారు ఎంతమంది. ఆమాటకొస్తే ఇది విద్య కాదా! మరి వీరిని నిరక్షరాస్యులుగా పరిగణించవచ్చా! బ్రిటీషు వారు ఈ విధముగా భారతీయ సమాజమును, భారతీయ విద్యావిధానమును  ఛిన్నా భిన్నము చేసినారు.  

(స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ ఉపన్యాస అనువాదము)     
మిగిలినది ఇంకొక సారి ............
విద్యా వ్యవస్థ నాడు నేడు - 5
ఇక నేటి చదువుల తీరు తెన్నులు చూస్తాము. మన దేశ విద్యావ్యవస్థను, నాటి ఆంగ్లేయ పరిపాలనా     వ్యవస్థలోని మన బలహీనతలను ఆసరా చేసుకొని  మన సమున్నత విద్యావిధాన ఆకాశ హర్మ్యమును  మెకాలే నేలమట్టము  ఎంతగా చేసినాడంటే ఈనాడు మన పిల్లలు భూతద్దము పెట్టివెదకినా   మూలములు ఏమాత్రమూ తెలుసుకోలేనంత. మరి తక్షణ కర్తవ్యము ఏమిటి అంటే విద్యా వ్యవస్థ యొక్క  పునర్నిర్మాణము. పడగొట్టుట సులభము కానీ కట్టుట ఎంతో కష్టమైనపని .  దీనికి ముఖ్యముగా ప్రభుత్వ   విద్యా యంత్రాంగమునకు కావలసినది చిత్తశుద్ధి, పరిశీలన, పట్టుదల. దానికి తోడుగా ప్రజల సహయోగము కలిసితే  మనము మన పూర్వ విద్యావిధానమునుండి ముఖ్యమయిన విషయములను అవసరమగు మార్పులతో గ్రహించవచ్చును. అసలు విద్యకే తలమానికమగు గణితము లోని మెళుకువలను నాటి గణిత శాస్త్రములో మనము ఎన్నియో చూడవచ్చును.
నేను పైన చెప్పిన విధముగా గురువు, ఉపాధ్యాయ మరియు ఆచార్యులకు ఎంతో విషయ పరిజ్ఞానము, బోధనా పటిమ, విద్యార్థుల లోని అవగాహనా సామర్థ్యమును గ్రహించగల్గుటకు తోడుగా తాము ఆచరణ యోగ్యము, అనుసరణ యోగ్యము అగు నైతిక ప్రవర్తన కలిగియుండుట మిక్కిలి అవసరము.
 దీనినిబట్టి ఆలోచించి నేటి బోధనా విదానముతో పోల్చితే, చదువులో లోపము ఉందని అనుటకంటే   చెప్పే విధానములో ఉంది అని అనిపిస్తుంది. సమాజాన్ని నాశనం చేస్తోంది విద్య కాదు, విద్యను ఏ సందర్భంలో, ఎలా అందిస్తున్నామన్నదే. విద్యార్థి బుద్ధి స్వచ్ఛమైన తెల్లగాగితము వంటిది. దానిపై వ్రాసే ప్రతి అక్షరమూ ఎంతో అందముగా ఉంటూ ప్రగతి హేతువగు  విషయానుక్రమనిక కలిగియుండుట ఎంతో అవసరము.
విద్య  మనుగడ కోసము మాత్రమే కాకూడదు. అది విద్యార్థుల ధృక్పథములను విశాలము చేయుటకు ఉపయోగపడితేనే తనకు, సంఘానికి, దేశానికి ప్రయోజనకారియౌతుంది. నేటి యువతలో విద్య ఈ ప్రపంచము  నుండి డబ్బులు పిండుటకు మాత్రమేనన్న ఒక నిశ్చితాభిప్రాయము ఏర్పడిపోయింది. మొదట, అత్యంత ప్రమాదకరమైన ఈ దృక్పథము మారవలసియుంటుంది.  అభివృద్ధిచెందే బాలునికి అత్యవసరమైన గుణములు 1. సమాజము లేక సాటి మనుషులపై ప్రేమ  మరియు విషమ పరిస్థితిని కూడా ఎదిరించి నిలువగల సాహసము. సాహసము అన్న మాటకు అర్థము మొండితనము మాత్రము కాదు. అతనిలో నరకమును కూడా స్వర్గమును చేయగల సామర్థ్యము పెంపొందాలి.
దేశంలో 67శాతం నిరక్షరాస్యులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరు తమ తమ వృత్తులలో సరైన నైపుణ్యం చూపలేకపోతున్నారు అన్నది పరిశీలకుల అభిప్రాయము. స్థానిక ప్రభుత్వములు ఆయావర్ణముల వారికి మొదట వారిలో ఒకవేళ ఏదయినా ఆత్మన్యూనతా భావము వుంటే దానిని తొలగించి, పారంపర్యముగా సంక్రమించిన విద్యలలో ప్రత్యేక శిషణ నొసగి, తోడుగా తగుమైను అక్షరాస్యత మరియు గణితమును  నేర్పించి, తగిన పనిముట్లను ఉచితముగానో, తక్కువ వడ్డీకో పొందువిధముగా ఏర్పాటుచేసి, న్యాయబద్ధమైన కంతులరూపములో పొందు విధముగానో వారి వారి సంఘముల ఒప్పుదల మేరకు, సహాయపడగలిగితే  మనదేశ హస్తకళలన్నీ కళకళలాడుతాయి.
 ఇక విద్య విద్యార్థులను గూర్చి ముచ్చటించుకొందాము. విద్యార్థి మొదటి దశలో ఆర్జించేదే ప్రాథమిక విద్య. ఈ దశ లోనే విద్యార్థికి అక్షర జ్ఞానంతో పాటు, వినయ విధేయతలు క్రమశిక్షణ, దేశభక్తి, దేశీయ వీరుల చరిత్రలు, మన ఋషి మునుల విజ్ఞాన సంపత్తి, విశ్వ మానవులకు వారు చేసిన నిస్వార్థ సేవ, ఆడర్శప్రాయులైన భారతీయ ఇతిహాస పురాణ ప్రసిద్ధులైన రాజుల చరిత్రలు, వారి గుణ గణ విశ్లేషణ, దేశమును ఏలిన మహా పురుషులై ఉండికూడా మన దేశ చరిత్రలో స్థానము నోచుకోని విక్రమార్క, భోజ, శాలివాహన, శంభాజీ,  గురు తేగ్ బహాదుర్ సింగ్ వంటి వారాలకు సంబంధించిన పాఠ్యాంశములను జేర్చి     పెద్దల పట్ల గౌరవం, వృత్తి  నైపుణ్యానికి సం బంధించిన మౌలిక విషయముల బోధన విధిగా పాఠ్యానుక్రమణికలో చేర్చాలి. కానీ ఇవ్వాళ ఈ విదానము అటు సంఘటిత విద్యా సంస్థలలో (Corporate Educational Institutions) గానీ   ప్రభుత్వ పాఠశాలల్లో గానీ ఇలాంటి బోధన జరుగుట లేదు. No root no fruit అన్న ఆంగ్ల సామెత మనకు తెలిసినదేకదా!
కాబట్టి ప్రాథమిక స్థాయి విద్యా విధానం సరిగా లేకపోతే ఉన్నత విద్యా విధానం కూడా పటిష్టంగా ఉండదు. నేడు మన దేశంలో యూనివర్సిటీలు రాజకీ యాలకు ఆలవాలమైపోయినాయి. ‘మొక్కై వగనిది మానై వంగదు కదా’.  శాంతి భద్రతలు లేకుండా కల్లోలభరితం గా ఉన్నాయంటే దీనికి ప్రధాన కారణం మన దేశంలోని స్వార్థ రాజకీయాలు, వారు సృష్టించిన కృత్రిమ సామాజిక పరిస్థితులే కారణము.

      కొన్ని రాష్ట్ర ప్రభుత్వములు ప్రాథమిక విద్యా దశ నుండియే కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రారంభించవలెనను  ఆలోచనలో ఉన్నవి. ఈ ఆలోచన అసంబద్ధమని ఈ వ్యాస రచయితనైన నా నిశ్చితాభిప్రాయము. ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలలో, ఇంచుమించు  1965 వరకు పాఠములు తెలుగు మాధ్యమములోనే చెప్పబడేవి. ఆంగ్లము ఒక భాషగా అభ్యసింప జేసేవారు. 1962 లో కళాశాల చేరిన నాటి మాజట్టు, ఒక నెల, రెండు నెలలు ఆంగ్ల మాధ్యమమునకు అలవాటు పడుటకు పట్టినా, ఆ తరువాత మాచదువు నల్లేరుపై నడచిన బండిలాగా సాగినది. అది మా గొప్పదనము కానేకాదు. అది మన మాతృ భాష మరియు దానికి తల్లియైన సంస్కృతము యొక్క గొప్పదనము. నేను చదివిన అదే కడపలో ముస్లిం ఉన్నత పాఠశాల ఉండేది. అందు వారు ఉర్దూ భాషగానూ మిగతా పాఠ్యాంశములన్నీ ఆంగ్లములో నేర్పించేవారు. కానీ వారిలో పది శాతము మంది కళాశాలలో చేరింటే ఎక్కువ. అంటే అవగాహన, అనువర్తన  అన్నది సంస్కృతాంధ్రములు ఉగ్గుపాలతో నేర్చుకొన్నవారికి అతి సులభముగా ఏభాషయైనా ఏ శాస్త్రమైనా అందుబాటులోనికి వస్తుంది. ఎటొచ్చీ ఏకాగ్రత మాత్రముఉండితీరవలసిన లక్షణము. ఈ రోజు మాకాలము వారంతా అటు తెలుగు లోనూ ఇటు ఆంగ్లము లోనూ చక్కని అభినివేశము కలిగి ఆయా భాషలలో చక్కగా మాట్లాడుటయేగాక అంతే చక్కగా వ్రాయగలుగుచునూ ఉన్నారు.
మిగిలినది ఇంకొకసారి...... 
విద్యా వ్యవస్థ నాడు నేడు - 6 (చివరి భాగము)

నేటి విద్యా విధానములో మొదట తెలుగు అక్షరమాలకు పునర్వైభవము సిద్ధింప జేయవలసి ఉంటుంది. ‘ఱ’ ను ఒకవేళ అందుబాటునకు తేలేక పోయినా ‘ఋ, ౠ’ లు ‘ళ’ ‘క్ష’ ‘శ, ష, స’ ళ సమయానుసార ఉపయోగము ఉచ్చారణ నేర్పించావలసియుంటుంది. ‘క’ కలు ‘ష’ వత్తు ఇవ్వవలసిన చోట ఏకంగా ‘క్ష’ వ్రాస్తూ వున్నారు. చంపడము తప్పించి బ్రతికిన్చాదము తెలియని హీన పరిస్థితిలో మనమున్నాము. అమరము, ఆంధ్రనామ సంగ్రహము, మన తెలుగుకు స్వంతమైన అనేక నీతి శతకములు పిల్లలకు నిత్యపారాయనము గావించవలసియుంటుంది. ఈ వయసులో పిల్లల బుర్ర ఎంతో చురుకుగా ఉంటుంది. ఇవన్నీ నేర్చుకొని తల్లిదండ్రులు పిల్లలను youtube ఎదుట కూర్చోబెట్టియైనా నేర్పించ వచ్చును. అసలు నేను మాకాలములో క్రెచ్చులు కేజీలు లేకుండా ఏకంగా 6వ తరగతిలో చేరినాను. ఈ కాలము, పిల్లల బెడద తప్పించుకొనుటకు వారి తల్లిదండ్రులు,  3సంవత్సరములకే లక్షలు కట్టి స్కూల్ లో బహుశ వేస్తున్నారేమో!
ఇక సంఘటిత విద్యా సంస్థల (Corporate Educational Institutions) ను గూర్చి మాట్లాడుకొందాము. ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రములను దృష్టిలో ఉంచుకొని ఈ విషయమును వ్రాస్తూ వున్నాను.
మన రెండు తెలుగు రాష్ట్రములలో భూమి అట్టడుగునకు వ్రేళ్ళూనిన Private Junior Colleges మరియు High Schools ఉన్నాయి. అందు ఫీజులు పేద, దిగువ మధ్యతరగతికి అందని పళ్ళు. ఇటువైపు ఈ కళాశాలలను రెండు రాష్ట్రములలో విస్తృతముగా నడుపుచూ గత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గములో ఈ కాలేజీలలోని ఒక కాలేజీ అధినేత మంత్రిగా కూడా ఉన్నాడు, మాయా బజారులోని ‘అదిస్వాహా, ఇది స్వాహా’ అన్న మాటను గుర్తుచేస్తూ. ఉత్త చేతితో మూర వేయటము మొదలుపెట్టి ఈనాడు ఊహకందని ఉన్నతమైన స్థితినిబొంది వేలకోట్లు గడించినాడు. ఆయన బహుశ ఆలోచించని విషయము ఏమిటంటే ఈ సంపదనంతా తనవెంట తీసుకుపోవుట లేదని. ఆనాడు నా ఈడువారు ఒక తరగతికి, ఒక సంవత్సరమునకు రూ.10 High School చదువుకు ఖర్చు పెట్టే వారు. మా కాలమునాటి Standard అన్నా ఉందా అంటే అదీ లేదు. తెలుగులో పూరు ఇంగ్లీషులో వీకు. తల్లిదండ్రులు ఖర్చు ఎందుకు పెట్టినారు అంటే దేవునికి తప్ప ఖర్చు పెట్టినవారికి తెలియదు.
ఇక ఈ కాలేజీలు అమాయకులను ఎట్లు దోచుకొంతూవుందో చూద్దాము. Intermediate Results వచ్చిన వెంటనే తాటికాయలంత అక్షరాలతో రెండు రాష్ట్రాలలో ఉండే మొత్తము విద్యాసంస్థలలో  కొన్ని లక్షలమంది చదువుతూ వుంటే వారిలో రాంకులు వచ్చిన ఒక 500 మంది పేర్లు రాంకులు News Papers లోadvertise చేస్తూ , TV లలో ప్రళయకాల మేఘ గర్జనలు బోలె అరుస్తూ వుంటారు. కానీ లక్షలు పోసి కూడా ఏ Rank రాని విద్యార్థులను గూర్చిగానీ,  రాక పోవుటకు గల కారణాలు కానీ తెలుపుతూ వున్నారా! అటువంటి ఏ  విద్యార్థి\విద్యార్థినుల తలిదండ్రులు ఆయా కళాశాలల యాజమాన్యమును నిలదీసి అడుగుతున్నారా! పిచ్చి పట్టిన విద్యార్థులను గూర్చి ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థులను గూర్చి మనము తెలుసుకొంటున్నామా! దశాబ్దాలుగా విద్య వ్యాపారమైపోయింది. విద్యా విలువలు దిగజారి పోయినాయి. ఆ కళాశాలలలో ఎన్నో విధములైన వివక్షలు, ఎన్నోవిధములయిన పక్షపాతములు ఎవరి చేవినయినా పడుతూ ఉన్నాయా! మరి ఈ తిని కక్కే చదువులకన్నా తినకుండానే ఉంటె మంచిది కాదా! లేక తిని అరిగించుకొనే విద్యను ఆలోచించరాదా!
కొత్తగా మోడల్ స్కూళ్లు పెట్టి కేజీ టు పీజీ విద్యా విధానం ప్రవేశపెడితే ఇప్పుడున్న ప్రాథమిక పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతాయనే అభిప్రాయం ఉన్నది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పనిజేసే  ఉపాధ్యాయులకు  వేతనములు, పూర్వము వలె కాకుండా సంతృప్తికరముగా వస్తూవున్నాయి. కానీ వారిలో చెప్పవలేనన్న ఉత్సాహమును రేకెత్తించే విధముగా పాఠశాల  పర్యావరణము గానీ, తగిన  ప్రయోగశాలా సౌఖర్యములు గానీ, ఈ పరీక్షలలో తిని కక్కే విధానము కాకుండా తగు సంస్కరణలతో మన పూర్వ విద్యా విధానమును ప్రవేశ పెట్టుటగానీ, సర్వ శాస్త్ర సమన్వితమైన సంస్కృత విద్యా బోధనను  
పునః ప్రతిష్ఠించుటగానీ ఉమ్మడిగా ప్రవేశపెడితే కలిగే ఉత్తెజముతో ఉపాధ్యాయులు తప్పక తమవంతు కృషి  చేస్తారు.
ఉమ్మడి ప్రభుత్వాలు పాలనాపరంగా కానీ, బడ్జెట్ కేటాయింపు విషయాల్లో కానీ యూనివర్సిటీ,  కళాశాలల విద్యకు ఇచ్చే ఆదరణ, ప్రాముఖ్యం ప్రాథమిక, సెకండరీ విద్యలకు ఇవ్వలేకపోయినాయి. అందుకే ప్రాథమిక విద్యా రంగాన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు హస్తగతం చేసుకొని కావలసినంత సొమ్ము  చేసుకొన్నాయి, చేసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నేడు వాడ వాడలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం తెలుసుకొని ప్రభుత్వాధికారులు సరైన చర్యలు  తీసుకోవాలి. ప్రభుత్వమూ, విద్యాశాఖ సహాయ సహ కారాలు లేకుండా వీరు ఇంతగా విస్తరించడానికి అవ కాశాలు లేవు. మరో వైపు ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు, విద్యా వ్యాపారులు ప్రభుత్వ విద్యా  విధానాలనే ప్రభావితం చేసేంతగా ఎదిగిపోయారంటే అతిశయోక్తి కాదు. ప్రైమరీ స్కూల్ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి 25 వేలు మొదలు 50 లక్ష రూపాయల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఈ విద్యా సంస్థల్లో దోపిడీ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వములూ  ఈ విద్యావ్యాపారాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకో వలసిన అత్యంత అవసరం ఎంతైనా ఉన్నది. ప్రైమరీ, సెకండరీ స్థాయిలోని విద్యా వ్యవస్థలోని మూలాలను పెకిలించి సంస్కరించకుండా.. కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే దాని ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది.

విద్యావంతులయిన ఆరోగ్యవంతులగు దేశాభిమానము, దేశీయ శాస్త్రాభిమానము కలిగిన విశ్రాంత అధికారులు  తమ తమ గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఒక పాఠశాలను ను దత్తత తీసుకొని, అంటే సమయ పట్టిక (Time Table) ను కుదించియో లేక వారములో రెండు రోజులు అదనముగా భోజనానంతర మధ్యాహ్న సమయములో మనదేశ నిజ చరిత్ర, మన పూర్వుల శాస్త్ర వైదుష్యము, మన సంస్కృతము యొక్క గొప్పదనము, మన మహావీరులగు రాజుల చరిత్రలు, నాటి కవుల ప్రతిభావ్యుత్పత్తులు ఉత్సాహపూరిత రీతిలో పిల్లలకు తెలుపుతూవుంటే దేశ యువతకు, దేశ భవితకు ఎంతో మేలుచేసిన వారౌతారు. ప్రభుత్వము పైనే అన్నిటికీ ఆధారపడకుండా  ఈ జ్ఞానాన్విత వయోవృద్ధులు, తమ ధనమును వితరణతో కూడిన విధముగా ఖర్చుచేయ సంకల్పము కలిగినవారు,  ఆ స్కూళ్లలో ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు ప్రణాళికలు రచయించి నేరవేర్చవచ్చును. ఆవిధముగా కొంతకు కొంత దేశ ఋణమును కూడా తీర్చుకొన్నవారు కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనం విషయంలో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యంతో భోజనం పెట్టడం హర్షణీయం. విద్యార్థు లు మధ్యాహ్న భోజనం కోసమే స్కూల్‌కు వస్తున్నారం టూ ఆ మధ్య పలువురు చేసిన వ్యాఖ్యలు బీద విద్యార్థుల ను అవమానపరిచేలా ఉన్నాయి. వారినలా చిన్నచూపు చూడటం సరికాదు. నిజానికి ఇంకా మన సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నందుకు తలదించుకోవాలి.

దేశంలో ముఖ్యంగా గ్రామాల్లో, బస్తీల్లో, మురికి వాడ ల్లో నిరక్షరాస్యులు ఎక్కువున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో 67శాతం నిరక్షరాస్యులు ఉన్నట్లు లెక్క లు చెబుతున్నాయి. కాబట్టి వీరంతా ఓటు బ్యాంకు రాజ కీయాలతో మోసపోతున్నారు. ఇలాంటి స్థితి లో ప్రజా స్వామ్యం సరైన పద్ధతిలో వికాసం చెందడానికి గాను, వారికి, చిన్న చిన్న సభలను నిర్వహించి, తామేట్లు మోసపోతున్నాము అన్న విషయములు తెలియజేస్తే ఎంతో బాగుంటుంది. వారికి అవసరమైన మేరకు విద్యా బోధన చేసే ఆలోచనను కూడా చేయవలసిన అవసరము, దానిని ఆచరించవలసిన అవసరము ఎంతో ఉంది. అంతేగాక వీరు తమ తమ వృత్తులలో సరైన నైపుణ్యం చూపలేకపోతున్నారు. కాబట్టి అందుకు తగిన విధముగా నిరక్షరాస్యత శాతాన్ని గణనీయంగా తగ్గిం చేందుకు ప్రభుత్వ సహాయముతో  కృషిచేస్తూ, వారికి తగిన ఆధునిక ఉపకరణములను అందజేయుట మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును అందుబాటులోనికి తెచ్చుట అన్నవి చేయగలిగితే తప్పక దేశము పురోగమించుతుంది. దేనికయినా పట్టు వదలని పట్టుదల అవసరము. అలాగే విద్యార్థుల విషయములో కూడా ప్రాథమిక విద్యాస్థాయి నుండీ విద్యా ప్రమాణాలు ఉన్నత స్థితిలో  ఉండేలాగున చూడాలి. చదవడం, వ్రాయడం లాంటి నైపుణ్యాములతో  బాటు మన పూర్వులు నిత్యావసరముల విషయములో పరస్పర సహకారముతో ఏవిధముగా నడచుకోనేవారు అన్నది తప్పక తెలియజేయవలసియుంటుంది. ఉన్నతంగా ఉన్నప్పుడే ఉన్నత విద్యలో విద్యార్థులు రాణించగలుగుతారు.

వీలైనంత వరకు విద్యాబోధనను మాతృ భాషలో గరుపుటకు ప్రాధాన్యం ఇచ్చి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య ఇంగ్లీషులోనే విద్యాబోధన జరగాలని, అది మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరు స్తుందనే విధంగా చెప్పుకొస్తున్నారు. అది పూర్తిగా వాస్తవం కాదు. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం నేటి సమకాలీన పరిస్థితుల్లో అత్యవసరమే కానీ, అది లేని చదువు చదువే కాదన్నది మాత్రం అంగీకరించదగింది కాదు. ఏది ఏమయినా సమర్థ భారతము ఏర్పడుటకు  సమిష్టి కృషి ఎంతయినా అవసరము.

స్వస్తి.



Friday, 21 June 2019

డాక్టర్ లలిత-(డాక్టర్) శ్రీవాణి


డాక్టర్ లలిత-(డాక్టర్) శ్రీవాణి


భేషజమునకు పోకుండా, అహంకారము లేకుండా ఆత్మ సాక్షిని అనుసరించి పోయే వారిలో శ్రీమతి డాక్టర్ అయ్యగారి లలతా ఫణికుమార్ ఒకరు,  శ్రీమతి (డాక్టర్) అన్నం  శ్రీవాణి అర్జున్ ఇంకొకరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయమునకు డాక్టర్ లలిత నాయిక.  శ్రీమతి శ్రీవాణి సహనాయిక.
ఈ ఇద్దరు మానసిక పుత్రికలద్వారా నాకు లభించిన గౌరవము నేను పదిమందికీ తెలుపుకొనక పోతే హీన పశు సమానుడనే. నేనూ మనిషినే అని అనిపించుకొనుటకు ఈ యదార్థమును మీ ముందుంచుచున్నాను.
నేను పాటలు, పద్యములు, వ్యాసములు, కథలు, హాస్య ఖండికలు మొదలగు ఎన్నో దైవ సంబంధమైన, చరిత్ర సంబంధమైన, శాస్త్ర సంబంధమైన, మనదేశపు వీరవిక్రమ విభూషితులైన మహారాజుల పైన, తమ సాధనా సంపత్తితో పరమాత్మ సాయుజ్యము పొందిన సత్పురుషులపైన, ఎన్నో విషయములను 2013 నుండి ఆస్యగ్రంధి మాధ్యముగా తెలుపుచూ వస్తూనే వున్నాను. ఓపికతో చదివినవాళ్ళు ఎందఱో వున్నారు. అట్లని చదవని వాళ్ళు లేరా అంటే,  వాళ్ళు అంతకంటే ఎక్కువగానే ఉన్నారు. 'నా రచనలు వస్తు ప్రాముఖ్యత మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ స్వోత్కర్ష ఎందుకు అనుకొంటున్నారేమో, నేను పంచబోయే ఆనందమయ అనుభవానికి ఇది ఆలంబనము.
నా బిడ్డలు గా భావించినాను కాబట్టి ముందుముందు లలిత, వాణి అని వారిరువురిని సంబోధించుతూ  వారిని గూర్చి వ్రాస్తాను. అన్యథా భావించవద్దు.
లలిత నాకు 2004 నుండి పరిచయము. ఆమె విషయములో, భారతీయ వార్దుషి లో (In State Bank Of India) నేను పనిచేయుకాలములో, ఆమె ఎవరు ఏమి అని తెలుసుకోకుండానే నా బాధ్యత యగు ఒక పనిని చేసి పెట్టినందుకు ఆమె నన్ను గుర్తుంచుకొని, మా ఇరువురు అంటే నేను నా శ్రీమతి పై ఎనలేని అనురాగమును పెంచుకోనింది. ఆమె ఇంతగా గుర్తుంచుకొనుటకు సహాయపడిన, అదే వార్దుషి లో పనిచేయుచుండిన ఒక అధికారి కారణము. ఆమె మొదట తనసమస్యను అతనితోనే చెప్పింది. దీని బాధ్యత నాది కాదు, ఆ పొడవాటి ఆయనదని చెప్పి, అయినా ఆయన మీకు పలికేవాడు కాదని చెప్పినాడు. కానీ నావల్ల కలిగిన అనుభవము వేరొక విధముగా ఉండుటచే ఆమెకు ఆ అభిమానము ఏర్పడినది. అంతా జరిగిపోయిన కొంత కాలానికి గాని ఆమె డాక్టరని నాకు తెలిసి రాలేదు.
ఇక ఆతరువాత అంతా ఆమె చేత మేలు పొందుటయే తప్పించి నేను చేసినది ఏమీ లేదు. నన్ను 2 సంవత్సరముల వయసునుండి సాకిన మా అమ్మమ్మను, నా భార్య తప్ప, (ఇంట్లో ఉన్నపుడు నేను) చూసుకొనే వారు వేరే లేని సమయములో ముఖ్యమైన పెళ్ళికి పోవలసివస్తే, లలిత హాస్పిటల్ లో మేము వచ్చే వరకు తన సంరక్షణలో ఉంచుకొనింది. మా అమ్మమ్మకు ఆరోగ్య పరమైన అన్ని సలహాలు ఇచ్చుటయే కాక ఆమె అవసరమగునపుడు, తాను  హైదరాబాదులో ఉండుటచే, ఇంటికి వచ్చి చూసి పోయేది. ఈ సేవంతా ఉచితముగానే సుమా! మా అమ్మమ్మగారు గతించిన తరువాత, లలిత ఉక్కునగరము (విశాఖ) చేరిన తరువాత, మమ్ములను తన ఇంటికి పిలిపించుకొని కొన్ని రోజులకు ఉంచుకొనింది. ఆ సమయములోనే నా రాతలను, నాలో వున్న చమత్కారమును, నా విషయ విశ్లేషణలను అర్థము చేసుకొని మీలో ఇంత సత్తా ఉందే మీరెందుకు లోకానికి తెలుప కూడదు అనేది. అమ్మ నాకంత స్తోమత లేదు అనేవాడిని.
కొంత కాలము తరువాత నా శ్రీమతికి అత్యవసరమగు ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. రిపోర్ట్ లలితకు వాట్సాప్ లో పంపి తన అభిప్రాయమును అడిగినాను. మారు మాట్లాడకుండా తత్కాల్ లో బుక్ చేసుకొని ట్రైన్ లో విశాఖకు రమ్మన్నది. ఏరోజు రాత్రయితే బయలుదేరినానో అదేరోజు ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి లోని ICU లో చేర్చబడినాడు. అదే రోజు ఆమె స్వంతము మరిది వేరొక ఆక్సిడెంట్ లో అసువులు బాసినాడు. అటువంటి సమయయములో తనతో పనిచేసే సాటి డాక్టర్లు చెప్పినా వినకుండా, మాకు విషయములు చెప్పకుండా, మమ్ములను ఉక్కునగరమునకు పిలిపించుకొని ఆస్పత్రిలో చేర్చి సర్జన్ తో మాట్లాడి తరువాతి రోజే ఆపరేషనుకు ఏర్పాటు చేసినది. ఆమె స్పెషలిస్ట్ ఫిజీషియాన్. ఆమెకు ఆపరేషన్ తో సంబంధము లేదు. నా భార్య కోరిక మేరకు  ఆమె డ్యూటీ ముగిసిన తరువాత ఆపరేషనుకు ఏర్పాటు చేసి ఆసాంతము తానువుండి నా భార్యకు ధైర్యము చెబుతూ కాపాడిన తల్లి ఆమె. ఆతరువాత ఆస్పత్రి ఖర్చులు నాపై పడకుండా తన ఇంటికి షిఫ్ట్ చేసి తానె చూసుకొంటూ అవసరమైతే సర్జన్ సలహాలు పొంది నా శ్రీమతిని కాపాడిన అపర లలిత.
చెప్పుకొంతూబోతే ఇటువంటి సహాయాలెన్నో! ఇది ఇంతటితో ఆగలేదు. ఆమెకు ఒక కుమారుడు ఒక కూతురు. ఇరువురూ MBBS చదువుతూ వున్నారు. ఒక మూడు నెలల క్రితము తన కుమార్తె వివాహము నిశ్చయమైనది. ఆ శుభవార్త నా చెవిన వేసినది ఆమె. కాసేపు ఆమాట ఈ మాట అయిన తరువాత నేను ఆమెతో, రిసెప్షను సమయములో ఏదయినా సాంప్రదాయ సంగీత కచేరీ ఏర్పాటుచేస్తే బాగుంటుందే? అని నేననటము జరిగింది.
అందులకామె "లేదుసార్ వేరే ప్రోగ్రామ్స్ ఏవో ఫిక్స్ అయినాయి అన్నది. నేనూ మిన్నకుండి పోయినాను. ఆ తరువాత ఒక వారమునకు ఆమె హైదరాబాదుకు వచ్చి బంధుమిత్రులకు వివాహ పత్రికలు పంచుతూ మాయింటికి రాత్రి 10.30 కి తన చెల్లెలుతో కూడా వచ్చింది. ఆమె ఎంతో కలుపు గోలుగా వుంటుంది కాబట్టి రాత్రి ఒక 10 గం. సమయములో "సార్ పెళ్లి పత్రిక ఇచ్చుటకు కొరియర్ వస్తాడు మీ అడ్రసు మరియు ల్యాండ్ మార్క్ చెప్పేది అని అనింది. నేను చెప్పినాను. నేను తలుపు లోనికి వేసుకొని వుంటే ఆమె బెల్ కొట్టింది. తలుపు తెరుస్తూ ఆమెను చూడకుండానే "రామ్మా! లలిత" అన్నాను. ఆమె “చూడకుండానే ఎట్లా నేను అని తెలుసుకొన్నారు” అని అడిగింది. ఇంత రాత్రి సమయములో అడ్రసు అడిగి వచ్చే కోరియారు ఎవరుంటారమ్మా నీవు తప్ప అన్నాను”. నవ్వుకొన్నాము సరిపోయింది. వెంటనే 'అమ్మా ఒక్క సారి నాతోబాటు రా' అంటూ నా డెస్క్ టాప్ ఉన్న చోటికి పిలుచుకుపోయి ఆమెకు అగంతుకురాలయిన ఒక గాయకి పాట వినిపించినాను. "చాలా బాగుంది" అని అప్రయత్నముగానే ఆమె నోటినుండి వచ్చినది. అప్పుడు ఆమెకు ఈ విధముగా చెప్పనారంభించినాను. " అమ్మా ఆమె పేరు శ్రీ వాణి. నాతో బాటు బాంక్ లో ఆఫీసరుగా పనిచేసిన శ్రీ TV సుబ్బరావు  గారి కుమార్తె. ఆమె భర్త పేరు అర్జున్. ఆయన లాయరు. ఆమె బాల్యములో తండ్రి వద్దనే సంగీతము అభ్యసించినది. ఆతరువాత గురువుల ద్వారా కూడా నేర్చుకొని ఇపుడు సంగీతములో PhD. చేయుచున్నది. అదికూడా ముగింపు దశలో వుంది అని చెప్పినాను.
అప్పుడు నాతో ఏమీ చెప్పకుండా విశాఖ పట్ణము పోయి వాణి మొబైల్ నంబరు నన్ను అడిగి తీసుకొని ఆమెకు ఫోన్ చేసి అన్నీ నేను వ్రాసిన పాటలతో ఒక CD తయారుచేయుట మరియు Live Concert పెళ్లిరోజు అనగా 2019 జూన్19 వ తేదీ రాత్రిన చేయుట ఒప్పజెప్పినది.
ఇక్కడ వాణిని గూర్చి తెలియజేసుకొంటాను. వైశ్యులలో సంగీతము అబ్బుట బహు అరుదు. అందునా కడపలో దానికి గుర్తింపు ఇంకా అరుదే. అయినా ఆమె తండ్రి తదేక దీక్షతో శాస్త్రీయ సంగీతమునభ్యసించి గొప్పగా పేరు గాంచి, తన జ్యేష్ఠపుత్రికకు కూడా తానే గురువై సంగీత విద్యను నేర్పినాడు. ఆమె స్వరము భగవద్దత్తము. దానికి తోడూ అణుకువ మణుకువలకు ఆమె పెట్టింది పేరు. బహుశ తల్లి పెంపకము కారణమై ఉండవచ్చు. ఎంత ఎదిగినా ఓదిగియుండే మనస్తత్వము. అసలు ఒక్క మాటలో చెప్పవలెనంటే ఆమె విద్వత్తు కలిగిన నిరహంకారి. ఆమె తల్లిదండ్రులు అనగా శ్రీయుతులు సుబ్బారావు గృహలక్ష్మి గారాలు మరియు కట్టుకొన్న భర్త అన్నం అర్జున్ ధన్యులు. వైశ్యులలో, అందులోనూ కడపలో ఇటువంటి ఒక అన్ర్ఘరత్నము ఉండుట కడపకే అలంకారము.
నాకు 2017 దీపావళి తరువాతి రోజే బైపాస్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆపరేషనయిన నాలుగవరోజే డాక్టరు డిశ్చార్జ్ చేసినాడు. ఆరోజు రాత్రికి ఇల్లు చేరినాను. ఈ విషయములేవీ తెలియని వాణి నాకు ఫోన్ చేసి "శివ నామావళి వ్రాయదలచినాను బాబాయి గారు ముందు ఒక నాలుగైదు నామాలు మీరు వ్రాసియిస్తే మిగతావి నేను ప్రయత్నిస్తాను" అని అన్నది. నేను నా పరిస్థితి చెబుతూ కూడా, వ్రాస్తాను అని అన్నాను, ఆమె ఎంతగానో నన్ను వారించినాకూడా! తరువాతి రోజే ఆమెకు నా రచన పంపినాను. అందు ఒక రెండు మూడు ప్రత్యేకతలు ఏమిటంటే నామావళికి పూర్వ పీఠిక ఉత్తర పీఠిక ఉంటాయి. ప్రతి నాలుగు నామాలు ఒకే అక్షరముతో మొదలౌతాయి. నిర్దుష్టముగా కష్టములేని తాళానుగుణముగా రచన పరమేశ్వరుని దయతో సాగింది. ఆమెకు చేరిన వెంటనే కంట తడి పెట్టుకొంటూ నాకు ఫోన్ చేసి అంతటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నా కొరకు వ్రాసినారా బాబాయిగారు. మీ ఋణము నేను తీర్చుకోలేనిది అయినా మీ పేరు నిలిచే విధముగా ఉడుతా భక్తిగానయినా మీ ఋణము తీర్చుకొంటాను అని అనుటయే కాక, కడపలో అందుబాటులో ఉండే ఒక మ్యూజిక్ స్టూడియో లో నేను వ్రాసిన మహాదేవు నామావళి, రెండు శాస్త్రీయ పరమైన పాటలు నేను వ్రాసిన రెండు శతకములలో తనకు ఇష్టమైన పద్యములు పాడి రికార్డు చేసి పంపించింది. అయితే ఆర్కెస్ట్రా దొరకలేదు. అందుకు నేను 'అమ్మా నీవు పాడుటయే చాలా ఎక్కువ'  అంతే చాలు అన్నాను. అందులో కొన్ని సవరణలు నేను తెలుపగా, ఆమె చేయ సంకల్పించిన తరుణములో లలిత వద్ద నుండి ఫోన్ వచ్చింది. తనను ఇంట్రడ్యూస్ చేసుకొంటూ అన్నీ రామ మోహన్ గారు వ్రాసిన పాటలతో ఒక CD తయారుచేయుటయే గాక పెళ్లిరోజు లైవ్ కాన్సర్ట్ ఇవ్వవలెనని కూడా తెలియజేసింది. నాతో తానే చేబుతాననింది లలిత. ఇక వాణి ఆనందానికి హద్దేలేదు. ఆమె ఆ CD తయారు చేయించుటకు పడిన తపన, శ్రమ అంతాయింతా కాదు. 16 పాటలు, అందులో శాస్త్రీయము, మిత శాస్త్రీయము, లలితము, దండకము ఈవిధముగా వివిధ ప్రక్రియలలో, ఆమె పాటలలో మమేకమై, పాడిన రీతిని మనసారా వింటే ఆనంద భాష్పములు రాక తప్పదు. విజేత యైన పురుషుని వెనుక స్త్రీ వుంటుంది అన్న సామెత విన్నాము గానీ, అనుక్షణము ఆమె వెనుకల తానుండి ఆమె భర్త అర్జున్ అంత జటిల కార్యమును చక్కగా పూర్తి చేయించినాడు. మద్రాసు నుండి వాద్య సహకారము తెప్పించుటలో గానీ తిరుపతి లో మంచి స్టూడియోను ఏర్పాటు చేయించుటలోగానీ, పదేపదే ఎర్రటి ఎండలో కడప తిరుపతి ఒకటిబట్టు నాలుగుమార్లు తిరిగి పని అద్భుతముగా పూర్తి చేసినారు. వెనుకనుండి లలిత నేనున్నాను మీరు సంకోచించకుండా కార్యము నెరవేర్చండి అని ఎంతగానో వత్తాసు పలుకుతూ వచ్చింది. సరియన సమయమునకు ఇటు CD పూర్తి అయ్యింది, అటు 19 రాత్రి శ్రోతలందరికీ నచ్చిన విధముగా సంగీత విభావరీ నడచినది.
తానూ సంఘములో ఒక ఉన్నతి కలిగియుండుటచే ఒక్కగా నొక్క కూతురికి వివాహము వైభవముగా జరిపించాదలచుకోంది. ఆమె మామ గారు పేరుగాంచిన డాక్టర్ అశ్వనీ కుమార్ గారు. వియ్యాలవారూ డాక్టర్లే ! మరి ఆమె భర్తకు బొత్తిగా ఆరోగ్యము సహకరించదు. కావున ఆమె ఒక్కటే ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానోక్కొక్కడై తోచు పోలిక’ గా వివాహ కార్యక్రమము చక్కగా నడిపించింది. ఆమె పిలువకముందే మనః పూర్వకముగా పని చేయుటకు సిద్ధమయినా 100 కు పైన స్టీల్ ప్లాంట్ లో పని చేసే ఉన్నతాధి కారులు ముందుకొచ్చి తమయింటి కార్యమైనట్లు చేసినారు. పెళ్ళికి వచ్చిన నావంటి వారికి తమ తమ ఇండ్లలో గల A\C గెస్ట్ రూములనిచ్చి  ఆదరించినారు. అసలు సంగీత కార్యక్రమునకు మైక్ స్టాండ్స్ కావలసి వస్తే ఎంత కష్టపడినారో ఏమో 10 నిముసములలో సిద్ధము చేసినారు. ఇదంతా లలిత కార్య కుశలతకు, మంచితనానికీ గీటురాళ్ళు. అసలు CD కి Concert కు (ఆర్కెస్ట్రా 2 పర్యాయములు) ఎంత ఖర్చయినదో నేను చెప్పలేను.
ఇక శ్రీవాణి తన్మయతతో పాడుతూవుంటే అన్ని పాటలు ఏవిధముగా పాడినావమ్మా అని ఆమెను అడిగినవారు ఎందఱో! వీరిరువురూ ఇంతకు ఈ పనులు చేసింది, ఉత్తపుణ్యానికి నా కోసం. ఉభయులూ నాకు ఉభయ కైంకర్యము చేసినారు. మరి ఈ విషయము పంచుకోక నిమ్మకు నీరేత్తినట్లుంటే నన్ను మనిషిగా తలవ గలుగుతారా! అందుకే ఈ తపన.
ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది ఒకటే మాట. వారిరువురు అంటే Dr. లలిత (Dr.) వాణి పట్టుదలతో పనిచేసి సాధించినది వారి కోసము కాదు. అనామకుడనైన నాకోసము. కలియుగములో ఇంకా,  మంచి, గౌరవము, అభిమానము, ఆప్యాయత, అంతః కరణ, ఆత్మీయత, అనురాగము, ఆర్ద్రత  అన్నీ వున్నాయి అనుటకు ఇది ఒక చక్కని నిదర్శనముగా భావించుచున్నాను. భగవంతుడు ఆ బిడ్డలిద్దరికీ  దీర్ఘ సౌమాంగళ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించవలెనని మనసారా పరమేశ్వరుని కోరుకొనుచున్నాను.
స్వస్తి.